ప్రభుత్వ తీరుతో ఆందోళనకు గురైన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. దేవరకొండ బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తుమ్మలపల్లి జైపాల్‌రెడ్డి ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పగిడిపల్లి. ఆయనకు ఇద్దరు సంతానం. నిన్నరాత్రి వరకు జైపాల్‌రెడ్డి సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు అంబులెన్సులో హైదరాబాద్‌కి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు.