
జోహన్నెస్‌బర్గ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం సౌతాఫ్రికాలో ఘనంగా నిర్వహించింది. టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తున్న పురోగతి అద్భుతం. తెలంగాణ పురోగతి రోజు రోజుకి పటిష్టమతుండటం చూసి పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ విధానాలను కొనియాడారు. అలాంటి మహానుభావుడైన కేసీఆర్ ఆలోచన విధానం నుంచి రూపొందిన హరితహారం కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఈరోజు పాటించి.. మొక్కలు నాటింది. అలాగే అనాథ శరణాలయములో పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేపట్టాం.
టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ బిగాల మహేష్, ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు ఆదేశాలతో కోర్ కమిటీ టీం ఈసారి కూడా దక్షిణాఫ్రికాలోని మూడు రాష్ట్రాల్లో( జోహన్నెస్‌బర్గ్, డర్బన్, కేప్‌టౌన్) కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరపాలని ఓల్డేజ్ హోమ్స్, అనాథ శరణాలయాలు, హాస్పిటల్ డ్రైవ్, కాన్సర్‌పై అవగాహన డ్రైవ్, మొక్కలు నాటించే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ భారీ కార్యక్రమానికి చారిటీ ఇంచార్జ్‌లు శ్రీధర్ అగ్గనగారి, అరవింద్ చీకోటిల ఆధ్వర్యంలో కోర్ కమిటీ టీమ్ అంతా ఆహర్నిశలు కృషి చేస్తుందని.. అలాగే కేప్‌టౌన్ ఇంచార్జ్ వీరన్న గండ్ల, డర్బన్ ఇంచార్జ్ రవిన్‌రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్టు’చెప్పారు. ఇందుకు సంబంధించి టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ మీడియా ఇంచార్జ్ కిరణ్‌కుమార్ బెల్లి పత్రికా ప్రకటన విడుదల చేశారు. అలాగే గతంలో టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని, బిగాల మహేష్ గారు విసిరిన చాలేంజ్‌ను గుర్రాల నాగరాజు అట్టహాసంగా ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.












Comments
Please login to add a commentAdd a comment