న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్ సిటీలోని మసీదులను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పాశవిక చర్యకు పాల్పడ్డ దుండగులు. మసీదుల్లోని గదుల్లో తిరుగుతూ కాల్పులు జరుపుతున్న దృశ్యాల్ని ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్ చేసి రాక్షసానందం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం నిందితుడు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారెంట్‌గా తెలుస్తోంది.