ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ముందే చెప్పినట్టు ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ తెలిపారు. చర్చలు జరుగుతుండగా మళ్లీ వస్తామని చెప్పి ఆర్టీసీ జేఏసీ నేతలే వెళ్లిపోయారని అన్నారు. వారు మళ్లీ తిరిగి వచ్చినా చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చిన 21 అంశాలపై చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు.