సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 7 వరకు కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే పుడ్ డెలివరీ సర్వీసులను కూడా నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనితో పాటు ఇళ్ల కిరాయిలను మూడు నెలల పాటు వసూలు చేయకుండా ఉండే విధంగా గృహ యజమానులను ఆదేశించే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు, కరోనా వైరస్ నియంత్రణ వంటి అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ఈ సమావేశం ముగింపు అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment