రూ. 64 వేల కోట్లకు చేరనున్న ఐటీ ఎగుమతులు | IT exports from Hyderabad to reach Rs.64,000 crore this year | Sakshi
Sakshi News home page

రూ. 64 వేల కోట్లకు చేరనున్న ఐటీ ఎగుమతులు

Published Fri, Feb 13 2015 7:48 PM | Last Updated on Wed, Sep 19 2018 6:29 PM

రూ. 64 వేల కోట్లకు చేరనున్న ఐటీ ఎగుమతులు - Sakshi

రూ. 64 వేల కోట్లకు చేరనున్న ఐటీ ఎగుమతులు

దేశంలోనే సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో పేరొందిన హైదరాబాద్ నుంచి ఈసారి ఎగుమతులు 13 శాతం పెరిగి సుమారు రూ. 64 వేల కోట్లకు (10 బిలియన్ డాలర్లు) చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి హర్ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20వేల మంది ఉద్యోగులు కొత్తగా చేరే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలలో 3.2 లక్షల మంది పనిచేస్తున్నారు.

2013-14 సంవత్సరంలో హైదరాబాద్ నుంచి ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతుల విలువ రూ. 57 వేల కోట్లు. ఇది దేశంలోని మొత్తం సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 12 శాతం. దీంతో ఈ రంగంలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. 31 శాతం వాటాతో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. 2025 నాటికి హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని నాస్కాం ఇటీవలే అంచనా వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement