దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. దాంతోపాటే విమర్శలు, ప్రతివిమర్శల పరంపరా షురూ అయింది. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘నేను దేశానికి, మీ అందరికీ కాపలాదారు’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ‘చోకీదార్ చోర్ హై’ అంటూ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో ఆయన పంథా మార్చారు. ‘మై భీ చోకీదార్ హై’ అంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. ‘నేను కూడా కాపలాదారునే’ అనే కొత్త హాష్టాగ్తో ట్విటర్ వేదికగా ప్రచారం పర్వాన్ని కొనసాగిస్తున్నారు.