కేటీఆర్‌కు సీఎం కేసీఆర్‌ అభినందనలు | Telangana State First Place In IT Exports In Country | Sakshi
Sakshi News home page

ఐటీలో సత్తాచాటిన తెలంగాణ

Published Thu, May 21 2020 5:44 PM | Last Updated on Thu, May 21 2020 6:45 PM

Telangana State First Place In IT Exports In Country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా కష్ట కాలంలోనూ తెలంగాణ రాష్ట్రం తన సత్తా చాటింది. ఐటీ ఎగుమతుల్లో వరుసగా ఐదోసారి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గాను తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి సాధించింది. ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం సమర్పించారు. 2019-20 ఏడాదిలో జాతీయ జాతీయ వృద్ది రేటు 8.9శాతంగా నమోదు కాగా.. రాష్ట్ర ఎగుమతులు 17.93 శాతంగా నమోదు అయ్యాయని  తెలిపారు.
 ఈ సందర్భంగా ఐటీశాఖ మంత్రిని సీఎం కేసీఆర్‌ అభినందించారు. కరోనా కష్టకాలంలోనూ ఐటీ పరిశ్రమను సజావుగా నడిపించారని కితాబిచ్చారు. భవిష్యత్‌లోనూ ఇదే పట్టుదలను ప్రదర్శించాలని సీఎం సూచించారు. కాగా తెలంగాణ ఐటీ ఎగుమతులు  2018-19లో రూ. 1,09,219 కోట్లు ఉండగా.. అది 2019-20లో రూ. 1,28,807 కోట్లకు పెరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement