IT exports
-
ఐటీలో మేటి..
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో శరవేగంగా దూసుకుపోతోంది. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది రూ.57,258 కోట్లతో మొదలైన ఎగుమతులు.. 2023 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 30 ఏళ్లలో నమోదైన ఐటీ ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. 2022–23లో దేశంలో ఐటీ ఎగుమతులు 9.36 శాతం వృద్ధి చెందగా.అదే ఏడాది తెలంగాణలో 31.44 శాతం పెరిగాయి. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల కాలంలో (2014–23) రూ.11.85 లక్షల కోట్ల ఎగుమతులు సాధించగా.. 54.47 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. 5,82,319 మందికి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి..: తెలంగాణ ఏర్పడక ముందు దేశవ్యాప్తంగా ఐటీలో 32.90 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83 శాతం. అంటే 3,23,396 ఉద్యోగులున్నారు. గత తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా కొత్తగా 21.10 లక్షల మంది ఉద్యోగులు చేరగా.. రాష్ట్రంలోనే కొత్తగా 5,82,319 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. బ్రాండ్ హైదరాబాద్!ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరులో ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. గతేడాది ఉద్యోగ కల్పనలో భాగ్యనగరం గార్డెన్ సిటీ బెంగళూరుని దాటేసింది. కొత్తగా దేశంలో 4.50 లక్షల ఉద్యోగాలు రాగా.. హైదరాబాద్‌లో 1.50 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. అదే బెంగళూరులో 1.46 లక్షల జాబ్స్ సృష్టించినట్లు నాస్కామ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆఫీసు స్పేస్ వినియోగంలోనూ హైదరాబాద్ 2022 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్యకాలంలో బెంగళూరును అధిగమించి ప్రథమ స్థానంలో నిలిచింది.ప్రపంచంలోనే ఐటీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో నెలకొల్పాయి. ఇక వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగాలకు హైదరాబాద్ చిరునామాగా మారింది. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, డ్రోన్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం అనేక నూతన పాలసీలకు రూపకల్పన చేసింది. ఐటీ రంగంలో ఆవిష్కరణలు, వాణిజ్యం ప్రోత్సహించే లక్ష్యంతో 2015లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ విజయం సాధించడంతో, మహిళల కోసం ప్రత్యేకంగా ‘వి హబ్’ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసింది.ద్వితీయ శ్రేణి పట్టణాలకూ ఐటీ.. జిల్లాల్లో ఐటీ టవర్లురాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం కావడంతో నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేలా గ్రిడ్ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ పాలసీతో ఉప్పల్, పోచారం, కండ్లకోయ, శంషాబాద్ ప్రాంతాల్లోనూ కొత్త ఐటీ టవర్లు కార్యకలాపాలు ప్రారంభించాయి. మరోవైపు ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ యువతకు స్థానికంగానే ఐటీ ఉద్యోగ అవకాశాలు కలి్పంచాలనే లక్ష్యంగా గత ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లోనే ఐటీ టవర్లను నిర్మించింది.వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఐటీ టవర్లలో పదుల సంఖ్యలో ఐటీ సంస్థలు, స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2019లో వరంగల్‌లో తొలి ఐటీ టవర్ ప్రారంభం కాగా.. ఇందులోని టెక్ మహీంద్రా, సైయంట్, క్వాడ్రంట్ వంటి 10 కంపెనీల్లో 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ రంగం పురోగతి, ప్రోత్సాహానికి సంబంధించి ఇప్పటివరకు నిర్దిష్ట ప్రణాళికలేవీ ప్రకటించలేదు. రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలను ప్రకటిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. -
మోడల్ అంటే తెలంగాణ
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ మోడల్ అంటే.. సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధి అని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. వ్యవసాయం, ఐటీ పరిశ్రమలు, హరితహారంలో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. హరితహారంతో పచ్చదనాన్ని 7.7 శాతానికి పెంచామని, రూ.2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులతో అగ్రభాగాన ఉన్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ ఉద్యోగులు 3.23 లక్షలుండగా, ఇప్పుడు 9.05 లక్షల మంది ఉన్నారన్నారు. 142 కోట్ల భారత్‌లో కేంద్రం 0.5 శాతం (59 లక్షలు)ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తోందని, రాష్ట్రంలో 6.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. కేటీఆర్ గురువారం సిద్దిపేటలో ఐటీ టవర్, స్లాటర్‌హౌస్, వాటర్ రింగ్‌మెన్ ప్రారంభోత్సవం, కప్పలకుంట చెరువు సుందరీకరణ పనులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో తెలంగాణకు అవార్డులు వస్తున్నాయని, 3 శాతం గ్రామీణ జనాభా ఉన్న రాష్ట్రం దేశంలో 30 శాతం అవార్డులను దక్కించుకుందని చెప్పారు. చాలామంది సిద్దిపేట మీద ప్రత్యేక ప్రేమ ఎందుకని అడుగుతున్నారని, సిద్దిపేట తెలంగాణకు నాయకుడితోపాటు తెలంగాణకు జన్మనిచ్చిందని చెప్పారు. ఇక్కడ కేసీఆర్ పుట్టకపోతే, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలు అవకాశం ఇవ్వకపోతే టీఆర్ఎస్ పుట్టేదా, తెలంగాణ వచ్చేదా? అని అన్నారు. చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే.. అని కేసీఆర్ గుండె లోతు నుంచి వచ్చిన మాట అని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, హరితహారం, దళితబంధుకు పునాది పడిన గడ్డ సిద్దిపేట అని, మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టి హర్ ఘర్ జల్‌గా అమలు చేస్తోందన్నారు. స్వచ్ఛ బడి స్ఫూర్తితో పాత జిల్లా కేంద్రాల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ బడి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బావ కాబట్టి అప్పుడప్పుడు ఏడిపిస్తా.. ‘సిరిసిల్లకు వెళ్లినప్పుడల్లా సిద్దిపేటకు రాగానే ఫోన్ చేసి బావా మళ్లీ ఏదో కొత్తది కట్టినవ్ అంటాను. ఇంత పెద్ద రోడ్లు వేశావ్ అంటా. అరెయ్ మళ్లీ వెళ్లినప్పుడు కళ్లు మూసుకొని పో.. ప్రతీసారి వెళ్లినప్పుడు ఇలా ఫోన్ చేస్తున్నావు అంటడు. సిరిసిల్లకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు బావ కాబట్టి అప్పుడప్పుడు ఏడిపిస్తా. ప్రతీ నియోజకవర్గం సిద్దిపేటలాగా మారినప్పుడే బంగారు తెలంగాణ, బంగారు భారతదేశం అవుతుంది’అని కేటీఆర్ అన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ, రాష్ట్రానికి సిద్దిపేట దిక్సూచి అని కొనియాడారు. ఆనాడు కేసీఆర్ అభివృద్ధిని ప్రారంభిస్తే దాన్ని నాలుగింతలు పైకి తీసుకెళ్లిన నాయకుడు హరీశ్‌రావు అని చెప్పక తప్పదన్నారు. ఈసారి 1.50 లక్షల మెజార్టీతో హరీశ్‌ను గెలిపించి, కేసీఆర్‌కు హ్యాట్రిక్ గెలుపు, ఆశీర్వాదం ఇవ్వాలని ప్రజలను కోరారు. తిట్టినవారే శభాష్ అంటున్నారు: మంత్రి హరీశ్‌రావు తెలంగాణ వస్తే మత కలహాలు, కరెంట్, సాగు, తాగు నీరు ఉండవని తిట్టినవారే ఇప్పుడు శభాష్ అంటున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అస్సాంలో విద్యుత్ కొరత ఉందని స్వయంగా మంత్రినే విద్యుత్ వినియోగం తక్కువ చేయాలని చెప్పారని, ప్రధాని సొంత రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారని గుర్తుచేశారు. ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీలన్నింటినీ హైదరాబాద్‌కు తెచ్చి కేటీఆర్ యువతకు ఉపాధిని కల్పిస్తున్నారని కొనియాడారు. కేటీఆర్ ఐటీలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్ స్థాయికి తీసుకువెళ్లారన్నారు. కేటీఆర్ లాంటి ఐటీ మంత్రి కావాలని ఇతర రాష్ట్రాల్లో యువత ట్విట్టర్ వేదికగా కోరుతున్నారని చెప్పారు. సిద్దిపేటలో కేసీఆర్ బలమైన పునాది వేశారని దాని కొనసాగింపుగానే తాను చేస్తున్నా అన్నారు. మరోసారి సీఎం కేసీఆర్‌ని గెలిపించి హ్యాట్రిక్ అందించాలని ప్రజలను కోరారు. కాగా, సిద్దిపేట ఐటీ హబ్ పర్యావరణహితంగా ఉండటంతో ఐజీబీసీ వారు గోల్డ్ రేటింగ్ ప్లేట్‌ను మంత్రి కేటీఆర్, హరీశ్‌రావుకు అందించారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మెన్ బాలమల్లు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ. 2.20 లక్షల కోట్లు!
రాష్ట్ర ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.2 లక్షల కోట్లు దాటుతున్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది రాష్ట్రం నుంచి రూ.1.83 లక్షల కోట్ల మేర ఐటీ ఎగుమతులు జరగగా.. 2022–23లో ఇది 20 శాతానికిపైగా వృద్ధిరేటు సాధించినట్టు ఐటీశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ రంగం పురోగతికి సంబంధించిన నివేదికను ఆ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి జూన్ మొదటి వారంలో నివేదికను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో వృద్ధితోపాటు ఉద్యోగాల కల్పనలోనూ మంచి పురోగతి సాధించామని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత ఏడాది ఐటీ రంగంలో 1.53 లక్షల ఉద్యోగాల కల్పన జరగగా.. ఈసారి ఆ సంఖ్య రెండు లక్షలకు చేరి ఉంటుందని పేర్కొంటున్నాయి. గత ఏడాది ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 4.5లక్షల ఉద్యోగాల కల్పన జరగ్గా.. అందులో మూడో వంతు హైదరాబాద్ నుంచే ఉందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరు, పుణె, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలను హైదరాబాద్ అధిగమించిందని అంటున్నాయి. ఐటీ రంగ కార్యకలాపాల విస్తరణ వల్లే.. కోవిడ్ నేపథ్యంలో పెరిగిన డిజిటలైజేషన్, తద్వారా వచి్చన కొత్త అవకాశాలను అందుకోవడంలో హైదరాబాద్‌లో ముందు వరుసలో ఉందని.. అందువల్లే శరవేగంగా వృద్ధి సాధ్యమవుతోందని ఐటీశాఖ వర్గాలు చెప్తున్నాయి. 1,500కుపైగా ఐటీ, ఐటీ ఆధారిత సేవా రంగాల కంపెనీలతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందని అంటున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరించడంలో భాగంగా.. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లను ప్రారంభించిందని గుర్తు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో రూపొందించిన గ్రిడ్ పాలసీ ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని అంటున్నాయి. టీహబ్‌తోపాటు పలు ప్రైవేటు ఇంక్యుబేషన్ సెంటర్ల కార్యకలాపాలు ఊపందుకోవడంతో.. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ వృద్ధి ఇదే వేగంతో కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి వేగంగా.. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57,258 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు.. 2021–22 నాటికి రూ.1.83 లక్షల కోట్లకు చేరాయి. అప్పట్లో 3.23 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 2021–22 నాటికి 7.78లక్షలకు చేరింది. అంటే ఎనిమిదేళ్లలో కొత్తగా 4.54 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఉమ్మడి ఏపీలో ఐటీ ఎగుమతులు 2035 నాటికి రూ.2.09లక్షల కోట్లకు చేరుతాయని గతంలో నిపుణులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఒక్కటే, 2022–23 నాటికే ఈ అంచనాలను దాటుతుండటం గమనార్హమని ఐటీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో 2026 నాటికి ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే అంతకన్నా ముందే ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఐటీ శాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల సంఖ్య ఏడాది ఐటీ ఎగుమతులు (రూ.కోట్లలో) ఉద్యోగాలు 2013–14 57,258 3,23,396 2014–15 66,276 3,71,774 2015–16 75,070 4,07,385 2016–17 85,470 4,31,891 2017–18 93,442 4,75,308 2018–19 1,09,219 5,43,033 2019–20 1,28,807 5,82,126 2020–21 1,45,522 6,28,615 2021–22 1,83,569 7,78,121 -
రాష్ట్ర ఐటీ రంగం ఎగుమతుల్లో 13 శాతం వృద్ధి
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఐటీ రంగం ఎగుమతుల్లో 13 శాతం వృద్ధి నమోదైంది. ఒకపక్క కోవిడ్–19తో ఏడాది మొత్తం ఉద్యోగులు ఇంటివద్ద నుంచే పనిచేయాల్సి వచ్చినా.. ఐటీ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదు కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం 2020–21లో రాష్ట్రం నుంచి రూ.2,500 కోట్ల విలువైన ఎగుమతులు జరిగినట్లు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 2019–20లో రాష్ట్రం నుంచి రూ.2,200 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయి. 2019–20లో 10 శాతం వృద్ధి నమోదు కాగా 2020–21లో 13 శాతం వృద్ధి నమోదైంది. లాక్డౌన్ సమయంలో ఐటీ కంపెనీలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న విశాఖ, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, అవాంతరాలు లేకుండా విద్యుత్ సౌకర్యాలు కల్పించింది. ఐటీ కంపెనీల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఐటీ కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కంపెనీల్లో 45 వేలమంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండేళ్లలో రూ.500 కోట్ల వృద్ధి విభజన సమయంలో రూ.1,500 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు ఇప్పుడు రూ.2,500 కోట్లకు చేరుకున్నాయి. గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ఎగుమతులు రూ.500 కోట్లు పెరిగితే గడిచిన రెండేళ్లలోనే మరో రూ.500 కోట్ల వృద్ధి నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఐటీ రంగ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టిసారించామని, ముఖ్యంగా విశాఖను ఐటీ, నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. -
ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయం ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఆరేళ్లుగా అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ నగరానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) లేదా దానికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆదివారం లేఖ రాశారు. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. జాతీయ సగటు 1.9 శాతంతో పోలిస్తే.. తెలం గాణ 7 శాతం వృద్ధి రేటుతో ఎగుమతులు రూ.1.4 లక్షల కోట్లకు చేరాయన్నారు. అ లాగే ఆఫీస్ స్పేస్ 8.7 మిలియన్ చదరపు అడుగులు పెరిగిందని, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్‌మాన్ సాక్స్, ఫియట్ క్రిస్లార్ ఆటోమొబైల్స్ వంటి ప్రముఖ కంపెనీలు తెలంగాణకు పెట్టుబడులతో వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీతో పాటు పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కోసం అనేక పాలసీలు రూపొందించామని తెలిపారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఐటీ రంగం వృద్ధికి అనువైన వాతావరణం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఐటీలో హైదరాబాద్‌ను ప్రోత్సహించండి హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సం బంధించి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేం ద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలిశారని, తాను కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నా రు. ఐటీఐఆర్‌పై కేంద్రం చేస్తున్న తాత్సారంతో ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆందోళన వ్య క్తం చేశారు. దేశానికి ఆర్థిక ఇంజన్లుగా పనిచేస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలన్నారు. ఐటీఐఆర్‌పై యువత ఆశలను అడియాశలు చేయొద్దని లేఖలో పేర్కొన్నారు. -
ఐటీలో సత్తాచాటిన తెలంగాణ
-
కేటీఆర్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలోనూ తెలంగాణ రాష్ట్రం తన సత్తా చాటింది. ఐటీ ఎగుమతుల్లో వరుసగా ఐదోసారి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గాను తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి సాధించింది. ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం సమర్పించారు. 2019-20 ఏడాదిలో జాతీయ జాతీయ వృద్ది రేటు 8.9శాతంగా నమోదు కాగా.. రాష్ట్ర ఎగుమతులు 17.93 శాతంగా నమోదు అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఐటీశాఖ మంత్రిని సీఎం కేసీఆర్ అభినందించారు. కరోనా కష్టకాలంలోనూ ఐటీ పరిశ్రమను సజావుగా నడిపించారని కితాబిచ్చారు. భవిష్యత్‌లోనూ ఇదే పట్టుదలను ప్రదర్శించాలని సీఎం సూచించారు. కాగా తెలంగాణ ఐటీ ఎగుమతులు 2018-19లో రూ. 1,09,219 కోట్లు ఉండగా.. అది 2019-20లో రూ. 1,28,807 కోట్లకు పెరిగింది. -
మరో 5 లక్షల ఐటీ జాబ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి చిరునామాగా నిలిచిన గ్రేటర్ హైదరాబాద్... ఈ రంగంలో మరింతగా పురోగమిస్తోంది. రాబోయే నాలు గేళ్లలో ఐటీ కొలువులు మరో ఐదు లక్షల వరకు పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) తాజాగా అంచనా వేస్తోంది. ప్రస్తుతం నగరం కేంద్రంగా సుమారు 600కుపైగా కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా ఈ సంస్థల్లో సుమారు 5.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు రూ. లక్ష కోట్లు దాటాయి. శరవేగంగా వృద్ధి...: ఐటీ రంగానికి నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, హైటెక్ సిటీ తదితర ప్రాంతాలు కొంగు బంగారంగా నిలుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో రాబోయే నాలుగేళ్లలో నూతనంగా సుమారు 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఐటీ కార్యాలయాలు వెలిసే అవకాశాలున్నట్లు హైసియా ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, నూతన ప్రాజెక్టులకు అనుగుణంగా అవసరమైన నిపుణుల లభ్యత కూడా నగరంలో అందుబాటులో ఉండటంతో పలు బహుళజాతి ఐటీ కంపెనీలు నగరానికి వెల్లువలా తరలివస్తున్నాయని చెబుతున్నారు. భౌగోళిక అనుకూలతలు కూడా నగరంలో ఐటీ రంగం వృద్ధి చెందేందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కొలువుల జాతర... ఐటీ రంగంలో ప్రధానంగా డిమాండ్ అనూహ్యంగా పెరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా సైన్స్, ఏఆర్, వీఆర్, బ్లాక్‌చైన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాఫ్ట్వేర్ల అభివృద్ధి, విస్తరణ ప్రాజెక్టులు చేపట్టే సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలు సాగించేందుకు ముందుకొస్తున్నాయని హైసియా అధ్యక్షుడు భరణి ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ, హార్డ్‌వేర్ పాలసీలు కూడా ఈ రంగం విస్తరణకు దోహదపడుతున్నాయన్నారు. ఐటీ రంగంలో నూతనంగా కొలువులు సాధించే పట్టభద్రులు ప్రారంభంలో రూ. 3–3.5 లక్షలు, కొంత అనుభవం గడిస్తే రూ. 6–8 లక్షల వరకు వార్షిక వేతనం పొందుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగేళ్లలో ఐటీ కొలువులు మరో 5 లక్షల వరకు పెరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఏటా నగరం నుంచి చేపట్టే ఐటీ ఎగుమతుల్లో 17 శాతం మేర వృద్ధి నమోదవుతోందని పేర్కొన్నారు. -
ఏడాదిలోనే రెండు లక్షల ఐటీ కొలువులా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వచ్చే ఏడాది(2019) కల్లా రాష్ట్రంలో అక్షరాలా రెండు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవలి కాలంలో పదేపదే ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగంలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను గమనిస్తే, లోకేశ్ ప్రకటనలు ఎంత వాస్తవ దూరంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఐటీ ఆధారిత ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అత్యల్ప ప్రగతిని సాధించినట్టు పొరుగు రాష్ట్రాల పురోగతిని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. సీఎం చంద్రబాబు ప్రస్తుత పరిపాలనలో ఐటీ పురోగతి నామమాత్రంగానే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ రంగంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు రాలేదు. కొత్త ఇన్వెస్టర్లు కూడా ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో గడచిన మూడేళ్లలో కేవలం 15 వరకు మాత్రమే చిన్న ఐటీ సంస్థలు ఏర్పడ్డాయి. కానీ, కొత్తగా ఐటీ యూనిట్ ఏర్పాటుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీని కాగితాలపైనే ఆకర్షణీయంగా చూపడం, ఆ తర్వాత అమలులో వైఫల్యమేనని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ మాత్రం వచ్చే ఏడాది నాటికే కొత్తగా రెండు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొడుతున్నారు. మంత్రి లోకేశ్ ఈ నెల 9న విశాఖలో ఊరూపేరూ లేని 13 ఐటీ కంపెనీలకు ప్రారంభించారు. భారత్‌లో మొత్తమ్మీద 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2017లో నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) లెక్కల ప్రకారం ఐటీ ద్వారా ఉపాధి పొందిన ఉద్యోగుల సంఖ్య లక్షన్నర. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 20 వేలు. రాష్ట్ర అధికారిక వెబ్సైట్(ఏపీఐటీ) ప్రకారమే ఐటీ హబ్ అయిన విశాఖపట్నంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 16,988. ఇక విజయవాడ, తిరుపతి, కాకినాడల్లోని ఐటీ కంపెనీల ఉద్యోగులతో కలుపుకుని చూస్తే మొత్తంగా 20 వేల లోపే ఉంటుంది. ఐటీ బూమ్ వచ్చిన రెండు దశాబ్దాల నుంచి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగుల సంఖ్య 20 వేల కంటే మించలేదు. మరో ఏడాదికల్లా 2 లక్షల ఉద్యోగాలు రావడం సాధ్యమేనా? నారా లోకేశ్ అన్నట్టుగానే ప్రపంచంలోని ఐటీ కంపెనీలన్నీ ఒకేసారి ఇబ్బడిముబ్బడిగా వెల్లువలా వచ్చేస్తాయని భావించినా... ఆ మేరకు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించగలదా? 2 లక్షల ఉద్యోగులు.. అంటే ఒక్కో ఉద్యోగికి వంద చదరపు అడుగుల(ఎస్ఎఫ్టీ) స్థలం కావాలి(కామన్ ఏరియాతో సహా). ఈ లెక్కన 2 లక్షల మందికి 2 కోట్ల ఎస్ఎఫ్టీ కావాలి. అంటే 200 లక్షల చదరపు అడుగులు. బహుళ అంతస్తుల భవనాలు కట్టాలని అనుకున్నా.. ప్రస్తుతం భూమి లభ్యతను పరిశీలిస్తే లక్ష చదరపు అడుగుల స్థలం కూడా సిద్ధంగా లేదు. ఆరునెలల క్రితం విశాఖపట్నంలో లోకేశ్ మాట్లాడుతూ.. ‘‘ఐటీ రంగంలో విశాఖకు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గడిచిన మూడేళ్లలో 40 ఐటీ కంపెనీలు ముందుకొచ్చినా భూముల కొరత వల్ల వెనక్కి వెళ్లిపోయాయి. ఈ రంగంలో పనిచేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గృహ వసతి సమస్య కూడా తీవ్రంగా ఉంది. అందువల్లే విశాఖలో పని చేసేందుకు ఐటీ రంగ నిపుణులు ఆసక్తి చూపడం లేదు. (చదవండి: విశాఖలో ఐటీ రివర్స్ గేర్!) ఇక్కడ పనిచేసే వారు కూడా హైదరాబాద్, బెంగుళూరు, మంగుళూరు, చెన్నై వంటి నగరాలకు తరలిపోతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. కానీ, వచ్చే ఏడాదికల్లా రెండు లక్షల ఉద్యోగాలు కల్పించేస్తామని ఇప్పుడు చెబుతుండడం గమనార్హం. ఐటీ అభివృద్ధికి ప్రోత్సాహమేదీ? రాష్ట్రంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తే విరివిగా ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ హామీ ఇస్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి చూస్తే ప్రస్తుతం ఏపీలోని ఐటీ కంపెనీలకు ప్రభుత్వ నిరాదరణ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఐటీ కంపెనీలకు విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ.6.50 అని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి యూనిట్‌కు రూ.9.50 చొప్పున వసూలు చేస్తోంది. దేశంలో ఐటీ కంపెనీల నుంచి అత్యధిక కరెంటు చార్జీలు వసూలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఐటీ కార్యాలయాల అద్దె, విద్యుత్, స్టాంప్ డ్యూటీ, ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ తదితరాల్లో ఏపీ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం లేదనేది ఐటీ కంపెనీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకు 100 ఎంబీపీఎస్ బ్యాండ్ విడ్త్‌కు రూ.1.25 లక్షలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఐటీ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలో ఐటీ కంపెనీలకు సర్కారు పరంగా రావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఐటీ ఎగుమతులు జరుగుతున్న విశాఖపట్నంలో కాకుండా ఐటీ శాఖ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడాన్ని కూడా ఐటీ కంపెనీల నిర్వాహకులు తప్పుపడుతున్నారు. -
ఈ ఏడాది ఐటీ రంగం వృద్ధి 8 శాతమే!
♦ గతేడాది 7.5 శాతం; 1.5 లక్షల ఉద్యోగ అవకాశాలు ♦ జపాన్, చైనా, ఆఫ్రికా ఐరోపా దేశాలకు విస్తరణ: నాస్కామ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఐటీ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం (2017–18)లో స్వల్ప పెరుగుదలతో 8 శాతానికి చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. అయితే దేశీయ ఐటీ విపణి మాత్రం 10–11 శాతం మేర వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. ‘‘2017–18 ఆర్ధిక సంవత్సరంలో ఐటీ–బీపీఎం రంగాల్లో కొత్తగా 1.3–1.5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలొస్తాయని.. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నికర నియామకాలు 1.7 లక్షలుగా ఉందని’’ నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. అమెరికా హెచ్1బీ వీసాపై ఆంక్షలు, బ్రెగ్జిట్ ఇతర అంతర్జాతీయ మార్కెట్లో రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు ఇందుకు కారణమని.. స్థానిక ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఖర్చులు, అలాగే గతేడాది ఐటీ కంపెనీల పనితీరును వంటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ఐటీ రంగం సానుకూలంగా ఉంటుందని ఆయన వివరించారు. దేశీయ ఐటీ పరిశ్రమ పరిమాణం 154 బిలియన్ డాలర్లని.. గత ఆర్థిక సంవత్సరంలో 11 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలియజేశారు. కొత్త భౌగోళికాలకు విస్తరణ.. బ్యాంకింగ్, ఆర్థిక, హెల్త్‌కేర్ వంటి అన్ని రంగాలు అనిశ్చితిలో ఉన్నాయని.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం కారణంగా ఐటీ రంగంలోనూ అవకాశాలు సన్నగిల్లాయని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం దేశీయ ఐటీ పరిశ్రమలో డిజిటల్ విప్లవం నడుస్తోంది. ప్రస్తుతమున్న 15–20 లక్షల మంది ఐటీ నిపుణులు తమ నైపుణ్యాలకు సానబెట్టి.. భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండాలి’’ అని చంద్రశేఖర్ సూచించారు. భారత ఐటీ పరిశ్రమ 80%కి పైగా అమెరికా, యూకే వంటి దేశాలపై ఆధారపడి ఉంది. కొత్తగా ఐరోపా, జపాన్, చైనా, ఆఫ్రికా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాల్లో విస్తరిస్తుందని పేర్కొన్నారు. -
ప్రపంచవ్యాప్తంగా నిపుణుల కొరత
45% అభివృద్ధి కేంద్రాలు మన దేశంలోనే ► 118 బిలియన్ డాలర్లకు ఐటీ ఎగుమతులు ► నాస్కాం ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. స్థానికులకు ఉద్యోగాలు, పాలసీల రూపకల్పన తద్వారా ఆర్థికాభివృద్ధి ఇదీ ఈ ఉద్యమ లక్ష్యం. ఈ ఉద్యమాన్ని ఒక్కో దేశం ఒక్కో రకంగా చేస్తోంది. అంటే అమెరికా హెచ్1బీ వీసా నిబంధనల మార్పు చేస్తే.. ఆస్ట్రేలియా, సింగపూర్లు వర్క్ వీసా పాలసీని రద్దు చేశాయి’ అని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ చెప్పారు. వీసా పాలసీ నిబంధనల ఇబ్బందులు వీసా ఆధారిత కంపెనీలకు ఎదురవుతాయే తప్ప నిపుణులకు కాదని పేర్కొన్నారు. గురువారమిక్కడ ‘నాస్కాం గ్లోబల్ ఇన్‌హౌజ్ సెంటర్స్ కాన్క్లేవ్–2017’ రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రపంచం డిజిటలైజేషన్ వైపు పరుగులు పెడుతోందని, దీంతో పనిచేసే విధానం మారుతోందన్నారు. కానీ, ప్రపంచ దేశాల్లో నైపుణ్యమున్న ఉద్యోగులకు కొరత ఉందని.. దీన్ని అధిగమించేందుకు నిపుణులకు ఎర్రతివాచీ పరుస్తున్నాయన్నారు. ‘ఆర్థిక మందగమనం సవాళ్లు విసురుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే కనుమరుగవుతాం. 20 లక్షల ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొంది. మన దేశంలో 60 శాతం కంపెనీలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటానికి స్టార్టప్స్‌తో భాగస్వామ్యమై పనిచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఐటీ ఎగుమతులు 118 బిలియన్ డాలర్లకు.. 57% గ్లోబల్ సోర్సింగ్ మన ఐటీ కంపెనీలే నిర్వహిస్తున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. ‘45%కి పైగా గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్స్ మన దేశంలోనే ఉన్నాయి. వీటి ఆదాయం 21 బిలియన్ డాలర్లు. దేశంలో ఐటీ ఎగుమతుల వాటా 118 బిలియన్ డాలర్లకు చేరింది. ఐటీ రంగంలో ప్రతి ఏటా 60–70 వేల మంది ఉద్యోగులు జతవుతున్నారు’ అని తెలిపారు. -
ఐటీ ఎగుమతులు రూ.75 వేల కోట్లు
⇒ మండలి ప్రశ్నోత్తరాల్లో ఐటీ మంత్రి కేటీఆర్ ⇒ ప్రత్యక్షంగా 4 లక్షల మందికి ఉపాధి.. ⇒ ఐటీలో బెంగళూరు తర్వాత హెదరాబాదేనని వెల్లడి ⇒ ఈనెల 20 నాటికి అన్ని స్కూళ్లకు పుస్తకాలు: కడియం ⇒ గ్రామజ్యోతి.. ఉన్నట్టా? లేనట్టా?: షబ్బీర్‌అలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి ప్రతీ ఏటా రూ.75 వేల కోట్ల ఐటీ ఎగుమతులు జరుగు తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. బుధవారం శాసన మండలిలో ప్రశోత్తరాల సమయంలో çసభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచందర్ రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ జవాబిచ్చారు. ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఐటీలో ప్రత్యక్షంగా 4 లక్షల మంది, పరోక్షంగా అంతకు రెండున్నర రెట్ల మంది ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఐటీ రంగంలో 31, పారిశ్రామిక రంగంలో 175 ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. కరీంనగర్, వరంగల్, జనగామ, హుజూరా బాద్, జడ్చర్లలో ఐటీ పార్కులు ప్రారంభి స్తామని వెల్లడించారు. పారిశ్రామిక విస్తరణలో భాగంగా 14 ప్రాముఖ్య రంగాలను ఎంచుకు న్నామని పేర్కొన్నారు. వరంగల్‌లో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. సత్తుపల్లిలో ఫుడ్ పార్కును, సిద్దిపేట, ఖమ్మంలలో గ్రానైట్ పార్కుల ఏర్పా టు యోచన ఉందని తెలిపారు. ఐటీఐఆర్ వచ్చినా రాకపోయినా ఐటీలో రాష్ట్రం తన దూకుడు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోని టాప్ 5 కంపెనీల్లో నాలుగు కంపెనీలు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయన్నారు. యాపిల్ కంపెనీ మొదటి దశలో నెలకు ఐదు నుంచి 10 వేల ఫోన్ల తయారీపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉందని కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ చెప్పగా.. అది వాస్తవమేనన్న కేటీఆర్.. నగరాల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం ఎస్సీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.154.15 కోట్లు, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.95.51 కోట్లు విడుదల చేసిందన్నారు. 1.74 కోట్ల పాఠ్య పుస్తకాల పంపిణీ: కడియం ఈనెల 20వ తేదీ నాటికి అన్ని పాఠశాలలకు 1.74 కోట్ల పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సభ్యులు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంతోష్‌కుమార్ అడిగిన ప్రశ్నకు కడియం సమాధానం ఇస్తూ.. ఒకవేళ ఏదైనా పాఠశాలకు అందలేదని తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1800–425–7462 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు ఎల్కేజీ నుంచి 5వ తేదీ వరకే సొంతంగా ప్రచురించుకోవచ్చని చెప్పామని, 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే వాడాలని పేర్కొన్నట్లు వివరిం చారు. ప్రైవేటు స్కూళ్లు పుస్తకాల రూపంలో రూ.200 కోట్లు లూటీ చేస్తున్నా యని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి ఆరోపిం చారు. వెనుకబడిన తరగతుల కోసం 2017–18 విద్యా సంవత్సరం నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, అయితే అర్హతలను సవరించాలని అభ్యర్థులు కోరడంతో.. సవరింపునకు సీఎం ఆదేశించారన్నారు. శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తారా అని షబ్బీర్ అలీ ప్రశ్నించగా.. త్వరలో చేపడతామని సమాధానమిచ్చారు. గ్రామజ్యోతిపై రసాభాస మన ఊరు మన ప్రణాళికలో భాగంగా ప్రారంభించిన గ్రామజ్యోతి కార్య క్రమంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. గ్రామజ్యోతి కార్యక్రమంపై ఘనంగా ప్రచారం చేసుకు న్నారని.. అది అసలు ఉన్నట్టా, లేనట్టా అని షబ్బీర్‌అలీ నిలదీశారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రామజ్యోతి కిందకే వస్తాయ ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జవాబి చ్చారు. గ్రామజ్యోతి కింద 2015–16లో రూ.450 కోట్లతో 43,674 పనులు, 2016–17లో రూ.492.69 కోట్లతో 42,757 పనులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో 8,227 గ్రామ పంచాయతీలను బీటీ రోడ్లతో అనుసంధానించామని చెప్పారు. -
లక్ష్యం.. లక్ష కోట్ల ఐటీ ఎగుమతులు
ప్రపంచ ప్రధాన సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి: హరీశ్ హైదరాబాద్: ఐటీ రంగం ఉత్పత్తుల ఎగుమ తులను వచ్చే రెండేళ్లలో రూ.లక్ష కోట్లకు పెంచాలన్నదే తెలంగాణ ప్రభుత్వం లక్ష్య మని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం రూ.70 వేల కోట్ల ఎగుమతులు చేస్తున్నామన్నారు. రాయ దుర్గంలోని దివ్యశ్రీ ఐటీ పార్కులో నూతనం గా ఏర్పాటు చేసిన ‘సేల్స్‌ఫోర్స్’సంస్థ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘ఐటీ రంగంలో మొదటి ఫేజ్‌లో హైటెక్‌సిటీ, రెండో దశలో గచ్చిబౌలి ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. మూడో దశలో ఔటర్రింగురోడ్డు, విమానా శ్రయానికి సమీపంలో అన్ని సౌకర్యాలున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రపంచంలోని అతి ముఖ్యమైన సంస్థలు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని నగరాల్లో ఉన్న ఐటీ సంస్థలపై జల్లికట్టు, కావేరిజలాల వంటి ఉద్యమాల ప్రభావం పడింది. కానీ తెలంగాణ కోసం 14 ఏళ్లు ఏకబిగిన ఉద్యమం సాగినా ఒక్క రోజు, ఒక్క సంస్థకు కూడా ఇబ్బంది లేకుండా చూశాం. మెరుగైన రవాణా వ్యవస్థ, 24 గంటలపాటు విద్యుత్, వచ్చే ఏడాదిలోపు గోదావరి, కృష్ణా, మంజీరా నీటిని నగరానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలూ తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నాం. ఒకప్పుడు వారంలో 3 రోజులు విద్యుత్ హాలిడే ఇచ్చేవారు. కానీ గత రెండున్నరేళ్లుగా సీఎం కేసీఆర్ నిర్ణయా లతో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సిద్దిపేట్, వరంగల్ అభివృద్ధిలో సేల్స్‌ఫోర్స్ సహకరించాలి. రీజినల్ ఇంజ నీరింగ్ కళాశాలలో చదివిన సేల్స్‌ఫోర్స్ శ్రీనివాస్ కళాశాల అభివృద్ధిలో భాగస్వామి కావాలి’ అని అన్నారు. త్వరలో విశాలమైన కాన్సులేట్... హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న దానికంటే రెండింత స్థలంలో విశాలమైన సొంత కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నామని యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ కేథరిన్ బి హడ్డా తెలిపారు. భారత్ అమెరికాలు అన్ని రంగాల్లో పరస్ప రం సహకరించుకుంటూ ముందుకు సాగు తున్నాయన్నారు. అమెరికాలో కొత్త ప్రభు త్వం ఏర్పడినప్పటికీ భారత్‌తో కలిసి పని చేయడంలో సమస్యలుం డవన్నారు. 2020 నాటికి 1.9మిలియన్ ఉద్యోగాలు 2020 నాటికి389 బిలియన్డాలర్ల జీడీపీతో 1.9 మిలియన్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సేల్స్‌ఫోర్స్ పనిచేస్తుందని ఆ సంస్థ టెక్నాలజీ, ప్రొడక్ట్ అధ్యక్షుడు శ్రీనివాస్ తల్లాప్రగడ తెలిపారు. ప్రపంచంలో వరుసగా ఐదేళ్లపాటు ఇన్నోవేటివ్ కంపెనీగా సేల్స్‌ఫోర్స్ గుర్తింపు పొందిందన్నారు. తెలంగాణలోని టాస్క్, టీ–హబ్‌తో కలసి పనిచేస్తూ నూతన ఆవిష్కరణలు, ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో తోడ్పాటునందిస్తున్నామన్నారు. వరంగల్ ఆర్ఈసీ కళాశాల పూర్వ విద్యార్థిగా ఇన్నోవేషన్ హబ్‌కు సహకరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. కేటీఆర్ పనితీరు భేష్ ప్రపంచ అగ్రశేణి సంస్థలన్నీ హైదరాబాద్ వైపు చూడడం, నగరంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం ఐటీ మంత్రి కేటీఆర్ పనితీరుకు నిదర్శ నమని హరీశ్ కొనియాడారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్, రాష్ట్రంగా తెలంగాణా దూసుకెళ్లడంలో కేసీఆర్, కేటీఆర్ రూపొందించిన విధానాలు, నిర్ణయాలవల్లేనన్నారు. -
ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ ఘనత
హైదరాబాద్ : ఐటీశాఖ వార్షిక నివేదికను ఐటి శాఖా మంత్రి కె తారక రామారావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణా రాష్ట్రం ఐటి ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని ప్రకటించారు. 2015-16 ఏడాదిలో రూ 75,070 కోట్ల ఎగుమతి సాధించిందనీ , గత ఏడాదితో పోలిస్తే ఇది 13.26 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఐటి మంత్రి ప్రకటించారు. 2014-15లో ఐటీ ఎగుమతులు రూ. 67 వేల కోట్లు ఉండేదనీ, 2015-16లో ఐటీ ఎగుమతులు రూ. 75 వేల కోట్లు దాటాయని వెల్లడించారు. ఐటీ సెక్టార్లో సాధించిన పురోగతి ఇది నిదర్శనమన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వార్షిక నివేదికను నేడు మీడియాకు వెల్లడించిన మంత్రి తమ ప్రధాన లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఐటి మరియు ఐటి ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్ ) ఎగుమతుల్లో పెరుగుదల జాతీయ సగటు 12.3 శాతం కంటే ఎక్కువ అని చెప్పారు. అలాగే మొత్తం 407, 385 ఉద్యోగాల్లో (వర్క్ ఫోర్స్) లో ఐటి రంగంలో నగరంలో దాదాపు 35, 611 కొత్త ఉద్యోగాలను సృష్టించామన్నారు. గేమింగ్, యానిమేషన్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు పాలసీలను ప్రకటించినట్లు పేర్కొన్న మంత్రి పాలనలో పారదర్శకతతో ఐటీకి పెద్దపీట వేశామన్నారు. టాస్క్ ద్వారా గత ఏడాది 45 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఐటీ సెక్టార్ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలకు కూడా విస్తరించాలని ఆకాంక్షించారు. టీహబ్ దేశానికే రోల్‌మోడల్‌గా మారింది. డిఫెన్స్ సెక్టార్లో టీహబ్‌తో కలిసి పనిచేసేందుకు రక్షణశాఖ ముందుకు వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ తెలంగాణా రూపకల్పనలో కృషిచేసిన ఐఐటి బాసర విద్యార్థుల, ఇతరవిద్యార్థులకు ప్రతిభ అవార్డులను, నగదు పురస్కారాలను ప్రదానం చేశారు. 100 శాతం డిజిటల్ లిటరసీ సాధించిన బాసర, నారసింగ్ పూర్ సర్పంచులను అవార్డులతో సత్కరించారు. -
ఐటీ ఎగుమతుల రెట్టింపు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఎగుమతులపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఐటీ శాఖ పనితీరును ఆ శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం హైదరాబాద్‌లోని టీఎస్‌ఐపీఏఆర్‌డీలో సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 57 వేల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఐటీ పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం కల్పించడంలో విజయవంతమయ్యామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ టెక్నాలజీ లీడర్ అయిందన్నారు. తెలంగాణను హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల కేంద్రంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
రూ. 64 వేల కోట్లకు చేరనున్న ఐటీ ఎగుమతులు
దేశంలోనే సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో పేరొందిన హైదరాబాద్ నుంచి ఈసారి ఎగుమతులు 13 శాతం పెరిగి సుమారు రూ. 64 వేల కోట్లకు (10 బిలియన్ డాలర్లు) చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20వేల మంది ఉద్యోగులు కొత్తగా చేరే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలలో 3.2 లక్షల మంది పనిచేస్తున్నారు. 2013-14 సంవత్సరంలో హైదరాబాద్ నుంచి ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతుల విలువ రూ. 57 వేల కోట్లు. ఇది దేశంలోని మొత్తం సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 12 శాతం. దీంతో ఈ రంగంలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. 31 శాతం వాటాతో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. 2025 నాటికి హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని నాస్కాం ఇటీవలే అంచనా వేసింది. -
రాష్ట్రంలో మరిన్ని సాఫ్ట్వేర్ పార్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో మరిన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు పార్కులున్నాయి. త్వరలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విజయవాడలో పార్కు అందుబాటులోకి రానుంది. దీని తర్వాత వైజాగ్, తిరుపతితోపాటు ఇతర నగరాల్లో పార్కులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) డెరైక్టర్ జనరల్ ఓంకార్ రాయ్ బుధవారమిక్కడ తెలిపారు. ఇట్స్‌ఏపీ 22వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 పార్కులు రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయని, ఇందులో విజయవాడ ఒకటని చెప్పారు. మొత్తంగా సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. ఎస్టీపీఐ పార్కుల్లో 10 వేల ఐటీ కంపెనీలు నమోదయ్యాయి. ఇందులో 3,750 కంపెనీలు ఎగుమతులు చేస్తున్నాయి. 2012-13లో ఈ కంపెనీల ఎగుమతుల విలువ రూ.2.51 లక్షల కోట్లు. వృద్ధి 10 శాతముంది. ఇంటర్నెట్ ఉచితం..: వైజాగ్, కాకినాడ, విజయవాడ, వరంగల్, తిరుపతి నగరాల్లోని ఇంక్యుబేషన్ సెంటర్లలో ఏర్పాటయ్యే నూతన కంపెనీలకు ఏడాదిపాటు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఆరు నెలలపాటు అద్దె కట్టనక్కరలేదని చెప్పారు. ఆ తర్వాత ఆరు నెలల కాలానికి ప్రభుత్వం నిర్దేశించిన అద్దెలో సగం చెల్లిస్తే చాలని పేర్కొన్నారు. కాగా, 23 విభాగాల్లో ఇట్స్‌ఏపీ అవార్డులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీఈ అండ్ సీ విభాగం కార్యదర్శి సంజయ్ జాజు, రిసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి.సతీష్ రెడ్డి, ఇట్స్‌ఏపీ ప్రెసిడెంట్ వి.రాజన్న మాట్లాడారు.