సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే ఏఈలతో పాటు సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాషియా ప్రకటించి అండగా నిలిచింది. అంతేకాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రమాదం అనంతరం అత్యున్నత స్థాయి అధికారులతో అత్యవసర సమావేశమైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. (విషాదం: లోపలున్న 9 మందీ మృతి)
గురువారం అర్థరాత్రి అనంతరం చోటుచేసుకున్న ప్రమాదంలో 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఘటనలో మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ ఇదివరకు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది ఉద్యోగులు మృత్యువాత పడటం బాధకరమన్నారు.
మృతుల వివరాలు
1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
2.AE వెంకట్‌రావు, పాల్వంచ
3.AE మోహన్ కుమార్, హైదరాబాద్
4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
5.AE సుందర్, సూర్యాపేట
6. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ రాంబాబు, ఖమ్మం జిల్లా
7. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ కిరణ్, పాల్వంచ
8. టెక్నీషియన్ మహేష్ కుమార్
9.హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి వినేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment