లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రూ.10వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తు సమర్పించడంతోపాటు వారంలో రెండు సార్లు నిందితుడు పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని కోర్టు పేర్కొంది. తీర్పు కాపీలు పరిశీలించిన పిదప చంచల్గూడా జైలు అధికారులు శ్రీనివాస్‌ను విడుదలచేసే అవకాశంఉంది.