సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్
ప్రపంచ ప్రధాన సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి: హరీశ్
హైదరాబాద్: ఐటీ రంగం ఉత్పత్తుల ఎగుమ తులను వచ్చే రెండేళ్లలో రూ.లక్ష కోట్లకు పెంచాలన్నదే తెలంగాణ ప్రభుత్వం లక్ష్య మని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం రూ.70 వేల కోట్ల ఎగుమతులు చేస్తున్నామన్నారు. రాయ దుర్గంలోని దివ్యశ్రీ ఐటీ పార్కులో నూతనం గా ఏర్పాటు చేసిన ‘సేల్స్‌ఫోర్స్’సంస్థ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘ఐటీ రంగంలో మొదటి ఫేజ్‌లో హైటెక్‌సిటీ, రెండో దశలో గచ్చిబౌలి ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. మూడో దశలో ఔటర్‌రింగురోడ్డు, విమానా శ్రయానికి సమీపంలో అన్ని సౌకర్యాలున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రపంచంలోని అతి ముఖ్యమైన సంస్థలు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని నగరాల్లో ఉన్న ఐటీ సంస్థలపై జల్లికట్టు, కావేరిజలాల వంటి ఉద్యమాల ప్రభావం పడింది. కానీ తెలంగాణ కోసం 14 ఏళ్లు ఏకబిగిన ఉద్యమం సాగినా ఒక్క రోజు, ఒక్క సంస్థకు కూడా ఇబ్బంది లేకుండా చూశాం. మెరుగైన రవాణా వ్యవస్థ, 24 గంటలపాటు విద్యుత్, వచ్చే ఏడాదిలోపు గోదావరి, కృష్ణా, మంజీరా నీటిని నగరానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలూ తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నాం.
ఒకప్పుడు వారంలో 3 రోజులు విద్యుత్ హాలిడే ఇచ్చేవారు. కానీ గత రెండున్నరేళ్లుగా సీఎం కేసీఆర్ నిర్ణయా లతో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సిద్దిపేట్, వరంగల్ అభివృద్ధిలో సేల్స్‌ఫోర్స్ సహకరించాలి. రీజినల్ ఇంజ నీరింగ్ కళాశాలలో చదివిన సేల్స్‌ఫోర్స్ శ్రీనివాస్ కళాశాల అభివృద్ధిలో భాగస్వామి కావాలి’ అని అన్నారు.
త్వరలో విశాలమైన కాన్సులేట్...
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న దానికంటే రెండింత స్థలంలో విశాలమైన సొంత కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నామని యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ కేథరిన్ బి హడ్డా తెలిపారు. భారత్ అమెరికాలు అన్ని రంగాల్లో పరస్ప రం సహకరించుకుంటూ ముందుకు సాగు తున్నాయన్నారు. అమెరికాలో కొత్త ప్రభు త్వం ఏర్పడినప్పటికీ భారత్‌తో కలిసి పని చేయడంలో సమస్యలుం డవన్నారు.
2020 నాటికి 1.9మిలియన్ ఉద్యోగాలు
2020 నాటికి389 బిలియన్‌డాలర్ల జీడీపీతో 1.9 మిలియన్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సేల్స్‌ఫోర్స్ పనిచేస్తుందని ఆ సంస్థ టెక్నాలజీ, ప్రొడక్ట్ అధ్యక్షుడు శ్రీనివాస్ తల్లాప్రగడ తెలిపారు. ప్రపంచంలో వరుసగా ఐదేళ్లపాటు ఇన్నోవేటివ్ కంపెనీగా సేల్స్‌ఫోర్స్ గుర్తింపు పొందిందన్నారు. తెలంగాణలోని టాస్క్, టీ–హబ్‌తో కలసి పనిచేస్తూ నూతన ఆవిష్కరణలు, ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో తోడ్పాటునందిస్తున్నామన్నారు. వరంగల్ ఆర్‌ఈసీ కళాశాల పూర్వ విద్యార్థిగా ఇన్నోవేషన్ హబ్‌కు సహకరించేందుకు ప్రయత్నిస్తానన్నారు.
కేటీఆర్ పనితీరు భేష్
ప్రపంచ అగ్రశేణి సంస్థలన్నీ హైదరాబాద్ వైపు చూడడం, నగరంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం ఐటీ మంత్రి కేటీఆర్ పనితీరుకు నిదర్శ నమని హరీశ్ కొనియాడారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్, రాష్ట్రంగా తెలంగాణా దూసుకెళ్లడంలో కేసీఆర్, కేటీఆర్ రూపొందించిన విధానాలు, నిర్ణయాలవల్లేనన్నారు.