NRI TRS
-
'తెలంగాణ దళిత బంధు' పథకంపై ఎన్నారైల హర్షం
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'దళిత సాధికారత' పథకానికి సీఎం కేసీఆర్ 'దళిత బంధు' అని నామకరణం చేసిన విషయం తెలిసిందేనని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. రూ.1200 కోట్లతో దళిత బంధు పథకం ప్రారంభంకానుందని ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ తెలిపారని. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 11,900 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారని అనిల్ తెలిపారు. అన్ని వర్గాల ఆశాజ్యోతిలా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దళితుల సాధికారత కోసం తెచ్చిన 'తెలంగాణ దళిత బంధు' పథకాన్ని ఎన్నారైలంతా హర్షిస్తున్నారని, పేదల పట్ల అణగారిన వర్గాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు కెసిఆర్ మాత్రమేనని ఎన్నారైలంతా ప్రశంశించినట్టు అనిల్ కూర్మాచలం తెలిపారు. గత పాలకులంతా దళితులని ఓటు బ్యాంక్ లాగ మాత్రమే చూసారని ఎన్నడు కూడా వారి అభివృద్ధి కోసం పని చేయలేదని ఒక్క కెసిఆర్ గారు మాత్రమే దళితులంతా గౌరవంగా బతకాలని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని అహర్నిశలు శ్రమిస్తున్ననారని మరి సందర్భం ఏదైనా కెసిఆర్ గారి నాయకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాడు హుజురాబాద్ లో రైతు బంధు పథకం ప్రారంభించినప్పుడు ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొన్నానని, అలాగే నేడు 'తెలంగాణ దళిత బంధు' పథకం ప్రారంభానికి కూడా హ్యాజరయ్యే అదృష్టం కలిగిందని అనిల్ కూర్మాచలం సంతోషం వ్యక్తం చేసి,అవకాశం కలిపించిన కెసిఆర్ గారికి మరియు స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
సింగపూర్‌లో ఘనంగా పీవీ శత జయంతి వేడుకలు
కౌలాలంపూర్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను సింగపూర్ ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి వెంకట రమణారెడ్డి, బైర్నేని రావు రంజిత్ మాట్లాడుతూ బహుభాషావేత్త, రచయిత, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావు సేవలను గుర్తుచేసుకున్నారు. కుంటుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కొనియాడారు. దేశానికి ఎనలేని సేవ చేసిన పీవీని భారతరత్నతో గౌరవించాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల మద్దతిస్తామని చెప్పారు. ఆరేళ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్న సీఎం కె.చంద్రశేఖర్ రావుకి సింగపూర్ ఎన్నారై తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాల మురళి మోహన్ రెడ్డి, మాచాడి రవీందర్ రావు, వీరమల్ల క్రిష్ణ ప్రసాద్, బద్దం జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సౌతాఫ్రికాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
జోహన్నెస్‌బర్గ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సౌతాఫ్రికాలో ఘనంగా నిర్వహించింది. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తున్న పురోగతి అద్భుతం. తెలంగాణ పురోగతి రోజు రోజుకి పటిష్టమతుండటం చూసి పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ విధానాలను కొనియాడారు. అలాంటి మహానుభావుడైన కేసీఆర్ ఆలోచన విధానం నుంచి రూపొందిన హరితహారం కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఈరోజు పాటించి.. మొక్కలు నాటింది. అలాగే అనాథ శరణాలయములో పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేపట్టాం. టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ బిగాల మహేష్, ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు ఆదేశాలతో కోర్ కమిటీ టీం ఈసారి కూడా దక్షిణాఫ్రికాలోని మూడు రాష్ట్రాల్లో( జోహన్నెస్‌బర్గ్, డర్బన్, కేప్‌టౌన్) కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరపాలని ఓల్డేజ్ హోమ్స్, అనాథ శరణాలయాలు, హాస్పిటల్ డ్రైవ్, కాన్సర్పై అవగాహన డ్రైవ్, మొక్కలు నాటించే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ భారీ కార్యక్రమానికి చారిటీ ఇంచార్జ్‌లు శ్రీధర్ అగ్గనగారి, అరవింద్ చీకోటిల ఆధ్వర్యంలో కోర్ కమిటీ టీమ్ అంతా ఆహర్నిశలు కృషి చేస్తుందని.. అలాగే కేప్‌టౌన్ ఇంచార్జ్ వీరన్న గండ్ల, డర్బన్ ఇంచార్జ్ రవిన్రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్టు’చెప్పారు. ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ మీడియా ఇంచార్జ్ కిరణ్‌కుమార్ బెల్లి పత్రికా ప్రకటన విడుదల చేశారు. అలాగే గతంలో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని, బిగాల మహేష్ గారు విసిరిన చాలేంజ్‌ను గుర్రాల నాగరాజు అట్టహాసంగా ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
లండన్ లో ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి
లండన్: ఎన్నారై టీఆర్ఎస్, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్దంతి సందర్భంగా నివాళి సభ ఏర్పాటు చేశారు. టాక్ సమస్త కార్యవర్గ సభ్యులు, ప్రవాస తెలంగాణ వాదులు హాజరై జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సార్ చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి, జోహార్ జయశంకర్ సార్... జయశంకర్ సార్ అమర్ రహే అంటూ నివాళుర్పించారు. ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడు, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ... తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదని, చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పనిచేశారని, నేడు సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించుకోవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు .అనుకున్న ఆశయ సాధనకై ఆయన చేసిన కృషిని ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. అలాగే ఇటీవల వరుస దాడులతో యూకే లోని పలు నగరాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు సంస్థ తరుపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఈవెంట్స్ కో ఆర్డినేటర్ రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ జీవితం అందరికి ఒక స్ఫూర్తి సందేశమని, ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భం ఏదైనా మనమంతా తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట ఉండి, జయశంకర్ సార్ ఆశయాల కోసం కృషి చెయ్యాలని, ఇదే మనం వారికిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, సెక్రటరీ సృజన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, నవీన్ మాదిరెడ్డి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ సత్యపాల్ పింగిళి, సత్య చిలుముల, రవి ప్రదీప్, నవీన్ భువనగిరి, తదితరులు హాజరయ్యారు.