ఇచ్చాపురం పట్టణం ఉప్పాడ వీధికి చెందిన లక్ష్మీనారాయణ అనే రిక్షా కార్మికుని కుమారుడు ఈశ్వరరావు(6)పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు.
ఆరు బయట ఆడుకుంటున్న బాలుడిని పిచ్చి కుక్క కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఇచ్చాపురం పట్టణం ఉప్పాడ వీధికి చెందిన లక్ష్మీనారాయణ అనే రిక్షా కార్మికుని కుమారుడు ఈశ్వరరావు(6) సోమవారం ఉదయం తమ ఇంటి వద్ద ఇసుకలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క అతని వీపుపైన, దవడపైన కండ ఊడేలా కరిచింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.