గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరేందుకు మరో అవకాశం కల్పిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగియనుంది. గడువులోగా చేరని కార్మి కులను ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేర్చుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్ల యిందని, దాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? విని యోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయడమా? అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువులోగా కార్మికులు చేరకుంటే, మిగిలిన 5 వేల రూట్లలో ప్రైవేటు వాహ నాలకు పర్మిట్లు ఇవ్వాలని, అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని మరో సారి ప్రభుత్వం హెచ్చరించింది.