Srikakulam District
-
కట్టుకున్నోడే.. కాలయముడు
ఇరవై రెండేళ్లు కాపురం చేశారు. ఇద్దరు బిడ్డలను పెంచి పెద్ద చేశారు. కూతురి పెళ్లిని కూడా ఘనంగా చేశారు. చేతికి దొరికిన పనిచేస్తూ బతుకును చక్కగా పండించుకున్నారు. కానీ మద్యం మత్తు మగవాడి ఆలోచనను మార్చేసింది. కష్టసుఖాల్లో ఇన్నేళ్లుగా తోడుగా ఉండి నీడలా నడిచిన జీవన సహచరిపై కోపం పెంచుకునేలా చేసింది. అతడి మనసులో అనుమానపు విషాన్ని కలిపింది. దాని ఫలితం భార్య మరణం.. భర్తకు ఖైదు. కొడుక్కి జీవితకాలపు విషాదం. ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలో భర్త చేతిలో భార్య హతమైంది. శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని సంత సీతారాంపురంలో గాలి నాగమ్మ(42) అనే మహిళను ఆమె భర్త అప్పలరెడ్డి సోమవారం రాత్రి దారుణంగా నరికి చంపేశాడు. ఈ హత్య స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలరెడ్డి, నాగమ్మ దంపతులకు ఇద్దరు బిడ్డలు. రెండేళ్ల కిందటే అమ్మాయికి పెళ్లి చేశారు. కొడుకు త్రినాథరావుతో కలిసి విశాఖలో ఉండేవారు. త్రినాథరావు తాపీమేస్త్రీ కాగా.. తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేవారు. కుటుంబం మొత్తం కష్టాన్నే నమ్ముకుని బతికేది. గత నెలే వీరు స్వగ్రామం సంతసీతారాంపురం వచ్చేశారు. ఇక్కడ సొంతిల్లు ఉండడంతో కుమారుడికి పెళ్లి చేసి మళ్లీ విశాఖ వెళ్లిపోవాలని అనుకునేవారు. స్థానికంగా ఉండటంతో సరుగుడు, నీలగిరి చెట్లు కొట్టటం, తొక్క తీయటం వంటి పనులు చేస్తున్నారు. సోమవారం కూడా రణస్థలంలో నీలగిరి తోట కొట్టేందుకు, తొక్క తీసే పనికి భార్యాభర్తలు వెళ్లారు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం చేశారు. కుమారుడు ఇంటి బయట మంచం వేసుకొని పడుకున్నారు. రాత్రి దంపతుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అప్పలరెడ్డికి మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో మందు తాగి గొడవపడడం, భార్యను అనుమానించడం వంటి పనులు చేసేవాడు. రాత్రి కూడా ఇలాగే దంపతులిద్దరూ గొడవ పడ్డారు. అయితే రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా సరుగుడు, నీలగిరి చెట్లు నరికే కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. మద్యం మత్తులో అతి కిరాతకంగా కత్తితో మెడ, తలపై దాడి చేశాడు. నాగమ్మ పెద్దగా కేకలు వేయడంతో కుమారుడు, చుట్టుపక్కల వారు కంగారు పడి ఇంటిలోకి వెళ్లబోతుండగా.. అప్పలరెడ్డి తలుపులు తీసి బయటకు వెళ్లిపోయాడు. లోపల చూస్తే నాగమ్మ విగతజీవిగా పడి ఉంది. హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్‌కుమార్, క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని సందర్శించింది. కుమారుడు త్రినాథరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగమ్మ మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హత్యతో గ్రామమంతా విషాదం నెలకొంది. జేఆర్ పురం సీఐ అవతారం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న దువ్వారి మీనమ్మ, భాస్కరరావు ,లక్మీపతి మృతి చెందగా దువ్వారి కాళిదాసు, కుసుమ తీవ్రంగా గాయపడ్డారు. పాత పట్నం మండలం లోగిడి గ్రామం నుంచి విశాఖపట్నం పుట్టినరోజు వేడుకల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
సారీ నాన్నా.. యూజ్‌లెస్‌గా ఉండలేను!
శ్రీకాకుళం: ‘సారీ నాన్న.. నాకెంతో చేశారు.. నేను కొంచెం కూడా మీకు ఉపయోగపడలేదు. ఇంత వయస్సు వచ్చినా మీకు సహాయం కాకుండా నేను ఉన్నాను. యూజ్‌లెస్‌గా ఉండటం కంటే మీకు దూరంగా ఉంటేనే కరెక్టని నాకు అనిపించింది. మిమ్మల్ని కష్టపెట్టాలనినాకు లేదు..’ అని వాట్సాప్ డీపీలో మెసేజ్ పెట్టి ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నందిగాం మండలం ఆనందపురం ఊర చెరువు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరికి చెందిన ఇచ్ఛాపురం హరికృష్ణ(24) విజయనగరంలో వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేవాడు. 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం విజయనగరం వెళ్తాను డబ్బులు ఇవ్వు అని తల్లిని అడిగాడు. కొద్ది రోజుల్లో ఇంటి సంబరం ఉందని, అదయ్యాక వెళ్లు అని చెప్పి రూ.550 ఇచ్చింది. డబ్బులు తీసుకొని బయటకు వెళ్లిన హరికృష్ణ పురుగుల మందు కొని ఆనందపురం చెరువు వద్దకు వెళ్లి తాగాడు. అనంతరం తన గ్రామానికి చెందిన స్నేహితుడు మామిడి విజయ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో విజయ్ కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు తెలియజేసి ఆనందపురం వెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న హరికృష్ణను పలాసలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం మెడికవర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు రిమ్స్‌కు తరలించారు. మృతుడి తల్లి ఆదిలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్సై షేక్‌మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువులో మంచి ప్రతిభ కనబరిచే హరికృష్ణ ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
బంగారు అవకాశం.. హద్దు ఆకాశం
ఎన్నాళ్లుగానో మదిలో మెదులుతున్న రూపం కళ్ల ముందు కదలాడే క్షణాలవి.. ఎన్నో కలలు, మరెన్నో ఆశల ప్రతిరూపాలుగా వాహనాలు మెరుపులా దూసుకెళ్లే అపురూప ఘడియలవి. గోకార్టింగ్ అంటే కేవలం వాహనాల పోటీ కాదు. ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న మోడల్, కష్టపడి తయారు చేసుకున్న ఇంజిన్, వాహనంలో ప్రతి విభాగంపై సొంత ముద్ర.. ఇలా ప్రతి అంశంలోనూ విద్యార్థులు తమను తాము చూసుకుంటారు. పోటీలో బండి పరుగులు పెడుతుంటే చూసి మురిసిపోతారు. ఓ కొత్త వాహనానికి పురుడు పోసే దశను గుండెతో ఆస్వాదిస్తారు. టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు ఇంజినీరింగ్ విద్యార్థుల మనసు దోచుకున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఎదగాలనుకునే విద్యార్థులకు ఈ పోటీలు ఒకరకంగా తొలి పరీక్ష లాంటివి. ఈ పోటీలు నిర్వహించడం, అందులో పాల్గొనడం, వాహనాలు తయారు చేయడం ఆషామాషీ విషయం కాదు. చాలారకాల దశలు దాటాకే బండిని ట్రాక్ మీదకు ఎక్కించాలి. గోకార్టింగ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తారు..? ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి కలిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే సృజనకు పరీక్ష పెట్టేందుకే ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో రెండు రకాల వాహనాలు తయారు చేస్తారు. వాటిలో సీవీ(ఇంజిన్‌తో తయారుచేసినవి) ఈవీ(ఎలక్ట్రికల్ వాహనాలు) ఉంటాయి. వాహనాల తయా రీతో పాటు బిజినెస్ ఆలోచనలు సైతం పంచుకునే విధంగా ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. అర్హతలు ఉండాల్సిందే.. గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనాలంటే కళాశాల స్థాయి లో ‘మోటార్ స్పోర్ట్ కార్పొరేషన్’ తయారు చేసిన రూల్ బుక్ ఆధారంగా గ్రాఫికల్‌గా డిజైన్ చేస్తూ వాహనాన్ని తయారుచేయాలి. ఆ తర్వాత పోటీల్లో పాల్గొనేందుకు ఆయా కళాశాలలు నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. పోటీల్లో పాల్గొనే ముందు కూడా డిజైనింగ్ చెక్, ఇన్నోవేషన్ చెకింగ్‌లో భాగంగా కొత్తగా ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తారు. అలాగే బ్రేక్ టెస్ట్, లోడ్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, స్టీరింగ్ టెస్ట్ తో పాటు ఇండ్యూరేషన్ టెస్ట్కూడా చేస్తారు. చివరగా బిజినెస్ రౌండ్లోనూ నెగ్గితేనే అర్హత సాధించినట్టు. ఒక్కో వాహనానికి 20 నుంచి 30 మంది టీమ్ సభ్యులు ఉంటారు. వారిలో కెపె్టన్, రైడర్, కో రైడర్ ఉంటారు. వాహనం తయారీ » గోకార్టింగ్ వాహనం తయారీకి సుమారు రూ. 70వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. »ఇందులో సీవీ వాహనాలను పూర్తిగా ఇంజిన్‌తో తయారు చేస్తారు. ఇంజిన్, మోటారు, వీల్స్, స్టీరింగ్, ఇతర పార్టులు ఉంటాయి. »ఈవీ వాహనాలను బ్యాటరీ ఆధారంగా తయారుచేస్తారు. దీనికి బ్యాటరీ, వీల్స్, స్టీరింగ్, మోటారు ఇతర పార్టులు ఉంటాయి. ఒక్కో వాహనం సుమారు 80 నుంచి 100 కిలోల వరకు బరువు ఉంటుంది. అఫిడవిట్ కచ్చితం.. గోకార్టింగ్ పోటీల్లో రైడర్ల పాత్ర కీలకం. కానీ రైడర్‌గా మారాలంటే విద్యార్థి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది నుంచి అఫిడవిట్‌ను సమర్పించాల్సిందే. గోకార్టింగ్ తో వచ్చే అవకాశాలు గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడమే విద్యార్థుల విజయానికి తొలిమెట్టు లాంటిది. వాటి లో ప్రముఖ కోర్ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు, ఆటోమొబైల్ రంగంలో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వారికి ప్రాథమిక ప్లాట్‌ఫామ్‌గా గోకార్టింగ్ ఉపయోగపడుతుంది. ప్రమాదమైనా ఇష్టమే.. గోకార్టింగ్ లో రైడింగ్ ప్రమాదకరమైనప్పటికీ ఎంతో ఆసక్తిగా ఉండడం వలన రైడర్‌గా మారాను. 60 ఓల్ట్స్ బ్యాటరీ సామర్థ్యంతో వాహనం తయారుచేశాం. మా కళాశాల ప్రిన్సిపాల్ కె.వీ.ఎన్.సునీత, ఫ్యాకల్టీ లు రూపత్, గోపీకృష్ణ సహకారంతో గోకార్టింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాం. అందరి సహకారంతో ఈవీ వెహికల్ రైడ్‌లో మొదటి స్థానంలో నిలిచాం. – జననీ నాగరాజన్, రైడర్, బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల, హైదరాబాద్. రెండు సార్లు రైడర్‌గా మొదటి స్థానం మా కళాశాల సీనియర్స్ ఇన్స్పిరేషన్తో గోకార్టింగ్ రైడర్ గా పోటీల్లో పాల్గొంటున్నాను. 150 సీసీ పల్సర్ ఇంజిన్‌తో వాహనం తయారుచేశాం. రైడర్‌గా రెండు సార్లు మొదటి స్థానంలో నిలిచాం. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ఆటోడ్రైవర్, అమ్మ గృహిణి. భవిష్యత్‌లో మంచి కోర్ కంపెనీలో ఉద్యోగం సాధించడమే లక్ష్యం. – వి.సునీల్, రైడర్, రఘు ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్టణం -
మహేంద్రగిరి..శివభక్తుల సిరి
మహేంద్రతనయ– ఒడిశాలోని గజపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాల్లోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే జీవనది. మహేంద్రగిరి కొండల్లో పుట్టినందునే ఈ నదికి మహేంద్రతనయ అనే పేరు వచ్చింది. మహేంద్రగిరి కొండలకు మరో విశిష్టత కూడా ఉంది. రోజున ఈ కొండలు అశేష శివభక్తకోటితో కళకళలాడుతూ కనిపిస్తాయి.శివపూజా విధానంలో మూర్తి పూజకంటే లింగార్చనే అనంత ఫలప్రదమని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. మహాభారత కథనం ప్రకారం అరణ్యవాసం చేసినప్పుడు పంచపాండవులు ఇదే విశ్వసించారు. మహేంద్రగిరిపై మహాశివుడిని భక్తి ప్రపత్తులతో కొలిచి తరించారు. తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి శిఖరం 1,501 మీటర్ల ఎత్తులో (4,925 అడుగులు) ఉంటుంది. మహేంద్రగిరి శిఖరాగ్రాన పంచపాండవుల ఆలయాల నిర్మాణం అప్పటి అద్భుత వాస్తునిర్మాణ ప్రతిభకు తార్కాణం. వీటి నిర్మాణం నేటికీ అంతు చిక్కని రహస్యమే! పాండవులు అరణ్యవాస సమయంలో మహేంద్రగిరిపై కొంతకాలం నివసించినప్పుడు శివలింగాలను ప్రతిష్ఠించి, ఆరాధించారని భక్తులు చెబుతారు. ఇక్కడ ప్రస్తుతం కుంతి, ధర్మరాజు, భీముడి ఆలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతావి శిథిలమయ్యాయి. ఈ ఆలయాలన్నింటిలోనూ శివలింగాలే ఉండటం విశేషం. ముప్పయి అడుగుల ఎత్తులో అరుదైన రాతికట్టుతో నిర్మించిన కుంతీ ఆలయం అబ్బురపరుస్తుంది. ఆలయం ఎదురుగా రెండు పురాతనమైన బావులు ఉన్నాయి. అత్యంత ఎత్తయిన మహేంద్రగిరులపై వాటిని ఎలా తవ్వారన్నది అంతుబట్టని విషయం. కుంతీ మందిరం ఉత్తరదిశలో ధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. ధర్మరాజు ఆలయం ఎదురుగా ఉన్న మరో కొండపై భీముడి ఆలయాన్ని కేవలం అయిదు భారీ రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయం లోపలికి వెళ్లడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. మహేంద్రగిరి పర్వతంపై ఉన్న అన్ని ఆలయాలలోనూ ఇదే పురాతనమైనది. పర్వతం చివర ఒక కొండపైన జగన్నాథస్వామి ఆలయం ఉంటుంది. దీన్ని దారుబ్రహ్మ ఆలయంగా పిలుస్తారు. మాఘమాసంలో కనుచూపు మేరంతా మంచుదుప్పటి కప్పుకుని కనిపించే మహేంద్రగిరుల మహోన్నత ప్రకృతి సౌందర్యం చూసి తరించాల్సిందే! ఏటా మహాశివరాత్రి రోజున ఇక్కడి ఆలయాల్లో భారీస్థాయిలో శివార్చన జరుగుతుంది. ఉభయ రాష్ట్రాలకు చెందిన భక్తులు మహాశివరాత్రికి ముందురోజే ఇక్కడకు చేరుకుంటారు. మహాశివరాత్రి రోజంతా పూజ, పురస్కారాలతో జాగరం చేస్తూ ‘జాగరమేళా’ నిర్వహిస్తారు.ఒడిశాలోని కొరాపుట్ జిల్లా దేవమాలి పర్వతం తర్వాత ఆ రాష్ట్రంలో రెండో ఎత్తయిన పర్వతం మహేంద్రగిరి. రామాయణంలో మహేంద్రగిరి కొండను మహేంద్రపర్వతంగా పేర్కొన్నారు. దాదాపు 1200 వృక్షజాతులకు చెందిన మొక్కలు, చెట్లు ఈ పర్వతంపైన ఉన్నాయని ఒడిశా జీవవైవిధ్య మండలి అధ్యయనంలో తేలింది. దాదాపు మూడువందలకు పైగా ఔషధ మొక్కలు ఇక్కడ లభిస్తాయి.మహా శివరాత్రి యాత్రకు ఆర్టీసీ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. మందస సమీపంలోని సాబకోట, సింగుపురం గ్రామాల వద్ద నడకయాత్ర భక్తుల కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేస్తాయి. సుమారు 32 కిలోమీటర్లు కొండలు, వాగులను దాటి కాలిబాటన మహేంద్రగిరులను చేరుకోవాలి. శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని పర్లాకిమిడి, కొయిపూర్ మీదుగా కూడా మహేంద్రగిరులను చేరుకోవచ్చు. పర్లాకిమిడి నుంచి 66 కిలోమీటర్లు ప్రయాణించి మహేంద్రగిరిని చేరుకోవచ్చు. శివరాత్రి రోజు తప్ప ఏడాదంతా మానవ సంచారం కానరాని ఈ మార్మిక మహేంద్రగిరి సందర్శన ఆద్యంతం అద్భుతం. బాలు అయ్యగారి -
అసలు కథ చెప్పని ‘తండేల్’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారులను విడుదల చేయించింది ఎవరు? వారిని వాఘా సరిహద్దుల నుంచి ఇంటి వరకు తీసుకొచ్చింది ఎవరు? వారి కష్టాలకు చలించిపోయి ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసిందెవ్వరు? ఇంకెవరూ వలస పోకుండా, ఎవరికీ అలాంటి దుస్థితి రాకుండా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో పోర్టు, హార్బర్, జెట్టీల నిర్మాణం మొదలుపెట్టింది ఎవరు? వలస బతుకులకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రయత్నించిందెవరు?... మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా ఈ ప్రశ్నలన్నింటినీ మరోసారి తెర ముందు ఉంచింది. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయి. బాధితులు మాత్రం మీడియా ముందుకు వచ్చి గుండె తెరిచి వాస్తవాలు వివరించారు. తమను విడిపించి తీసుకువచ్చింది, రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని విస్పష్టంగా చెప్పారు. తరాల తరబడి శ్రీకాకుళం జిల్లాను పాలిస్తున్న రాజకీయ కుటుంబాలు కలలో కూడా ఊహించని విధంగా జిల్లాలో పోర్టు పనులు ప్రారంభించడం, ఫిషింగ్ హార్బర్, జెట్టీ పనులు ప్రారంభించడం వైఎస్ జగన్ (YS Jagan) చలవేనని సోషల్ మీడియా మోతమోగిపోయేలా చెబుతున్నారు. ఇదీ జరిగింది.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన 10 మంది, బడివానిపేటకు చెందిన ముగ్గురు, ముద్దాడకు చెందిన ఒకరు, విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఇలా మొత్తం 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం 2018 జూలైలో గుజరాత్ రాష్ట్రం వీరావల్‌కు వెళ్లారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి నాలుగు పడవల్లో అరేబియా సముద్రంలోకి వెళ్లారు. పడవలు సముద్రంలో తీవ్ర ఆటుపోట్లకు గురవడంతో పొరపాటుగా పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. 2018 నవంబర్ 28న అక్కడి కోస్టు గార్డు అధికారులకు దొరికిపోయారు. పాకిస్తాన్ అధికారులు వారందరినీ కరాచీ సబ్ జైలులో పెట్టారు. అక్కడ సరైన తిండి, దుస్తులు లేక అక్కడ వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. జైలు అధికారులు ఉదయం ఒక్క రొట్టె ఇచ్చేవారు. మధ్యాహ్నం, రాత్రి రెండేసి రొట్టెలు ఇచ్చేవారు. వాటితోనే సరిపెట్టుకోమని చెప్పేవారు. రొట్టెలు వద్దంటే అన్నం ఇచ్చేవారు. ఆదివారం మాత్రం కొంచెం మాంసాహారం పెట్టేవారు. ఈద్ అనే స్వచ్ఛంద సంస్థ దుస్తులతో పాటు రూ.5 వేల నగదు ఇచ్చింది. అక్కడ కూలి పనులు చేస్తే కొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బుతో జైల్లోనే విక్రయించే కిరాణా సరుకులు కొనుక్కొని వంట చేసుకునేవారు. అదీ అరకొర భోజనమే. ఇలా కష్టాలు అనుభవిస్తూ క్షణమొక యుగంలా గడిపారు. మరోపక్క వేటకు వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు వారితో పాటు వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడి ద్వారా వారంతా పాకిస్తాన్ అదుపులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ మత్స్యకారుల కుటుంబాలు తమ వాళ్ల కోసం గ్రామ సర్పంచ్ నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరినీ ఆశ్రయించాయి. ఎవరూ పరిష్కారం చూపలేదు. పాకిస్తాన్లో మత్స్యకారులు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారి కుటుంబీకులు తల్లడిల్లిపోయేవారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ హామీ ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న రామారావు అలియాస్ రాజు సతీమణి నూకమ్మ, బందీగా ఉన్న మరో మత్స్యకారుడు ఎర్రయ్య సతీమణి శిరీష మిగిలిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన న్యాయవాది గురుమూర్తి సాయంతో జిల్లా యంత్రాంగానికి, నాయకులకు, ప్రభుత్వానికి విన్నపాలు అందజేశారు. అయినా ఫలితం లేదు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. 2018 డిసెంబర్ 2న రాజాం నియోజకవర్గం లచ్చయ్యపేట గ్రామం వద్దకు వచ్చిన వైఎస్ జగన్‌ను బాధిత మత్స్యకార కుటుంబాలు కలిశాయి. పాకిస్తాన్ జైల్లో బందీలుగా ఉన్న తమ వాళ్లను విడిపించాలని కోరాయి. అప్పటి రాష్ట్ర మంత్రి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. పాక్ చెరలో ఉన్న మత్స్యకారుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తమ ఎంపీలను పంపిస్తానని, మత్స్యకార కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ మంత్రిని కలిసేలా చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే వెంటనే విడిపిస్తానని భరోసా ఇచ్చారు. జగన్ పునర్జన్మనిచ్చారు తండేల్ సినిమా హీరో పాత్రకు మూలమైన రామారావు సోదరి ముగతమ్మ. ఈమె భర్త అప్పారావు, కొడుకులు కళ్యాణ్, కిషోర్ కూడా అప్పట్లో పాక్ జైల్లో బందీ అయ్యారు. ‘తండేల్’ సినిమాలో జగన్ ప్రస్తావన లేకపోవడాన్ని చూసి ముగతమ్మ తట్టుకోలేకపోయారు. సినిమా చూసి వచ్చిన వెంటనే హాల్ బయట తన మనసులో మాటను మీడియా ముందు స్పష్టంగా చెప్పారు. తమ వారిని విడిపించి తీసుకువస్తానని చేతిలో చేయి వేసి జగన్ చెప్పారని, చెప్పినట్టుగానే తీసుకుని వచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. జగనన్నతో పాటు అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, గ్రామ సర్పంచ్, సర్పంచ్ కుమార్తె, న్యాయవాది గురుమూర్తి కృషి కూడా ఉందని తెలిపారు. సినిమాలో అవేవీ లేకపోయినా బయట చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే అన్ని విషయాలు వివరంగా చెబుతున్నానని అన్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో విడుదల పాదయాత్రలో ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో 2019 ఫిబ్రవరిలో మత్స్యకారుల నుంచి కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రావడం మొదలైంది. ఇది కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలిగించినా, తిరిగి ఇంటికి వస్తారో, లేదో అన్న భయం వెంటాడుతూనే ఉండేది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి మరింతగా పెంచారు.ఆ తర్వాత కేంద్రం 370వ అధికరణం ఎత్తివేయడం, 35 (ఎ)తొలగింపు వంటి పరిణామాలతో వీరి విడుదలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా వైఎస్ జగన్ పట్టువిడవకుండా ఎంపీల ద్వారా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు. దీంతో మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. 2020 జనవరి 6న మత్స్యకారులను విడుదల చేసింది. ఆరోజు సాయంత్రం 7 గంటల సమయంలో వాఘాలోని భారత్–పాక్ సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను అప్పగించింది. వారికి అప్పటి వైఎస్సార్సీపీ (YSRCP) మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మిగతా ఇద్దరు డాక్యుమెంట్లు, ఇతర సాంకేతిక కారణాల వల్ల తర్వాత విడుదలయ్యారు. విడుదలైన వారందరినీ వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఢిల్లీ తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి తెచ్చారు. వారంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జగన్ వారందరికీ స్వీట్లు తినిపించి, ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇకపై మత్స్యకారులు ఇలా వలసలు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే పోర్టు, జెట్టీ, ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.చెప్పినట్టుగానే హామీలు అమలు 194 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మౌలిక సదుపాయాలు లేక మత్స్యకారులు వలసపోయేవారు. దీన్ని నివారించేందుకు జిల్లాలోని మూలపేటలోనే ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో సీ పోర్టు తొలి దశ, బుడగట్లపాలెంలో రూ.366 కోట్లతో ఫిషింగ్ హార్బర్, మంచినీళ్లపేటలో జెట్టీ పనులకూ శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉండగానే చాలా వరకు పనులు పూర్తి చేశారు. చదవండి: బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!వేట నిషేధ కాలంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 17,136 మందికి రూ.10 వేలు చొప్పున సాయం అందజేశారు. మత్స్యకారుల సంక్షేమం క్షేత్రస్థాయిలో అందుతుందో తెలుసుకునేందుకు 66 మంది సాగర మిత్ర ఉద్యోగులను నియమించారు. గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఫిష్ ఆంధ్రా షాపులను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి 3,064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకు వచ్చారు. ఇదంతా కళ్లెదుటే జరిగింది. అయినా ఇందులో ప్రధాన ఘట్టాలను సినిమాలో చూపించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ కార్యకర్త అమానుషం..
-
YSRCP సోషల్ మీడియాపై పోలీసుల ఓవరాక్షన్.. హైకోర్టు దెబ్బకు సీన్ రివర్స్
-
శ్రీకాకుళం కళావతి కేసులో సంచలన విషయాలు..
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పొందూరు (Ponduru) మండలం మొదలవలస (Modalavalasa) గ్రామానికి చెందిన పూజారి కళావతి (53) ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే నగరానికి చెందిన అండలూరి శరత్‌కుమార్ (31) పథకం ప్రకారం హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. శనివారం (Saturday) మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.వి.రమణ, టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానందలు వివరాలు వెల్లడించారు.నిండా అప్పులు.. ఆపై వ్యసనాలుశ్రీకాకుళానికి చెందిన అండలూరి శరత్‌కుమార్ (31) తల్లిదండ్రులతో తగువులాడుకుని ఇంటి నుంచి బయటకొచ్చేశాడు. సరస్వతీ మహల్ ఎదురుగా ఏవీఆర్ జనరేటర్ రిపేర్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తూ.. న్యూకాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. వ్యసనాలకు తోడు జల్సాలు ఎక్కువగా చేసేవాడు.పథక రచన చేశాడిలా..నగరంలోని డీసీసీబీ కాలనీలో సూరిబాబు సుందర సత్సంగానికి పొందూరు నుంచి కళావతి భజనలు, కీర్తనలు వినడానికి వచ్చేవారు. ఏడాది కిందట శరత్‌కుమార్‌కు కళావతి పరిచయమైంది. సత్సంగానికి ఎప్పుడొచ్చినా ఒంటి నిండా బంగారు ఆభరణాలతో కళావతి కనిపించేవారు. దీంతో తన అప్పులు తీర్చేందుకు ఆమెను హతమార్చి బంగారాన్ని కాజేయాలని శరత్‌కుమార్ పథక రచన చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 18న కళావతి రూమ్‌కి వస్తున్నట్లు శరత్‌కుమార్‌కు ఫోన్ చేయడంతో హత్య చేయడానికి సరైన సమయమిదేనని భావించాడు.కళావతి మధ్యాహ్నం మూడు గంటలకు గదికి వచ్చారు. ఇదివరకు శరత్‌కుమార్ ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కానీ అతడు రూ.500 మాత్రమే ఇవ్వడంతో మిగతా రూ.500 కోసం వాదులాడుకున్నారు. ఈ క్రమంలో కళావతి శరత్‌కుమార్ తల్లినుద్దేశించి అనరాని మాట అనడంతో కోపోద్రిక్తుడైన శరత్‌కుమార్ వైరుతో ఆమె గొంతు బిగించి తలగడతో గట్టిగా ముఖాన్ని అదిమి చంపేశాడు. వెంటనే ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు రెండు, పుస్తెలతాడు, నాలుగు ఉంగరాలు, ఓ చెవిదిద్దు, సెల్ఫోన్లు రెండు తీసుకున్నాడు. శవాన్ని పక్కనే ఉన్న బాత్రూమ్లోకి ఈడ్చుకువెళ్లి అక్కడ పడేశాడు. గాజులు రెండూ తన వద్ద ఉంచుకుని మిగతా వస్తువులను ఒక పాలిథీన్ కవర్లో కట్టి ఇంటి మెట్ల కింద పెట్టి రూమ్‌కి తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.తన స్నేహితుడి ఇంటిలో ఓ రాత్రి, ఆదిత్య పార్క్‌లో రెండు రాత్రులు గడిపాడు. సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసి అక్కడే ఆగి ఉన్న లారీపైకి విసిరేశాడు. తానే చంపానని బయటకు తెలిసిపోవడంతో 24న బాకర్ సాహెబ్‌పేట వీఆర్వో స్పందన అనూష వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పి ఆమె సమక్షంలో పోలీసులకు లొంగిపోయాడు. వేరే వ్యక్తికి అమ్మజూపిన రెండు గాజులనే కాక మెట్లపై దాచి ఉన్న మిగతా బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.చదవండి: శరత్ అనే వ్యక్తితో కళావతి సన్నిహితంగా..! -
ఎమ్మెల్యే ఈశ్వర్ రావు స్వగ్రామంలో దారుణ ఘటన..
-
శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్సీపీ కార్యకర్తకు గాయాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్సీపీ కార్యకర్తపై దుండగులు కత్తితో దాడి చేశారు. పాతపట్నంలోని దువ్వార వీధిలో ఘటన చోటుచేసుకుంది. దాడిలో పెద్దింటి తిరుపతిరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మెడ, చేతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఇంట్లో చొరబడి దాడికి పాల్పడ్డారు. రాజకీయ కక్షతోనే తనపై దాడి చేశారని బాధితుడు తిరుపతిరావు తెలిపారు. తిరుపతిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీకాకుళం జిల్లా గూడూరులో మురుగు నీటిలోకి దిగిన గ్రామస్తులు
-
శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతల దాడి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: రణస్థలం మండలం ఎన్టీఆర్‌పురంలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు.గురయ్యపేట బీచ్‌కి వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు కొమరకొమర రామును అడ్డగించి టీడీపీ నేతలు ముకుమ్మడిగా దాడి చేశారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీపై సైతం రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలు దాడికి దిగారు. దాడిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ ఉప్పాడ అప్పన్న, మత్సకార సోసైటీ ప్రెసిడెంట్ కొమర అప్పన్న, కొమర రాములు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
Srikakulam District: సంతబొమ్మాళి మండలంలో పెద్దపులి సంచారం
-
శ్రీకాకుళం: అమ్మో మళ్లీ వచ్చింది.. ‘పెద్దపులి’ అలజడి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: గత ఏడాది సరిగ్గా ఇదే నవంబర్ నెలలో ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన పెద్ద పులి మళ్లీ ఇప్పుడు మరో సారి అలజడి సృష్టిస్తోంది. గత రెండు రోజుల నుంచి టెక్కలి, కాశీబుగ్గ డివిజన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ యా గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. శుక్రవారం కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు గ్రామం సమీపంలో పెద్దపులి అడుగుల ఆనవాలు కనిపించడంతో అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతానికి పరుగులు తీశారు.గత రెండు రోజులుగా పెద్దపులి ఈ ప్రాంతంలో గల గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక వైపు తుఫాన్ ప్రభావంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పంట పొలాల్లో ముమ్మరంగా కోత లు, నూర్పులు చేస్తున్న సమయంలో పెద్దపులి సంచారంపై అధికారుల హెచ్చరికలతో రైతులు మరింత భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖా ఎఫ్ఆర్ఓ జగదీశ్వరరావు, ఏసీఎఫ్ నాగేంద్ర, బీట్ అధికారులు జనప్రియ, రంజిత్, ఝాన్సీ తో పాటు సిబ్బంది గ్రామాల్లో అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు.ప్రస్తుతం భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి ఒడిశా నుంచి మందస రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా సాబకోట, బుడంబో తదితర గిరిజన ప్రాంతాలను దాటుకుంటూ వజ్రపుకొత్తూరు తీ ర ప్రాంతంలో గల తోటల నుంచి సంత బొమ్మాళి వైపునకు చేరుకుంది. ప్రస్తుతం కోట»ొ మ్మాళి మండలం పొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాలు కనిపించాయి.పులి సంచారంపై అప్రమత్తం పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖాధికారులు అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని రకాల జాగ్రత్తలు దండోరా ద్వారా తెలియజేస్తున్నారు.ప్రజలు వేకువజామున, చీకటి పడిన తర్వాత సాధ్యమైనంతవరకు బయట తిరగకుండా ఇళ్ల వద్ద ఉండాలిఇంటి ఆరుబయట లేదా పశువుల పాకల వద్ద నిద్రించకూడదుపులి తిరుగుతున్న ప్రాంతంలో అడవి లోపలకు వెళ్లేందుకు సాహసించకూడదువ్యవసాయ పనులు, బయటకు వెళ్లినపుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలివ్యవసాయ పనుల్లో కింద కూర్చున్నప్పుడు లేదా వంగి పని చేస్తున్నపుడు అప్రమత్తంగా ఉండాలిపంట పొలాలకు వెళ్లినపుడు బిగ్గరగా శబ్దాలు చేయాలిపులులు సంచరించే ప్రాంతాల్లో పశువులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదుపులి తిరుగుతున్న ఆనవాళ్లు, పాదముద్రలు కనిపిస్తే తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో అటవీశాఖాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా పులి సంచరించే ఆనవాలు కనిపిస్తే తక్షణమే.. 6302267557, 9440810037,9493083748 ఫోన్ నంబర్లకు సమాచారం అందజేయాలి. -
కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూములిచ్చేదిలేదు
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా మందస మండల పరిధిలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను స్థానిక గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనాధారమైన పంట భూములు తీసుకుని కార్గో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే తమ బతుకులు నాశనమవుతాయని వాపోతున్నారు. మందస మండలం రాంపురం గ్రామంలో ఆదివారం 6 పంచాయతీల ప్రజలు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసుకుని ఎయిర్‌పోర్టును ముక్తకంఠంతో వ్యతిరేకించారు.ఉద్దాన ప్రాంత ప్రజల అవసరాలు, మనోభావాలు తెలుసుకోకుండా, స్థానికుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని బలవంతంగా కార్గో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్దాన ప్రాంతానికి ఉద్యమాలు కొత్తకాదన్నారు. జీవనాధారమైన పంట భూముల్ని పరిహారానికి ఆశపడి ఇవ్వబోమని స్పష్టంచేశారు.ఈ సందర్భంగా రాంపురం వేదికగా ఉద్దానం ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌గా కొమర వాసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో వారం రోజుల్లో పంచాయతీల వారీగా కమిటీలు వేసుకుని అనంతరం పోరాట కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు. -
టీడీపీ నేతల దాష్టీకం
వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచి నీళ్లపేటలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ వర్గీయులపై దాష్టీకానికి తెగబడ్డారు. ఇద్దరు మహిళలు, మరో యువకు డిని చితకబాదడంతో వారు పలాస ప్రభుత్వాస్పత్రిలో చేరారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి సంబంధించిన డబ్బుల ఖర్చులు, జమ వివరాలపై శనివారం గ్రామ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.వైఎ స్సార్సీపీ కార్యకర్త గూడేం చిన్నారావు సమా వేశానికి రావాలని టీడీపీ నేతలు గుళ్ల చిన్నా రావు, మాణిక్యాలరావు, మడ్డు అప్పలస్వామి, మడ్డు రాజు, కారి లింగరాజు కబురు పంపా రు. దీంతో.. చిన్నారావుతో పాటు ఆయన మేనత్తలు రట్టి లక్ష్మమ్మ, కదిరి నీలమ్మ కూడా వెళ్లారు. నాలుగేళ్ల కింద మంచినీళ్లపేట జెట్టీ నిర్మాణంలో 66 మందికి చెందిన రూ.1.63 లక్షల కూలీ డబ్బులు ఎందుకు చెల్లించలేదని టీడీపీ నేతలు, మాజీ సర్పంచ్ గుళ్ల చిన్నా రావు, గుళ్ల మాణిక్యాలరావు, మరో 20 మంది నిలదీశారు. దీనికి చిన్నారావు తనకు సంబంధంలేదని, జెట్టీ కాంట్రాక్టర్‌ను అడగాలని చెప్పారు. దీంతో గుళ్ల చిన్నారావుతో పాటు టీ డీపీ నేతలంతా కదిరి నీలమ్మ, లక్ష్మమ్మ, చిన్నా రావులపై దాడి చేశారు. నిజానికి.. 2023లో మంచినీళ్లపేట పర్యటనకు వచ్చిన గౌతు శిరీ షను నిలదీశామనే తమపై కక్ష పెట్టుకుని దా డులకుతెగబడ్డారని బాధితులు ఆరోపించారు. -
పోలీస్ స్టేషన్ లో టీడీపీ రౌడీల వీరంగం..
-
బరితెగించిన పచ్చ గూండాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. పోలీస్‌స్టేషన్‌లోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. పోలీసులు వద్దని వారించినా వినకుండా టీడీపీ నేతలు చితకబాదారు. టీడీపీ నేతలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.టీడీపీ నేతల కక్ష సాధిపుమరోవైపు, సనపల సురేష్‌పై టీడీపీ నేతలు కక్ష సాధిపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నాడని గతంలో సురేష్‌పై ఇసుక మాఫియా దాడి చేసింది. ఇసుక మాఫియాతో ఎమ్మెల్యే కూన రవికుమార్ దాడి చేయించాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు తనను వేధిస్తున్నారని సురేష్ అంటున్నారు.విచారణకంటూ పిలిచి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒత్తిడితోనే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. బాధితుడు సురేష్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. -
'కుంకీ'లొచ్చేనా.. కలత తీర్చేనా?
సాక్షి, పార్వతీపురం మన్యం: కొన్నేళ్లుగా పార్వతీపురం మన్యం జిల్లాను కరి రాజులు వీడటం లేదు. ప్రస్తుతం జిల్లాలో 2 గుంపులు ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో 11 వరకు గజరాజులు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఏనుగుల కారణంగా ఇప్పటికే 12 మంది వరకు రైతులు, గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రూ.6 కోట్ల మేర పంటలకు, ఇతర ఆస్తులకు ధ్వంసం వాటిల్లినట్లు అంచనా. సరిహద్దులను దాటుకుంటూ ప్రవేశం..ఆరేళ్ల క్రితం సరిహద్దులను దాటుకుంటూ జిల్లాలోకి ప్రవేశించాయి గజరాజులు. అప్పటి నుంచి ఎక్కడికక్కడ దాడులు చేస్తూ గిరిజనుల ప్రాణాలు తీస్తున్నాయి. పంటలు ధ్వంసం చేస్తున్నాయి. మరోవైపు ప్రమాదాల బారిన పడి గజరాజులూ మృత్యువాత పడుతున్నాయి. గత జూన్‌లో గరుగుబిల్లి మండలం తోటపల్లి సరిహద్దుల్లో అనారోగ్యంతో ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. కొద్దిరోజుల క్రితం కొమరాడ మండలం వన్నాం గ్రామానికి చెందిన వాన శివున్నాయుడు(62) అనే వృద్ధుడిని ఏనుగులు తొక్కి చంపాయి. ఏళ్లుగా అటు అమాయక గిరిజనులతో పాటు.. ఇటు ఏనుగుల ప్రాణాలూ పోతున్నా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఆహార అన్వేషణలో మృత్యువాత..2018 సెప్టెంబరు 7న శ్రీకాకుళం జిల్లా నుంచి 8 ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలంలోకి ప్రవేశించింది. అదే నెల 16న అర్తాం వద్ద విద్యుదాఘాతానికి గురై ఒక ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత దుగ్గి సమీపంలోని నాగావళి ఊబిలో కూరుకుపోయి మరో ఏనుగు మృత్యువాత పడింది. అంతకు ముందు 2010 నవంబర్‌లో అప్పటి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం (ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా) మండలం కుంబిడి ఇచ్ఛాపురంలో 2 ఏనుగులు మృతి చెందాయి. గతంలో సాలూరు మండలంలో ఏనుగు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు వదిలింది. కొన్నాళ్ల క్రితం “హరి’ అనే మగ ఏనుగు గుంపు నుంచి తప్పిపోయింది. నెలలు గడిచినా దాని జాడ తెలియరాలేదు. గుంపులో కలవలేదు. గతేడాది మే లో జిల్లాలోని భామిని మండలం కాట్రగడ బీ వద్ద విద్యుదాఘాతంతో 4 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఏనుగులు గుంపు ఇక్కడికి వచ్చిన తర్వాతే మరో 4 ఏనుగు పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఆహార అన్వేషణలో భాగంగా అడవులను వదిలి, జనావాసాల మధ్యకు వస్తున్న ఏనుగులు.. విద్యుదాఘాతాలకు, రైతులు పంటల కోసం ఏర్పాటు చేసుకున్న రక్షణ కంచెలతో ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతున్నాయి. అటు ప్రాణ నష్టం..ఇటు పంట ధ్వంసంఏనుగులు దాడి చేయడంతో మనుషుల ప్రాణాలూ పోతున్నాయి. 2019 జనవరిలో కొమరాడ, జియ్యమ్మవలస మండలాలకు చెందిన నిమ్మక పకీరు, కాశన్నదొర ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో గజరాజుల ప్రవేశం నుంచి ఇప్పటి వరకు వాటి దాడిలో 11 మంది పైబడి మృతి చెందగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. వేలాది ఎకరాల పంటలను ఇవి ధ్వంసం చేశాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును ఒడిశా ప్రాంతానికి తరలించినా..తిరిగి జిల్లాకు చేరుకుని కొమరాడ, పార్వతీపురం , జియ్యమ్మవలస, భామిని, సీతంపేట, గరుగుబిల్లి తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల సంఖ్యను నిర్థారించేందుకు 3 రోజులపాటు అటవీ శాఖాధికారులు సర్వే చేపట్టారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో ఏడు, పాలకొండ డివిజన్ పరిధిలో 4 ఏనుగులు తిరుగుతున్నట్లు గుర్తించారు. జోన్‌తోనే సంరక్షణ! కరిరాజులు ఆహారం, నీరు కోసం తరచూ జనావాసాల మధ్యకు వస్తున్నాయి. దీంతో గిరిజనుల పంటలు ధ్వంసం కావడంతో పాటు, పలువురు ఏనుగుల దాడిలో ప్రాణాలూ కోల్పోతున్నారు. ఇవి జనావాసాల మధ్యకు రాకుండా సాలూరులో జంతికొండ, కురుపాం పరిధిలోని జేకేపాడులో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు 2020 డిసెంబర్లో అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. జంతికొండలో 526 హెక్టార్లు, జేకే బ్లాక్‌లో 661 హెక్టార్లలో అటవీ భూమిని గుర్తించారు. ఆ తర్వాత ఆ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. తర్వాత కూడా ఏనుగుల సంరక్షణకు పార్వతీపురం మండలం డోకిశీల, చందలింగి, కొమరాడ మండలం పెదశాఖ, పాత మార్కొండపుట్టి ప్రాంతాలను పరిశీలించారు. చివరకు సీతానగరం మండలం జోగింపేట అడవులను ఏనుగుల పునరావస కేంద్రం కోసం ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఒడిశా నుంచి జిల్లాలోకి...ఒడిశా రాష్ట్రం లఖేరి నుంచి తొలిసారిగా 1998 అక్టోబర్ 4న కురుపాం అటవీ ప్రాంతంలోకి ఏనుగులు ప్రవేశించాయి. వాటిని తరిమేసినా..1999 ఆగస్ట్‌లో కురుపాం, గుమ్మలక్ష్మీపురం కొండల్లోకి వచ్చాయి. మళ్లీ వాటిని వెనక్కి పంపారు. 2007–08 మధ్య గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, సీతంపేట, వీరఘట్టం ప్రాంతాల్లో పంటలను తీవ్రంగా నష్టపరిచాయి. ఆ సమయంలో వాటిని తరిమికొట్టేందుకు “ఆపరేషన్ గజ’ను చేపట్టారు. ఏనుగులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఒడిశా తరలిస్తుండగా రెండు మృతి చెందాయి. దీంతో ఆ ఆపరేషన్‌ను నిలిపివేశారు. అప్పట్లో ఉమ్మడి విజయనగరం– శ్రీకాకుళం జిల్లాల మధ్య ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినా గిరిజనుల వ్యతిరేకత నేపథ్యంలో నిలిచిపోయింది. కుంకీలను పంపేందుకు ఉప ముఖ్యమంత్రి హామీ చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కరిరాజుల వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కర్ణాటక నుంచి కుంకీలను తీసుకువచ్చేందుకు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా జిల్లాకూ కుంకీలను పంపుతామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఇవి వస్తే ఇక్కడున్న ఏనుగులతో సహవాసం చేసి, వాటిని తమకు అనుకూలంగా మలుచుకుంటాయి. జనారణ్యంలో తిరుగుతున్న గజరాజులను తిరిగి అరణ్యంలోకి వెళ్లేలా దిశానిర్దేశం చేస్తాయి. ఇదే సమయంలో కుంకీలను తీసుకువచ్చేందుకు జిల్లాలో అనువైన పరిస్థితులు లేవని అటవీ శాఖాధికారుల మాట. జిల్లాలో చిత్తూరు మాదిరి శిక్షణ పొందిన ఏనుగులను ఉంచేందుకు క్యాంపు లేదు. వాటి కోసం పని చేసేందుకు ప్రత్యేక సిబ్బంది లేరు. ఈ పరిస్థితుల్లో కుంకీల రాక ఉంటుందా, ఉండదా? అన్న సందేహాలు గిరిజన సంఘాల నుంచి నుంచి వ్యక్తమవుతున్నాయి. కుంకీలను రప్పించాలి.. కర్ణాటక నుంచి కుంకీలను త్వరగా జిల్లాకు రప్పించి ఇక్కడున్న ఏనుగులను అడవికిగానీ, సంరక్షణ కేంద్రానికి గానీ తరలించాలి. చాలా ఏళ్లుగా ఏనుగులు ఇక్కడే తిష్ట వేశాయి. 11 మందికిపైగా మృత్యువాత పడ్డారు. రూ.6 కోట్ల మేర పంట, ఆస్తి నష్టం సంభవించాయి. ఏనుగుల వెంట అటవీ శాఖాధికారులు తిరగడమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండటం లేదు. – కొల్లి సాంబమూర్తి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, పార్వతీపురంరైతులు, గిరిజనులు భయపడుతున్నారు..ఏనుగులు ఎప్పుడు ఏ ప్రాంతం మీద దాడి చేస్తున్నాయో అర్థం కావడం లేదు. అటవీ శాఖాధికారులు తిరగడం, ప్రభుత్వానికి నిధులు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండటం లేదు. రైతులు, గిరిజనులు పొలాలకు, ఇతర పనులకు వెళ్లడానికి భయపడుతున్నారు. కుంకీ ఏనుగులను తెప్పిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చి రెండు నెలలవుతున్నా.. ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. – హెచ్.రామారావు, గిరిజన సంఘం నాయకులు, పార్వతీపురం -
ఆగని అఘాయిత్యాలు: ఇద్దరు విద్యార్థినులపై గ్యాంగ్‌రేప్
కాశీబుగ్గ: కూటమి ప్రభుత్వహయాంలో అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. నిన్న తెనాలిలో కేంద్రమంత్రి అనుచరుడి దురాగతం.. మొన్న బద్వేలులో ఉన్మాది దారుణం.. అంతకుముందు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఇలా అత్యాచారాలు, వేధింపులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. పుట్టినరోజు వేడుకల పేరిట స్నేహితురాళ్లను తీసుకెళ్లిన యువకులు గ్యాంగ్‌రేప్ చేశారు. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సోమవారం బయటకు వచ్చింది.పట్టణానికి చెందిన ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు, ఇంటర్ తప్పి ఖాళీగా తిరుగుతున్న ముగ్గురు యువకులు స్నేహితులు. ఈ నెల 19న వారిలో ఒక యువకుడి పుట్టినరోజు కావడంతో అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. పలాస సినిమా థియేటర్ సమీపంలో ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద బిర్యానీలు, స్వీట్‌షాప్‌లో కేక్‌లు, గిఫ్ట్‌లు కొనుక్కుని ద్విచక్ర వాహనాలపై పలాస–కాశీబుగ్గ జంటపట్టణాలకు ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్న కాలనీకి చేరుకున్నారు.అక్కడ కేక్‌కట్ చేసి భోజనాలు చేసిన తరువాత ఇద్దరు విద్యార్థినులపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై జరిగిన లైంగిక దాడి నుంచి మరో విద్యార్థిని తప్పించుకోగలిగింది. తప్పించుకున్న విద్యార్థని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అత్యాచారానికి గురైన విద్యార్థినుల తల్లిదండ్రులకు విషయం తెలిసినా పరువు పోతుందని మిన్నకుండిపోయారు. బాధిత విద్యార్థిని ఒకరు సోమవారం అనారోగ్యానికి గురవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
‘గుడ్ బుక్ రాస్తాం.. అండగా ఉంటాం’
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం, రాష్ట్ర వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా సీదిరి అప్పల రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ‘‘భవిష్యత్తు అంతా వైఎస్సార్సీపీ పార్టీదే. కూటమి పాలనలో పధకాలన్నీ కొట్టుకుపోయాయి. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని అన్నారు.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. ‘‘పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎవరైనా పనిచేస్తారు. పార్టీ అధికారంలో లేనప్పుడు బరువు మోయడమే అసలైన పని. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా జగన్ పనిచేయమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం. 4 నెలలో ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రజలను పూర్తిగా మోసం చేశారు. నేను ఆముదాలవలసలోనే ఉంటా.. ప్రజల కోసమే పనిచేస్తా. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ అన్ని ఆగిపోయాయి. నిత్యవసరాలు ఆకాశానంటుతున్నాయి. ధరల కంట్రోల్‌కి బడ్జెట్లోనే మేం నిధులు ఇచ్చేవాళ్లం. నాలుగు నెలలో రూ. 30 వేల కోట్లు అప్పుచేశారు. మెడికల్ సీట్లు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాయడం ఎంత దారుణం?. పేదల విద్యార్దులకు సీట్లు రాకుండా చేయడానికే కదా. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. వరద సహాయం పేరుతో అక్రమాలు చేశారు’’ అని అన్నారు.అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ, ‘‘ కార్యకర్తలు కసితో పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు మాయమాటలు చేబుతూనే వస్తున్నారు. బిర్యాని వస్తుందని పలావు పెట్టే వారిని ఓడించారు. ఇప్పుడు పలావు, బిర్యానీ రెండూ లేవు. వంద రోజుల్లో ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. గుడ్ బుక్ రాస్తాం.. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సమస్యలపై పోరాడటం మొదలు పెడతాం’’ అని పేర్కొన్నారు. -
శ్రీకాకుళంలో విషాదం.. కందిరీగల దాడిలో ఇద్దరి మృతి
శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం పొలం పనులు వెళ్లి వస్తుండగా కూలీలపై కందిరీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేసున్నారు.చదవండి: నెల్లూరు జిల్లాలో పరువు హత్య -
మెడికల్ సీట్లు వదులుకోవడం హేయం
కాశీబుగ్గ: మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య అని.. ఈ విషయంలో ఏకైక అత్యంత చెత్త ప్రభుత్వం చంద్రబాబుదేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు.చంద్రబాబు హామీలకు తాను గ్యారంటీ అన్న పవన్‌కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్ కాలేజీలు స్థాపించేందుకు గత సీఎం వైఎస్ జగన్ ఏర్పాట్లు చేశారని, వాటిలో ఐదింటిని పూర్తి చేశారని గుర్తు చేశారు. ఫలితంగా 2023–24లో విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలో వైద్య కళాశాలలు ప్రారంభమై ఒకేసారి 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయి ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు సైతం ప్రారంభమై మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చి ఉండేవని అన్నారు. మరోవైపు ముందుగా నిర్దేశించుకున్నట్టు 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, పెనుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురంలలో ఏడు కాలేజీలు కూడా ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్లు దాదాపు 5వేలకు చేరేవన్నారు. -
ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. విజయనగరం జిల్లాలో..విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్‌కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో అదుపులోనే ఉంది. ‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలుఅధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.ముందుచూపులేకే ఏలేరు ముంచింది..ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళనచింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినారైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలంబీర పంట పోయింది..రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా -
చాక్లెట్లతో గణేశుడి విగ్రహం..
-
అమెరికాలో ఇచ్ఛాపురం యువకుడు మృతి
ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పి.రూపక్‌రెడ్డి(26) అమెరికాలోని జార్జ్ సరస్సులో మునిగి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతుల కుమారుడు పి.రూపక్‌రెడ్డి పది నెలల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడి హరీష్‌బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేరాడు. డెలావర్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం (ఆగస్టు 27) న్యూయార్క్‌లోని జార్జ్ లేక్‌కు భారతదేశానికి చెందిన ఐదుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. సరస్సు మధ్యలో పెద్ద రాయి కనిపించడంతో దానిపై నిలుచుని ఫొటోలు తీసుకునేందుకు ఎక్కారు. ఈ క్రమంలో రూపక్‌రెడ్డి, అతని స్నేహితుడు రాజీవ్ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డారు. మిగిలిన స్నేహితులు రాజీవ్‌ను కాపాడగా, రూపక్‌రెడ్డి నీటిలో మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రెస్క్యూ టీం వచ్చి గాలించిం రూపక్‌రెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతులు, వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఉపాధికి గడ్డుకాలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వ్యవసాయం, మత్స్యకార రంగాల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉపాధి దొరికేది గ్రానైట్ పరిశ్రమల్లోనే. ఇప్పుడా పరిశ్రమలు మూతబడ్డాయి. నూతన పాలసీ పేరుతో గ్రానైట్ పరిశ్రమలను ప్రభుత్వమే మూసివేయించింది. రెండు నెలలుగా గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనులు జరగడం లేదు. ఉపాధి లేక కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి. వారి ఆకలికేకలను జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.ఇప్పట్లో పరిశ్రమలు తెరుచుకునే పరిస్థితి లేదని భావిస్తున్న కార్మికులు.. మళ్లీ వలస బాట పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 150 క్వారీలు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా మరో 150 పాలిíÙంగ్ యూనిట్లు, 30 క్రషర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 25 వేల మంది, పరోక్షంగా 45 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో జిల్లాకు చెందిన వారే కాకుండా ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పశి్చమ బెంగాల్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. కూటమి నేతల పెత్తనం.. టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే గ్రానైట్ పరిశ్రమలపై కూటమి నేతల పెత్తనం మొదలైంది. మళ్లీ తాము చెప్పేవరకు గ్రానైట్ పరిశ్రమల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదని అధికారవర్గాల ద్వారా ఆదేశించారు. దీనికి నూతన గ్రానైట్ పాలసీ అనే ముసుగు తొడిగారు. పర్మిట్లను ఇవ్వకుండా నిలిపేశారు. దీంతో గ్రానైట్ క్వారీలతో పాటు వాటి అనుబంధ యూనిట్లు అన్నీ రెండు నెలల క్రితమే మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆధారపడ్డ కార్మికులంతా గగ్గోలు పెడుతున్నారు.ఈ సంక్షోభం ఒక్క కార్మికులపైనే కాదు యాజమాన్యాలపైనా ప్రభావం చూపింది.. ఇక్కడ గ్రానైట్ బ్లాకులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లేవి. ప్రస్తుతం విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు తీసిన బ్లాక్‌లు ఆరు బయటే ఉండిపోవటంతో కలర్ మారి మార్కెట్లో విలువ తగ్గిపోయేలా ఉంది. ఫలితంగా గ్రానైట్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోనుంది. అటు కార్మికుల ఆకలికేకలు, ఇటు యాజమాన్యాల నష్టాలను క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలించింది. కార్మికుల వేదన వర్ణనాతీతం గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న టెక్కలి మండలంలో కార్మికుల వేదన వర్ణనాతీతంగా ఉంది. బొరిగిపేట సమీపంలోని ఓ క్వారీ సూపర్వైజర్ మాట్లాడుతూ.. తాను టీడీపీ అభిమానినని, కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు మంచి జరుగుతుందని భావిస్తే చివరకు కడుపుకొట్టారని చెప్పారు.పరిశ్రమలు తెరిపించండి అని కోరడానికి ఇక్కడి మంత్రి వద్దకు వెళితే.. పరిశ్రమ తెరవకపోతే తినడం మానేస్తావా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిపేట, మెలియాపుట్టి, దీనబంధుపురం, సవర, జాడుపల్లి, నిమ్మాడ తదితర గ్రామాల్లో నివసించే కార్మికుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీలు ఆపేసి తమ ఉపాధిపై దెబ్బకొట్టి పస్తులు పెట్టడం ఏంటని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాసుల కక్కుర్తి కోసమే.. గ్రానైట్ పరిశ్రమల నుంచి కాసులు ఆశించే ఇలా చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా 2014–19లో గ్రానైట్ కార్యకలాపాలన్నీ మంత్రి సోదరుడు కనుసన్నల్లోనే జరిగేవి. వారి కుటుంబానికి కూడా గ్రానైట్ అనుబంధ పరిశ్రమలు ఉండటంతో వాటి ముసుగులో చక్రం తిప్పేవారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వారి పప్పులు ఉడకలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో గ్రానైట్ కంపెనీలపై పెత్తనం కోసం ప్రయతి్నస్తున్నారు. దానికి నూతన పాలసీ అంటూ బూచిగా చూపిస్తున్నారు అని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి పోయింది మా ఊరికి దగ్గరలో మేలిసతివాడ వద్ద క్వారీలో జాకీ లేబర్‌గా పనిచేస్తుండేవాడిని. క్వారీలు నడవక ఉపాధి పోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా లాంటి పేదలకు పెద్ద ఇబ్బందులు వచ్చాయి. గత ప్రభుత్వంలో బాగానే క్వారీలు నడచి జీతాలు వచ్చాయి. –కొర్రాయి నారాయణ, జీడిపేట, వీకేజీ క్వారీ మేలిసతివాడగ్రానైట్ కార్మికులను రోడ్డున పడేశారు కూటమి ప్రభుత్వం గ్రానైట్ క్వారీల నిర్వాహణపై ఆంక్షలు పెట్టింది. దీని వలన జిల్లాలోని క్వారీలు, వాటికి అనుసంధానంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు, క్రషర్లు ఆగిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు నడిరోడ్డున పడ్డారు. జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ లేదు. దీని వలన జిల్లాలో వలసలు ఆరంభమయ్యాయి. జిల్లాలో వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగ యువతకు ఉపాధికి ఆసరాగా ఉన్న గ్రానైట్ రంగాన్ని కుదేలు చేస్తున్నారు. –షణ్ముఖరావు, గ్రానైట్ కార్మికుల యూనియన్ జిల్లా నాయకుడుపని లేదు.. బత్తాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చాక క్వారీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీని వలన పని లేదు. బత్తాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజు రేపు అని చెబుతున్నారు కానీ క్వారీలు తెరవడం లేదు. పని లేక పస్తులుంటున్నాం. –ముఖలింగాపురం అప్పారావు, జాకీ లేబర్, ప్రియాంక గ్రానైట్, జీడిపేట -
బాబు అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
-
టీడీపీ నేతలు చెప్పారు.. అధికారులు వేటేశారు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సంతబొమ్మాళి: అధికారమే అండగా టీడీపీ నేతలు బరితెగించారు. శ్రీకాకుళం జిల్లా సంత»ొమ్మాళి మండలం మూలపేట పోర్టులో పనిచేస్తున్న మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 17 మందిని టీడీపీ నేతల బెదిరింపులతో అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. ఉద్యోగులు వైఎస్సార్సీపీకి చెందినవారని.. వారిని తీసేసి టీడీపీ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు 17 మందిని ఉద్యోగాల నుంచి తప్పించడంతో బాధితులతోపాటు నిర్వాసితులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. స్థానిక సర్పంచ్ జీరు బాబూరావు ఆధ్వర్యంలో మూలపేట పోర్టులోకి ప్రవేశించి ఉద్యోగాల తొలగింపుపై అధికారులను నిలదీశారు. స్థానిక టీడీపీ నాయకులు తమను బెదిరించడం వల్లే 17 మందిని తొలగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పడంతో నిర్వాసితులు మండిపడ్డారు. పోర్టు నిర్మాణానికి భూములు ఇవ్వని టీడీపీ నాయకుల పెత్తనం ఏమిటని ప్రశి్నంచారు. వారు దర్జాగా వారి భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నారని, పోర్టుకు భూములిచ్చి తాము సర్వం కోల్పోయి నిర్వాసితులుగా మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టులో ఉద్యోగాలు చేసుకుంటున్న తమపై టీడీపీ నాయకులు రాజకీయ కక్ష సాధింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కాగా 10 రోజుల పాటు మూలపేట గ్రామస్తులకు పని ఆపుతున్నామని పోర్టు అధికారులు చెప్పారు. దీంతో తమతో పాటు మిగతా గ్రామస్తులకు పని ఆపాలని ఉద్యోగాలు కోల్పోయినవారు డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. నిర్వాసితులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలన్నదే తమ అభిమతమని సర్పంచ్ బాబూరావు, గ్రామస్తులు రాంబాబు, శివ, దారపు అప్పలరెడ్డి, రోహిణి, మోహనరావు తదితరులు తెలిపారు. ఇదే విషయాన్ని పోర్టు డీజీఎం ఉమామహేశ్వరరెడ్డి, హెచ్ఆర్ మేనేజర్ సంతో‹Ùలకు తెలియజేశామన్నారు. కాగా, ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టెక్కలి సీఐ సూర్యచంద్రమౌళి, నౌపడ ఎస్ఐ కిషోర్‌వర్మ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోర్టు అధికారులకు విన్నవించడానికి వెళ్లిన నిర్వాసితులను తొలుత సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వడంతో తర్వాత లోపలకు విడిచిపెట్టారు. మీడియా ప్రతినిధులను సైతం గేటు వద్దే ఆపేశారు.మూలపేటపై కాలకూట విషం.. వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మూలపేట పోర్టుపై పెత్తనం కోసం టీడీపీ నేతలు తెగ ఆరాటపడుతున్నారు. పోర్టుకు సంబంధించిన సబ్ కాంట్రాక్టులు, ఉద్యోగాల కోసం కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే బండ రాళ్లు, ఇసుక, గ్రావెల్ తరలిస్తున్న లారీలను నిలిపివేయించారు. తాజాగా అందులో మొదటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేలా అధికారులను బెదిరించారు. దీంతో అటు నిర్మాణానికి కీలకమైన బండ రాళ్లు, గ్రావెల్, ఇసుక రవాణా కాకపోవడంతో ప్రధాన పనులు నిలిచిపోయాయి. ఇప్పుడేమో ఉద్యోగులను కూడా తొలగించి టీడీపీ నేతలు పనులను కూడా అడ్డుకున్నారు. ఒక మంత్రితో కలిసి స్థానిక టీడీపీ నేతలు మూలపేట పోర్టును తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ పనులు శరవేగంగా జరిగాయి. పోర్టులో కీలకమైన సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. పోర్టు పనులు పూర్తయితే 11 తీర ప్రాంత మండలాల మత్స్యకారులకు మత్స్య సంపద లభించడంతో పాటు జీడిపప్పు, గ్రానైట్, జూట్, ఇనుము ఉక్కు ఎగుమతులకు అవకాశం కలుగుతుంది. అయితే టీడీపీ నేతల దాషీ్టకాలతో పోర్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి.చంపుతామని బెదిరిస్తున్నారు ప్రభుత్వం మారిన వెంటనే మమ్మల్ని చంపుతామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. పోర్టు కోసం భూములు ఇచ్చిన మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించాలని టీడీపీ నాయకులు అధికారులను భయపెట్టారు. నిర్వాసిత గ్రామస్తులందరికీ పోర్టులో పనికల్పించాలని అధికారులకు విన్నవించాం. – జీరు బాబూరావు, సర్పంచ్, మూలపే -
అప్పుడే పింఛన్ల తొలగింపు
సాక్షి నెట్వర్క్: అనుకున్నంతా అయింది. నెలకే మొదలైంది. ఐదేళ్లుగా కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా పింఛన్ అందుకున్న లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. కూటమి నాయకులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. పలు గ్రామాల్లో పింఛన్లను నిలిపేశారు. పలువురి పింఛన్లు తొలగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే అడుగడుగునా తమ నైజం బయటపెట్టుకున్నారు. పలు గ్రామాల్లో పింఛన్ల పంపిణీని టీడీపీ నాయకులు తమ కనుసన్నల్లో నడిపించారు.ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కారణంతో పలు గ్రామాల్లో కొందరికి పింఛన్లు అందకుండా చేశారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇళ్లపై టీడీపీ జెండా ఐదేళ్లు ఎగిరితేనే పింఛన్ ఇస్తామని బాహాటంగానే చెబుతున్నారు. ఒక లబ్ధిదారుడికి పింఛన్ ఆపేశారని ఫోన్ చేసిన టీడీపీ కార్యకర్తతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచితంగా మాట్లాడారు. తొక్కగాడివి.. మొనగాడిననుకుంటున్నావా.. అంటూ విరుచుకుపడ్డారు. దెందులూరు మండలంలో పింఛన్లు రాలేదని నిరసన తెలుపుతున్న వారిని ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్త శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 41 మందికి ఆగిన పింఛన్ ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేదు. వారు మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు వచ్చి తమ పింఛన్ ఎందుకు ఇవ్వలేదని కార్యదర్శిని ప్రశ్నించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న వీరిని సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త తీడా శ్రీనుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో మనస్తాపం చెందిన తీడా శ్రీను వెంటనే అక్కడినుంచి వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చాడు. టీడీపీ కార్యకర్తలు తనపై దాడిచేసినచోటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. సర్పంచ్ పరసా లక్ష్మీసుజాత, వైఎస్సార్సీపీ నేత పరసా కనకరాజు సూచన మేరకు వైఎస్సార్సీపీ నాయకుడు ఉదయభాస్కర్ తదితరులు శ్రీనును ద్విచక్ర వాహనంపై భీమడోలు వైద్యశాలకు తీసుకువెళ్లారు. వైద్యులు శ్రీనుకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. 41 మందికి పెన్షన్లు ఎందుకు నిలిపేశారని పరసా కనకరాజు, కోటిపల్లి సత్తిరాజు, ఉదయభాస్కర్, వర్రె సత్తిబాబు, రాజు ప్రశ్నించారు.వెంటనే గ్రామానికి చెందిన 41 మంది పెన్షనర్లకు నగదు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి, ఏపీ ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు తెలియజేస్తామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై దెందులూరు ఎంపీడీవో వి.శ్రీలతను వివరణ కోరగా.. ఫిర్యాదులు రావడంతో పెన్షన్లు నిలిపేసినట్లు చెప్పారు. వాటిని పరిశీలించి విచారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికలాంగులపై కక్ష గుంటూరు జిల్లా గరికపాడులో ఈనెల 1వ తేదీన 11 మంది వికలాంగుల పింఛన్లను టీడీపీ నాయకులు నిలిపేశారు. వీరు వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, దొంగ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకుంటున్నారని అధికారులకు పోస్టుద్వారా ఫిర్యాదు చేశారు. వారికి పింఛన్ పంపిణీ నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీంతో 11 మంది వికలాంగులకు అధికారులు పింఛన్ పంపిణీ నిలిపేశారు. ఈ విషయమై ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ 11 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఫింఛన్ తీసుకుంటున్నారని వెంటనే వారికి నిలిపివేయాలని గ్రామ టీడీపీ నేతలు నోటీసు ఇవ్వడంతో ప్రస్తుతానికి నిలిపేసినట్లు చెప్పారు. ఐదేళ్లు టీడీపీ జెండా ఉండాలని బెదిరింపు పల్నాడు జిల్లా అల్లూరివారిపాలెం, పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో పలువురికి పింఛన్ల పంపిణీ నిలిపేశారు. అల్లూరివారిపాలెంలో 20 మందికిపైగా లబ్ధిదారులకు మంగళవారం సాయంత్రం వరకు పింఛన్లు పంపిణీ చేయలేదు. సోమవారం గ్రామంలో పింఛన్ ఇచ్చేందుకు వచ్చిన సచివాలయ సిబ్బంది వద్దకు లబ్ధిదారులు వెళ్లారు. పింఛన్ కావాలంటే గ్రామంలోని టీడీపీ నాయకులను కలవాలని సచివాలయ సిబ్బంది వారికి చెప్పారు. దీంతో పలువురు లబ్ధిదారులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి తమకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరారు.టీడీపీలో చేరి ఇంటిపై జెండా పెడితేనే పింఛన్ ఇస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఐదేళ్లు జెండా ఇంటి మీద ఉండాలని స్పష్టం చేశారు. దీనికి లబ్ధిదారులు విముఖత చూపడంతో వారికి పింఛన్ పంపిణీ చేయలేదు. పమిడిపాడులో పింఛన్ల పంపిణీని జనసేన నాయకులు అడ్డుకున్నారు. సోమవారం కూటమి సానుభూతిపరులకు మాత్రమే పింఛన్ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారంటూ పలువురికి పింఛన్ పంపిణీ చేయకుండా జనసేన నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు.గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసు బందోబస్తుతో మంగళవారం పెన్షన్లు పంపిణీ చేశారు. దొండపాడులోను పింఛన్ల పంపిణీని ఇదే విధంగా అడ్డుకున్నారు. పలు గ్రామాల్లో సోమవారం టీడీపీ సానుభూతిపరులకే పింఛన్లు పంపిణీ చేశారు. జాబితాలో ఉన్న అందరికీ పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మంగళవారం మిగిలిన పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ అందలేదని నిరసనశ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట సచివాలయం పరిధిలో తమకు పింఛన్లు ఇవ్వలేదని 19 మంది మంగళవారం నిరసన తెలిపారు. సచివాలయం వద్ద సాయంత్రం వరకు కార్యదర్శి కోసం వేచి చూశారు. సాయంత్రం సచివాలయం కార్యదర్శి నాగరాజు వచ్చి 13 మందికి పింఛన్లు ఇచ్చారు. ఇంకా ఆరుగురికి ఇవ్వాల్సి ఉంది. పింఛన్‌దారుల తరఫున సర్పంచ్ భర్త తమ్మినైన మురళీకృష్ణకు చెప్పి ఆఫీసు పనిమీద మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లానని కార్యదర్శి చెప్పారు. సాయంత్రం 13 మందికి పింఛన్లు ఇచ్చానని, మిగిలిన వారిలో అర్హులందరికీ ఇస్తానని తెలిపారు.ఎంపీడీవో లాగిన్ ద్వారా ఇద్దరి పింఛన్ల తొలగింపుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులకొల్లులో కలవకూరి రామ్మూర్తి, చిగురుపాటి బోడియ్య పింఛన్లు తొలగించారు. రామ్మూర్తికి ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛన్, బోడియ్యకు నాలుగేళ్లుగా చర్మకార్మిక పింఛన్ వస్తున్నాయి. స్థానిక టీడీపీ నాయకులు కొద్దిరోజులుగా ఇక నుంచి వారికి పింఛన్ రాదని గ్రామంలో ప్రచారం చేశారు. ఆ విధంగానే ఈ నెల 1వ తేదీ వారికి పింఛన్ నగదు అందలేదు.దీంతో రామ్మూర్తి, బోడియ్య మంగళవారం పోలంపాడులోని గ్రామ సచివాలయానికి, కలిగిరిలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్లను తొలగించారని తెలియడంతో నిర్ఘాంతపోయారు. తమ పింఛన్‌ను అన్యాయంగా నిలిపేశారని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగానే అధికారుల ద్వారా తమ పింఛన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలు పంచాయతీల్లో కొందరికి పింఛన్ నిలిపేయాలని స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించినట్లు తెలిసింది.గత నెలలో పింఛన్ అందిందిగత నెలలో పింఛన్ నగదు బ్యాంకులో జమ అయింది. ఈ నెలలో పింఛన్ కోసం సోమవారం అంతా ఎదురుచూశాను. మంగళవారం కూడా రాకపోవడంతో మా ఊళ్లో సచివాలయానికి వెళ్తే ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లమన్నారు. అక్కడికెళ్తే ఎంపీడీవో లాగిన్ ద్వారా పింఛన్ తొలగించారని చెప్పారు. టీడీపీ నాయకులు అన్యాయంగా పింఛన్ తొలగించారు. – కలవకూరి రామ్మూర్తిదళితులకు చేసే న్యాయం ఇదేనా?దళితుడినైన నాకు కులవృత్తి అయిన చర్మకార్మిక పింఛన్ వస్తోంది. మా కుమార్తె చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలకు కూడా మేమే ఆధారం. నాలుగేళ్లుగా వస్తున్న పింఛన్ తొలగించారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే దళితులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఇదేనా? నాకు పింఛన్ అందించి న్యాయం చేయాలి. – చిగురుపాటి బోడియ్యజాగ్రత్తగా ఉండు.. సొంత పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే కూన హెచ్చరిక శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే విరుచుకుపడ్డారు. ఆ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమదాలవలస మండలం పీరుసాహెబ్పేటకు చెందిన ఊట రాజారావుకు పింఛన్ ఆపేశారంటూ.. పొందూరు మండలం పిల్లలవలసకు చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి భాస్కరరావు మంగళవారం ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు.రాజారావు వైఎస్సార్సీపీకి చెందినవారని పెన్షన్ నిలుపుదల చేశారని, ఆయన మన టీడీపీ వ్యక్తేనని చెప్పారు. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటలు ముదిరి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఫోన్లో వాదించుకున్నారు. పార్టీ గెలుపునకు వేల రూపాయలు ఖర్చుచేశానని, ఇప్పుడు తమ చుట్టాలకు పెన్షన్ తీసివేయడం సమంజసం కాదని భాస్కరరావు చెబుతుండగానే.. ‘డొంక తిరుగుడు మాటలు మాట్లాడకు, తొక్కగాడివి, మొనగాడివి అనుకుంటున్నావా? మర్యాద ఇచ్చి మాట్లాడు.మర్యాద ఇస్తున్నాను జాగ్రత్తగా ఉండు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్..’ అంటూ ఎమ్మెల్యే కూన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ మాటలు విన్న భాస్కరరావు ‘ఆ పెన్షన్ డబ్బులు మూడువేలు కూడా మీరే తీసుకోండి. మేం కష్టపడి పనిచేశాం. తప్పుగా మాట్లాడలేదు. ఇడియట్ అని మీరు తిడితే సహించేదిలేదు..’ అంటూ తిరిగి సమాధానం చెప్పాడు. -
కప్పం కడితేనే ‘కింగ్ ఫిషర్’!
సాక్షి, అమరావతి: ‘మాకు లాభం ఉంటేనే లారీలు కదులుతాయి’.. ‘మాకు కప్పం కడితేనే కింగ్ ఫిషర్ బీరు మార్కెట్లోకి వస్తుంది.. లేదంటే అంతే సంగతులు’ అని పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.. టీడీపీ కూటమి ముఠా. డీల్ సెట్ కాకపోతే కంపెనీలోకి ఒక్క లారీని రానివ్వం.. పోనివ్వం అని తెగేసి చెబుతోంది. దీంతో కింగ్ ఫిషర్ బీరును ఉత్పత్తి చేసే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ అధికార పార్టీ దాష్టీకానికి బెంబేలెత్తుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్న ఈ సిండికేట్‌ను ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు వర్గం తెరముందు నడుపుతుంటే.. తెర వెనుక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వర్గం చక్రం తిప్పుతోంది. నెలకు రూ.1.50 కోట్లు చొప్పున ఏడాదికి రూ.18 కోట్లు తమకు కప్పం కింద కట్టాలని కంపెనీకి కూటమి ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్ బ్రూవరీస్ సిద్ధంగా లేకపోవడంతో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి మొదలుకావడం లేదు.అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ కూటమి ముఠా..శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) బీర్ కంపెనీ ఉంది. తమ ఫ్యాక్టరీలో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆ కంపెనీ చేస్తున్న యత్నాలకు అడుగడుగునా టీడీపీ కూటమి ముఠా అడ్డు పడుతోంది. ముడి సరుకును ఫ్యాక్టరీకి తీసుకువచ్చి, ఉత్పత్తి చేసిన సరుకును ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకువెళ్లే ఒక్కో లారీకి రూ.వేయి చొప్పున కప్పం చెల్లించాలని ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం కరాఖండీగా తేల్చిచెప్పిందనే విషయం సంచలనం సృష్టించింది. ఎందుకంటే లోడింగ్, అన్ లోడింగ్ కోసం రోజుకు సగటున 500 లారీలు వస్తాయి.. ఆ లెక్కన రోజుకు రూ.5 లక్షల చొప్పున నెలకు రూ.1.50 కోట్ల వరకు కప్పంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఈ మొత్తం 18 కోట్లు. అంత భారీ మొత్తం కప్పంగా చెల్లించలేమని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులు ఏకంగా ఆ ఫ్యాక్టరీపై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కంపెనీ ఆస్తులను ధ్వంసం చేయడమేకాకుండా కంపెనీలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారు.దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు మొదట పట్టించుకోలేదు. కేంద్ర హోం శాఖకు నివేదించడంతో ఢిల్లీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో పోలీసులు ఒక రోజు తరువాత కేసు నమోదు చేశారు. మరోవైపు కంపెనీ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించడం గమనార్హం. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని కప్పం కట్టేలా డీల్ సెట్ చేసినట్టు సమాచారం. ఆయన ఆదేశాలతో కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావుతో రాజీ చర్చలు కూడా జరిపారు. తాము అడిగినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు కప్పం కడితేనే బీర్ ఉత్పత్తి ప్రారంభించకోవచ్చని ఎమ్మెల్యే వర్గం కంపెనీకి తేల్చిచెప్పింది. కంపెనీ యాజమాన్యం ససేమిరా.. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం డిమాండ్ చేసినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు వరకు కప్పంగా చెల్లించేందుకు యూబీ కంపెనీ యాజమాన్యం ససేమిరా అన్నట్టు సమాచారం. బంటుమల్లిలోని ఒక్క యూనిట్‌కే ఏడాదికి ఏకంగా రూ.18 కోట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మామూళ్లుగా ఇవ్వడం తలకుమించిన భారంగా ఆ కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో రూపంలో కొంత మొత్తం అయితేనే ఇవ్వగలమని చెప్పినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం భగ్గుమంది. ఫ్యాక్టరీలోని బీరు ఉత్పత్తికి అడ్డుపడుతోంది. రెండు రోజులుగా ఫ్యాక్టరీకి లారీలు వస్తున్నా అందులోని ముడి సరుకును అన్లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా ఇప్పటికే ఉత్పత్తి చేసిన బీరును మార్కెట్లోకి పంపేందుకు లారీల్లోకి లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా కళాసీలెవరూ పనిలోకి రావడానికి వీల్లేదని ఎమ్మెల్యే వర్గం ఆల్టిమేటం జారీ చేసింది. ఎమ్మెల్యే వర్గం గుప్పిట్లోనే కళాసీల సంఘం ప్రతినిధులు ఉండటం గమనార్హం. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాష్టీకంతోయూబీ ఫ్యాక్టరీ ముందు భారీ సంఖ్యలో లారీలు బారులు తీరి ఉన్నాయి. ఎమ్మెల్యే వర్గం హెచ్చరికలకు భయపడి ఎవరూ ముడి సరుకును అన్లోడింగ్ చేయడం లేదు. దాంతో యూబీ ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు ఉత్పత్తి కోసం తెప్పించిన ముడి సరుకు సైతం లారీల్లోనే మగ్గిపోతోంది. ముడి సరుకు పాడైపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.డ్రామాను అదరగొడుతున్న అచ్చెన్నఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు డబుల్ గేమ్ ఆడుతుండటం గమనార్హం. కంపెనీ ప్రతినిధులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మాట్లాడినట్టు అచ్చెన్నాయుడు కథ నడిపించారు. తాను చెబుతున్నా కళాసీలు వినడం లేదని చెప్పి ఎమ్మెల్యే ఈశ్వరరావు తప్పించుకున్నారు. అయితే మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే ఈశ్వరావు పక్కా పన్నాగంతోనే ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా సాగదీస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి కొన్ని రోజుల పాటు నిలిచిపోతే యాజమాన్యం తప్పనిసరిగా తమ కాళ్లబేరానికి వస్తుందనేదే ఇద్దరు నేతల ఉద్దేశమని అంటున్నారు. అదే అదనుగా భారీగా కప్పం డిమాండ్ చేసి సాధించుకోవచ్చని కుట్రపన్నారు. పారిశ్రామికవేత్తల ఆందోళన..అధికారంలోకి వచ్చీ రావడంతోనే కూటమి నేతల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామికవేత్తల పట్ల ప్రభుత్వ వైఖరిపై వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పంతం వీడటం లేదు. యూబీ కంపెనీ ఉదంతం ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము డిమాండ్ చేసినంత కప్పం కడితేనే రాష్ట్రంలో ఏ కంపెనీ అయినా మనుగుడ సాగిస్తుంది.. లేదంటే ఆ కంపెనీ మూత పడాల్సిందేనని స్పష్టం చేస్తోంది. -
శ్రీకాకుళం జిల్లా: సిరిమాను విరిగిపడి ఇద్దరు మృతి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఎచ్చర్ల మండలం కుప్పిలి సిరిమాను ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. సిరిమాను విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. బుడగడ్లపాలెం చెందిన సూరాడ అప్పన్న(40), కారిపల్లెటి శ్రీకాంత్(55) మృతిచెందారు. సిరిమానుపై కూర్చున్న చిన్నారెడ్డికి నాలుక తెగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. -
ఇసుక దందా గుట్టురట్టు
నరసన్నపేట: అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నాయకులు మొదలుపెట్టిన ఇసుక దందా గుట్టు బట్టబయలైంది. అర్ధరాత్రి వేళ వంశధార నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తుండగా సెబ్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. మడపాం, కొత్తపేటకు చెందిన టీడీపీ నాయకులు బుచ్చిపేట వద్ద వంశధార నదిలో అక్రమంగా ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేశారు. గత ఐదు రోజులుగా ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. లోడింగ్ పేరుతో ఒక్కో లారీకి రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసి దోచుకుంటున్నారు. ముందుగా ఇసుక లారీలను పగలంతా సమీపంలోని టోల్గేట్ వద్ద ఉంచుతున్నారు. చీకటి పడగానే లారీలకు ప్రత్యేక రశీదులిచ్చి నదిలోకి పంపిస్తున్నారు. అడుగడునా టీడీపీ కార్యకర్తల ద్వారా నిఘా పెడుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరు ఆ మార్గంలోకి వచ్చినా వెంటనే ఆ సమాచారం నదిలో ఉన్న వారికి వెళ్లిపోతోంది. వారు వెంటనే అప్రమత్తమై లారీలను సమీపంలోని జీడి తోటల్లోకి తరలిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో సెబ్ అధికారులు బుధవారం రాత్రి బుచ్చిపేటకు వచ్చి మాటు వేశారు. నదిలో 20కి పైగా లారీల్లో ఇసుక లోడింగ్ చేస్తుండగా.. సెబ్ అధికారులు దాడి చేశారు. మొత్తం 14 లారీలు దొరకగా.. మిగిలిన లారీలు సమీప జీడి తోటల్లోకి వెళ్లి తప్పించుకున్నాయి. ఈ దోపిడీపై సీఐ సతీశ్ కుమార్, ఎస్ఐ కావ్య కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన లారీలను నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. కాగా, ఇసుక దందాపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట నిద్ర లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల స్వార్థం వల్ల ఊరంతా ఇబ్బంది పడుతోందని స్థానికులు చెప్పారు. ఇసుక దందాలను అడ్డుకోవాలని కోరారు. -
వివాహిత ఆత్మహత్య
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ ఎన్ఎన్ కాలనీలో నివాసం ఉంటున్న వన్నాల రేవతి(27) బుధవారం ఇంటిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేవతి భర్త కృష్ణారావు స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన కృష్ణారావుకు పాతపట్నం మండలం పాచిగంగుపేటకు చెందిన రేవతితో తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఎప్పటి మాదిరిగానే కృష్ణారావు విధుల నుంచి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఇంటిలోకి వెళ్లే సరికి రేవతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వెంటనే ఆమెకు కిందకు దించి స్థానికుల సహకారంతో స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వీరికి ఆరేళ్ల వయసు గల కుమార్తె ఉంది. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏంఏ ఆహ్మద్ తెలిపారు. -
టీడీపీ గుండాలు ప్రాణం తీశారు!
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఓటమిని ఊహించి.. ఎన్నికల పోలింగ్ రిగ్గింగ్‌కు ప్రయత్నించింది. ఈ క్రమంలో హింసకు తెర లేపింది. వైఎస్సార్సీపీ నేతలను, పోలింగ్ ఏజెంట్లను, కార్యకర్తలను, పార్టీ సానుభూతిపరుల్ని.. ఆఖరికి ఓటేసిన వాళ్లను సైతం వదలకుండా దాడులకు తెగబడింది. ఈ క్రమంలో శ్రీకాకుళంలో టీడీపీ గుండాల చేతిలో ఓ నిండు ప్రాణం బలైంది. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ తండ్రి ఒకరు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాధితుల్ని తోట మల్లేశ్వరరావుగా పోలీసులు ప్రకటించారు. దాడికి పాల్పడింది టీడీపీ నేత అచ్చెన్నాయుడి అనుచరగణమేనని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయితీ బూత్-228లో మాధవరావు అనే వ్యక్తి వైఎస్సార్సీపీ తరఫున పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరించారు. అయితే మాధవరావు కుటుంబాన్ని టీడీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. గురువారం గుడిలో పూజ చేస్తుండగా మాధవరావు తండ్రి మల్లేష్‌పై అచ్చెన్నాయుడి వర్గీయులు దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లేష్ రావును శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మల్లేష్ కన్నుమూశారు. తన తండ్రి మరణానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని మాధవరావు డిమాండ్ చేస్తున్నారు. -
Srikakulam District: అశోక్ ఇదా నీ రాజకీయం
సోంపేట/కంచిలి: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆనవాయితీ కొనసాగించారు. పచ్చటి పల్లెలో కక్షలు రగిలించి రాజకీయ లబ్ధి పొందాలనే రాక్షస రాజకీయ సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించారు. ఇన్నాళ్లూ ఏ పార్టీ తరఫున ఆ పార్టీ నాయకులు ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటే.. అశోక్ మాత్రం తన నైజం చూపించారు. తాను ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా తన పార్టీ కార్యకర్తలతో ఓ యాదవ సామాజిక వర్గ నాయకుడిపై దాడి చేయించారు. సోంపేట మండలం కర్తలిపాలెం పంచాయతీ పరిధి సంధికొత్తూరు గ్రామంలో గురువారం సాయంత్రం నిర్వహించిన టీడీపీ ఎన్నికల ర్యాలీలో వైఎస్సార్ సీపీ నేత ఇంటిపై టీడీపీ రౌడీమూకలు మూకమ్మడిగా దాడి చేశాయి. ఆయన ఇంటిలోకి చొరబడి విధ్వంసకాండ సృష్టించాయి. దాడిలో యాదవ సామాజిక వర్గం నేత, ఉపసర్పంచ్ కొల్లి గోపయ్య, ఉలాల తిరుపతి, పోగల ఈశ్వరరావు గాయపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి అశోక్ కనబర్చిన రాజకీయ పరిణితి ఇదేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడికి జరిగిన అవమానంపై యాదవ సామాజిక వర్గానికి చెందిన వారంతా భగ్గుమంటున్నారు.దాడి అమానుషం: మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్వైఎస్సార్ సీపీకి చెందిన యాదవ సామాజిక వర్గ నేత, ఉపసర్పంచ్ కొల్లి గోపయ్య, మరో ఇద్దరుపై టీడీపీ రౌడీ మూకలు దాడి చేయడం అమానుషమని మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. పదేళ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు నువ్వు ఇచ్చిన బహుమతి ఇదా అని అశోక్ తీరును దుయ్యబట్టారు. అహంకారం, అహంభావానికి ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పి ఓడిస్తారని అన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం యాదవులు తప్పనిసరిగా అశోక్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని అన్నారు. యాదవులే లక్ష్యంగా ఎమ్మెల్యే దాడికి ఉసిగొల్పారని అన్నారు. సంధికొత్తూరులో ఉన్న కీలక నేతలను భయపెట్టి గ్రామంలో లేకుండా చేస్తే గుంపగుత్తగా ఓట్లు వేయించుకోవచ్చన్న కుట్రతో వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడిచేయించారని అన్నారు. ఎమ్మెల్యే అశోక్ దగ్గరుండి దాడి చేయించడం ఆయన తీరును కనబరుస్తుందన్నారు. పోలీసులు ఎమ్మెల్యే అశోక్పైన కూడా కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా)
-
సీఎం జగన్ ను కాపీ కొట్టిన చంద్రబాబు.. కానీ గెలుపు మాదే
-
శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ
శ్రీకాకుళం, సాక్షి: జనం అంతా జగన్ వెంటే.. మేమంతా సిద్ధం యాత్రతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే రాజకీయంగానూ అధికార పార్టీ మరింత బలపడుతోంది. కూటమికి షాకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతలు తమ అనుచరగణంతో సహా వైఎస్సార్సీపీలో చేరారు. వీళ్లలో పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణిలు ప్రముఖంగా ఉన్నారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు YSRCP కండువా కప్పుకున్నారు.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్సీపీలో చేరారు.సీఎం జగన్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు. -
సిక్కోలులో జన సంద్రం
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తొలి సూర్యకిరణాలు తాకే అరసవెల్లి సూర్యనారాయణమూర్తి సాక్షిగా జననేతను సిక్కోలు అక్కున చేర్చుకుంది. మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటన అనంతరం శ్రీకాకుళం జిల్లా అక్కివలసలోని రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలుకరించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే పరిసర గ్రామాలకు చెందిన పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రియతమ నేతను కళ్లారా చూడాలని, వీలైతే ఓ సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహం చూపారు.బుధవారం ఉదయం తిరిగి ప్రారంభమైన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజు సుమారు 64 కి.మీ. మేర సాగి టెక్కలి నియోజకవర్గం అక్కవరం బహిరంగ సభతో ముగిసింది. రాత్రి బస శిబిరం వద్ద శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్‌ను కలిశారు. సీఎం వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు ఆరా తీసి దిశానిర్దేశం చేశారు.అనంతరం వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో అక్కివలస నుంచి ప్రారంభమైన యాత్ర ఆమదాలవలస కొత్తరోడ్డు, మడపాం, నిమ్మాడ, పొడుగుపాడు, కోటబొమ్మాళి జంక్షన్, కన్నెవలస, చమయ్యపేట వరకు సాగింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం నేతలతో కలసి అక్కవరం బహిరంగ సభ ప్రాంగణం వద్దకు సీఎం చేరుకున్నారు. ‘సిద్ధం సిద్ధం.. సీఎం సీఎం’ అంటూ మిన్నంటిన నినాదాలతో సభా ప్రాంగణం సముద్ర హోరును తలపించింది. సీఎం మాట్లాడుతుండగా ఆకాశం మేఘావృతంఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైన యాత్రకు అక్కచెల్లెమ్మలు హారతులు పట్టారు. జగనన్న తెచ్చిన వలంటీర్లు, సచివాలయాలతో తమ పనులు సులభతరమైపోయాయని, కార్యాలయాలు చుట్టూ తిరిగే దుస్థితి తప్పిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పొద్దున్నే ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ పింఛన్ ఇస్తున్నారని, ఇంత మేలు చేసిన జగన్ బాబును చూడాలని వచ్చామని తమ ఆనందాన్ని పంచుకున్నారు.మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. సీఎం జగన్ అక్కవరం సభలో ప్రసంగిస్తుండగా మేఘాలు కమ్ముకున్నాయి. సభా ప్రాంగణంలో చినుకులు రాలడం, సమీపంలో వర్షం కురవడంతో హర్షాతిరేకాలు మిన్నంటాయి. జగన్ రాకతో తమ ప్రాంతం చల్లబడిందని, ఆయన అడుగుపెట్టిన చోట మంచే జరుగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మహిళలు నినాదాలు చేశారు.♦ పుట్టుకతో వినికిడి లోపం కలిగిన తన కుమారుడు త్రిషాన్ రెండు చెవులకు 2022లో ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఉచితంగా చేయడంతో చిన్నగా మాట్లాడగలుగుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్ సీఎం జగన్ వద్ద ఆనందం వ్యక్తం చేశాడు. అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ఆయన సీఎం జగన్‌కు కలిశారు. ♦ ‘మేమంతా సిద్ధం’ యాత్ర మడపాం టోల్గేట్ వద్దకు చేరుకునేసరికి అభిమానులతో కిక్కిరిసిపోయింది. భారీ క్రేన్‌తో తెచ్చిన నవరత్నాల పథకాల మాలతో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడ తనను కలసిన ఓ దివ్యాంగుడికి మూడు చక్రాల మోటార్ సైకిల్ అందజేస్తామని సీఎం జగన్ భరోసా వచ్చారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ బాధితురాలికి కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుటుంబం అంతా జగనన్న అభిమానులంమా కుటుంబం మొత్తం జగనన్న అభిమానులం. జగనన్న పాదయాత చేసినప్పుడు నేను చదువకుంటున్నా. మా జిల్లాకు వచ్చినప్పుడు సెల్ఫీ కూడా తీసుకున్నా. ఇప్పుడు మా పాప రెండో తరగతి చదువుతోంది. జగనన్నను చూడాలని రాత్రి నుంచి మారాం చేయడంతో ఉదయం 7 గంటలకే అక్కివలస తీసుకొచ్చాం. జగనన్న చేపట్టిన విద్య, వైద్య సంస్కరణలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తున్నాయి. వాటిని కళ్లారా చూస్తున్నాం. – పి.సంతోషిమణి, శ్రీకాకుళం మా తొలి ఓటు జగనన్నకే.. నాన్న అబ్దుల్ సలీమ్ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తుండగా అమ్మ నసీమాబేగం గృహిణి. తక్కువ ఆదాయం ఉన్న మాలాంటి కుటుంబాలకు జగనన్న దేవుడు. మా అక్క, నా చదువు పూర్తిగా జగనన్న విద్యా దీవెనతోనే పూర్తయింది. ఇంటి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం చేయడంతో సొంతిల్లు కట్టుకున్నాం. మా కుటుంబం ఆనందంగా ఉందంటే అది జగనన్న పుణ్యమే. మా అక్కకు, నాకు తొలిసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. తొలి ఓటు ఫ్యానుకే వేస్తాం. జగనన్నను చూశాకే అక్కివలస నుంచి ఇంటికి వెళతా. – నజీమా, విజయనగరం -
రేపు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ ఇలా..
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజు షెడ్యూల్‌ను సీఎంఓ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్ బస్సు యాత్ర ముగియనుంది. యాత్రలో భాగంగా ఉదయం 9 గంటలకు అక్కివలస(రాత్రి బస చేసిన ప్రాంతం) నుంచి బయల్దేరుతారు. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరుశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరుశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకుబయల్దేరుతారు. 4.20 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.20 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి అక్కవరం హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం విమాశ్రయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 6.15 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. 6.30 గంటలకు విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. 7.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టునుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు. చదవండి: మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలన్న: YSRCP సోషల్ మీడియా వింగ్ జనమే సైన్యంగా సంక్షేమసారథి యాత్ర సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. 43 నుంచి 45 డిగ్రీల మండుటెండల్లోనూ.. రాత్రి పొద్దుపోయినా సీఎం జగన్‌ను చూసేందుకు ప్రజలు ఆరాటపడుతున్నారు. సీఎం జగన్‌ను దగ్గరి నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే ఫోటో దిగేందుకు బస్సు వెంట పరుగులు తీస్తున్నారు. అడుగడుగునా జనంతో మమేకమవుతూ.. బాధితులకు భరోసా ఇస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. జనమే సైన్యంగా సంక్షేమ రథసారథి ప్రారంభించిన బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగియనుంది. ఇప్పటిదాకా 21 రోజులు పాటు 22 జిల్లాల్లో యాత్ర సాగింది. బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలు.. వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ 15 భారీ బహిరంగ సభల్లో(మంగళవారం సభతో సహా) పాల్గొని ప్రసంగించారు. -
ప్రగతి పథం...శ్రీకాకుళం గమనం...
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు అండగా నిలిచారు. పలాసలో రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేసి 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ వ్యాధులపై రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. ఇక్కడి కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరే అని తేలడంతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 807 గ్రామాలకు ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. సుమారు 5,57,633 మందికి తాగునీరు అందించారు. మూలపేట పోర్టు నిర్మాణంతో మత్స్యకారులకు ఆసరా దొరికింది. ► రూ.141.70 కోట్లతో 650 రైతు భరోసా కేంద్ర భవనాలు మంజూరు కాగా రూ.67.67 కోట్లతో 270 భవనాలు పూర్తి ► రూ.262 కోట్లతో 654 గ్రామ సచివాలయ భవనాలు మంజూరు కాగా రూ.146.74 కోట్లతో 360 భవనాలు పూర్తి ► రూ.31.20 కోట్లతో 195 డిజిటల్ లైబ్రరీ భవనాలు మంజూరుకాగా 22 భవనాల నిర్మాణం. ► రూ.93.62 కోట్లతో 535 విలేజ్ క్లినిక్ భవనాలు మంజూరు కాగా రూ.48.42 కోట్లతో 122 భవనాలు పూర్తి.. ఐదు రూరల్ పీహెచ్‌సీలు, 11 అర్బన్ హెచ్‌సీలు సాగుకు సాయం ► జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు, 7 ఇంటిగ్రేటె డ్ ల్యాబ్‌లు నిర్మించారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 3.21 లక్షల మందికి రూ.1,919.46 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 87,158 మందికి రూ.85.14 కోట్లు అందజేశారు. ► రూ.424.74 కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలు సబ్సిడీపై అందించారు. ► 82,745 మెట్రిక్ టన్నుల ఎరువులు, 5592 లీటర్ల నానో యూరియా వంటివి అందించారు. ► చిన్న, సన్నకారు రైతుల కోసం 505 ట్రాక్టర్లు, మల్టిపుల్ క్రాప్ ట్రెసర్స్, పాడిరేపర్స్, రోటావెటర్స్, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్ హార్వెస్టర్స్ వంటివి అందించారు. ► 10వేల భూసార పరీక్షలు చేశారు. 27,049 కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చారు. ఉద్యోగాల కల్పన ► సచివాలయాల ఏర్పాటు ద్వారా 7880 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కలి్పంచారు. – ప్రతి పీహెచ్‌సీకి అదనంగా ఒక్కో డాక్టర్ వంతున 66 మంది నియామకం ► పీహెచ్‌సీల్లో 108, 104 వాహనాల్లో కొత్తగా 2199 మంది నియామకం ► ఎంప్లాయిమెంట్ కార్యాలయం, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 9018 ఉద్యోగాలు జలయజ్ఞానికి ఊతం ► జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వంశధార ఫేజ్ 2లోని స్టేజ్ 2 పనులు పూర్తి చేయడమే కాకుండా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను అధిగమించేలా రూ.176.35 కోట్లు వెచి్చంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మిస్తున్నారు. మహేంద్ర తనయపై నిర్మిస్తున్న ఆఫ్ షోర్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.852 కోట్లు మంజూరు చేశారు. మడ్డువలస రెండో దశ పనులకు రూ.26.65 కోట్లు మంజూరు చేశారు. ► మత్స్యకారుల సంక్షేమం, వివిధ ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా మూలపేటలో రూ.2,949.70 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మత్స్యకారుల కోసం రూ.365.81 కోట్లతో బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, వజ్రపుకొత్తూరు మండలంలోని నీళ్లపేటలో రూ.11.95 కోట్లతో జెట్టీ నిర్మిస్తున్నారు. మెరుగుపడిన మార్గాలు ► గడచిన ఐదేళ్లలో ఆర్అండ్బీ పరిధిలో రూ.526.69 కోట్లతో 633.4 కిలోమీటర్లకు సంబంధించి 432 రోడ్లు మంజూరు చేయగా చాలా వరకూ పూర్తయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78 కోట్లతో 484.43 కిలోమీటర్ల మేర 312 రోడ్లు మంజూరు కాగా 266 రోడ్ల పనులు జరుగుతున్నాయి. ► ఆర్సీపీఎల్డబ్ల్యూ కింద రూ.70.96 కోట్లతో 94.30 కిలోమీటర్ల పొడవున 23 రోడ్లు మంజూరు చేయగా వాటిలో రూ.55.55 కోట్లతో 21రహదారుల నిర్మాణం పూర్తయింది. ► పీఎంజీఎస్‌వై బ్యాచ్ 1 కింద రూ.51.27 కోట్లతో 11 పనులు మంజూరు కాగా 10 పనులు, బ్యాచ్ 2లో రూ.38.23 కోట్లతో 8 పనులు మంజూరు కాగా 6 పూర్తయ్యాయి. ► ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు వర్క్స్ కింద రూ.350 కోట్లతో 480 కిలోమీటర్ల పొడవు గల 312 పనులు చేపడుతున్నారు. రెన్యువల్ వర్క్స్ కింద రూ.50 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవున 83 పనులు చేపడుతున్నారు. ► గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 102 గ్రామాలకు ఉపయోగపడేలా 42 సీసీ, బీటీ రోడ్లు వేశారు. నగరపాలక, పురపాలక సంఘాల్లో రూ.16.60 కోట్లతో 115 రహదారులను అభివృద్ధి చేశారు. మరో రూ.300 కోట్లతో జిల్లాలో 12 భారీ వంతెనలు నిర్మించారు. బలసలరేవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.87 కోట్లు మంజూరు చేశారు. ► పాతపట్నం 50 పడకల సామాజిక ఆస్పత్రిని రూ.4.2 కోట్లతో, జొన్నవలస ఆస్పత్రిని రూ.2.45 కోట్లతో, లావేరులో రూ.1.2 కోట్లతో, సోంపేట సామాజిక ఆస్పత్రిని రూ.4.60 కోట్లతో, బారువ సామాజిక ఆస్పత్రిని రూ.5.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. నాడు నేడు కింద 83 ఆస్పత్రులను రూ.47 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసన్నపేట ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ► ఇంటింటికి తాగునీరు సరఫరాకు రూ.1552.36 కోట్లతో 4822 పనులు ప్రారంభించగా, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి. జగనన్న హౌసింగ్ కాలనీలో తాగునీరు అందించేందుకు 791 పనులను రూ.38.4 కోట్లతో చేపడుతున్నారు. సుపరిపాలన సుసాధ్యమయ్యేలా... ► జాతిపిత కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా జిల్లాలో 835 గ్రామ సచివాలయాలు, 95 వార్డు సచివాలయాల ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నారు. వీటి ద్వారా మొత్తం 512 రకాల సేవలు అందిస్తుండగా, ఇప్పటివరకూ 47,27,732 మందికి సేవలందాయి. ► విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా సామాన్య, పేద వర్గాలకు గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా రూరల్ ప్రాంతాల్లో 5 పీహెచ్‌సీలు, శ్రీకాకుళం, ఆమదాలవలస తదితర అర్బన్ ప్రాంతాల్లో 11 పీహెచ్‌సీలు నిర్మించారు. శ్రీకూర్మం ఆస్పత్రిలో చాలా మార్పులొచ్చాయి గతంలో శ్రీకూర్మం ఆస్పత్రి వద్దకు వచ్చేవాడిని. కూర్చోడానికి కూడా అవకాశం ఉండేది కాదు. పాడుబడిన భవనం ఉండేది. ఇరుకైన గదులు, ఎవ్వరూ కూడా సరిగ్గా ఉండేవారు కాదు. ఇప్పుడు ఎక్కడికో వెళ్లినట్టుంది. ఈ ప్రభుత్వం వచ్చాక గదులు అందంగా తయారు చేశారు. అన్ని పరీక్షలు రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నారు. అన్ని సలహాలు చెబుతూనే మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. అలాగే మా గ్రామంలోకి డాక్టరమ్మలు వచ్చి ఆరోగ్యం కోసం అడుగుతున్నారు. అవసరమైన మందులు కూడా ఇంటి వద్దనే ఇస్తున్నారు. –గేదెల తవుడు, దువ్వుపేట, గార మండలం -
ఆ ఒక్కటీ.. ఇంకా తేలదేమిటీ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమిలో సీట్ల పంపకంపై స్పష్టత కుదరడం లేదు. టీడీపీ, జనసేనలోనే కాదు బీజేపీలో కూడా టెన్షన్ నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో కేటాయించే సీటు విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ లేకపోవడంతో బీజేపీ నాయకుల్లో అయోమయం వీడడం లేదు. చంద్రబాబు, పవన్‌తో జరిగిన సమావేశంలో జాతీయ స్థాయి నాయకులు పాల్గొనడం, అందులో రాష్ట్ర నాయకులు లేకపోవడంతో బీజేపీకి కేటాయించే సీటుపై గందరగోళం నెలకొంది. ఇప్పుడున్న సమాచారం మేరకు శ్రీకాకుళం కంటే పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాలకే ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా బీజేపీ నాయకులు అభిప్రాయడుతున్నారు. పొత్తు కుదరకముందు ప్రతి నియోజకవర్గానికి ముగ్గురేసి అభ్యర్థులను రాష్ట్ర నాయకులు జాతీయ అధిష్టానానికి ప్రతిపాదించారు. ఈ లోగా పొత్తు కుదరడంతో సీట్ల పంపకాలపై పార్టీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు ఒక సీటు ఇవ్వాలని ఒప్పందం జరిగింది. ఇక్కడే కాస్త సమాచారం లోపం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలో ఒక సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్కటీ శ్రీకాకుళం కావచ్చని చాలారోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం జిల్లాకు ఒకటి అన్నది శ్రీకాకుళం పేరు మీద జరిగినందున.. అది శ్రీకాకుళం నియోజకవర్గం అయి ఉండొచ్చనే ప్రచారానికి తెరలేచినట్టుగా భావిస్తున్నారు. అదే జరిగితే శ్రీకాకుళం నుంచి ప్రతిపాదిత జాబితాలో ఉన్న పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాల్‌తో పాటు రాయలసీమ జిల్లాకు చెందిన సురేంద్రకుమా ర్లలో ఎవరికో ఒకరికి ఇవ్వవచ్చని ఊహాగానాలు, విశ్లేషణలు జరిగిపోయాయి. తాజా సమాచారం ప్రకారం ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాలకే ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాతపట్నంలో టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీ భ్రష్టు పట్టి పోవడంతో ఎందుకొచ్చిన సమస్య అని బీజేపీకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు భోగట్టా. అలాగే ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో బీజేపీకి ఇచ్చేస్తే తలనొప్పి ఉండదని కూడా చంద్రబాబు భావించి ఉండొచ్చని.. ఈ రెండింటిలో బీజేపీ ఏది కోరితే ఆ సీటు ఇచ్చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్టు కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ అభిప్రాయం మేరకు ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని జాతీయ నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉందని జిల్లా నాయకత్వం కూడా భావిస్తోంది. వాస్తవంగా ఇటీవల బీజేపీలో చేరిన ఒకప్పటి టీడీపీ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు ఆ వ్యూహంలో భాగమని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఒకవేళ పాతపట్నం కాదనుకుంటే ఎచ్చెర్లకు చెందిన ఎన్ఈఆర్( నడికుదిటి ఈశ్వరరావు)కైనా ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఎన్ఈఆర్ కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పెద్ద ఎత్తున ప్రయతి్నస్తున్నట్టుగా ఓ వర్గం చెబుతుండగా, టిక్కెట్ గ్యారంటీ ఇవ్వడంతోనే సిరిపురం తేజేశ్వరరావు పారీ్టలోకి చేరారని మరోవర్గం స్పష్టం చేస్తోంది. మొత్తానికి బీజేపీకి జిల్లాలో ఒక సీటు కేటాయించడం ఖాయం. అది ఏది అన్నది తేలాల్సి ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్‌తో తెరపైకి వచ్చిన శ్రీకాకుళం అవుతుందా? కాస్త బలంగా ఉన్నామని భావిస్తున్న ఎచ్చెర్ల, పాతపట్నంలో ఒకటవుతుందా అన్నది చూడాల్సి ఉంది. బీజేపీలో జరుగుతున్న తర్జనభర్జన నేపథ్యంలో టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయి. బీజేపీతో తమ సీటు గల్లంతు అవుతుందేమోనని అటు శ్రీకాకుళం నుంచి గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్, పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు, ఎచ్చెర్ల నుంచి కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు భయాందోళనలో ఉన్నారు. మొత్తానికి ఏదో ఒక నియోజకవర్గంలో ఇద్దరికీ సీటు చిరగడం మాత్రం ఖాయమని పొత్తు ఒప్పందం ప్రకారం స్పష్టమవుతోంది. -
YSRCP: శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులు వీళ్లే
శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
ఇచ్చాపురం: మరోసారి బయటపడ్డ టీడీపీ, జనసేన విభేదాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురంలో జనసేన, టీడీపీ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. లోకేష్ శంఖారావం సభకు రావొద్దంటూ జనసేన నేతలతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. సభకు వస్తున్న జనసేన నేతలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల తీరుపై జనసేన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో అవమానంతో జనసేన నేతలు తిరిగి వెళ్లిపోయారు. లోకేష్ సభలో జనసేన జెండాలు కనబడకూడదని టీడీపీ నేతలు హుకుం జారీ చేయడంతో సభలో జనసేన నేతలు, జెండాలు కనిపించలేదు. కాగా, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవడంలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడంలేదు. -
వెనుకబాటు వీడి ప్రగతిబాటలో సిక్కోలు
సిక్కోలు అంటే వెనుకబాటు.. సిక్కోలు అంటే వలసలు.. సిక్కోలు అంటే కిడ్నీ సమస్య.. సిక్కోలు అంటే ఉపాధి గోస.. ఇదంతా నిజమే గానీ.. ఇప్పుడది గతం. ఆ చేదు అనుభవాల పునాదులపై ప్రగతి పూలు పూస్తున్నాయి. నాలుగున్నరేళ్ళ క్రితం రాష్ర్టంలో జరిగిన అధికార మార్పిడి వెనుకబడిన, చిన్న చూపునకు గురైన శ్రీకాకుళం జిల్లా నెత్తిన పాలు పోసింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిని సమపాళ్ళలో రంగరించి జిల్లా ప్రగతి చిత్రాన్ని తీర్చిదద్దుతోంది. సంక్షేమ పథకాల రూపంలోనే అక్షరాలా రూ.15 వేల కోట్లు జిల్లాలోని పేద లబ్ధిదారులకు నేరుగా అందించిన ప్రభుత్వం.. జిల్లా ప్రజల అర్థ శతాబ్ది కోరిక అయిన పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగిస్తూ ఉందిలే మంచి కాలం ముందూ ముందునా.. అంటూ.. జిల్లా భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. దీనికి తోడు రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రానున్నాయి. ఇక దశాబ్దాలుగా జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వతంగా పారదోలేందుకు ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి, 800 గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పథకం ఏర్పాటు చేయడం ద్వారా ఉద్దానం గుండెలపై కుంపటిని దింపేసినట్లు అయ్యింది. మరోవైపు ఆఫ్ షోర్, వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా వ్యవసాయానికి కొత్త ఊపిరులూదుతున్నారు. జిల్లాలో నాలుగేళ్లలో ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.526. 69కోట్లతో 633.4 కిలోమీటర్లకు సంబంధించి 432 రోడ్లు మంజూరు చేసింది. ► పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78 కోట్లతో 484.43కిలోమీటర్ల మేర 312 రోడ్లు వేసేందుకు మంజూరు చేసింది. ఇందులో 266 రోడ్లు పనులు జరుగుతున్నాయి. అదే స్కీమ్‌లో కొత్తగా రూ.46.72 కోట్లతో 205.68 కిలోమీటర్లతో 83 రహదారులు మంజూరు చేసింది. ► ఆర్సీపీఎల్డబ్ల్యూ కింద రూ.70.96 కోట్లతో 94.30 కిలోమీటర్లకు సంబంధించి 23 రోడ్లు మంజూరు చేయగా వాటిలో రూ.55.55 కోట్ల తో 21 రహదారుల నిర్మాణం పూర్తి చేసింది. ►పీఎంజీఎస్‌వై బ్యాచ్–1 కింద రూ.51.27కోట్లతో 11పనులు మంజూరు చేయగా ఇప్పటికే 10 పనులు పూర్తి చేసింది. బ్యాచ్–2లో రూ. 38.23కోట్లతో 8పనులు మంజూరు చేయగా ఆరుపూర్తయ్యాయి. రెండు ప్రగతిలో ఉన్నాయి. ► ప్రత్యేక మరమ్మతుల కింద 275 కిలోమీటర్ల పొడవునా రూ.73.25 కోట్లతో 54 రోడ్ల పనులు చేపట్టారు. ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు వర్క్స్ కింద రూ.350 కోట్లతో 480 కిలోమీటర్ల పొడవునా 312 పనులు చేపడుతున్నారు. ► ఏపీ గ్రామీణ రహదారుల రెన్యువల్ వర్క్స్ కింద రూ.50 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవునా 83 పనులు చేపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 102 గ్రామాలకు ఉపయోగపడేలా 42 సీసీ, బీటీ రోడ్లు వేశారు. ►నగరపాలక, పురపాలక సంఘాల్లో రూ.48 కోట్లతో రహదారులను అభివృద్ధి చేశారు. రూ.300 కోట్లతో జిల్లాలో 12 భారీ వంతెనలు నిర్మించారు. బలసలరేవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.87కోట్లు మంజూరు చేశారు. కిడ్నీ పరిశోధన కేంద్రం, ఆస్పత్రి ఉద్దానానికి ఊపిరి కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలిచారు. పలాసలో రూ.50 కోట్లకు పైగా వ్యయంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం పరిధిలో 7 (ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు) మండలాల్లోని 807గ్రామాలకు ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సుమారు 5లక్షల 57వేల 633మందికి తాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యం. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు వలసలకు స్వస్తి మత్స్యకార సమస్యలతో పాటు వలసలపై సీఎం ప్రత్యేక దృష్టిసారించారు. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో మూలపేట పోర్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది. మత్స్యకారుల కోసం రూ. 365.81కోట్లతో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో రూ.11.95 కోట్లతో జెట్టీ నిర్మిస్తున్నారు. నిర్మాణంలో మూలపేట పోర్టు జలయజ్ఞం..ఫలప్రదం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ నడుంబిగించారు. వంశధార ఫేజ్ 2లోని స్టేజ్ 2 పనులు పూర్తి చేయడమే కాకుండా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు కారణంగా ఈలోపు మొత్తం ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేశారు. రూ.176.35 కోట్లు మంజూరు చేయడమే కాకుండా పనులు కూడా ప్రారంభించారు. నాగావళి, వంశధార నదుల అనుసంధానం పనులు పూర్తి చేస్తున్నారు. ఉద్దానంలోని మహేంద్ర తనయపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.852 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మడ్డువలస రెండో దశ పనులకు రూ.26.65 కోట్లు మంజూరు చేశారు. పుష్కలంగా తాగునీరు.. ఇంటింటికి తాగునీరు సరఫరా చేసేందుకు జిల్లాలో మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పైపులెన్లు వేసింది. రూ.1552.36 కోట్లతో 4822 నిర్మాణాలు ప్రారంభించగా, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి. జగనన్న హౌసింగ్ కాలనీల్లో తాగునీరు అందించేందుకు 791 పనులను రూ.38.4కోట్లతో పనులు చేపడుతున్నారు. అందుబాటులో వైద్యం.. ► సచివాలయాల్లో భాగంగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా ఇంటి చెంతకే వైద్యసేవలు అందుతున్నాయి. ►జిల్లాలో కొత్తగా రూరల్ ప్రాంతాల్లో 5 పీహెచ్‌సీలు, శ్రీకాకుళం, ఆమదాలవలస తదితర అర్బన్ ప్రాంతాల్లో 11 పీహెచ్‌సీలను కొత్తగా ఈ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారు. పాతపట్నంలో 50 పడకల సామాజిక ఆసుపత్రిని రూ.4.2 కోట్లు, జొన్నవలస ఆసుపత్రిని 2.45 కోట్లు, లావేరులో రూ.1.20 కోట్లు, సోంపేట సామాజిక ఆసుపత్రిని రూ.4.60 కోట్లు, బారువ సామాజిక ఆసుపత్రిని రూ. 5.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ►నాడు నేడు కింద 83 ఆసుపత్రులను రూ.47 కోట్లతో అభివృద్ధి చేశారు. నరసన్నపేట ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. విద్యాభివృద్ధికి పెద్దపీట.. ► వైఎస్సార్ కలల విద్యా సంస్థ ట్రిపుల్ ఐటీలో రూ.131కోట్లతో జీప్లస్–5 బ్లాక్‌లను మూడు నిర్మించింది. ప్రస్తుతం రూ.67కోట్లతో న్యూ అకాడమీ బ్లాక్‌ను ప్రస్తుతం నిర్మిస్తోంది. మరో రూ.133 కోట్లతో 6వేల మందికి సరిపడా వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ►జిల్లాకే తలమానికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో రూ.45 కోట్లతో అదనపు భవనాలు నిర్మిస్తున్నారు. ►పొందూరు, ఆమదాలవలస మండలం తొగరాంలో డిగ్రీ కళాశాలలు, పొందూరులో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్సియల్ బాలురు పాఠశాల, సరుబుజ్జిలి మండలం రొట్టవలసలో బాలికల జూనియర్ కళాశాల, వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నికల్ కళాశాల, ఆమదాలవలస మండలం తొగరాంలో అగ్రికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల, బూర్జ మండలం పెద్దపేటలో హారి్టకల్చర్ రీసెర్చ్ స్టేషన్ మంజూరు చేశారు. ఆమదాలవలస జగ్గు శా్రస్తులపేట వద్ద క్రికెట్ స్టేడియం మంజూరు చేశారు. కీలక అభివృద్ధి పనులు ►రూ.28 కోట్లతో పొందూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ►రూ. 48 కోట్లతో అలికాం– ఆమదాలవలస మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ►ప్రసాదం స్కీమ్ కింద శ్రీముఖలింగం టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి చేస్తున్నారు. కోట్ల రూపాయలతో అరసవిల్లి సూర్యదేవాలయం అభివృద్ధి చేస్తున్నారు. ►జిల్లాలో లక్షా 10వేల 825మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. వాటిలో మొదటి విడతగా 83,456 ఇళ్లు నిర్మాణాలు చేపడుతున్నారు. ►నిరుద్యోగులకు ఉపాధి కలి్పంచే భాగంలో జిల్లాలో 27 ఫిష్ ఆంధ్ర డెలీయస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ►శ్రీకాకుళం– ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్లకు రూ.43కోట్లు మంజూరు చేశారు. పనులు ప్రారంభమయ్యాయి. పల్లెకు కొత్తరూపు.. ►పల్లెలు సరికొత్త రూపు రేఖలు సంతరించుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగాయి. కళ్లెదుటే ఆస్తులు కని్పస్తున్నాయి. ►రైతులకు సేవలందించేందుకు రూ.141.70 కోట్లతో 650 రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తున్నారు. ►గ్రామ సచివాలయాల కోసం రూ.262 కోట్లతో 654 భవనాలను నిర్మిస్తున్నారు. వీటిలో సగానికిపైగా పూర్తయ్యాయి. ►రూ.31.20 కోట్లతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల కోసం 195 భవనాలను నిర్మిస్తున్నారు. ►వైఎస్సార్ విలేజీ హెల్త్ క్లినిక్స్ కోసం రూ.93.62 కోట్లతో 535 భవనాలను నిర్మిస్తున్నారు. ఇందులో సగానికి పైగా పూర్తయ్యాయి. ∙వ్యవ‘సాయం’ ►జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు నిర్మించారు. 7 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ల నిర్మాణాలు చేపట్టారు. వైఎస్సార్ రైతుభరోసా కింద 3.21 లక్షల మంది రైతులకు రూ 1919.46 కోట్లు అందించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 87,158 రైతులకు గాను రూ 85.14 కోట్లు అందజేశారు. ►రూ.424.74కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలను (వరి,మినుములుతో పాటు ఇతరాలు) సబ్సిడీ ధరపై అందించారు. 82,745 మెట్రిక్ టన్నులు ఎరువులు (యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే) పురుగు మందులు 5592 లీటర్లు నేనొ, యూరియా వంటివి ఆర్బీకేల ద్వారా అందించారు. ►సాగుకు ఉపయోగపడేలా వైఎస్సార్ యంత్రసేవా పరికరాలు అందజేశారు. చిన్న, సన్నకార రైతులకు 505 ట్రాక్టర్లు, మలి్టపుల్క్రాప్ ట్రెసర్స్, పాడిరేపర్స్, రోటావెటర్స్, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్ హార్వెస్టర్స్ వంటివి అందించారు. 10 వేల భూసార పరీక్షలు చేశారు. 27,049 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఇవన్నీ చేయడంతో సాగుతో పాటు పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. మనబడి నాడు–నేడు ►ఫేజ్–1: జిల్లాలో నాడు–నేడు మొదటి ఫేజ్ కింద 1247 పాఠశాలను సుందరంగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలు కలి్పంచారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.286.22 కోట్లు వెచ్చించింది. ► ఫేజ్–2: జిల్లాలో నాడు–నేడు రెండో ఫేజ్ కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, వసతి గృహాలు.. ఇలా 1096 విద్యాసంస్థలను తీర్చిదిద్దారు. అదనపు తరగతి గదులను నిర్మించి, మౌలిక సదుపాయాలను కలి్పస్తున్నారు. ఇందుకోసం రూ.427.73 కోట్లు కేటాయించారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి. -
రాగోలు గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవం
-
సాక్షి విలేకరి ‘గురిజా’ మృతిపై వాస్తవాలు నిగ్గుతేల్చాలి
రణస్థలం: శ్రీకాకుళం జిల్లా లావేరు సాక్షి విలేకరి గురిజా దామోదరరావు మృతి బాధాకరమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. రణస్థలంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తన పెదనాన్న గొర్లె శ్రీరాములునాయుడుకు, దామోదరరావు తండ్రి తవిటయ్యతో మంచి అనుబంధం ఉందని, దామోదర్ కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు. విపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలు తెలీకుండా టీడీపీ నేతలు కళా వెంకటరావు, చంద్రబాబు స్పందించిన తీరు శవాలపై రాజకీయం చేసేలా ఉందని విమర్శించారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరిపి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. ఈ ఘటనపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని, దామోదర్ నాలుగు నెలలు ఎవరితో ఎక్కువ మాట్లాడారో కాల్స్ పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. దామోదర్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ కళా వెంకటరావు రాజకీయ లబ్ధి కోసమే దామోదర్ మృతిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ల కిందట కళా వెంకటరావు తన తమ్ముడినే చంపేశాడని కుటుంబ సభ్యులే కేసు పెట్టారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వేధించారంటూ వంగర ఎస్ఐ, కళాతో పాటు ఆయన పీఏపైనా కేసు పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ నేతలు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు లావేటిపాలెం వైఎస్సార్సీపీ నేతలు, మృతుడి బంధువులైన లావేరు ఎంపీటీసీ ఇనపకుర్తి సతీష్, ఇనపకుర్తి చంద్రశేఖర్, సగరం విశ్వనాథం మాట్లాడుతూ దామోదర్ ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. టీడీపీ నేత జగ్గన్న దొరకు దామోదర్ రూ.10 లక్షలు అప్పు ఇచ్చాడని, ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు దామోదర్ చెప్పాడని పేర్కొన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కిరణ్‌కుమార్, లంకలపల్లి గోపిపై ఆరోపణలు చేస్తున్నారని, సూసైడ్ లెటర్ కూడా టీడీపీ వాళ్లు పెట్టించి ఉంటారని ఆరోపించారు. -
విన్నారు.. ఆదుకున్నారు..
శ్రీకాకుళం పాత బస్టాండ్: శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు గురువారం వచ్చిన సీఎం వైఎస్ జగన్ మరోసారి తన మంచి మనస్సుని చాటుకున్నారు. సాయం కోరి వచ్చిన వారిని అక్కున చేర్చుకుని ఒక్కరోజులోనే ఆయన వారికి ఆర్థిక సాయాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం నిర్మించిన వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి, వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రిని పలువురు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. మందుల కోసం, ఇతర వైద్య అవసరాల కోసం సాయం కోరారు. వారి కష్టాలు విన్న సీఎం వెంటనే సాయం చేయాలని అక్కడే ఉన్న కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్‌ను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో ఎనిమిది మందికి రూ.9లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. సాయం అందుకున్న వారి వివరాలు ♦ పొందూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన బోను సంతోషి పదేళ్లుగా తేలికపాటి పక్షవాతం, తీవ్రమైన చర్మవ్యాధితో బాధపడుతోంది. ఆమె సీఎంను కలిసి ఆర్థిక సాయం కోరడంతో ఆమెకు రూ.2 లక్షలు అందించారు. ♦పెద్ద శ్రీపురం సచివాలయ పరిధికి చెందిన మేరపాటి తులసీదాసు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. సీఎంను కలిసి కష్టం చెప్పుకోగా ఆయనకు రూ.లక్ష అందించారు. ♦సనపల హేమంత్‌కుమార్ అనే వ్యక్తి వంశపారంపర్య హైపర్ కొలోస్ట్రిమియా అనే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యశ్రీలో తనకు చికిత్స అందేలా చూడాలని సీఎంను కోరారు. వెంటనే ఆయనకు రూ.లక్ష చెక్కును కలెక్టర్ అందజేశారు. ♦ రాజాం మండలానికి చెందిన అడపా యోగేశ్వరరావు సీఎంను కలిసి తనకు గుండెలో రంధ్రాలు, జన్యుపరమైన సమస్యకు ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స జరిగిందని, ఆర్థిక సాయం చేయాలని కోరారు. దీంతో ఆయనకు రూ.లక్ష మంజూరు చేశారు. ♦ అలాగే.. వితిక (అధిక రక్తస్రావం), సాయికృష్ణ (మానసిక వ్యాధి), ఎం. సాత్విక్ (జన్యుపరమైన సమస్యలు), అధిక కొలెస్ట్రాల్) కొమర పోలరాజు (ఊపిరితిత్తుల క్యాన్సర్ 4వ దశ)లు కూడా ముఖ్యమంత్రిని కలిసి సాయం అభ్యర్థించగా.. వారికి కలెక్టర్ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ♦ ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త పి. ప్రకాశరావు, కొవ్వాడ ఎస్డీసీ తహసీల్దార్ బీవీ రమణ, డి–సెక్షన్ సూపరింటెండెంట్ పి. అమల, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు. -
మంచి చేసినా ఏడుపే
ఉద్దానం సమస్య చంద్రబాబు హయాంలో కూడా ఉన్నా పరిష్కారం చూపలేదు సరికదా కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. సమాజం గురించి పట్టని ఇలాంటి క్యాన్సర్ గడ్డలను ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి. పక్క రాష్ట్రంలో ఉంటూ ఏడుపుతో మనపై పడుతున్న వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. ఈ ఏడుపులన్నింటినీ కేవలం మరో మూడు నెలలు భరించండి. మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. ఇలా ధైర్యంగా అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా? – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్క రోజులో వచ్చింది కాదని, ఆ కష్టాలు చంద్రబాబు హయాంలోనూ ఉన్నా దశాబ్దాల పాటు ఎందుకు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలపై ప్రజలందరూ ఆలోచించాలని విన్నవిస్తున్నట్లు చెప్పారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ విపక్షాల వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ ఏ ఒక్కరిపైనా మానవత్వం, మమకారం లేని మనిషి ఈ చంద్రబాబు. తన సొంత నియోజకవర్గం కుప్పానికి గతంలో ఎప్పుడూ నీరిచ్చిన చరిత్రే లేదు. కుప్పానికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా అది జరిగింది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. మరి సొంత నియోజకవర్గం, తనను ఎమ్మెల్యేగా దశాబ్దాలుగా గెలిపించిన నియోజకవర్గాన్నే పట్టించుకోని ఈ వ్యక్తికి ఉత్తరాంధ్రపై ఏం ప్రేమ ఉంటుంది? ఈ పెద్దమనిషి దత్తపుత్రుడిగా ఒక యాక్టర్‌ను పెట్టుకొని డ్రామాలు ఆడతాడు. ఆ దత్తపుత్రుడు మొన్న తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడుతూ అన్న మాటలు వింటే ఆశ్చర్యం అనిపించింది. తాను తెలంగాణలో పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నానంటాడు. తన దురదృష్టం అంటాడు. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. చంద్రబాబుకు పార్టనర్. బర్రెలక్క బెటర్.. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్. ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లు ఎన్నో తెలుసా? చివరికి ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడి అభ్యర్థులకు రాలేదు. డిపాజిట్లు కూడా రాలేదు. ఏడుపులే.. ఏడుపులు అక్కచెల్లెమ్మలను, పొదుపు సంఘాల్ని నిలువునా ముంచేసిన చంద్రబాబుకు ఇవాళ మనం పార్టీలకు అతీతంగా మంచి చేస్తుంటే ఏడుపు. 31 లక్షల ఇంటి పట్టాలు అక్కచెల్లెమ్మల చేతిలో పెడితే ఏడుపు. 22 లక్షల ఇళ్లను కట్టిస్తుంటే ఏడుపు. పేద పిల్లల బతుకులు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలని తపిస్తూ పేద పిల్లలు వెళ్తున్న గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు తీసుకొస్తే ఏడుపు. గోరుముద్ద, నాడు–నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ బడుల్లో పెడితే ఏడుపు. 6వ తరగతి, ఆపై తరగతుల పిల్లలకు, ప్రతి క్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్‌పీ ప్యానల్స్ తెస్తే ఏడుపు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు. ఏకంగా 35 లక్షల ఎకరాలు హక్కులేని భూములకు, అసైన్డ్ భూముల మీద పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కలి్పస్తే ఏడుపు. 99 శాతం హామీలను నెరవేరుస్తుంటే ఏడుపు. లంచాలు, వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కి నేరుగా రూ.2.40 లక్షల కోట్లు జమ చేస్తుంటే ఏడుపు. మరో 1.70 లక్షల కోట్లు నాన్ డీబీటీగా పేదలకు ఇస్తున్నా కూడా ఏడుపే ఏడుపు. పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజని, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, వరుదు కళ్యాణి, నర్తు రామారావు, దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, జిల్లా పరిషత్ చైర్మన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాసరావు, హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. నాన్ లోకల్స్.. ఒకటే ఏడుపులు ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్లు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని మీ బిడ్డ అంటే అడ్డుకుంటున్న దుర్మార్గం వారిది. ఉత్తరాంధ్రలో ఒక బిల్డింగ్ కట్టినా వీళ్లు ఏడుస్తారు. మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానన్నా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పోర్టు వస్తుందన్నా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామంటే ఏడుస్తారు. ఓ చంద్రబాబు, ఓ రామోజీరావు, దత్తపుత్రుడు, రాధాకృష్ణ, టీవీ 5 వీళ్లంతా ఒక దొంగల ముఠాగా తయారై మనమీద పడి ఏడుస్తుంటారు. వీళ్లలో ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. ఉండేది హైదరాబాద్‌లో. అలాంటి నాన్ లోకల్స్.. ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? మన రాజధానులు ఎక్కడ ఉండాలి? అని శాసిస్తారా? ఈ నాన్ లోకల్స్ చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రంలో జరగాలట. అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు. వారు ఏనాడూ ఇవ్వని విధంగా మనం ఇంటింటికీ పెన్షన్ ఇస్తుంటే కూడా ఏడుపు. వారి హయాంలో ఇచ్చిన వెయ్యి పింఛన్‌ను మనం రూ.2250తో ప్రారంభించి ఏకంగా రూ. 3 వేలు చేస్తుంటే ఏడుపు. దోపిడీని అరికట్టి, జన్మభూమి కమిటీలను రద్దు చేసి, ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రతి పేద వాడికీ తోడుగా ఉండి నడిపిస్తుంటే ఏడుపు. వారు ఇవ్వని విధంగా ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 2.10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు ఏడుపు. వారి ఐదేళ్ల పాలనలో నష్టపోయిన రైతన్నకు మీ బిడ్డ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, ఆర్బీకే వ్యవస్థ, పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత బీమా, సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ.. ఇవన్నీ అందిస్తున్నందుకు ఏడుపు. -
సీఎం జగన్‌కు ఘనస్వాగతం (ఫొటోలు)
-
ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు మూల కారణం తెలుసుకునేందుకు సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టాం: సీఎం జగన్
-
ఉద్దానం సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చాం: సీఎం జగన్
-
ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు: సీఎం జగన్
-
పవన్ కన్నా బర్రెలక్క ఎంతో బెటర్: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని.. గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని.. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజవర్గానికి కూడా నీరు అందించలేదని, సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందంటూ సీఎం దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్-200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సీఎం జగన్.. గురువారం ప్రారంభించారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ‘‘ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. బాబు ఇంకో పార్ట్నర్. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు. ‘‘విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే చంద్రబాబు, అనుంగు శిష్యులు ఏడుస్తున్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు’’ అంటూ సీఎం ధ్వజమెత్తారు. ‘‘ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం. ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశాను. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకువచ్చాం. ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాం. దాదాపు రూ.85కోట్లతో నిర్మాణాలు చేపట్టాం. సురక్షిత మంచి నీటి కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అత్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలు అందిస్తున్నాం. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం’’ అని సీఎం పేర్కొన్నాం. కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నామని సీఎం అన్నారు. పేదవాడిని ఎలా ఆదుకోవాలి, పేదవాడికి ఎలా తోడుగా ఉండాలి, పేదరికం నుంచి ఎలా లాగాలి, ఎలా బతుకులు మార్చాలని అనే తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది. తేడా ఇదీ అని గమనించాలి. సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే లెక్కే లేదు. తన సొంత నియోజకవర్గం కుప్పానికి గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే లేదు. కుప్పానికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా మళ్లీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. మరి సొంత నియోజకవర్గం, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్నే పట్టించుకోని ఈ వ్యక్తికి ఉత్తరాంధ్రపై ఏం ప్రేమ ఉంటుంది? ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది ఆలోచన చేయాలి. ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం గానీ, మమకారం గానీ చూపించని ఈ చంద్రబాబు. 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకొనే దానికి ఒక్క మంచిపనీ లేదు. తన హయాంలో ఈ మంచి స్కీమ్ చేశాను, ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకొనే దానికి ఒక్క స్కీమ్ కూడా లేని పరిస్థితి. తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడని, మాట కోసం ఎందాకైనా పోయాడని, నిలబెట్టుకున్నాడని కనీసం చెప్పుకొనేందుకు ఒక్క విషయం అయినా లేదు. ఇలాంటాయన ఎన్నికలు వచ్చే సరికే పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్దమనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిగా యాక్టర్‌ను పెట్టుకొని డ్రామాలు ఆడతాడు. ఈ దత్తపుత్రుడు ఎవరంటే, ఎలాంటి వాడు అంటే.. మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు. అభ్యర్థులను నిలబెడుతూ, తెలంగాణలో అన్నమాటలు వింటే ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నానంటాడు. తన దురదృష్టం అంటాడు. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. ఈ పెద్దమనిషి చంద్రబాబుకు ఇంకొక పార్టనర్. ఈ పెద్ద మనిషి ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెంలగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టార్, ఈ మ్యారేజీ స్టార్. ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయన పడిన ఓట్లు ఎన్నో తెలుసా? చివరికి ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాలేదు. ఈ పెద్దమనిషికి చంద్రబాబు ప్రయోజనవర్గం ఉంది తప్ప, ఆంధ్ర రాష్ట్రంపై ప్రేమే లేదు. సొంత నియోజకవర్గం లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య ఎన్నికల్లో కలిసి వచ్చారు. 2014-2019 మధ్య ఈ ఉద్దానం ప్రాంతానికి మంచి నీరు ఇవ్వడం ఎలా అని కనీసం ఆలోచన అయినా చేశారా అంటే అదీ లేదు. కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్, ఆస్పత్రి నిర్మించారా అంటే అది కూడా లేదు. వీళ్ల బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచీ లేదు. ప్రతి పక్షంలో ఉండి కూడా వాళ్లు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తాం అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి అడ్డుకుంటున్న దుర్మార్గం వీరిది. ఉత్తరాంధ్రలో ఒక బిల్డింగ్ కట్టినా వీళ్లు ఏడుస్తాడు. మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానన్నా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పోర్టు వస్తుందన్నా ఏడుస్తారు. ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామంటే ఏడుస్తారు. ఈ ఏడుపంతా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా తయారయ్యారు. ఓ చంద్రబాబు ఓ రామోజీరావు, దత్తపుత్రుడు, రాధాకృష్ణ, టీవీ5 వీళ్లంతా ఒక దొంగల ముఠాగా తయారై మనమీద పడి ఏడుస్తుంటారు. వీళ్లలో ఎవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్లంతా ఉండేది హైదరాబాద్‌లో.. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్లు నిర్ణయిస్తామని మనకు చెబుతారు. దానికి తగ్గట్టుగా ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్, చంద్రబాబు, దత్తపుత్రుడు.. ఇవే కథలు.. రోజూ ఈ డ్రామాలు. వీళ్లలో ఏ ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు. ఈ నాన్ లోకల్స్ చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలట. నేనుచెప్పిన విషయాలు ఆలోచన చేయాలి. అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు, వారు ఏనాడూ ఇవ్వని విధంగా ఇంటింటికీ పెన్షన్ ఇస్తుంటే కూడా ఏడుపు. వారి హయాంలో ఇచ్చిన వెయ్యి పించన్ మనం 2250తో ప్రారంభించి ఏకంగా 3 వేలు చేస్తుంటే ఏడుపు. వారి హయాంలో విచ్చలవిడి దోపిడీని అరికట్టి, జన్మభూమి కమిటీలు రద్దు చేసి ప్రతి గ్రామంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రతి పేద వాడికీ తోడుగా ఉండి నడిపిస్తుంటే ఏడుపు. వారు ఇవ్వని విధంగా, ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 2.10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు. వారి ఐదేళ్ల పాలనలో నష్టపోయిన రైతన్నకు మీ బిడ్డ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, ఆర్బీకే వ్యవస్థ, పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత బీమా, సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ.. ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ అందిస్తున్నందుకు వీరంతా ఏడుపు. అక్కచెల్లెమ్మల్ని, పొదుపు సంఘాల్ని నిలువునా ముంచేసిన ఈ బాబుకు, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న అమ్మ ఒడి.. ఇవన్నీ కూడా పార్టీలు కూడా చూడకుండా మీ బిడ్డకు గతంలో ఓటు వేశారా లేదా అన్నది చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేయాలని అడుగులు వేస్తుంటే ఏడుపు. ఐదేళ్లు వాళ్లు అధికారంలో ఉండి కూడా కనీసం పేద వాడికి ఒక సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఉండాలి, లక్షాధికారులు కావాలని తపన పడుతూ 31 లక్షల ఇంటి పట్టాలు వారి చేతిలో పెడితే ఏడుపు. ఏకంగా 22 లక్షల ఇళ్లు మీ బిడ్డ కట్టిస్తుంటే ఏడుపు. పేద పిల్లల బతుకులు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలి, పేద పిల్లలు వెళ్తున్న గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు తీసుకొస్తే ఏడుపు. గోరుముద్ద, నాడు-నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ బడుల్లో పెడితే ఏడుపు. 6వ తరగతి, ఆ పై తరగతుల పిల్లలకు, ప్రతి క్లాస్ రూమ్ డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్‌పీ ప్యానల్స్ తెస్తే ఏడుపు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు. ఏకంగా 35 లక్షల ఎకరాలు హక్కులేని భూములకు, అసైన్డ్ భూముల మీద పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు. 2014-19 మధ్య వాళ్లు అధికారంలో ఉన్నారు. మేనిఫెస్టోలో 10 శాతం వాగ్గానాలు కూడా అమలు చేయని వీరు.. మీ బిడ్డ ఎన్నికల మేనిఫెస్టోను తెచ్చి ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేస్తే ఏడుపు. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబు. బటన్ ఎలా నొక్కాలో తెలియని ఈ చంద్రబాబు. మీ బిడ్డ హయాంలో ఏకంగా 2.40 లక్షల కోట్లు మీ బిడ్డ హయాంలో నేరుగా బటన్ నొక్కుతున్నాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నా ఏడుపే ఏడుపు. మరో 1.70 లక్షల కోట్లు నాన్ డీబీటీగా పేద వారి కోసం ఇస్తున్నా కూడా ఏడుపే ఏడుపు. ఈ ఏడుపులన్నింటినీ కూడా కేవలం మరో మూడు నెలలు భరించండి. ఈ క్యాన్సర్ గడ్డల్ని, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని తెలియజేస్తున్నా. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, పేదల వ్యతిరేకులంతా, పెత్తందార్లంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా తీర్పు ఇవ్వాలని మిమ్మల్నందరినీ సవినయంగా కోరుతున్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి, మోసాలు ఎక్కువ అవుతాయి. ఎవరు మాట ఇచ్చారు. మాట మీద నిలబడింది ఎవరు అనేది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీ బిడ్డ ధైర్యంగా మీ ముందుకు వచ్చి చెప్ప గలుగుతున్నాడు. మీ ఇంటికి, మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీరే సైనికులుగా మీ బిడ్డకు నిలబడండి అని అడుగుతున్నాడు. ఇలా అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా? రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు చేస్తారు. మీ బిడ్డ ఇంత ఇచ్చాడు, ఇంతకన్నా నాలుగింతలు ఎక్కువ చెబితే గానీ నమ్మరు అని చెప్పి.. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని చెబుతారు. మాటలు చెప్పడం చాలా సులభం, మాటలు చెప్పి మోసం చేసేవాళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండని కోరుతున్నా. మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకు ఉంది. మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఆశీర్వదించండి. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. -
అత్యున్నత వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
Updates అత్యున్నత వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్ పలాసలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదల బతుకులు మార్చాలి అనే తపన మీ బిడ్డకు మాత్రమే ఉంది. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి కూడా నీరు అందించలేదు. తన సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటుందా? ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారు. తాను ఒక మంచి పని చేశాడని చెప్పుకోవడానికి చంద్రబాబు ఒక్క స్కీమ్ అయినా తెచ్చాడా? చంద్రబాబుకు నాన్‌లోకల్ ప్యాకేజీ స్టార్ ఇంకో పార్ట్నర్. ప్యాకేజీ స్టార్ ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగ్‌లు కొడతాడు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు. ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశాను. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకువచ్చాం ఉద్దానం ప్రజలకు ఇచ్చిన మాట ఇప్పటికీ గుర్తుంది. ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాం. దాదాపు రూ.85కోట్లతో నిర్మాణాలు చేపట్టాం. సురక్షిత మంచి నీటి కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలు కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా సేవలు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం. దేశ, విదేశాల నుంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షలో రీసెర్చ్. కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నాం. నాన్ డయాలసిస్ రోగులకు కూడా రూ.5వేలు ఇస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు మానవతా ధృక్పదంతో అడుగులు వేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ రూ.10వేలకు పెంచాం. దేవుడి దయతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం. మన ప్రభుత్వంలో 13వేల మందికిపైగా డయాలసిస్ రోగులకు పెన్షన్ ప్రతీ నెల పెన్షన్ల కోసం 12కోట్ల 54లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు మూల కారణం తెలుసుకునేందుకు సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టాం. మార్కాపురంలోనూ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వారిని ఆదుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. పలాస బహిరంగ సభ: డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అందరికీ నమస్కారం, చాలా సంతోషం, ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న గొప్ప కల సాకారమవుతోంది. ఏదైనా మనం ఒక పని మొదలుపెట్టేటప్పుడు ముందు దేవుణ్ని మొక్కి మొదలుపెడతాం.పని పూర్తయిన తర్వాత అదే దేవుణ్ని మొక్కి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈ ప్రాంతంలో వేలాదిమంది ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్ధితులు చూశాం నేను ఈ ప్రాంత వైద్యుడిగా ప్రత్యక్షంగా చూశాను, ఈ ప్రాంత ప్రజలకు ఆ దేవుడు పంపిన స్వరూపమే మన సీఎం కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి, వందల మంది ఉద్యమాల బాట పట్టారు, మా కష్టాలు, కన్నీళ్ళు ఎవరైనా తుడవకపోతారా ఎదురుచూసిన ప్రాంతం ఇది వారికి సంజీవనిలా మీరు వచ్చారు, ఇది అతిపెద్ద భగీరథ ప్రయత్నం మీరు చేశారు అనేక అడ్డంకులు దాటి పూర్తిచేసిన మీ సంకల్పానికి సలాం పలాస అంటే ప్రపంచానికి తెలిసేది ఒకటి జీడిపప్పు, రెండు కొబ్బరి పంట ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి మార్గమైన అదనపు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు సైతం శంకుస్ధాపన చేసిన మీకు కృతజ్ఞతలు ఈ రోజు ప్రతిపక్షం మాటలు, కొన్ని పత్రికలు చూపుతున్న వక్రబాష్యాలు చూస్తున్నాం వారందరికీ నేను ఒకటే చెబుతున్నా.. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ గ్రామమైనా తీసుకోండి ఆ గ్రామంలో సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లీనిక్స్, ఆర్బీకేలు అభివృద్దిలో భాగం కాదా, విద్యావ్యవస్ధలో నాడు నేడు గొప్ప కార్యక్రమం, ఇవి అభివృద్ది కాదా, ఇక్కడ ప్రజలు వలసలు పోతున్నారంటున్నారు, కానీ ఇక్కడ మూలపేట పోర్టు పూర్తయితే ఈ జిల్లాకే వలసలు మొదలవుతాయి, భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖను రాజధాని చేయాలని, ఉత్తరాంధ్ర అభివృద్దికి మీరు చేస్తున్న సంస్కరణలు చిరస్మరణీయం రాబోయే దశాబ్ధానికి ఈ రాష్ట్రానికి సీఎంగా జగన్ గారే రావాలి, కావాలి, మీరు సీఎంగా కొనసాగడం ప్రతి పేదవాడికి అవసరం మీరు వెనక్కి తగ్గద్దు, గెలిచేవారికే టికెట్లివ్వండి, మా నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇదే సంకల్పం తీసుకోవాలి మన జగనన్న సీఎం కావడం కోసం మనమంతా నడుం బిగించాలి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాను ఈ నియోజకవర్గంలో ఉన్న నౌపాడ, వెంకటాపురం రోడ్డును విస్తరించేందుకు ప్రతిపాదనలు అందజేశాం, మంజూరు చేయాలని కోరుతున్నాను. మాది వంశధార శివారు ప్రాంతం కాబట్టి హిరమండలం ఎల్ఐ స్కీమ్ ఇచ్చారు, దీనికి లింక్‌గా రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చాం, మంజూరు చేయగలరు వజ్రపుకొత్తూరు మండలంలోని శివారు ప్రాంతాలకు చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను మంజూరు చేయాలని కోరుతున్నాం. అనేక పనులు పూర్తిచేయమని మీరు నిధులు ఇచ్చారు, మా పలాస ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు ►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్ ►మకరాంపురం నుంచి పలాస బయల్దేరిన సీఎం జగన్ ►కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్ ►అనంతరం రైల్వే గ్రౌండ్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్.. ►వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్ ►రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జాతికి అంకితం ►శ్రీకాకుళం: కంచిలి మండలం మకరాంపురం చేరుకున్న సీఎం జగన్ ►ఉద్దానం మంచినీటి పథకం, పలాస కిడ్నీ రిసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం ►విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►అక్కడ నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లనున్న సీఎం ►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►గన్నవరం నుండి విశాఖపట్నం బయల్దేరిన సీఎం ►అక్కడ నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లనున్న సీఎం ►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి హెలికాప్టర్లో వస్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.10 గంటలకు వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు పంప్‌హౌస్ స్విచ్ నొక్కి దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పలాస వెళ్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.40 గంటలకు కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకుంటారు. ►అక్కడ ఆస్పత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇండ్రస్టియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను పరిశీలించి బహిరంగ సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి హెలికాప్టర్లో విశాఖకు బయలుదేరతారు. ►ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ – 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ►అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్– 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ►ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు. ►సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్ రే (డిజిటల్), థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్.. ►ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్సార్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా. ►ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా.. ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. ♦ గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు కేవలం రూ.2,500 చొప్పున పింఛన్ ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెలా 1న ఠంఛన్‌గా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే వలంటీర్లతో అందజేస్తోంది. ♦ ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 74 మెషీన్లతో డయాలసిస్ సేవలు. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020– 21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,520 సెషన్లు, 2023–24లో (అక్టోబర్ నాటికి) 38,513 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు ప్రభుత్వం డయాలసిస్ సేవలు అందించింది. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్–సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ♦వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు. గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే.. అది కూడా అరకొరగా అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరమ్ క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్‌సీలకు తరలిస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే సీహెచ్‌వోలకు ప్రత్యేక యాప్. ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా.. జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ -
ఉద్దానం సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ – 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్– 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు. సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్ రే (డిజిటల్), థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్.. ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్సార్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా.. ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. ♦ గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు కేవలం రూ.2,500 చొప్పున పింఛన్ ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెలా 1న ఠంఛన్‌గా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే వలంటీర్లతో అందజేస్తోంది. ♦ ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 74 మెషీన్లతో డయాలసిస్ సేవలు. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020– 21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,520 సెషన్లు, 2023–24లో (అక్టోబర్ నాటికి) 38,513 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు ప్రభుత్వం డయాలసిస్ సేవలు అందించింది. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్–సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ♦వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు. గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే.. అది కూడా అరకొరగా అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరమ్ క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్‌సీలకు తరలిస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే సీహెచ్‌వోలకు ప్రత్యేక యాప్. ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా.. జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ నేడు సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి హెలికాప్టర్లో వస్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.10 గంటలకు వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు పంప్‌హౌస్ స్విచ్ నొక్కి దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పలాస వెళ్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.40 గంటలకు కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ ఆస్పత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇండ్రస్టియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను పరిశీలించి బహిరంగ సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి హెలికాప్టర్లో విశాఖకు బయలుదేరతారు. -
‘ఏపీ ప్రజల ఆకాంక్షలు సీఎం జగన్ నెరవేర్చారు’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: సీఎం జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నిలిపిన వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. పాతపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో వైస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, వి.కళావతి, గొర్లె కిరణ్, కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ, చంద్రబాబుకు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశారని, దోచుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రజల ఆకాంక్షలు తీర్చారు. వంశధార నిర్వాసితులకు 216 కోట్లు అదనపు పరిహారం ఇచ్చారు. హిర మండలం వద్ద 176 కోట్ల తో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. పాడు పడిన పాఠశాలలు బాగు చేసి మంచి బడులు గా తీర్చి దిద్దారు. కొత్తూరు లో 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాం. గత ప్రభుత్వం కిడ్నీ రోగులకు నెఫ్రాలజిస్టులను కనీసం నియమించ లేకపోయింది. జగనన్న ఏకంగా కిడ్నీ రీసెర్చ్ స్టేషన్ నిర్మించారు’’ అని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూడండి.. జన్మభూమి కమిటీల ద్వారా గత ప్రభుత్వం ప్రజల సొమ్ము దోపిడీ చేసిది. అవినీతి లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2లక్షల 45 వేల కోట్ల రూపాయిలు ప్రజల ఖాతా ల్లో జమ చేసింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి. సంక్షేమ పథకాలు గౌరవంగా ఇస్తున్న విషయం గమనించండి. చంద్ర బాబు అభివృద్ధి లేదంటున్నాడు. ప్రతి గ్రామంలో సచివాలయం, ఆరోగ్య కేంద్రం నిర్మించడం అభివృద్ధి కాదా?. ప్రజల అవసరాలు వైద్యం, విద్య, ఉపాధి కల్పించకుండా రోడ్డులు వేస్తే అభివృద్ధి జరిగినట్టా?. సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఎన్నికల ముందు అవే ఇస్తానంటున్నాడు. మూడు సార్లు చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. ఏమి చేశారు?. వైస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో సంస్కరణలు తెచ్చింది. సచివాలయాలు ఏర్పాటు చేసింది. అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తే పేదలు కోటీశ్వర్లు అయ్యారు. పేదల జీవన ప్రమాణాలు పెంచే పనులు చేసింది ఈ ప్రభుత్వం -మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రజల సొమ్మును చంద్రబాబు దోచుకున్నారు.. సీఎం జగన్ నాలుగున్నరేళ్లు పాలనలో ఎంతో మార్పు తెచ్చారు. సచివాలయాల ద్వారా అవినీతి లేకుండా పథకాలు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో ఏమి చేశామో సచివాలయం వద్ద దాపరికం లేకుండా ధైర్యంగా బోర్డు పెట్టాం. ఈ బోర్డుల్లో ఎక్కడైనా అబద్ధం ఉంటే నిలదీయండి. ప్రజలకు డబ్బులు పంపిణీ చేయడం తప్పు అని చంద్రబాబు అంటున్నాడు. అప్పట్లో చంద్రబాబు అలీబాబా 40 దొంగల్లా దోచుకొని ప్రజల సొమ్ము తిన్నారు. పేద పిల్లాడికి మంచి యూనిఫార్మ్, స్కూల్ బ్యాగ్, బూట్లు కొని ఇస్తే తప్పా. తమ బిడ్డ నీట్‌గా తయారై స్కూల్‌కి వెళ్తుంటే తల్లి కళ్లల్లో సంతోషం చూడటం అభివృద్ధి కాదా? -స్పీకర్ తమ్మినేని సీతారాం -
నేడు శ్రీకాకుళం జిల్లాలో సామాజిక సాధికార యాత్ర
-
నేడు పాతపట్నంలో సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: సీఎం జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నిలిపిన వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. -
14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన
సాక్షి, అమరావతి: ఈ నెల 14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు వాయుమార్గంలో చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లా మకరంపురం గ్రామానికి సీఎం చేరుకుంటారు. ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభిస్తారు. పలాస చేరుకుని వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్‌ను ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి పలాస రైల్వే గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు హాజరవుతారు. తిరుగు ప్రయాణమై తాడేపల్లి చేరుకుంటారు. -
గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?.. నమ్ముకుంటే అంతేనా?
తెలంగాణ ఎన్నికల పర్వం ముగియడంతో ఇక ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోష్ మీదుంటే..ప్రతిపక్ష టీడీపీ మాత్రం దిక్కులు చూస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం చరిష్మా చెదిరిపోవడంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఐదేళ్ళుగా జిల్లాలో టీడీపీ ప్రాభవం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఇక కింజరాపు కుటుంబాన్ని నమ్ముకుంటే లాభం లేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తాజా రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎప్పుడూ కింజరాపు కుటుంబం చుట్టూనే తిరుగుతాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎమ్మెల్యేగా ఎర్రన్నాయుడు కుమార్తె భవాని తెలుగుదేశం పార్టీలో కీలక కుటుంబంగా వ్యవహరిస్తున్నారు. యర్రంనాయుడు మరణం తరువాత ఆయన వారసులుగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తమ్ముడు, కొడుకు, కూతురు టీడీపీలో పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు కింజరాపు కుటుంబానికి వైభవం గతంగా మిగిలిపోయింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు.. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మధ్య పొసగడం లేదు. అచ్చెన్నాయుడు ఎంత రాసుకుపూసుకు తిరుగుతున్నా లోకేష్ మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హాదాలో ఉన్న అచ్చెన్నాయుడు లోకేష్ వల్లే తెలుగుదేశంకు నష్టం జరుగుతోందంటూ చేసిన కామెంట్.. పార్టీ లేదూ బొక్కా లేదు అని పలు సందర్బాల్లో అన్న వ్యాఖ్యలు లోకేష్ టీంలో నాటుకుపోయాయి. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో పార్టీ శ్రేణుల్లో కూడా చులకన భావం ఏర్పడింది. అచ్చెన్నాయుడుని రాష్ట్ర నాయుకుడుగా గుర్తించడం లేదు. మరో పక్క శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఒక ఫెయిల్యూర్ ఎంపీ అని జిల్లా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో ఫోటోలు దిగడం, ట్విట్టర్ లో పోస్ట్ చేయడం మినహా ఆయన జిల్లాలో కనిపించింది చాలా అరుదు అని పార్టీ కేడరే పెదవి విరుస్తున్నారు. శ్రీకాకుళంలో ఇల్లు ఉన్నా, ఎప్పుడు ఇంట్లో ఉండరని కార్యకర్తలు బహిరంగ వేదికల మీదే ప్రశ్నించిన సందర్బాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు స్థానికంగా ఉంటున్నప్పటికీ ఇంట్లో లైట్లు వేసి ఉంటే కార్యకర్తలు ఇంటికి వచ్చేస్తారని, లైట్లు ఆర్పేస్తారని చెప్పుకుంటున్నారు. జిల్లా ప్రజల కంటే చంద్రబాబు, లోకేష్ ల చుట్టూ తిరగడానికి, ఢిల్లీలో గడపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో ఈయన మీద అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. ఒకవైపు అచ్చెన్నాయుడుకి అధిష్టానం వద్ద విలువలేకపోవడం, మరోవైపు రామ్మోహన్ నాయుడు తీరుపై జిల్లా ప్రజలు, పార్టీలో నమ్మకం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో కింజరాపు కుటుంబాన్ని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతాం అనే భయం జిల్లా నాయకులను వెంటాడుతోంది. వీరిద్దరి గ్రాఫ్ తగ్గిందని చంద్రబాబు సర్వే రిపోర్ట్లు కూడా తేల్చడంతో ఈ ప్రభావం అసెంబ్లీ నియోజవర్గాలపై కూడా ఉందని టికెట్ ఆశిస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు. వి సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టు నిర్మాణం, ఉద్దానం తాగునీటి ప్రోజెక్ట్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణాల వలన టెక్కలిలో ఈసారి వై.యస్.ఆర్ కాంగ్రెస్ కు బ్రహ్మరధం పడుతున్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకున్న పనులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే చేసింది. దీంతో టెక్కలిలో ఈసారి అచ్చెన్నాయుడు గెలుపు ప్రశ్నార్దకం అయింది. మొత్తం మీద కింజారపు కుటుంబం నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధుల గ్రాఫ్ పడిపోవడంతో.. వీరివల్ల జిల్లాలో పార్టీ పరిస్థితి కూడా దయనీయంగా తయారైందనే చర్చ సాగుతోంది. ఇదీ చదవండి: AP: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా? -
సాధికారతను చాటిన ఎచ్చెర్ల
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల ప్రజలు సామాజిక సాధికారతను ఎలుగెత్తి చాటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అండదండలతో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నియోజకవర్గమంతా కలియదిరిగారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. రణస్థలం నుంచి చిలకపాలెం – పొందూరు రోడ్డు వరకు 15 కిలోమీటర్లు సాగిన బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై జగన్ అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గంలోని రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాల నుంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. అనంతరం చిలకపాలెంలో జరిగిన బహిరంగ సభకు ఇసకేస్తే రాలనంతగా ప్రజలు హాజరయ్యారు. అన్ని కులాలకు సమాన హక్కులు కల్పింస్తున్న సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రాష్ట్రంలో అన్ని కులాలకు సమాన హక్కులు కల్పిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వంటి కులాలకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి, వారికి రాజ్యాధికారాన్ని, సంపదను అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను, 700 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. అనేక పథకాలు, అంతర్జాతీయ స్థాయి విద్య, అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. కరోనా సమయంలో గుజరాత్‌కు వలస వెళ్లిన 4,500 మంది మత్స్యకారులను ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా జిల్లాకు తెచ్చామని, 24 మంది మత్స్యకారులను పాకిస్థాన్ నుంచి విడిపించామని చెప్పారు. బీసీలు జడ్జీలుగా ఉండకూడదని కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాసిన ఘనత చంద్రబాబుదన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను అవహేళన చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్ అప్పట్లో చంద్రబాబు పాలనను ఎందుకు విమర్శించలేదని ప్రశ్నించారు. జగనన్న బలం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. దేశానికి సచివాల య, వలంటీర్ వ్యవస్థలు ఆదర్శంగా నిలిచాయన్నారు.తన పని తీరు నచ్చితేనే ఓటు వేయమని అడగగలిగే ఏకైక సీఎం వైఎస్ జగన్ అని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. సీఎం జగన్ అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఉప ముఖ్యమంత్రులు, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులను ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేవని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తెలిపారు. కులం, మతం, ప్రాంతం, లంచం, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప్రయోజనాలు అందాయన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రమే అసంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రెడ్డి శాంతి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, నర్తు రామారావు, పెనుమత్స సురేష్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచారు: మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సీఎం జగన్ విశాఖను రాజధాని చేయాలనుకుంటుంటే టీడీపీ మాత్రం అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు. విశాఖను రాజధాని చేస్తే ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 22వ రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సామాజిక సాధికార యాత్ర సోమవారం రెండు ప్రాంతాల్లో జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును, అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ సాగుతున్న సామాజిక సాధికార యాత్ర విశేష ప్రజాదరణ పొందుతోంది. ఇందులో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. వైఎస్సార్ సర్కిల్ దాకా బస్సు యాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్లలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ ఆధ్వర్యంలో జరగనున్న బస్సుయాత్ర సాగనుంది. ఉదయం 11గంటలకు రణస్థలంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం ర్యాలీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎచ్చర్ల మండలం చిలకపాలెంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. చదవండి: జనం మెచ్చిన 'జగన్' -
ఉద్దానం కిడ్నీకి రక్షణ కవచం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌కు “డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్’గా నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కిడ్నీ బాధితులకు కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో రూ.50 కోట్లు వెచ్చించి రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మి0చారు. ర్యాంప్ బ్లాక్‌తో కలిపి మూడు బ్లాక్‌లుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. మొదటి అంతస్తులో క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, హాస్పిటల్ స్టోర్స్, సెంట్రల్ ల్యాబ్స్ ఉంటాయి. రెండో అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూడో అంతస్తులో డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, నాలుగో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్/ఐసీయూ, యూరాలజీ వార్డ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. అందుబాటులో అన్నిరకాల చికిత్సలు కిడ్నీ వ్యాధులకు సంబంధించి అన్నిరకాల చికిత్సలతో పాటు పరిశోధనలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పరికరాలను సమకూరుస్తోంది. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్సరే (డిజిటల్), ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు పూర్తిగా రిమోట్ కంట్రోల్ ఐసీయూ సౌకర్యాలను కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో అందుబాటులోకి రానున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, వంటి వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య పోస్టులు 46, స్టాఫ్ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు 60 చొప్పున మంజూరు చేశారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించనున్నట్టు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. ఇప్పటికే తీసుకున్న చర్యలివీ ♦ గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 చొప్పున ఇచ్చే పెన్షన్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10వేలకు పెంచింది. ప్రతినెలా 1వ తేదీనే లబి్ధదారుల గుమ్మం చెంతకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌ను వలంటీర్లు అందజేస్తున్నారు. ♦ టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 69 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. హరిపురంలో డయాలసిస్ సెంటర్‌ను 2020లో ప్రారంభించారు. మరో 25 మెషిన్లతో కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020–21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో (మే నాటికి) 55,708 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేశారు. ♦ ఇచ్చాపురం, కంచిలీ సీహెచ్‌సీ, కంచిలి పీహెచ్‌సీల్లో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ♦ వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను అందుబాటులో ఉంచారు. ♦ టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే అరకొరగా ఇక్కడి ఆస్పత్రుల్లో అందించేవారు. ప్రస్తుతం ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. ♦కొత్త కేసుల గుర్తింపునకు వైద్య శాఖ నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగిస్తోంది. ఇందుకోసం వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లకు ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు. వీరు ఈ ప్రాంతంలోని ప్రజలను స్క్రీనింగ్ చేసి అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సమీపంలోని పీహెచ్‌సీలకు సీరమ్ క్రియాటినిన్ పరీక్షలకు తరలిస్తున్నారు. -
‘జగన్ జైత్రయాత్రను ఆపేశక్తి ఎవరికీ లేదు’
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన.. దేశానికే ఆదర్శమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆయన అండగా ఉన్నారని.. సామాజిక న్యాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారాయన. బుధవారం శ్రీకాకుళం నరసన్నపేటలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారాయన. ‘‘ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు?. చంద్రబాబు అడుగడుగునా దళితుల్ని అవమానించారు. అధికారం కోసం కాదు.. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు జగన్. అందుకే వెనుకబడిన వర్గాల వాళ్లు ఇవాళ తలెత్తుకుని బతుకుతున్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం తెచ్చారు. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. రైతు భరోసాతో కర్షకులకు ఆర్థిక భరోసా లభించింది. విత్తనాలు రైతుల ముంగిటకే వస్తున్నాయి. వెనకబడిన వర్గాలకు అండగా ఉంటూ.. సామాజిక న్యాయం పాటిస్తూ.. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ జైత్రయాత్రను ఆపే శక్తి ఎవరికీ లేదు అని తమ్మినేని అన్నారు. అంతకు ముందు.. మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌లు ప్రసంగించారు. బహిరంగ సభకు ముందు.. నరసన్నపేటలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మరీ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే లు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి తదితరులు పాల్గొన్నారు. -
పురిటి కోసం విదేశాల నుంచి వస్తున్న పక్షులు.. ఎక్కడో తెలుసా?
తేలినీలాపురం.. సైబీరియా పక్షుల విడిది కేంద్రం. పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం. అల్లంత దూరం నుంచి పక్షులను చూడడం, చెట్టుపై వాలిన వాటి అందాలు గమనించడం సహజం. అవే పక్షులను దగ్గరగా చూస్తే..? వాటి ఆహారం, ఆహార్యం, అలవాట్లను తెలుసుకోగలిగితే..? చింత, రావి, తుమ్మ, గండ్ర, వెదురుపై వాలే అతిథి విహంగాల జీవన క్రమాన్ని అర్థం చేసుకోగలిగితే..? ఎంత బాగుంటుందో కదా. ఆ సరదాను తీర్చడానికి తేలినీలాపురంలో పక్షుల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆహార అన్వేషణ, ఆవాసాలపై జీవించే క్రమంలో ఆయా పక్షుల ప్రత్యేకతలను వివరంగా తెలియజేస్తూ పక్షుల బొమ్మలను ఏర్పాటు చేశారు. పెలికాన్ పెలికాన్ బాతు జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 8 కిలోలు ఉంటుంది. దీని నోరు పొడవు సుమారు 14 సెంటీమీటర్లు. దీని రెక్కల పొడవు సుమారు 118 ఇంచీలు, రోజుకు 4 కిలోల చేపల్ని తింటుంది. ఒకే సారి 2 కిలోల బరువు కలిగిన చేపను సునాయాశంగా తినగలిగే సామర్థ్యం ఉంది. దీని గుడ్డు బరువు సుమారు 150 గ్రాములు. ప్రతీ సీజన్‌కు 4 గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని గుడ్డు 28 రోజుల్లో పిల్లగా పరిపక్వత చెందుతుంది. 3 నెలల్లో పిల్ల తల్లిగా మారుతుంది. దీని దవడ సంచి ఆకారంలో ఉంటుంది. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తాయి. రోజుకు సుమారు 4 సార్లు బయటకు వెళ్తూ ఆహారాన్ని తీసుకువస్తాయి. పెలికాన్ దవడ సంచి ఆకారంలో ఉంటుంది. ఈ దవడలో సుమారు 4 కిలోల వరకు చేపల్ని నిల్వ చేయగలవు. పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. పెయింటెడ్ స్టార్క్ పెయింటెడ్ స్టార్క్ కొంగ జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. దీని రెక్కల పొడవు 63 ఇంచీలు, ఇవి చిన్న చేపలు, పురుగులు, నత్తలు తింటాయి. కేవలం పావు కిలో వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి. తీసుకువచ్చిన ఆహారాన్ని గూడు మీద వేస్తే పిల్లలు తింటాయి. దీని నోటి పొడవు సుమారు 16 సెంటీ మీటర్లు. ఆహారం కోసం రోజుకు 2 సార్లు బయటకు వెళ్తుంటాయి. దీనికి సాధారణ దవడ మాత్రమే ఉంటుంది. దీని గుడ్డు సుమారు 75 గ్రాములు. ఇవి ఒక సీజన్లో 4 గుడ్లు మాత్రమే పెడతాయి. 28 రోజుల్లో గుడ్డును పిల్లగా పరిపక్వత చేస్తుంది. పిల్ల తల్లిగా మారాలంటే సుమారు 3 సంవత్సరాలు కాలం పడుతుంది. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. 120 రకాల పక్షుల్లో కొన్నింటి ప్రత్యేకతలు.. పొడుగు ముక్కు ఉల్లంకి: ఈ పక్షి మట్టిలో ఆహార ఆన్వేషణకు బురద మట్టి ఇసుక నేలలో అనేక రకాలైన చిన్న పురుగులను కొక్కెం వంటి ముక్కుతో వేట కొనసాగిస్తుంది. ఈ పక్షి నమూనా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తెడ్డు మూతి కొంగ: ఈ పక్షి మూతి చెంచా ఆకారంలో ఉంటుంది. నీటి అడుగున ఉన్న చిన్న జీవులను వేటాడుతుంది. అర్ధ చంద్రాకారంలో గల మూతితో వేట కొనసాగిస్తుంది. పాము బాతు : బల్లెం వంటి ముక్కు ఆకారంతో ఈ పక్షి వేట కొనసాగిస్తుంది. మట్టి, నీటిలో పొడుచుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది. రాజహంస: జల్లెడ మాదిరిగా ఉన్న ముక్కు కలిగిన ఈ రాజహంస సూక్ష్మ జీవులను సునాయాశంగా వేటాడుతుంది. ఈ పక్షి ముక్కులో ఒక రకమైన వడపోత పరికరం బిగించి ఉన్నట్లు ఉంటుంది. నత్తగుల్ల కొంగ: నత్తలను వేటాడడంలో ఈ పక్షి ముక్కు ఎంతో షార్ప్‌గా ఉంటుంది. నత్తలను గట్టిగా పట్టుకోవడంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మ్యూజియం చూసొద్దామా... టెక్కలి సమీపంలోని తేలినీలాపురంలొ ఈ మ్యూజియం ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఎంత దూరం 70 కిలోమీటర్లు ఉంటుంది. రవాణా: టెక్కలి వరకు రైలు సదుపాయం ఉంది. బస్సు సదు పాయం కూడా ఉంది. టెక్కలి నుంచి పూండి మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి బస్సులు, ఆటోలు కూడా ఉన్నాయి. సందర్శనీయ వేళలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. -
సామాజిక సాధికార యాత్ర శ్రీకాకుళం షెడ్యూల్
-
శ్రీకాకుళంలో సామాజిక సాధికార యాత్ర
-
సామాజిక సాధికార బస్సుయాత్ర.. 10వ రోజు షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. నేడు(మంగళవారం) 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో బస్సుయాత్ర కొనసాగనుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో మీడియా సమావేశం అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ బైక్ ర్యాలీ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగనుంది. పల్నాడు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యేబొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లిలో సుజికీ కార్ షోరూమ్ వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం మూడు గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు శివయ్య స్థూపం సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎమ్మెల్యే తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వాకలవలస ఆంజనేయస్వామి కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం గం. 1:30ని.లకు ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని గేటు పాఠశాలలో నాడు-నేడును పార్టీ నేతల పరిశీలించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నాలుగురోడ్ల సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
‘సీఎం జగన్‌ది ఆదర్శవంతమైన పాలన’
సాక్షి, పలాస(శ్రీకాకుళం జిల్లా): వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఎనిమిదో రోజు ఆదివారం పలాసలో నిర్వహించిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు ప్రజలు భారీ స్థాయిలో సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా పలాసలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. జనం భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారం, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంబాల జోగులు, ఎంఎల్సీ వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘ గత పాలకుల నిర్లక్ష్యం వలన ఇన్నాళ్ళూ ఉద్దానం ప్రాంతం వెనుక బడింది. జగన్ సీఎం అయ్యాక రూ. 75 కోట్ల తో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టాము. 7వందల కోట్ల రూపాయలతో వంశధార తాగునీరు తెచ్చాము. వలసల నివారణకు మూల పేట పోర్ట్ నిర్మాణం చేపట్టాం. వంశధార ఎడమ కాలవకి నీరు రావడం లేదు. అందుకే ఈ ప్రాంతానికి ఇన్సూరెన్స్ వచ్చేలా కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ గతంలో చిన్న చిన్న సమస్యలకు జనం ఉద్యమాలు చేసేవారు. ఇప్పుడు ప్రజా సమస్యలు మేమే పరిష్కరిస్తున్నాం. కిడ్నీ రోగుల సమస్యలు తీర్చడానికి వంశధార ప్రాజెక్ట్ తాగు నీరు అందించాలని అనుకుని ఈ ప్రభుత్వం కాలం లోనే అనుకుని, ఈ ప్రభుత్వకాలంలోనే పూర్తి చేస్తాం. గ్రామ స్థాయిలో అవినీతి తగ్గించాము. ప్రధాన మంత్రులు సైతం అవినీతిని ఆపలేకపోయారు. సీఎం జగన్ అవినీతిని రూపు మార్చగలిగారు. పరిపాలన లో గొప్ప గొప్ప సంస్కరణలు తెచ్చాము. జగన్ అమలు చేస్తున్న పథకాల వంటి వాటి పై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. ప్రజల జీవన ప్రమాణాలు ఏమేరకు పెంచాలని జగన్ ఆలోచన. మన రాష్ట్రం లో తీసుకొచ్చిన మార్పులు ఓట్ల కోసం కాదు. పిల్లలకు చదువు చెప్పడం ఓట్ల కోసం కాదు. విద్యా ద్వారా పేదరికం తొలగించే పని. ఇది ఆదర్శవంతమైన పాలన’ అని పేర్కొన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తే ప్రతిపక్షానికి నష్టం ఏమిటి?. విద్యార్థులకి ఇస్తున్న విద్యా కానుక, పౌష్టికాహారం, విద్యా దీవెన, వసతి దీవెన అందిస్తున్నారు. ఈ సృష్టి లో ఇద్దరే ఇద్దరు మామలు. ఒకటి చందమామ, రెండు జగన్ మామ. చదువు పేదవాడి జీవనాన్ని మార్చుతుంది. పేదవాడి ఆరోగ్యం నయం చేసిన ఘనత సీఎం జగన్‌ది. వైద్య రంగం లో సమూలమైన మార్పులు తెచ్చాం’ అని పేర్కొన్నారు. -
‘ఏపీ ప్రయోజనాలు కోసం మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా టెక్కలిలో కృష్ణదాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనేక విప్లవాత్మక నిర్ణయాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తోంది. అండగా జగనన్న ఉన్నారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి’’ అని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. చదవండి: ‘ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురందేశ్వరి’ -
8 రోజు సామాజిక సాధికార యాత్ర
-
సామాజిక సాధికార బస్సు యాత్ర.. ఎనిమిదో రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, తాడేపల్లి: నేడు ఎనిమిదో రోజు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో సామాజిక సాధికార యాత్ర జరుగనుంది. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో యాత్ర ముందుకు సాగుతుంది. సామాజిక సాధికార యాత్రలో పలువురు వైస్సార్సీపీ నేతలు పాల్గొననున్నారు. పలాసలో యాత్ర రూట్ మ్యాప్: ⏰ఉదయం 10:15 గంటలకు: శ్రీకాకుళం నుండి బయలుదేరి టెక్కలి చేరుకుంటుంది. ⏰ ఉదయం 11:00 గంటలకు: ఎస్ కన్వెన్షన్ హాల్లో ప్రెస్ మీట్. ⏰మధ్యాహ్నం 12:00 గంటలకు: టెక్కలి నుండి బయలుదేరి పలాస వరకు బస్సు యాత్ర సాగుతుంది. ⏰మధ్యాహ్నం 1గంటకు: పవర్ గ్రిడ్ అతిథి గృహం (రామకృష్ణాపురం) పలాసకు చేరుకోవడం, భోజన కార్యక్రమం. ⏰ మధ్యాహ్నం 2 గంటలకు: పవర్ గ్రిడ్ గెస్ట్ హౌస్ నుండి ప్రారంభమవుతుంది. ⏰ మధ్యాహ్నం 2:15 గంటలకు: కోసంగిపురం జంక్షన్‌కు చేరుకుంటుంది. ⏰ మధ్యాహ్నం 2:30 గంటలకు: 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ & ఆసుపత్రికి చేరుకోవడం (అభివృద్ధి కార్యాచరణ సందర్శన) ⏰ మధ్యాహ్నం 2:45 గంటలకు: కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ నుండి ప్రారంభమై వైఎస్సార్ స్క్వేర్ కాశీబుగ్గ వరకు సాగుతుంది. ⏰ మధ్యాహ్నం 3.00 గంటలకు: కాశీబుగ్గ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి సామాజిక సాధికర యాత్ర సభా వేదిక వద్దకు చేరుకుంటుంది. -
అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఏకైక సిఎం జగనే
-
టీడీపీ చేసిన అవినీతిని ప్రజలకు వివరిస్తామన్న వైఎస్సార్సీపీ నేతలు
-
పల్లె గుండెల్లో విజయ వీచిక
పల్లె జనాలను కుటుంబ సభ్యుల్లా వరసలు పెట్టి ఆప్యాయంగా పిలవడం, అక్కడి ఆడపడుచులతో తోబుట్టువులా కలిసిపోవడం, ఊరి కష్టసుఖాలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచించడం, రాత్రి అదే పల్లెలో నిద్రపోవడం, ఉదయం లేచి మళ్లీ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీయడం.. క్షేత్రస్థాయిలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ చేసి చూపిస్తున్న కార్యక్రమాలివి. అధినేత ఆదేశాల మేరకు గ్రామగ్రామాన తిరుగుతూ పార్టీ పతాకాన్ని జనం గుండెల్లో ప్రతిష్టిస్తున్నారామె. సంక్షేమ సమాచారం చేరవేస్తూనే.. సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు. పల్లె నిద్ర, రచ్చబండ పేరుతో ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆమెలోని నిఖార్సయిన రాజకీయ నాయకురాలికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బాబాయ్ బాగున్నావా..? అవ్వా ఆరోగ్యం ఎలా ఉంది..? పిల్లలూ బడికెళ్లి చదువుకుంటున్నారా..? అమ్మా.. పింఛన్ అందుతోందా..? జిల్లా ప్రథమ పౌరురాలు సాధారణ పల్లెవాసులతో మాట కలుపుతున్న పద్ధతి ఇది. జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ చేపడుతున్న పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమంలో ఇలాంటి ఆప్యాయమైన పలకరింపులు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇంతవరకు ఏ మహిళా నేత చేపట్టని ఈ వినూత్న కార్యక్రమం ప్రజల మన్ననలను అందుకుంటోంది. పేరు ఒకలా తీరు మరోలా కాకుండా పల్లె నిద్ర అంటే అచ్చంగా అదే పల్లెలో నిద్రిస్తూ.. రచ్చబండపై ముఖాముఖి మాట్లాడుతూ ఆమె ఆదర్శప్రాయంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు జిల్లా ప్రథమ పౌరురాలు పిరియా విజయ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తన హోదాని పక్కన పెట్టి ఒక సాధారణ మహిళగా గ్రామస్తులతో కలిసిపోతున్నారు. సొంత మనిషిగా మెలిగి లోటుపాట్లను తెలుసుకుంటున్నారు. గ్రామస్తులతో ముఖాముఖీ తర్వాత రాత్రి బస చేసి గ్రామాల పరిస్థితులను చూస్తున్నారు. రోజంతా గ్రామంలోనే ఉండి అక్కడి స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సమస్యలు తెలుసుకుని, సంక్షేమాలను వివరించి వారితో మమేకమవుతున్నారు. కార్యక్రమం జరుగుతోందిలా.. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సెపె్టంబర్ 30వ తేదీ నుంచి సోంపేట మండలం ఉప్పలాం సచివాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలను జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అమలు చేయడం ప్రారంభించారు. ►సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సంబంధిత గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందించినవి తెలియజేస్తూ, వారికి ఇంకేం కావాలో తెలుసుకొనే ప్రయత్నం చేసి, వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చూపిస్తున్నారు. ►రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామస్తులు, మహిళలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకొని, వాటిని అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ►తర్వాత ఆ గ్రామస్తులతోనే రాత్రి భోజనం చేసి, అక్కడే పల్లెనిద్ర చేస్తున్నారు. ►మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచి, మహిళలతో టీ తాగుతూ వారితో రచ్చబండపై సమావేశమవుతున్నారు. ►గ్రామంలో అందుబాటులో ఉన్న టిఫిన్ చేసి మళ్లీ ఉదయం 7 గంటలకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, మిగతా ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్, గ్రామస్తులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముందురోజు మిగిలిపోయిన గడపలను తిరిగేలా మరుసటి రోజు ఉదయం 11గంటల వరకు నిర్వహిస్తున్నారు. 9 గ్రామాల్లో పల్లెనిద్ర, రచ్చబండ.. ► ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సెపె్టంబర్ 30వ తేదీన సోంపేట మండలం ఉప్పలాం గ్రామంలో ప్రారంభించిన పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను ఇప్పటి వరకు 9 చోట్ల నిర్వహించారు. ►నియోజకవర్గంలోని ఉప్పలాం, బట్టిగళ్లూరు, గొల్లవూరు, శాసనాం, మామిడిపల్లి–1, మామిడిపల్లి–2, ఇచ్ఛాపురం మండలం డొంకూరు, అరకభద్ర గ్రామాలు, కవిటి మండలం భైరిపురం గ్రామాల్లో చేపట్టారు. వేలాది గడపలను సందర్శించారు. వందలాది సమస్యలను స్వీకరించారు. ► సోంపేట మండలం ఉప్పలాంలో 110, గొల్లవూరులో 20, టి.శాసనం పంచాయతీలో 10, మామిడిపల్లి పంచాయతీలో 30, కవిటి మండలం బైరీపురంలో 20, ఇచ్ఛాపురం మండలం టి.బరంపురంలో 10, అరకభద్రలో 10, డొంకూరులో 10 వినతులను స్వీకరించారు. ►వచ్చిన అర్జీల్లో చాలా వరకు హౌసింగ్, రేషన్‌కార్డు, డ్రైనేజీ తాగునీటి, రోడ్లు తదితరమైనవి ఉన్నాయి. ఇవన్నీ వెంటనే పరిష్కరించదగ్గ వినతులే కావడంతో అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతున్నారు. పరిష్కారాలను చూపుతూ ప్రజలతో మమేకమవుతున్నారు పిరియా విజయ. -
ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు..
-
చెప్పింది తప్పకుండా చేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు
-
శ్రీకాకుళం మత్స్యకారులకు దేవుడు వైఎస్..!
-
శ్రీకాకుళం: భారీ అగ్నిప్రమాదం.. రూ.6కోట్ల నష్టం!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాతపట్నంలోని ఓ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా ఫైర్ సిబ్బంది శ్రమించి.. మంటల్ని చల్లార్చారు. పాత పట్నంలోని స్నేహ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. రెండు అంతస్తుల్లోని వస్త్రాలు అగ్నికి ఆహుతి కాగా.. రూ. 6 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. #WATCH | Andhra Pradesh | Fire breaks out in a shopping mall in Pathapatnam, of Srikakulam district due to an electrical short circuit. Fire engines have reached the spot to put out the fire. Details awaited. pic.twitter.com/dx7GhFJNzr — ANI (@ANI) August 30, 2023 -
ఇదే కదా సుపరిపాలన అంటే..: కొమ్మినేని
సాక్షి, శ్రీకాకుళం: తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవుతుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్.మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో “సుపరిపాలన దిశగా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం” అంశంపై అవర్ స్టేట్ అవర్ లీడర్, వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఆధ్వర్యం లో మంగళవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ అవసరాల కోసం ఎవరి దయాదాక్షిణ్యాలు కోసం యాచించాల్సిన అవసరం లేని వ్యవస్థను ప్రభుత్వంలో ప్రవేశపెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు సుపరిపాలనలో భాగమన్నారు. గతంలో రైతులు వ్యవసాయ ఇన్ పుట్స్ కోసం ధర్నాలు, ఆందోళనలు చేసేవారని, ఆ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చిందన్నారు. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లకోసం మండల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి ఇంటికే వచ్చే ఏర్పాటు విజయవంతంగా అమలు అవుతోన్నదన్నారు. ఇదే సుపరిపాలన అంటేనని తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి జరగడం లేదన్న వాదన సరికాదన్నారు. విశాఖలో అదానీ డేటా సెంటరు, భోగాపురం విమానాశ్రయం, రామాయపట్నం, మచిలీపట్నంలో పోర్టులు వంటి వి అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్దానం లో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మానవతా థృక్పధానికి నిదర్శనమని కొనియాడారు. శ్రీ శ్రీ, గురజాడ, గరిమెళ్ళ, వంగపండు, వంటి ఉత్తరాంధ్ర కవులను, వ్యావహారిక భాషా వేత్త గిడుగు రామ్మూర్తిని, కాళీపట్నం రామారావును ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. తమ ప్రసంగంలో ఆద్యంతం సుపరిపాలన పై విద్యార్థులు ప్రతి స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. నిమ్మ వెంకట రావు మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రవేశ పెట్టిన “నవరత్నాల” పథకంలో మహాత్మా గాంధీ, జ్యోతిబా ఫూలే, ఆర్ధిక వేత్త అమర్త్య సేన్ ల సిద్ధాంతాలు యిమిడి వున్నాయన్నారు. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు వారి ఇంటివద్దనే, ఒకటో తేదీనే అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం వారికి పేదలు, నిస్సహయుల పట్ల వున్న అనుకూల ధృక్పధాన్ని మనం తెలుసు కోవచ్చన్నారు. చదవండి: అమ్ముడుపోను.. చావుకు భయపడను: పోసాని విద్యకు వృత్తి పరమైన నైపుణ్యాన్నిజోడించడంద్వారా ఉన్నత విద్య అనంతరం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచిందన్నారు. ఆర్ధిక పరమైన అన్ని అంశాలను మహిళలకు కేటాయించడం ద్వారా వారి సాధికారితకు నిజమైన నిర్వచనాన్నిఇచ్చారన్నారు. తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లితండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా విద్యా సంస్థలపై తల్లులకుప్రశ్నించే అధికారాన్ని కల్పించారని ఆయన పేర్కొన్నారు ఇదంతా సుపరిపాలనలో భాగమని ఆయన తెలిపారు. పరిపాలన అందరికీ ఉపయోగంగా, ఉపయుక్తంగా వుండాలని అందుకు నిదర్శనంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్సిటి రిటైర్డ్ వీసీ వి.బాల మోహన్‌దాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు పథకాలు అందజేయడంలో తండ్రి కి మించిన తనయుడు సీఎం జగన్ అని కొనియాడారు. విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రవేశపెట్టిన విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీయ విద్యా దీవెనలకు సంబంధించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అవర్ స్టేట్ అవర్ లీడర్ వైఎస్సార్ ఇంటలెక్చరర్ ఫోరమ్ చైర్మన్ జి. శాంతమూర్తి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ బి.అర్ధయ్య, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉదయభాస్కర్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. రాజేష్, సి.హెచ్. కృష్ణారావు, డా. సి.హెచ్. రాజశేఖర్, ఇ. కామరాజు, పొన్నాల వెంకట లక్ష్మణరావు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుంటే
సీతంపేట/బూర్జ(శ్రీకాకుళం): సీతంపేట ఏజెన్సీలోని గొయిది గ్రామ సమీపంలో సోమవారం ఓ బైక్, ఆటో ఢీనండంతో జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం గుత్తవల్లికి చెందిన పైడి వసంతకుమారి (17) మృతి చెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గుత్తవల్లి పక్కగ్రామానికి చెందిన యువకుడు కూన వెంకటేష్, వసంతకుమారి బైక్‌పై సీతంపేట వచ్చారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై ఇద్దరూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో గాయాలపాలవగా యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇద్దరినీ 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడు వెంకటేష్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, సత్యనారాయణ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.నీలకంఠరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
శ్రీకాకుళం జిల్లా వంశధార పర్యటనలో చంద్రబాబుకు నిరసన సెగ
-
గౌతు శిరీష అహమే శత్రువా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తన కోపమే తన శత్రువని అంటారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీషకు మాత్రం తన అహమే తన శత్రువవుతోంది. ప్రత్యర్థి నేతలతో పాటు స్వపక్ష నాయకులతోనూ వైరం పెంచుకుంటున్న ఆమె వింత వైఖరి అసమ్మతి సెగ రేపుతోంది. ఇంటా బయటా నాయకులు తనకంటే సీనియర్స్ కావడంతో ఆమె తట్టుకోలేకపోతున్నారు. అరవై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తన కుటుంబానికి ఇన్నాళ్లూ అండగా ఉన్న నేతలే తనకు అడ్డు తగులుతారేమో అన్న అభద్రతా భావంలో ఉన్నారు. తాతతండ్రుల చరిత్రలు చెబుతూ నిత్యం అహంతో వ్యవహరించడం తప్ప సొంత ముద్ర వేసుకోలేక సతమతమవుతున్నారు.వాస్తవానికి సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలిగా పెత్తనం చెలాయించడం తప్ప గౌతు శిరీష పేరు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. గౌతు శ్యామసుందర్ శివాజీ రాజకీయంగా కనుమరుగు అవుతుండటంతో వారసత్వ రాజకీయాల్లో భాగంగా ఆమె తెరపైకి వచ్చారు. వారసత్వ రాజకీ యం సిక్కోలుకు కొత్త కాకపోయినా.. విశాఖపట్నంలో ఉండి ఇక్కడ రాజకీయాలు చేసి గద్దెనెక్కాలనే ఆమె ఆలోచన ఎవరికీ నచ్చడం లేదు. ప్రతి విషయంలో డబ్బును, బ్యాగ్రౌండ్‌ను చెప్పుకోవడం, ఏ మండలంలో ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియకపోవడం, ప్రజల మన్ననలతో కాకుండా వారసత్వం పేరుతో పెత్తనం చెలాయించాలన్న ఆలోచన ఇప్పుడామె కొంప ముంచుతోంది. ఇంతవరకు కుటుంబానికి అండగా నిలిచిన నాయకులే ఇప్పుడు ఎదురుతిరిగే పరిస్థితి ఏర్పడింది.అధికార పార్టీ నాయకులపైన విమర్శలు, ఆరోపణలు చేస్తే అది రాజకీయం అనుకోవచ్చు. కానీ ఉన్నవీ లేనివీ మాట్లాడి నోరు పారేసుకోవడం వల్ల ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె ప్రతిష్ట మసకబారిపోయింది. అది చాలదన్నట్టు సొంత పార్టీ నేతలను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రానున్న ఎన్నికల్లో ఎక్కడ టిక్కెట్‌కు పోటీ పడతారేమోనన్న అభద్రతా భావంతో స్వపక్షంలోనే నాయకులతో వైరం పెట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి తనకు తప్ప ఎవ్వరికీ ఎమ్మెల్యే సీటు దక్కకూడదనే ఉద్దేశంతో పారీ్టలో ఎదగాల్సిన నాయకులను వెనక్కు నెట్టేందుకే ప్రయ తి్నస్తున్నారు. ఇన్‌కంటాక్స్‌లో ఆఫీసర్‌గా పనిచేసి వచ్చిన ఉద్దాన వాసి జుత్తు తాతారావు ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించడంతో ఆయనతో విభేదాలు పెట్టుకుని ఆయన పారీ్టకి దూరంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. తాజాగా పలాస–కాశీబుగ్గ మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావుకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ కోసం పోటీ పడతారన్న ఉద్దేశంతో ఆయన్ని అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి చిన్న విషయంలో వజ్జ బాబురావు అండ్‌కోపై చిర్రుబుర్రులాడుతున్నారు. సొంత పార్టీ నాయకుల సీనియారిటీని సైతం విస్మరించి తన చెప్పుచేతుల్లో ఉండేలా హకుం జారీ చేస్తున్నారు. ఇటీవల శిరీష రాకుండా ఆఫ్‌షోర్ ప్రాజెక్టు చూసేందుకు ప్రతిపక్ష పాత్రలో వెళ్లారంటూ వజ్జపై రుసరుసలాడారు. చెప్పాలంటే వజ్జ బాబూరావును అవమాన పరిచేలా పలు సందర్భాల్లో వ్యవహరించారు. సీనియర్ అయినప్పటికీ తన వెనుక ఉండాలే గానీ తన మాట దాటొద్దంటూ ఆంక్షలు విధించారు. వజ్జ బాబూరావుకు ఏ ఒక్కరు జై కొట్టినా సహించలేకపోతున్నారు. దీంతో శిరీషకు సహజంగానే అసమ్మతి పోరు మొదలైంది. వజ్జ బాబూరావు వర్గీయులంతా ఇప్పుడామెపై గుర్రుగా ఉన్నారు. విశాఖలో ఉండి, పార్టీ పిలుపు సమయంలో ఇక్కడికొచ్చి కార్యక్రమాలు చేపట్టి, తర్వాత వెళ్లిపోయి కేడర్‌ను గాలికొదిలేసిన శిరీష వెంట ఎలా ఉండగలమని వ్యతిరేక వర్గమంతా బాహాటంగానే నిరసన గళం విప్పుతున్నారు. ఆ స్వరం రోజురోజుకీ ఎక్కువై నియోజకవర్గంలో టీడీపీ వర్గాలుగా చీలిపోయింది. -
దొంగల తెలివి మామూలుగా లేదు.. 3 రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేశారు..
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో దొంగిలించిన బైక్ రూపు రేఖలు మార్చి మూడు రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేసిన ఘటన పలాసలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బైక్ యజమాని తెలిపిన వివరాల మేరకు.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉదయ్‌శంకర్ పాత్రో మే 27న తన బండిని పోగొట్టుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంతగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. అక్కడకు మూడు రోజుల తర్వాత ఆగ్రాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతియాబాద్ పోలీసుల నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ వాహన తనిఖీల్లో పోలీసులకు ఓ బండి దొరికిందని, ఇంజిన్ వివరాలను పరిశీలిస్తే పలాసకు చెందిన బైక్ అని నిర్ధారణ జరిగిందని వారు చెప్పారు. అయితే ఆ వాహనం ఫొటోలు చూసి ఉదయశంకర్ పోల్చుకోలేకపోయారు. తన బండి అలా ఉండదని చెప్పేశారు. కానీ అక్కడి పోలీసులు మాత్రం ఇంజిన్ వివరాలు మీ పేరు మీదే ఉన్నాయని స్పష్టం చేశారు. ట్యాంక్ కవర్ చింపేసి, అద్దాలు తీసేసి రూపురేఖలు మార్చేశారని వివరించారు. దీంతో ఆయన వెంటనే ఫతియాబాద్ వెళ్లి వాహనాన్ని పరిశీలించి అక్కడి పోలీసులకు సీ–బుక్ చూపించడంతో వివరాలన్నీ సరిపోయాయి. దీంతో ఆయనకు ష్యూరిటీపై బైక్‌ను తిరిగి అప్పగించారు. బైక్ దొంగతనాలు చేస్తున్న దొంగలు తెలివి మీరిపోయారని, రెండు మూడు రోజుల్లోనే బైక్ రూపురేఖలు మార్చేసి లారీలు ఎక్కించి రాష్ట్రాలు దాటించేస్తున్నారని బాధితుడు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చదవండి: AP: కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ -
చేపల వేటలో నాగచైతన్య .. ఎందుకో తెలుసా?
మత్స్యకారుల జీవితం గురించి తెలుసుకునే పని మీద నాగచైతన్య శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లిన విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు ఓ సినిమా నిర్మించనున్నారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసమే టీమ్ కసరత్తులు చేస్తోంది. గురువారం శ్రీకాకుళంలోని మత్స్యకారులను స్వయంగా కలిసి, వారి సంస్కృతి, జీవనశైలిని అడిగి తెలుసుకున్నారు చైతన్య, చందు, ‘బన్నీ’ వాసు. శుక్రవారం వైజాగ్ పోర్టును సందర్శించారు. మత్స్యకారులతో కలసి చేపల వేటకు వెళ్లారు. సముద్ర ప్రయాణం, వేట, అక్కడ ఎదురయ్యే పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. -
శ్రీకాకుళంలో పర్యటించిన హీరో నాగ చైతన్య, చందు, బన్నీ వాసు (ఫొటోలు)
-
వడివడిగా మహేంద్రతనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు
-
వెళ్లిపోయావా తమ్ముడూ.. ఇంట్లోకి వెళ్లి కాటు వేసిన కట్లపాము
శ్రీకాకుళం: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. తల్లి తీవ్ర అనారోగ్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తండ్రి తాపీ పనిచేసేందుకు కొద్ది రోజుల క్రితం రాజమండ్రి వెళ్లాడు. అక్క, తమ్ముడు కలిసి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో కట్లపాము కాటు వేయడంతో తమ్ముడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన పొందూరు మండలం తోలాపిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తోలాపి ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రావాడ చిన్నయ్య, నీలవేణికి కుమార్తె రమ్య, కుమారుడు లవకుమార్(14) ఉన్నారు. లవకుమార్ తోలాపి జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నయ్య, నీలవేణి రోజువారీ కూలీలు. నీలవేణికి అనారోగ్యం కారణంగా శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ పోషణ కోసం చిన్నయ్య రెండు రోజుల క్రితం రాజమండ్రి వెళ్లాడు. దీంతో అక్క రమ్యతో కలిసి లవకుమార్ ఇంటిలో ఉంటున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గాలి తగలడం లేదని తలుపుతీసి పడుకున్నారు. ఆ సమయంలో కట్లపాము లవకుమార్‌ను కాటువేసింది. మెలకువ రావడంతో ఏదో పురుగు కుట్టిందనుకుని నిద్రలోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పాము మెడకు చుట్టినట్లు అనిపించడంతో ఒక్కసారిగా నిద్రలేచి పామును గుర్తించాడు. పామును విసిరేస్తే అక్కకు ప్రమాదం జరుగుతుందని గ్రహించి భయపడకుండా చేతితో తీసి నేలకు గట్టిగా కొట్టాడు. తర్వాత పామును కొట్టి చంపాడు. అలికిడి కావడంతో అక్క నిద్రలోనుంచి లేచింది. అప్పటికే పాము కరిచి చాలాసేపు కావడం, తమ్ముడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో బయటకు వెళ్లి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు లవకుమార్‌ను శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. అప్పటి వరకు తనతో ఉన్న తమ్ముడు పాముకాటుకు బలికావడంతో అక్క కన్నీటిపర్యంతమైంది. తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేసింది. వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ముందు రోజు వరకు రోజూ పాఠశాలకు వస్తున్న విద్యార్థి ఇక లేడని తెలిసి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి మృదేహానికి పోస్టుమార్టం చేయించారు. -
ఇదో రాకాసి మీనం: వలను చించేస్తూ.. భూమిని చీలుస్తూ!
చిత్రంలో మీరు చూస్తున్నది చేపే. కానీ ఇది కొంచెం వైల్డ్. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రచెరువులో బుధవారం దర్శనమిచ్చింది. మామూలు చేపలతో పోలిస్తే విభిన్నంగా కనిపించడంతో ప్రజలు దీనిని చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ చేప కోసం పరిశోధకుల్ని సంప్రదిస్తే వారు బోలెడు విషయాల్ని వివరించారు. – కాశీబుగ్గ ఇదీ చేప కథ.. శాస్త్రీయ నామం: టెరిగో ఫ్లిక్తీస్ పరదాలిస్ వ్యవహారిక నామం: అమెజాన్ అంటుబిల్ల.. సెయిల్ ఫిన్ క్యాట్ ఫిష్ నీటి అడుగు భాగంలో బొరియలు చేస్తాయి. తద్వారా జీవవైవిధ్యం దెబ్బతింటుంది. మత్స్యకారుల వలలను తమ శరీర భాగాలతో చించేస్తాయి. ఈ చేపల్ని పక్షులు ఆరగిస్తే వాటి ఆహార నాళం చిరిగిపోయి మరణిస్తాయి. ఇది విదేశాలకు చెందినది. అక్వేరియంలో పెంచేందుకు దీనిని గతంలో భారత్‌కు తీసుకొచ్చారు. అక్వేరియంలో ఉండే నాచు పదార్థాన్ని తిని శుభ్రపరచడం దీని ప్రత్యేకత. నీరు లేకపోయినా ఎక్కువ సేపు బయట బతకగలగడం మరో ప్రత్యేకత. మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, వెస్ట్‌బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇవి కనిపిస్తాయని జీవ వైవిధ్య శాస్త్రవేత డాక్టర్ కర్రిరామారావు ‘సాక్షి’కి వివరించారు. 2014లో దీనిని తెలంగాణలో తొలిసారి గుర్తించినట్లు ఆయన తెలిపారు. -
కత్తులు దూస్తున్నారు...ఇదేం ఖర్మ సారూ..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీలో అంతర్గత పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. తాడోపేడో తేల్చుకోవడానికి ఇరువర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. అంతు చూస్తాం.. హతమారుస్తాం అనే వరకు వెళ్లిపోయారు. ఆ మధ్య ‘ఇదేం ఖర్మ’ నిర్వహించే విషయంలో విభేదాలొచ్చి పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. తాజాగా ఫ్లెక్సీల విషయంలో పోలీసులను ఆశ్రయించారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లడంతో ఇదేం కర్మ అని అటు నియోజకవర్గ ప్రజలు, ఇటు పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. సాధారణంగా పార్టీలో అసమ్మతి చెలరేగితే పార్టీ అధిష్టానం సర్ధి చెప్పాలి. కానీ, శ్రీకాకుళం టీడీపీ నేతల పోరును పోలీసుస్టేషన్లో పంచాయితీ చేయాల్సి రావడం గమనార్హం. ఎన్నాళ్లీ ఊడిగం.. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దంపతులు, గొండు శంకర్ వర్గీయుల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. కాలం చెల్లిన నేతలు ఇంకెంత కాలం నాయకత్వం వహిస్తారని, ఎన్నాళ్లు వారికి ఊడిగం చేయాలని గొండు శంకర్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే సీటు లక్ష్మీదేవికి ఇవ్వొద్దని, తమకే కేటాయించాలని గొండు శంకర్ వర్గీయులు డిమాండ్ చేయడమే కాకుండా అధిష్టానం దూతలను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అంతు చూస్తామంటూ వార్నింగ్‌లు కూడా ఇచ్చుకుంటున్నారు. తాజాగా ఫ్లెక్సీల గొడవ.. గొండు శంకర్ పుట్టిన రోజు సందర్భంగా గారలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని గుండ లక్ష్మీదేవి వర్గీయులు పట్టపగలే చించేసి తొలగించారు. తోటి కార్యకర్తలు చూస్తుండగానే లక్ష్మీదేవి అనుచరులైన మండల పార్టీ కార్యదర్శి జల్లు రాజీవ్, శ్రీకూర్మం మాజీ ఎంపీటీసీ కైబాడీ రాజులు కలిసి గొండు శంకర్ ఫ్లెక్సీలు చించేయడమే కాకుండా లక్ష్మీదేవికి వ్యతిరేకంగా పనిచేసే వారికి బుద్ధి చెబుతామని, ఏమాత్రం మర్యాద లేకుండా వ్యవహరిస్తామని హెచ్చరించారు. దీంతో గొండు శంకర్ వర్గీయులు ఘాటుగా స్పందించారు. మేమేంటో తేల్చుతామని అంటూనే గార పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొండు శంకర్ వర్గీయులైన గార మాజీ సర్పంచ్ బడకల వెంకట అప్పారావు, పీహెచ్సీ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ రమణమూర్తి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. తమాషా చూస్తున్న అధిష్టానం.. నేతల మధ్య తారస్థాయికి విభేదాలు చేరడంతో అక్కడి టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. వీరి మధ్య గొడవతో ఎవరికి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా అధినేతల డైరెక్షన్లో జరుగుతోంది. గొండు శంకర్ వర్గీయులకు అండగా కింజరాపు అచ్చెన్నాయుడు, గుండ లక్ష్మీదేవికి అండగా కళా వెంకటరావు ద్వారా నారా లోకేష్ అండదండలుండటంతో ఎవరికి వారే బరి తెగించి ‘ఫైటింగ్’ చేసుకోవడానికి సిద్ధమవుతున్నా రు. ఎక్కడైనా పార్టీలో విభేదాలుంటే అధిష్టానం చొరవచూపి పరిష్కరించాలి. ఇక్కడ మాత్రం అధిష్టానం పెద్దలే వెనకుండి తమాషా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి వారికున్న భయాలకు రక్షణ కల్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నారు. దీన్నిబట్టి శ్రీకాకుళం టీడీపీ గొడవలు ఏ స్థాయికి వెళ్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏదో ఒక రోజు కేడర్ ప్రాణాలకు ముప్పు వచ్చే ప్రమాదం ఉందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. వీరి వల్ల నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతోంది. అసాంఘిక శక్తుల మాదిరి వ్యవహరిస్తుండటంతో ప్రజలకు కూడా ఇబ్బందికరంగా పరిణమించింది. గతంలోనూ ఇదే పరిస్థితి.. గార మండలం అంపోలు పంచాయతీలో ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సన్నద్ధమవ్వగా, ఇక్కడ చేయడానికి వీల్లేదని గొండు శంకర్ వర్గీయులు అడ్డు తగిలారు. లక్ష్మీదేవి అనుచరుడు వెలమల శ్రీనివాసరావు నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించగా, గొండు శంకర్ అనుచరులైన మూర్తి, అచ్యుతరావులు అడ్డుకునేందుకు యత్నించారు. ఫోన్, వాట్సాప్ ద్వారా ఎవరు అడ్డుకుంటారో చూస్తామని లక్ష్మీదేవి వర్గం, ఎవరొచ్చి నిర్వహిస్తారో చూస్తామని గొండు శంకర్ వర్గీయులు వాదించుకున్నారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన వారిని మరో వర్గానికి చెందిన నాయకులు ఇటీవల జరిగిన రామశేషు హత్య మాదిరిగా హతమార్చేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో అంపోలులో పార్టీ కార్యక్రమానికి బందోబస్తు కావాలని, తమను అడ్డుకోవడానికి గొండు శంకర్ వర్గీయులు ప్రయత్నిస్తున్నారని లక్ష్మీదేవి వర్గం శ్రీకాకుళం రూరల్ సీఐకు ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్‌గా గొండు శంకర్ వర్గీయులు ఫిర్యాదు చేశారు. లక్ష్మీదేవి తమను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాస్త సీరియస్‌గానే స్పందించారు. పార్టీ కార్యక్ర మం నిర్వహించుకుంటే ఫర్వాలేదని, గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
'363 బీచ్‌లు' కోస్తా తీరానికి కొత్త అందాలు
సాక్షి, అమరావతి: బీచ్ పర్యాటకంతో కోస్తా తీరానికి కొత్త కళ చేకూరనుంది. 12 జిల్లాల్లో కోస్తా తీరం వెంట 363 బీచ్‌లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిషరీస్ యూనివర్సిటీ, పర్యాటక శాఖ, మత్స్యశాఖలతో కూడిన 11 బృందాలు కోస్తా తీరం వెంట సర్వే చేసి ఎక్కడెక్కడ బీచ్‌లను అభివృద్ధి చేయవచ్చో గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో కోస్టల్ జోన్ టూరిజం పేరుతో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తారు. చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా పర్యావరణానికి అనుకూలంగా బీచ్‌లను తీర్చిదిద్దనున్నారు. కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ చట్ట ప్రకారం బీచ్‌లకు అనుమతి కోసం పర్యాటక శాఖ కలెక్టర్లకు నివేదిక పంపించింది. బీచ్‌ల అభివృద్ధిపై ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు.మత్స్యకారులతో పాటు టూరిజం ఆపరేటర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి బీచ్‌లను ఖరారు చేసి పర్యాటక అథారిటీకి వివరాలు పంపాలని సూచించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో67 బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ♦ మంగినపూడి (కృష్ణా జిల్లా) ♦ పేరుపాలెం, మొల్లపర్రు (పశ్చిమ గోదావరి జిల్లా) ♦ కాకినాడ (కాకినాడ జిల్లా) ♦ మైపాడు (నెల్లూరు జిల్లా) ♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా) ♦ చింతలమోరి (బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే..? బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే 33 ప్రమాణాల ఆధారంగా ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ బీచ్‌లను పరిశీలించి ధృవీకరిస్తుంది. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, నిర్వహణ, భద్రత, సేవలు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బీచ్‌లు పరిశుభ్రంగా ఉండాలి. సందర్శకులకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారుల కమిటీ, విశేషాలను వివరించేందుకు సిబ్బంది ఉండాలి. రుషికొండ తరహాలో 8 బ్లూఫ్లాగ్ బీచ్‌లు విశాఖలోని రుషికొండ తరహాలో మరో ఎనిమిది బ్లూ ఫ్లాగ్ బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మౌలిక వసతులను కల్పించేందుకు భూ కేటాయింపు ప్రతిపాదనలను సీసీఎల్ఏకు పంపాలని సీఎస్ ఆదేశించారు. దేశంలో 10 బ్లూ ఫాగ్ బీచ్లుండగా అందులో రుషికొండ చోటు సాధించింది. కోస్టల్ జోన్ రెగ్యులేషన్‌కు అనుగుణంగా బీచ్‌ల అభివృద్ధి: కన్నబాబు కేంద్రం 2019లో విడుదల చేసిన కోస్టల్ జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ ప్రకారం బీచ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైనట్లు చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి రాగానే పనులు చేపడతామన్నారు. స్థానికులకు ఉపాధితో పాటు సేవల రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. -
అక్కడ దేవుడికి నైవేద్యంగా రాళ్లే పెడతారు! ఎందుకంటే.
మన హిందూ దేవాలయాల్లో ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చాలామంది భక్తులు కూడా ఆ దేవాలయ ప్రసాదాలంటే చాలా ఇష్టపడతారు కూడా. అందుకోసం గుడికి వచ్చేవాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. ఈ దేవాలయంలో దేవుడికి రాళ్లనే నైవేద్యంగా పెడతారట. పైగా అలా చేస్తే అనుకున్న పని ఎలాంటి ఆటంకం లేకుండా అయిపోతుందని అక్కడ వారి నమ్మకం. వివరాల్లోకెళ్తే..శ్రీకాకుళం జిల్లా షేర్ మహ్మద్‌పురం గ్రామంలో ఈ వింత ఆచారం నెలకొంది. అక్కడ గ్రామస్తులు దేవుడికి నైవేద్యంగా ఏదోఒక రాయిని సమర్పిస్తారు. ఇది కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు స్థానికులు. వాళ్లు ఆ దేవుడిని 'వీరుడి తాతగా' కొలుస్తారు. నిజానికి అక్కడ దేవాలయం గానీ దేవుని విగ్రహం కానీ ఉండదు. అక్కడ గుట్టగా.. భక్తులు నైవేద్యంగా సమర్పించిన రాళ్లు మాత్రమే కనిపిస్తాయి. అక్కడే సమీపంలో ఉండే వేపచెట్టునే దేవుడిగా పూజిస్తారు. ఈ దేవుడిని వీరుడి తాతగా పిలుస్తుంటారు. ఆ ప్రాంతంలో కుమ్మరి వాళ్లు ఉండేవారని, ఈ గ్రామంలో జరిగే పెళ్లిళ్లకు కుండలు తయారు చేసి పెద్ద ఊరేగింపుగా వచ్చి ఈ ప్రాంతంలో ఉండేవారని చెబుతున్నారు. ఆ తర్వాత క్రమేణ ఆ ప్రాంతాన్ని వీరుడి తాతగా కొలవడం ప్రారంభించారు. ఆ దారి వెంబడి వెళ్తూ ఆ స్వామికి ఏదో ఒక రాయిని సమర్పించి వెళ్తే తక్షణమే పని అవుతుందని వారి ప్రగాఢ నమ్మకం. అది కేవలం ఆ ఊరికి మాత్రమే పరిమితం కాలేదు. చుట్టు పక్కడ గ్రామస్తులు సైతం ఇక్కడకు వచ్చి రాళ్లను సమర్పిస్తుంటారు. ఈ ప్రదేశం సరిగ్గా ప్రధాన రహదారికి పక్కనే ఉంది. అత్యంత విలువైన ఈ ప్రదేశం పక్కన ఉన్న కొంత జాగా(నాలుగుసెంట్లు భూమిని) ఆ దేవుడి కోసం గ్రామస్తులు వదిలేశారు. ఈ ప్రదేశంలోనే పెళ్లిళ్లు కూడా చేసుకుంటారని చెబుతున్నారు అక్కడి గ్రామస్తులు. వినడానికి నమ్మశక్యం కాని విధంగా వింతగా ఉంది కదూ ఈ ఆచారం. ఏదీఏమైన మనిషి నమ్మకమే దేవుడు అని మరోసారి ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది. (చదవండి: యావత్తు సృష్టిని ఒక్క గంటలో సృష్టించి..'స్త్రీ మూర్తి'ని మాత్రం ఏకంగా అన్ని రోజులా?) -
తప్పు చేసింది టీడీపీ హయాంలో.. విషం వీరిపైనా!
సమస్య ఏర్పడింది టీడీపీ ప్రభుత్వ హయాంలో. తప్పు చేసింది ఆనాటి పాలకులు. కానీ సిరా నిండా విషాన్ని నింపుకున్న ఈనాడు మాత్రం నాటి ప్రభుత్వ ప్రస్తావన లేకుండానే భూ సమస్యలంటూ కథనాన్ని అచ్చేసింది. భావనపాడు, దేవునల్తాడ, మర్రిపాడు గ్రామాల్లో ఇదే తరహా సమస్యలను పరిష్కరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నౌపడలోనూ అందుకు రంగం సిద్ధం చేస్తూ ఉంటే.. అంతలోనే వింత వాదనను జనంపైకి రుద్దే ప్రయత్నం చేసింది. నౌపడలో భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయంటూ అసలు దొంగలను దాచేసి విషపు రాతలను జనం ఇంటికి పంపించింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: భూకుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టీడీపీ అమరావతి తరహాలోనే మన జిల్లాలోనూ తన ప్రతాపం చూపించేందుకు విఫలయత్నం చేసింది. 2015 సంవత్సరంలో భావనపాడు పోర్టు పేరుతో వేలాది ఎకరాలు కొట్టేయాలని ప్లాన్ వేసింది. అందులో భాగంగా 2015 ఆగస్టు 28వ తేదీన భావనపాడు పోర్టు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి 5798.02 ఎకరాల భూములను నిషేధిత ఖాతాలోకి మళ్లించింది. దీంతో భావనపాడు, మర్రిపాడు, దేవునల్తాడ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూక్రయవిక్రయాలు జరక్క ఇక్కట్లు పడ్డారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి అసలు విషయాన్ని తెలుసుకుని 2022 అక్టోబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆ భూములకు విముక్తి కలిగించారు. నౌపడ పంచాయతీ గ్రామ కంఠంలోని 35 ఎకరాల భూమిని కూడా టీడీపీ ప్రభుత్వంలో 2017 జూలైలో నిషేధిత ఖాతాలోకి మళ్లించారు. 418–1లో 2 ఎకరాలు, 418–2లో 33 ఎకరాలు గ్రామకంఠంలో ఉన్నాయి. కానీ వీటిని నిషేధిత ఖాతాలో పెట్టేశారు. భావనపాడు పోర్టుకు కేంద్ర బిందువు నౌపడ కావడం వల్ల ఇక్కడ భూమి రేట్లు విపరీతంగా పెరగడంతో అమ్మకం.. కొనుగోలు జరగకుండా టీడీపీ నేత వ్యూహాత్మకంగా దేవదాయ శాఖ భూముల పర్యవేక్షణ పేరుతో వీటిపై ఆంక్షలు విధించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తూ ఉంది. కానీ పచ్చ పత్రిక ‘ఈనాడు’ అంతలోనే రోత పుట్టించే కథనాన్ని వండి వార్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విషం చిమ్మింది. నాటి అవినీతి మకిలిని ఇప్పటి ప్రభుత్వానికి అంటించే ప్రయత్నం చేసింది. భూములకు సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రైతులు, పేదల పక్షాన నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లింది. వాస్తవంగా గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో పెట్టిన భావనపాడు, మర్రిపాడు, దేవునల్తాడ భూ సమస్యను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిష్కరించింది. నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతులకు సర్వహక్కులు కల్పించింది. దీంతో ఆ రైతులు ఆనందంతో ఉన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో నిషేధిత జాబితాలోకి వెళ్లిన నౌపడ గ్రామకంఠం భూముల సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఉన్న ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. ఆ క్రమంలోనే ఇక్కడి సమస్యను కూడా పరిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందన్నట్టుగా ఈనాడు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సమస్య పరిష్కరిస్తాం నౌపడ గ్రామంలో గ్రామకంఠం సర్వే నంబర్లపై భూములను దేవదాయ అఽధికారుల సమక్షంలో సబ్ డివిజన్ చేస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. – చలమయ్య, తహసీల్దార్, సంతబొమ్మాళి. ఇబ్బందులు పడ్డాం భావనపాడు పోర్టుతో పేరుతో 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 5798 ఎకరాల రైతుల భూమిని నిషేధిత ఖాతాలో పెట్టింది. చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడ్డాం. భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయి. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడుకు రైతులంతా విన్నవించినా పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విముక్తి కలిగింది. – బి. మోహన్ రెడ్డి, సర్పంచ్ భావనపాడు. స్పందనలో ఫిర్యాదు చేశాక.. నౌపడలో నాకు ఇళ్లకు సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయి. దీంతో రుణం కోసం బ్యాంకుకు వెళితే స్థలం నిషేధిత ఖాతాలో ఉందని చెప్పారు. రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో స్పందనలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశాను. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఈ భూములను నిషేధిత ఖాతాలో చేర్చిందని అధికారుల ద్వారా తెలిసింది. – పరపటి మురళీ, నౌపడ -
అరసవల్లిలో అద్భుతం
-
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
టెక్కలి రూరల్: విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలుకు టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ రైల్వే గేటు వద్ద పెనుప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం గూడ్స్ రైలు విశాఖపట్నం నుంచి నౌపడా మీదుగా భువనేశ్వర్ వైపు వెళ్తుండగా ఆ సమాచారం తెలియని గేట్‌మ్యాన్ గేటు వెయలేదు. ఈ విషయాన్ని గుర్తించిన గూడ్స్ డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. హారన్ వేయడంతో అప్రమత్తమైన గేట్ మ్యాన్ హుటాహూటిన గేటు వేశారు. దీంతో రైలు అక్కడి నుంచి వెళ్లింది. గూడ్స్ డ్రైవర్ గుర్తించకపోతే పెనుప్రమాదం జరిగి ఉండేదని వాహనదారులు చెబుతున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
శ్రీకాకుళం: మండలంలోని బొడ్డవర వద్ద గూడ్స్ రైలు ఆదివారం సాయంత్రం పట్టాలు తప్పింది. కిరండూల్ నుంచి విశాఖకు ఐరన్ ఓర్‌తో వస్తున్న గూడ్స్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో 20 కి.మీ వేగంతో రావాల్సిన రైలు 40 కి.మీ వేగంతో రావడం ప్రమాదానికి కారణం కావచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. వరుస గా ఉన్న నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పగా మధ్యలో రెండు మినహా తరువాత మరో రెండు వ్యాగన్లు మొత్తంగా ఆరు వ్యాగన్లు పట్టాలు తప్పా యి. ఐరన్ ఓర్ సమాంతరంగా వేయకపోవడం ప్రమాదానికి ఒక కారణం కావచ్చని భావిస్తున్నా రు. సోమవారం నాటికి ట్రాక్ పునరుద్ధరణ పను లు పూర్తవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. -
AP: దిగులు లేదిక.. ఉద్దానం చెంతకు ఆధునిక వైద్యం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా మందస మండలం లింబుగం గ్రామస్తుడైన తెవ్వయ్య ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటున్నాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లాలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ కిడ్నీ వ్యాధులకు సరైన చికిత్స అందుబాటులో ఉండేది కాదు. దీంతో చికిత్స కోసం విశాఖకు వెళ్లేవాడు. సహాయకునితో కలిసి ఒక్కసారి విశాఖకు వెళ్లి రావాలంటే రవాణా, ఇతర ఖర్చుల రూపంలో రూ.వేలల్లో ఖర్చు అయ్యేది. చాలీచాలని పింఛన్, భార్య కూలిపనులకు వెళితే వచ్చే డబ్బుతో మందుల కొనుగోలు.. వెరసి వైద్యం చేయించుకోవడం తలకు మించిన భారంగా మారింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లింబుగంకు మూడు కి.మీ దూరంలోని హరిపురం సీహెచ్‌సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. డయాలసిస్‌కు వెళ్లాల్సిన రోజు 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటి వద్దకే వచ్చి తెవ్వయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లేది. నెఫ్రాలజిస్ట్ సమీపంలోని హరిపురం ఆస్పత్రికి షెడ్యూల్ ప్రకారం వస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యం అందుతోంది. మరోవైపు సీఎం జగన్ ఇతని పింఛన్‌ను రూ.10 వేలకు పెంచారు. వీటన్నింటికీ తోడు ఇప్పుడు త్వరలో పలాసలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో తెవ్వయ్య మాట్లాడుతూ ‘నా లాగా మహమ్మారి జబ్బుతో బాధపడుతున్న వారికి సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పింఛన్ రూ.10 వేలకు పెంపుతో ఆర్థికంగా అండగా నిలివడమే కాకుండా, మా ఊళ్లకు శుద్ధి చేసిన నీటిని అందించడానికి చర్యలు తీసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని మాకు చేరువ చేశారు. ఇంతకంటే మాకేం కావాలి?’ అని ఆనందపడ్డాడు. ప్రభుత్వ చర్యల కారణంగా ఉద్దానం ప్రాంతంలో ఇలా ఎంతో మంది కిడ్నీ బాధితులకు ఊరట లభిస్తోంది. అత్యాధునిక ఆస్పత్రితో భరోసా కిడ్నీ వ్యాధులకు మూల కారణంగా భావిస్తున్న నీటి సమస్యకు చెక్ పెట్టడంతో పాటు వైద్య పరంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేపట్టారు. దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. రూ.60 కోట్లతో నిర్మిస్తున్న రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి నిర్మాణ పనులు 85 శాతం మేర పూర్తయ్యాయి. తుది దశ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ర్యాంప్ బ్లాక్‌తో కలిపి మూడు బ్లాక్‌లుగా నాలుగు అంతస్తుల్లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటవుతోంది. మొదటి అంతస్తులో క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, హాస్పిటల్ సోర్ట్స్, సెంట్రల్ ల్యాబ్స్ ఉంటాయి. రెండో అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూడో అంతస్తులో డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, నాలుగో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్/ఐసీయూ, యూరాలజీ వార్డ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. వీటన్నింటి కారణంగా కిడ్నీ రోగులకు భరోసా లభించనుంది. అధునాత పరికరాల సమకూర్పు కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు అత్యంత అధునాతన పరికరాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. కిడ్నీ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలతో పాటు, పరిశోధనలు చేయడానికి వీలుగా పరికరాల సమకూర్పు ఉంటోంది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, 2డీ ఎకో, హైఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్సరే ► డిజిటల్, ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు, ఫుల్లీ రిమోట్ కంట్రోల్ ఐసీయూ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో ఉండనున్నాయి. మొత్తంగా 117 రకాల వైద్య పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే పలు పరికరాల సరఫరా కూడా మొదలైంది. రీసెర్చ్ సెంటర్లో శాశ్వత ప్రాతిపదికన 41 మంది స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఇతర వైద్యులను ఇక్కడ నియమించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇలా.. ► గత ప్రభుత్వంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 ఇచ్చే పెన్షన్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల గుమ్మం వద్దకు రూ.10 వేల చొప్పున వలంటీర్లు పెన్షన్ అందజేస్తున్నారు. ► టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 69 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. 2020లో హరిపురంలో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. మరో 25 మిషన్లతో కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020–21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,708 సెషన్లు కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేశారు. ► ఇచ్చాపురం, కంచిలి సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో 25 మిషన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ► కిడ్నీ వ్యాధులపై వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, ఐదు యూపీహెచ్‌సీలు, ఆరు సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్లు, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్లు, యూరిన్ ఎనలైజర్లు అందుబాటులో ఉంచారు. ► టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందిస్తుండగా, అవి కూడా అరకొరగానే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ► కొత్త కేసుల గుర్తింపునకు వైద్య శాఖ నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగిస్తోంది. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. వీరు ఈ ప్రాంతంలోని ప్రజలను స్క్రీనింగ్ చేసి, అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి దగ్గరలోని పీహెచ్‌సీలకు సీరమ్ క్రియాటిన్ పరీక్షలకు తరలిస్తున్నారు. ఇబ్బందులు తొలగిపోతాయి సంవత్సరం నుంచి నేను డయాలసిస్ చేయించుకుంటున్నాను. మా గ్రామానికి దగ్గరలోని హరిపురం ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఉండటంతో రవాణా, వ్యయ ప్రయాసలు లేవు. డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్లాల్సిన రోజు 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటి వద్దకు వచ్చి ఆస్పత్రికి తీసుకుని వెళుతోంది. ప్రభుత్వం రూ.10 వేల పెన్షన్ కూడా ఇస్తోంది. షెడ్యూల్ ప్రకారం నెఫ్రాలజిస్ట్ హరిపురంకు వస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే శ్రీకాకుళం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు పలాసలో కిడ్నీ సెంటర్ ప్రారంభిస్తే ఆ ఇబ్బంది కూడా తొలగిపోతుంది. - శ్రీరాములు, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, బేతాలపురం, శ్రీకాకుళం జిల్లా నీళ్ల దిగులుండదిక.. కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాల్లో మా ఊరు కూడా ఒకటి. ప్రభుత్వం మా కోసం రక్షిత నీటి పథకం అందుబాటులోకి తెస్తోంది. పనులు దాదాపు పూర్తికావచ్చాయని చెబుతున్నారు. త్వరలో మా గ్రామానికి నీళ్లు వస్తాయి. బోర్ నీళ్లు తాగడం వల్లే కిడ్నీ జబ్బులు వస్తున్నాయని చాలా మంది చెప్పారు. దీంతో మేం పక్క ఊరి నుంచి సరఫరా చేస్తున్న ఫిల్టర్ నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. ప్రభుత్వమే ఉచితంగా కొళాయి ద్వారా మంచినీటిని సరఫరా చేయబోతుండటం మాకెంతో ఊరట కలిగిస్తోంది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లు, అమ్మ ఒడి, పక్కా ఇళ్లు, ఇతరత్రా పథకాలతో మా ప్రాంత ప్రజలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ మహమ్మారి జబ్బుకు శాశ్వత పరిష్కారం చూపితే ఆయన మేలు ఎప్పటికీ మరువం. - ఎం.సరోజిని, రంగోయి, శ్రీకాకుళం జిల్లా వ్యాధిగ్రస్తులకు పెద్ద ఊరట కిడ్నీ రీసెర్చ్ సెంటర్ భవన నిర్మాణం తుది దశలో ఉంది. మరోవైపు వైద్య పరికరాలు సమకూరుస్తున్నాం. త్వరలోనే రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి వస్తుంది. భవన నిర్మాణం, పరికరాల సమకూర్పునకు కలిపి రూ.60 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెద్ద ఊరట లభిస్తుంది. - మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్ఐడీసీ -
దేవుడు ముడివేసిన జంట.. అడ్డంకులు అధిగమించి అన్యోన్యంగా ముందుకు
శ్రీకాకుళం: ఒకరికి కళ్లు లేవు. మరొకరికి కాళ్లు పని చేయవు. వీరి బతుకు ముళ్ల బాటన వెళ్లకుండా మూడు ముళ్ల బంధంతో దేవుడు అందంగా ముడివేశాడు. ఆమె కడకొంగు ఆయనకు చేతి ఊతం. అతని గుండె చప్పుడు బిడ్డకు లాలి గీతం. పుట్టుకతో వచ్చిన లోపాలను సర్దుబాట్లతో అధిగమిస్తూ ఈ జంట అన్యోన్యంగా ఇలా ముందుకు వెళ్లడం పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కనిపించింది. -
ఏపీలో లంచంలేని సమాజం ఏర్పాటు చేశాం
-
ఒడిశా రైలు ప్రమాదం: శ్రీకాకుళం వాసి మృతి
శ్రీకాకుళం: ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన వ్యక్తి మృతిచెందారు. మండలంలోని జగన్నాధపురానికి చెందిన గురుమూర్తి(60) మృత్యువాత పడ్డారు. నిన్న(శనివారం) జరిగిన రైలు దుర్ఘటనలో గురుమూర్తి యశ్వంత్‌పూర్ రైలులో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డాడు. ప్రమాద వార్త తెలుసుకున్న గురుమూర్తి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకోగా అక్కడే అతని మృతదేహాన్ని అప్పగించారు. అతనికి ఒడిసాలోనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జూట్ కార్మికుడిగా పనిచేసే గురుమూర్తి.. బాలాసోర్‌లో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకూ రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డ వారి సంఖ్య 288కి చేరింది. మరొకవైపు వెయ్యికి మందికి పైగా గాయపడ్డారు. -
శ్రీకాకుళం: కమ్ముకున్న కారు మబ్బులు..
శ్రీకాకుళం: రోజంతా ఎండవేడి, ఉక్కపోతగా ఉన్న వాతావరణం బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై కారుమబ్బులు కమ్మేయడంతో పగటి పూటే చిమ్మచీకట్లు అలముకున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు శ్రీకాకుళం నగరవాసులను భయభ్రాంతులకు గురిచేశాయి. -
ముగిసిన శరత్ కాలం..
సాగర సంగమం సంపూర్ణమవ్వాలంటే బాలుకు ఓ రఘుపతి కావాలి. సీతాకోక చిలుక అందంగా ఎగరాలంటే ఆ కథకు డేవిడ్ ఉండి తీరాలి. అన్వేషణ అంతం కావాలంటే అడుగడుగునా జేమ్స్ కనిపించాలి. ఆపద్బాంధవుడిలా చిరంజీవి మారాలంటే శ్రీపతి లాంటి ఉత్తముడు రావాలి. అప్పలనరసయ్య సంసారాన్ని చదరంగంలా ఆడాలంటే ప్రకాష్ అనే పొగరుబోతు కొడుకు ఇంటిలో తిరగాలి. పనివాడు ముత్తు గొప్పవాడిగా మారాలంటే నిజం తెలుసుకునే జమీందార్ అతని కళ్ల ముందుండాలి. ఇన్ని గొప్ప కథలకు, ఇలాంటి కథకులకు వరంలా దొరికిన నటుడు శరత్‌బాబు. ఆమదాలవలసలో పుట్టి పెరిగిన ఈ అందగాడు తెలుగు, తమిళ సినిమాల్లో మర్చిపోలేని పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. వెండితెరపై అందంగా వికసించిన ఆయన నవ్వు ఇప్పుడు మాయమైపోయింది. అర్ధ శతాబ్దం పాటు అప్రతిహతంగా సాగిన నట ప్రస్థానం నేటికి కళామతల్లి పాదాల చెంతకు చేరుకుంది. వంశధార నుంచి మెరీనా తీరం వరకు ఆయన సాగించిన ప్రయాణం సిక్కోలు స్మరించుకుంటోంది. ఆమదాలవలస: వంశధార నదీ తీరాన సత్యనారాయణ దీక్షితులుగా ఆడిపాడిన శరత్‌బాబు వేలాది మంది సినిమా అభిమానులను శోకంలో ముంచుతూ శాశ్వత సెలవు తీసుకున్నారు. ఆమదాలవలసకు చెందిన ఆయన రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ముందు చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడి నుంచి బెంగళూరు, మళ్లీ అక్కడి నుంచి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ ఇష్యూతో ఆయన ఇబ్బంది పడుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆమదాలవలసలోనే.. ► శరత్‌బాబు బాల్యం, యవ్వనం ఆమదాలవలసలో నే గడిచింది. ఆయన తండ్రి విజయ్‌శంకర్ దీక్షితులు ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి చేసుకుని ఆమదాలవలస వచ్చి స్థిరపడ్డారు. ► శరత్‌బాబు ఇక్కడే పుట్టారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 13 మంది సంతానంలో శరత్‌బాబు ఒకరు. వీరికి ఆమదాలవలసలో రైల్వేస్టేషన్ ఎదురుగా గౌరీ శంకర్ విలాస్ అనే బ్రాహ్మణ భోజన హొటల్ ఉండేది. ► శరత్‌బాబు ఆమదాలవలసలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియెట్ చదివారు. డిగ్రీ శ్రీకాకుళంలో ఆర్ట్స్ కళాశాలలో చదివారు. ► తిత్లీ తుఫాన్ సమయంలో రెండు లక్షల రూపాయలు జిల్లాకు ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆమదాలవలసలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, సంగమేశ్వర దేవాలయాలకు ఒక్కో లక్ష చొప్పున విరాళాలు అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. దిగ్భ్రాంతికి గురయ్యా: స్పీకర్ ఆమదాలవలసకు మంచి పేరు తెచ్చిన నటుడు శరత్‌బాబు మృతి చెందడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఓ ప్రకటనలో తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గంలో, ఆమదాలవలస పట్టణానికి చెందిన సత్యనారాయణ దీక్షితులు అలియాస్ శరత్ బాబు మృతి చెందిన సమాచారం తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదువుకున్న రోజుల్లోనే నటనపై శరత్ బాబుకు మక్కువ ఉండేదన్నారు. అప్పట్లో ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ‘వాపస్’ నాటకంలో నిరుద్యోగ యువకుడిగా శరత్ బాబు వేసిన పాత్ర రక్తి కట్టించిందన్నారు. 44 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఆమదాలవలస పేరు ప్రఖ్యాతలు బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో శరత్ బాబు ఒకరిని కొనియాడారు. శరత్ బాబు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీరని లోటు శరత్‌బాబు మృతి అటు సినీ పరిశ్రమకు, ఇటు ఆమదాలవలసకు తీరని లోటని ఆమదాలవలసకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు, రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్ జేజే మోహన్‌రావు అన్నారు. శరత్‌బాబుతో తమ కుటుంబానికి స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉండేవని జ్ఞాపకం చేసుకున్నారు. చివరిసారిగా ఆమదాలవలసలో అయ్యçప్పస్వామి ఆలయ ప్రతిష్ట సమయంలో ఆయన వచ్చారని చెప్పారు. ఆమదాలవలస పట్టణంలోని గల ప్రధాన రహదారి సింగపూర్ రహదారిలా తీర్చిదిద్దుదామని శరత్‌బాబు అన్నారని తెలిపారు. శరత్‌బాబుకు ఆమదాలవలస లో ఎర్నాగుల ప్రభాకరరావు, పీరు యర్రయ్య, రవిబ్రహ్మం అనే స్నేహితులు ఉన్నారని, ప్రస్తుతం వారంతా ఉద్యోగరీత్యా వేరే చోట్ల నివసిస్తున్నారని తెలిపారు. సంగమయ్య ఆలయానికి విరాళం ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస మండలంలోని సంగమేశ్వర కొండకు శరత్‌బాబు తన సొంత ఖర్చుతో ఐదేళ్ల కిందట టైల్స్ వేయించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో మొట్టమొదటిగా నిర్వహించే జాతర సంగమేశ్వర జాతర. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందినవారు జనం వచ్చి సంగమయ్య కొండను, గుహలో ఉన్న సంగమయ్యను దర్శించుకుంటారు. అలాంటి సమయాల్లో గుహ లోపలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు శరత్‌బాబు దృష్టికి తీసుకురావడంతో వెంటనే గుహ లోపల టైల్స్ వేయించాలని తన సోదరులకు తెలపడంతో వాటిని అమర్చారు. కలిసి చదువుకున్నాం శరత్ బాబు మృతి చెందారని తెలియగానే సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయాననే బాధ కలిగింది. నేను, శరత్ బాబు ఏడో తరగతి నుంచి కలిసి చ దువుకున్నాం. శ్రీకాకుళం డిగ్రీ ఆర్ట్స్ కళాశాలలో ఆయన ఎంపీసీ, నేను సీబీజెడ్లో చేరాం. మంచి తెలివైన విద్యారి్థ. క్రమశిక్షణకు మారుపేరు. శరత్ బాబు ఒరిజనల్ పేరు సత్యనారాయణ దీక్షితులు. ఆయన ముప్పైఏళ్లు వరుసగా అయ్యప్ప మా ల వేశారు. 2019 వరకూ ఎప్పటికప్పుడు మాట్లాడుకునేవాళ్లం. తర్వాత తగ్గింది. 1980 లో నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో టంకాల బాబ్జీ తదితరులు శరత్‌బాబును సత్కరించారు. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. – పీరు ఎర్రయ్య, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ -
ప్రాణాలు తీసిన ‘సంబంధం’.. ఇద్దరిని హతమార్చి, తను కూడా..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని సారవకోట కోదడ్డపనసలో జంట హత్యల కేసు నిందితుడు ముద్దాడ రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో వెలమల ఎర్రమ్మ అనే మహిళ, ముద్దాడ సంతోష్‌లను మంగళవారం కత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే. హత్యా స్థలం నుంచి పరారైన రామారావు.. గ్రామ సమీపంలో అదే కత్తితో గొంతు కోసుకొని పాల్పడ్డాడు. విగతజీవిగా పడిఉన్న రామారావును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా వరుసకు వదినయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రామారావు.. ఆ మహిళ మరో యువకుడితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమెతోపాటు యువకుణ్ణి కూడా దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం కోదడ్డపనస గ్రామ సమీపంలో ఉన్న వంశధార ఎడమ కాలువలో స్నానం చేస్తున్న సంతోష్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అదే కత్తి తీసుకుని సమీపంలోని పొలంలో పనిచేస్తున్న ఎర్రమ్మపైనా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత వార్త: యువకుడితో వివాహేతర సంబంధం.. మరొకరితో చనువుగా ఉంటోందని.. -
వర్షాలకు కూలిన బహుదా నది వంతెన
-
బ్రెయిన్ డెడ్ విద్యార్థి అవయవదానం
-
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
-
Chakrapani Nagari: పాటల తుపాకీ...
దేశ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్. వేదికల మీద పాటలు పాడుతూ తనలో ఉన్న కళకు హద్దులు లేవని నిరూపిస్తున్నారు. ‘డ్యూటీలో ఉంటూ గాన సాధన కూడా చేయడంతో ఈ పాట నాకు బాగా వంటపట్టింది’ అంటూ ఇటీవల హైదరాబాద్ వచ్చిన చక్రపాణి నగరి తన గురించి వివరించారు. ‘‘మాది శ్రీకాకుళం జిల్లా, పలాస. టెన్త్‌క్లాస్ వరకు హైదరాబాద్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఆ సమయంలో బీఎస్ఎఫ్కు సంబంధించిన ఒక ప్రకటన చూసి, అప్లై చేశాను. ఆ పరీక్షల్లో సెలక్ట్ అయ్యి 2013లో బీఎస్ఎఫ్లో చేరాను. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో పని చేశాను. ఇప్పుడు సెలవు మీద హైదరాబాద్‌కు వచ్చాను. సెలవు పూర్తవగానే జమ్ములో విధులు నిర్వర్తించాలి. డ్యూటీలో ఉంటూ.. ఏదో ఒకటి పాడుకుంటూ ఉండటం అనేది స్కూల్ టైమ్ నుంచే ఉండేది. కానీ, ఎప్పుడూ దానిని నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోలేదు. బీఎస్ఎఫ్లో చేరిన తర్వాత అక్కడ మా టీమ్, క్యాంపుల్లో సరదాగా పాడుతుండేవాడిని. నెలకు ఒకసారి ఏదో ఒక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఆ సమయంలో అన్నీ హిందీ పాటలు పాడేవాడిని. అక్కడున్నవారందరికీ హిందీ తెలుసు కాబట్టి, అవే పాటలు పాడేవాడిని. మా తోటి జవాన్లే కాదు ఆఫీసర్స్ కూడా చాలా ప్రోత్సహించేవారు. డ్యూటీలో ఉన్నా లేకున్నా పాటలు పాడటం మాత్రం ఆగేది కాదు. ఇక మా ఊరికి వచ్చినప్పడు పెళ్లిళ్లు వంటి వేడుకల సందర్భాల్లోనూ నా గాన కచేరీ ఉండేది. ఖాళీ సమయంలో డిజిటల్ మీడియాని ఫాలో అవుతుంటాను. అలా, హైదరాబాద్‌లోని ఓ టీవీ పాటల కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని ప్రకటన చూసి, అప్లై చేసుకున్నాను. వేల మందిలో నాకు అవకాశం రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయాన్ని మా అధికారులకు చెబితే వాళ్లూ వెంటనే ఓకే చేశారు. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు, గాన గంధర్వుడు బాలుగారి మైక్‌ను కానుకగా అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. కష్టపడుతూ.. మా అమ్మానాన్నలకు మేం ముగ్గురం. నా చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో మా అమ్మ చాలా కష్టాలు పడింది. మమ్మల్ని హాస్టల్లో ఉంచి, తెలిసినవారి ద్వారా ఢిల్లీ వెళ్లి, పనులు చేసి, మాకు డబ్బు పంపేది. ఇప్పుడు అమ్మ ఊళ్లో వ్యవసాయం పనులు చేస్తుంది. అన్నయ్య సొంతగా బేకరీ నడిపిస్తున్నాడు. అక్క గ్రామవాలంటీర్గా చేస్తోంది. మాకు కష్టం విలువ తెలుసు, స్వయంగా ఎదగడానికి మా వంతుగా కృషి చేస్తూనే వచ్చాం. ఆ కష్టంలో నుంచే ఈ పాట పుట్టుకు వచ్చిందనుకుంటాను. ఎక్కడ ఉన్నా కళ రాణిస్తుందనడానికి నేనే ఉదాహరణ అనిపిస్తుంటుంది. మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని సింగర్‌గా రాణించాలనుకుంటున్నాను’’ అని తెలియజేశాడు ఈ జవాన్. – నిర్మలారెడ్డి -
నేను విన్నాను.. నేనున్నాను.. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్..
అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధ పడుతున్న పలువురికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం అందేలా ఆదేశించారు. నౌపడ సభా వేదిక నుంచి హెలిప్యాడ్‌కు వెళ్తున్న సమయంలో టెక్కలి మండలానికి చెందిన లాయిపండా వెంకటరావు తన కుమారుడు కార్తీక్ (9) ‘తొసిల్జుమాబ్–సోజియా’ అనే ఎముకల వ్యాధితో ఆరేళ్లుగా బాధ పడుతున్నాడని సీఎంకు చెప్పారు. వైద్య ఖర్చులకు ఇంటిని కూడా అమ్మేశానన్నారు. సీఎం స్పందిస్తూ మెరుగైన వైద్యం అందేలా చూడాలని, తక్షణ సాయంగా రూ.5 లక్షలు ఇవ్వాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠ్కర్ను ఆదేశించారు. వీరి విషయం ఫాలోఅప్ చేయాలని సీఎంవో కార్యదర్శి ధనంజయరెడ్డికి సూచించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండటెంబురు గ్రామానికి చెందిన అన్నపూర్ణ తన కూతురు రాజశ్రీ పుట్టకతోనే పక్షవాతం బారిన పడిన విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చలించిపోయిన సీఎం జగన్ సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. లక్షల మంజూరు చేశారు. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామానికి చెందిన అప్పారావు తన కుమారుడు దిలీప్ కుమార్ పుట్టకతోనే దివ్యాంగుడనే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన తమ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమేని సీఎం జగన్‌కు విన్నవించారు. దీనికి సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ. 2లక్షల మంజూరు చేశారు సీఎం జగన్. విజయనగరం జిల్లా సారథికి చెందిన వంజరాపు రామ్మూర్తి కుమారుడు రవికుమార్ (33) ఊపిరితిత్తుల వ్యాధి వల్ల ఆక్సిజన్ సిలెండర్ల మీదే బతుకుతున్నాడని స్థానిక సామాజిక కార్యకర్త పాలూరి సిద్ధార్థ బాధితుని తరఫున సీఎంను కోరారు. తక్షణ సాయంగా రూ.లక్ష అందివ్వాలని, ప్రతి నెలా రూ.10 వేలు íపింఛన్ మంజూరు చేసేలా విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించాలని సీఎంఓ కార్యదర్శి ధనంజయరెడ్డికి సూచించారు. బాధితులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: Fact Check: సీతకొండపై బాబు బొంకు!.. అబద్ధాలతో ట్వీట్ -
సీఎం జగన్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
శ్రీకాకుళం జిల్లా భవిష్యత్ లో మహానగరంగా ఎదగాలి
-
CM Jagan Srikakulam Tour: సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం (ఫొటోలు)
-
కార్యకర్తలను ప్రేమగా పలకరించిన సీఎం జగన్
-
మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
-
సీఎం జగన్ ను చూసేందుకు జనం ఉరుకులు పరుగులు
-
శ్రీకాకుళం జిల్లా మూలపేటకు చేరుకున్న సీఎం జగన్
-
సీఎం జగన్ రాకకోసం ముస్తాబైన శ్రీకాకుళం
-
ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే: సీఎం జగన్
Updates దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా.. ‘‘మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు’’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ కీలక ప్రకటన ►శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామన్నారు. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం తెలిపారు. ►ఇవాళ నాలుగు మంచి కార్యక్రమాలు జరుపుకున్నాం: సీఎం జగన్ ►మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం ►నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేసుకున్నాం ►ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిప్ట్ లిరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నాం ►ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చివేస్తాయి ►గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారు ►ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుంది ►భవిష్యత్‌లో మూలపేట, విష్ణు చక్రం మరో ముంబై, మద్రాస్ కాబోతున్నాయి ►24 నెలల్లో పోర్ట్ పూర్తవుతుంది ►పోర్టు నిర్మాణానికి రూ.4,362 కోట్లు ఖర్చు చేస్తున్నాం ►పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 35వేల మందికి ఉపాధి లభిస్తుంది ►పోర్టు వస్తే.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి ►అప్పుడు లక్షల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ►మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు ►గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ►గంగపుత్రులు వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండేందుకు కృషి ►పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ►బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ►రాష్ట్రంలో ఇప్పటివరకు 4 పోర్టులు మాత్రమే ఉండగా.. మనం అధికారంలోకి వచ్చాక మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం తీరప్రాంత అభివృద్ధికి సంబంధించి గతంలో ఇలాంటి అభివృద్ధి ఎందుకు జరగలేదు? ►సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన చరిత్రలో గుర్తుండిపోయేలా.. ►చరిత్రలో గుర్తుండిపోయేలా మూలపేట పోర్టుకు ఈ రోజు శంకుస్ధాపన జరిగిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దాదాపు 30 నెలల్లో పూర్తి చేయనున్న ఈ పోర్టు ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది స్ధానిక యువతకు ఉపాధి కల్పించబోతున్నారన్నారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను అనేక ప్రభుత్వాలను చూశాం, ఈ రోజు మన రాష్ట్రానికి సహజసిద్దంగా ఉన్నటువంటి సముద్రతీరాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలని, తద్వారా ఈ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో సీఎం 2019లో ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏర్పాటు చేసి దాదాపు రూ. 16 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. దీంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టు, మరో 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నారు. ఈ ఘట్టం శ్రీకాకుళం చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతుంది.రానున్న కాలంలో ఈ ప్రాంతంలో మరిన్ని మంచి కార్యక్రమాలు సీఎంద్వారా చేస్తామని మంత్రి అన్నారు. 75 ఏళ్ల చరిత్రలో ఇవాళ చరిత్రాత్మక ఘట్టం: ఎమ్మెల్సీ దువ్వాడ ►నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిరహిత పాలన అందిస్తున్నారన్నారు. రైతులను విత్తనం నుంచి విక్రయం వరుకు ఆదుకుంటున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. ►మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిప్ట్ లిరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు ►సీఎం జగన్ మూలపేటలో పర్యటిస్తున్నారు. గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ►సీఎం వైఎస్ జగన్ మూలపేటకు చేరుకున్నారు. కాసేపట్లో మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ►శ్రీకాకుళం జిల్లా మూలపేట పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని నిర్ణయించారు. ►విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. అంతేగాక వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీని సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. ►శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా బుధవారం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం కాగా, కాకినాడ సెజ్ పోర్టులో శరవేగంగా పనులు సాగుతున్నాయి. ►వచ్చే నెలలో మచిలీపట్నం (బందరు) పోర్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. పదేళ్లలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్ల లోపే నాలుగు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విశేషం. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుకే ఎగుమతులు జరగనున్నాయి. -
సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి రేపు(బుధవారం) సీఎం జిల్లాకు రానున్నారు. ● బుధవారం ఉదయం 8 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు. ● ఉదయం 9.20కు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ● 9:30 గంటలకు విశాఖపట్టణంలో బయల్దేరి సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు 10.15 గంటలకు చేరుకుంటారు. ● 10.20 గంటలకు హెలీప్యాడ్ వద్ద నాయకులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ● 10.25 గంటలకు హెలీప్యాడ్ నుంచి పోర్టు శంకుస్థాపన పైలాన్ ఆవిష్కరణకు బయల్దేరుతారు. ● 10:30 నుంచి 10:47 వరకు పోర్టు శంకుస్థాపన, గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ● 11 గంటలకు మళ్లీ హెలీకాప్టర్‌లో బయల్దేరి 11.10 గంటలకు నౌపడ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ● 11.10 నుంచి 11.20 వరకు హెలీప్యాడ్ వద్ద నాయకులంతా సీఎంకు స్వాగతం పలుకుతారు. ●11.25 గంటల నుంచి 11.35 వరకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. ● 11.45 నుంచి 12 గంటల వరకు సభా వేదికపై ఇతర నాయకులు ప్రసంగిస్తారు. ● మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు సభా వేదికపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగం చేస్తారు. ● 12.35 గంటలకు మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ● 12.40 గంటలకు సభా వేదిక నుంచి బయల్దేరి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ● 12.45 నుంచి 1.05 వరకు స్థానిక నాయకులతో మాట్లాడుతారు. ● మధ్యాహ్నం 1.10 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ● మధ్యాహ్నం 2.10 గంటలకు విశాఖపట్టణం నుంచి గన్నవరం చేరుకుంటారు. ● మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. చదవండి: AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ -
ఈనెల 19న సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి(బుధవారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా, శ్రీకాకుళం పర్యటనలో మూలపేట పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఈ కార్యక్రమం జరుగనుంది. -
భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం
సాక్షి, విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం చేస్తూ రాష్ట్ర పెట్టుబడులు మరియు మౌలిక వసతుల (పోర్టులు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టుకు భూసమీకరణ నిమిత్తం జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు సంబంధించిన రైతులతో సమావేశం నిర్వహించినప్పుడు గ్రామస్థులు పోర్టు సంబంధింత భూములన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లోనే ఉన్నాయని, పోర్టు ప్రతిపాదిత ప్రాంతంలో భావనపాడు లేనందున పోర్టుకు మూలపేట పోర్టుగా పేరు పెట్టాలని కోరినట్లు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి విన్నవించారన్నారు. పోర్టు నిర్మాణ ప్రాంతంలోని భూములు, నిర్వాసిత కుటుంబాలన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల పరిధిలో ఉన్నందున గ్రామస్థుల కోరిక మేరకు భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గతంలో భావనపాడు పోర్టుగా నోటిఫై చేసిన ప్రాంతాన్ని ఇకపై మూలపేట పోర్టుగా పరిగణించాలని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సదరు మూలపేట పోర్టుకు ఏప్రిల్ 19వ తేదీన భూమిపూజ చేయనున్నారని పెట్టుబడులు మరియు మౌలిక వసతుల (పోర్టులు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ. కరికాల్ వలవన్ తెలిపారు. -
శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణంతో మారనున్న ముఖచిత్రం
-
మాజీ ఎంపీ కణితి విశ్వనాథం కన్నుమూత
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం (91) శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పలాసలోని స్వగృహంలో కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో కణితి కూడా ఒకరు. ఈయన 1932 జూలై 1న నందిగాం మండలం హరిదాసుపురంలో జన్మించారు. వైద్యుడిగా, విద్యావేత్తగా పేరు గడించారు. తర్వాత రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1989, 1991లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. 2014 నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. 1989లో ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా 34 ఏళ్ల పాటు కొనసాగారు. చదవండి: రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు?.. ఆ భయం వెంటాడిందా? -
వైఎస్ జగన్ హత్యాయత్నం ఘటనపై క్షుణంగా దర్యాప్తు జరగాలి
-
ఉత్తరాంధ్రకు వెలుగు రేఖ.. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణంతో మారనున్న ముఖచిత్రం
సాక్షి, అమరావతి/సంతబొమ్మాళి/ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు త్వరలో మారిపోనున్నాయి. సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ ప్రాంత వాసుల కల త్వరలో సాకారం కానుంది. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ, అత్యంత కీలకమైన చోట ఈ పోర్టు ఉంది. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్æ, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌తో పాటు దక్షిణ ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు ఈ పోర్టు అత్యంత కీలకం కానుంది. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు పోర్టుల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు భావనపాడుకే ఉన్నాయని మారిటైమ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు.. థర్మల్ కోల్, కుకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి ఈ పోర్టు కేంద్రం కానుంది. ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్.. ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంతటి కీలకమైన భావనపాడు పోర్టు పనులకు ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయడం ద్వారా ప్రారంభించనున్నారు. తొలి దశలో నాలుగు బెర్తులు తొలి దశలో భావనపాడు పోర్టును నిరి్మంచడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,361.91 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనులను రూ.2,949.70 కోట్లతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనతో తొలి దశ ఉంటుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా, తొలి దశలో నాలుగు బెర్తులతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు. నాలుగు బెర్తుల్లో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్‌తోపాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భావనపాడు పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణ రూపంలో సమకీరించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దీంతోపాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. పోర్టు సిటీగా శ్రీకాకుళం భావనపాడుతో శ్రీకాకుళం జిల్లా పోర్టు సిటీగా మారుతుంది. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతుండగా, త్వరలో మచిలీపట్నం పనులు కూడా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టుకు తొలి నౌకను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే స్ఫూర్తితో భావనపాడు పోర్టు పనులు కూడా లక్ష్యంలోగా పూర్తి చేస్తాం. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి రూ.35 కోట్లతో ఆర్అండ్ఆర్ కాలనీ భావనపాడు పోర్టు నిర్వాసితులు 594 మంది కోసం రూ.35 కోట్లతో 55 ఎకరాల్లో నౌపడలో అధునాతన వసతులతో అర్అండ్ఆర్ కాలనీ నిరి్మంచనున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ తెలిపారు. ఈ నెల 19న భావనపాడు పోర్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మూలపేట, విష్ణుచక్రంలో రైతుల నుంచి 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. రైతులకు 10 శాతం మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. అప్రోచ్ రోడ్డు కోసం మరో 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. దీంతో పాటు మొదటి ఫేజ్‌లో సీఆర్‌జెడ్ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు.. మొత్తం 1000 ఎకరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. రెండో ఫేజ్‌లో బృహత్తర పోర్టు డెవలప్మెంట్కు మరికొన్ని భూములు రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుందన్నారు. ఆర్అండ్ ఆర్ కాలనీకి ఈ నెల 11న ప్రభుత్వం నుంచి ప్లాన్ అప్రూవల్ వచి్చందన్నారు. జిల్లా ప్రజల పోర్టు కల నెరవేరుతుండడం శుభ పరిణామమన్నారు. వలసల నివారణే ప్రభుత్వ ధ్యేయం మత్స్యకారుల వలసల నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రూ.365 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెం తీరంలో నిరి్మంచనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 19న సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో ఈ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచి్చన ప్రతి హామీని సీఎం నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా, హార్బర్లు లేక మత్స్యకారులు వలస వెళ్లే పరిస్థితిని సీఎం పూర్తిగా మార్చేస్తున్నారన్నారు. విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాలకు సమానంగా భవిష్యత్‌లో ఇక్కడ తీరం అభివృద్ధి చెందుతుందన్నారు. నెల్లూరులో హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉందని, బాపట్ల, మచిలీపట్నం, రామాయపట్నం వంటి ప్రాంతాల్లో నిర్మాణాలు జరగుతున్నాయని తెలిపారు. అనకాపల్లి వద్ద మరో హార్బర్ నిర్మాణంతో పాటు మంచినీళ్లపేట వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను హార్బర్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మే 3న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఉత్తరాంధ్ర భవిష్యత్‌లో పూర్తి స్థాయి ప్రగతి సాధిస్తుందని అన్నారు. పవన్ కల్యాణ్ వంటి వారు అప్పుడప్పుడూ కనిపిస్తూ మత్స్యకారుల కోసం మాట్లాడుతుంటారని, అలాంటి పార్ట్‌టైమ్ నాయకులను నమ్మే పరిస్థితి లేదన్నారు. -
సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు
ఇచ్ఛాపురం రూరల్(శ్రీకాకుళం జిల్లా): టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.7 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ బ్రిడ్జిని నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సెల్ఫీ తీసి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌లు తోక ముడిచారు. వీరి సెల్ఫీకి బొడ్డబడ గ్రామస్తులంతా ప్రతిస్పందించారు. ఈ వంతెన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైందంటూ గురువారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ప్రజల్లో అభాసుపాలయ్యామంట గురువారం ‘సెల్ఫీ’ పోస్టులు తొలగించారు. చదవండి: టీడీపీ నేతల ‘సెల్ఫీ’గోల్ -
వైకల్యాన్ని జయించి అద్భుతాలు సృష్టిస్తున్న రూపాదేవి
-
‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం’
శ్రీకాకుళం: విశాఖ స్టీల్‌ప్టాంట్ ప్రైవేటికరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్టాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి అనేకసార్లు తెలిపిన విషయాన్ని అమర్నాథ్ మరోసారి ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడిన మంత్రి అమర్నాథ్.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిపి తమ ఉద్దేశాన్ని తెలుపుతూ కేంద్రానికి, ప్రధానికి మూడుసార్లు సీఎం జగన్ లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మరాదన్నదే మా స్టాండ్. అటువంటప్పుడు ప్రైవేటీకరణ.. ఎవరు కొంటారు.. అన్న ప్రశ్నలే ఉత్పన్నం కావు. కేంద్రప్రభుత్వమే ప్లాంట్‌ను నడపాలన్నది మా ప్రభుత్వ డిమాండ్. ‘‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’’ అనే సెంటిమెంట్‌ను కాపాడతాం. దానికోసం ఇప్పటికే ప్రధానికి మూడుసార్లు లేఖలు రాశాం. అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఉద్యమానికి మద్ధతు ఇస్తున్నాం.’ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ స్టాండ్‌పై క్లారిటీలేదు ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదన్న తెలంగాణ సీఎం కేసీఆర్ .. మళ్లీ అదే ప్లాంట్‌ను కొంటారని ఎలా అనుకుంటారు..? ఒకవేళ అదే నిజమైతే, ప్లాంట్‌ను అమ్మేయాలన్నది వారి ఉద్దేశమా..?. అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ గానీ.. బీఆర్ఎస్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్టేట్మెంట్ను మేం వినలేదు. మా దృష్టికి రాలేదు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న మమ్మల్ని ప్లాంట్ ను మీరే కొంటారా అని ఎలా అడుగుతారు...? అలాగే, ప్రైవేటీకరణ వద్దని కేసీఆర్ చెప్పినప్పుడు ఆయనే మళ్లీ కొనేందుకు ముందుకొస్తున్నారని మీరు ఎలా చెబుతారు.. మీ మీడియాల్లో ఎలా రాస్తారు..? రాజకీయంగా ఇలాంటివి ఎన్నో అవాస్తవాలు ప్రచారంలోకి వస్తుంటాయి. వాటన్నింటినీ పట్టించుకుని మేం స్పందించలేం కదా.. ! వాస్తవానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై బీఆర్ఎస్ ఏదైనా మాట్లాడితే.. వాళ్ల స్టాండ్ ఏంటో తెలిశాక అప్పుడు మేం స్పందించడం కరెక్టు గానీ, రాజకీయ దుమారం రేపే గాలివార్తలపై మేం ఇప్పుడే ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ముమ్మాటికీ విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్‌గానే మేం భావిస్తున్నాం.. ఆ మేరకు ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్న విధానంపైనే మా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది’ అని పేర్కొన్నారు. -
అర్ధరాత్రి టీడీపీ నాయకుల గూండాగిరి.. ఎదురుతిరిగిన ప్రజలు
సంతబొమ్మాళి: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లపై టీడీపీ నాయకులు అర్ధరాత్రి సమయంలో ప్రొక్లెయినర్లతో దాడి చేశారు. నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. లబ్ధిదారులను భయపెట్టి అక్కడి నుంచి తరిమేసి.. స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురంలో గొనప సునీత, కోత అమ్మోజీ, నౌపడ తవిటమ్మ, బస్వల తులసమ్మ, బస్వల మహాలక్ష్మి, గోరుబండ తులసమ్మకు ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు ఇచ్చింది. దీంతో వారు అక్కడ ప్రభుత్వ సాయంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే ఎప్పటి నుంచో ఈ స్థలంపై స్థానిక టీడీపీ నాయకులు కన్నేశారు. ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకోవడంతో.. లబ్ధిదారులను భయపెట్టి అక్కడి నుంచి తరిమేసేందుకు ఇదే సరైన సమయమనుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ప్రొక్లెయినర్లతో ఆ ఏడుగురి ఇళ్ల నిర్మాణాలపై దాడి చేసి.. వాటిని కూల్చివేశారు. మంగళవారం ఉదయం అక్కడకు చేరుకున్న లబ్ధిదారులు.. నేలమట్టమైన తమ ఇళ్లను చూసి భోరున విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామస్తులంతా తిరగబడటంతో నిందితులైన టీడీపీ నాయకులు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయారు. కాగా, ఇళ్ల కూల్చివేతపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ ఆరంగి వసంతరావు, బెండి విష్ణు, బెండి సూర్యనారాయణ, రాము, అరుణ్‌కుమార్, కైలాష్, ప్రదీప్, అనిల్, బాలక ప్రసాద్, నారాయణ, పొందల సురేశ్, మధు, ఆరంగి శ్రీధర్, హరిపై కేసు నమోదు చేసినట్లు సంతబొమ్మాళి ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. -
కలకలం .. వీధులోకి వచ్చిన 15 అడుగుల వింతపాము
శ్రీకాకుళం: సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం, టెక్కలి మండలం విక్రంపురంలో పాములు జనావాసాల్లోకి వచ్చి భయపెట్టాయి. పురుషోత్తపురంలో స్థానిక రైస్ మిల్లు పక్క నుంచి సోమవారం ఉదయం సుమారు పది అడుగుల పసిడికి పాము జనాల్లోకి వచ్చింది. దీంతో కొంతమంది యువకులు ధైర్యం చేసి కర్రలతో కొట్టి చంపారు. అలాగే విక్రంపురంలో ఆదివారం రాత్రి నలుపు, పసుపు ఛారలతో ఉన్న సుమారు 15 అడుగుల పాము వీధుల్లోకి వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పామును చూసి ఉండకపోవడంతో భయాందోళన చెందారు. కొంతమంది కర్రలతో వెంబడించడంతో సమీపంలోని చెరువు వైపు వెళ్లిపోయింది. కాగా ఈ పామును గౌరీబెత్తుగా పిలుస్తారని స్థానికులు తెలిపారు. -
శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో YSRCP విజయం
-
ఆ ముల్లు లేనిదే ఖాదీ దారం తయారు కాదంటే నమ్ముతారా?
ముల్లు.. అది గులాబీ ముల్లైనా, పిచ్చి పొదల్లో ముల్లైనా.. చివరికి చేప ముల్లైనా గుచ్చుకుంటుందని భయపడతాం. గులాబీని వాడేటప్పుడు, చేపలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం. కానీ పొందూరు ఖాదీ నేతకార్మికులు ఆ ముల్లు లభించక తల్లడిల్లుతున్నారు. వారికి అవసరమైన కృత్రిమ ముళ్ల తయారీకి అనేకమంది ప్రయత్నిస్తున్నారు. అధ్యయనాలు, పరిశోధనలు చేస్తున్నారు. ఆఫ్ట్రాల్ ఒక ముల్లు కోసం ఇన్ని మల్లగుల్లాలా! ఏమిటి దాని గొప్ప? అని వెటకారం చేయకండి.. చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఆ ముల్లు లేనిదే ఖాదీ దారం తయారు కాదు. ఖాదీ వస్త్రాలు ఆ నునుపు, మెరుపు సంతరించుకోలేవు మరి! అలాగని అన్ని చేపల ముళ్లు పనికిరావు. ఖాదీ వస్త్రాల తయారీకి ఉపయోగపడే ముడి కొండపత్తిలోని పొల్లు తీసి శుభ్రం చేసేందుకు వాలుగ చేప ముల్లు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ చేప దవడ పలువరుసతో ఉండే ప్రత్యేకమైన ముల్లు లభించక దాని ప్రభావం ఖాదీ నేతపై పడుతోంది. అందుకే వాలుగ చేప ముల్లును పోలి ఉండేలా కృత్రిమ పరికరం తయారీకి ఒక సీనియర్ సైంటిస్ట్, ఒక యువజన సంఘం, ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. సాక్షి, శ్రీకాకుళం: పొందూరు ఖాదీ తయారీలో కీలకమైన.. పత్తిని శుభ్రం చేసేందుకు వినియోగించే.. వాలుగ చేప దవడ భాగం అవసరానికి తగినంతగా లభ్యం కావడం లేదా? ఆ చేప ముల్లును సేకరించడం కష్టతరంగా మారిందా..? ఆ ముల్లుకు ప్రత్యామ్నాయాలను రూపొందించే పనిలో సీనియర్ శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏమిటీ వాలుగ.. ఎందుకీ వెలుగు.. వాలుగు చేప.. శాసీ్త్రయ నామం వల్లగో అట్టు. మంచినీటిలో పెరిగే చేప. మిగతా చేపల మాదిరిగా కాకుండా దవడ భాగం విభిన్నంగా ఉంటుంది. దవడలోని ఉండే మృదువైన పళ్లవరసే ఖాదీ వస్త్రం రూపొందించడంలో కీలకం. ఖాదీకి అంత తెలుపు రంగు తీసుకురావడంతో కూడా కీలక పాత్ర దీనిదే. వినియోగం ఎలా.. వాలుగ చేప దవడ భాగాన్ని మత్స్యకారుల నుంచి సేకరిస్తారు. పైదవడను రెండు ముక్కలుగా, కింది దవడను రెండు ముక్కలుగా చేస్తారు. ఆ ముక్కను ఓ చిన్న కర్రకు దువ్వెన మాదిరిగా కడతారు. దాని సాయంతో పత్తిని శుభ్ర పరుస్తారు. ఈ క్రమంలో పత్తి మృదువుగా తయారవడంతో పాటు మరింత తెలుపుగా మారుతుంది. ఎడమ చేతి వా టం ఉన్న నేత కారులు ఎడమ దవడను, కుడి చేతి వాటం ఉన్న వారు కుడి దవడను వినియోగించి పత్తిని శుభ్రపరిచేందుకు వినియోగించడం మరో విశేషం. గతంలో రాజమండ్రి నుంచి.. తొలినాళ్లలో రాజమండ్రి ధవళేశ్వరం నుంచి కరకు సత్యమ్మ అనే మహిళ పొందూరు ఖాదీ కార్యాలయానికి వాలుగ చేప దవడల్ని సరఫరా చేసేవారు. ఆమె మరణాంతరం అక్కడ్నుంచి ముల్లు రావడం లేదు. శ్రీకాకుళం, విజయనగరం పరిసరాల్లోని మత్స్యకారులు అడపాదడపా తెచ్చి విక్రయిస్తున్నారు. ప్రత్యామ్నాయాల రూపకల్పనలో.. ఖాదీ తయారీలో వాలుగ చేప దవడ కీలకం కావడం.. అవసరమైన మేర లభ్యత లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై సీనియర్ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మహరాష్ట్ర వార్ధాలోని మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్(ఎంజీఐఆర్ఐ) సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త మహేష్‌కుమార్ ఆధ్వర్యంలోని ఓ బృందం స్టీల్‌తో వాలుగ చేప దవడ మాదిరిగా ఓ పరికరాన్ని రూపొందించింది. దీనిని హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ఎంఈ సంస్థ తయారుచేసింది. ఆ పరికరం పనితీరును పొందూరు ఖాదీ తయారీలో ప్రయోగాత్మకంగా పరిశీలించింది. కానీ వాలుగ చేప దవడతో వచ్చేంత మృదుత్వం ఈ పరికరంతో రాలేదు. నేతన్నల చేతులకు గాయాలవ్వడం.. ఇతర అంశాల కారణంగా ఆ పరికరం వినియోగంలోకి రాలేదు. ●అయినా సీనియర్ సైంటిస్ట్ మహేష్ కుమార్ ప్రత్యామ్నాయాలపై పట్టువిడవలేదు. చేప దవడ మాదిరిగానే ఉండేలా సన్నని ప్లాస్టిక్ సూదుల్ని స్విట్జర్లాండ్‌లో, దవడ భాగాన్ని థాయ్‌లాండ్‌లో రూపొందించి మరో కొత్త పరికరాన్ని రూపొందించారు. కానీ ఈ పరికరం ఖర్చు ఎక్కువగా ఉండడంతో.. ఖాదీ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం పంపించారు. ● జిల్లాకు చెందిన పొగిరి జశ్వంత్‌నాయుడు (చైన్నె ట్రిపుల్ ఐటీ, ఐఐఎం అమృత్సర్ పూర్వ విద్యార్థి) బృందం కూడా ప్రత్యామ్నాయ పరికరంపై దృష్టిసారించింది. ఐఐఎం అమృత్సర్ వేదికగా ఐదుగురు సభ్యుల బృందం త్రీడీ టెక్నాలజీ సాయంతో మోడల్‌ను రూపొందించింది. ప్లాస్టిక్‌ది కావడం.. ఇతర అంశాల వల్ల ఇదీ సఫలీకృతం కాలేదు. ఈ బృందం మరిన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ● పొందూరుకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం(ఏఎఫ్‌కేకే) వాలుగ చేప సేకరణకోసం విస్తృతంగా ప్రయత్నిస్తోంది. వాలుగ సేకరణ కష్టంగా మారడంతో దానిని పోలి ఉండే మరో రకం చేపపై దృష్టిసారించారు. హిరమండలం రిజర్వాయర్‌లో వీటిని సేకరించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ దీని వినియోగంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. త్వరగా విరిగిపోవడం, అరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దీనిని వినియోగిస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నాం.. పొందూరు ఖాదీలో కీలకమైన వాలుగ చేప దవడ భాగం సేకరణ కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయాల దిశగా ఐఐఎం అమృత్సర్ వేదికగా మా టీమ్ దృష్టి సారించింది. ప్రాఫెసర్తో సహా ఐదుగురు సభ్యులు ఓ పరికరాన్ని రూపొందించాం. కొన్ని ఇబ్బందులు గమనించాం. పూర్తి పర్యావరణ హితమైన మెటీరియల్‌తో తయారు చేసేందుకు మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. – పొగిరి జశ్వంత్ నాయుడు, స్టేటజీ కన్సల్టెంట్, ఈవై శిక్షణ తీసుకున్నాం.. కృత్రిమ చేప ముల్లుతో పత్తిని శుభ్రం చేసే ప్రక్రియను నేర్చుకునేందుకు హైదరాబాదుకు వెళ్లాం. దీని వినియోగంతో నాణ్యమైన 100 కౌంటు దారం రాదు. ఈ కృత్రిమ ముల్లుతో చేయడం వల్ల చేతి వేళ్లకు గాయాలై రక్తం వచ్చేది. అందుకే దీనిని వినియోగించలేదు. –కాపల కుమారి, చేనేత కార్మికురాలు ఆ రిజర్వాయర్‌లో గుర్తించాం.. విదేశీ సాంకేతికతతో తయారు చేసిన ప్రత్యామ్నాయ పరికరం ఖరీదు రూ.750 వరకు ఉంది. అదే వాలుగ చేప దవడ అయితే కేవలం రూ.25 నుంచి రూ.50 వరకు ఉంది.వాలుగ చేప శాస్త్రీయ నామం వల్లగో అట్టు. ఇది మంచి నీటి చేప. మా అధ్యయానాల్లో వాలు గు చేపలు మడ్డువలస రిజర్వాయర్‌లో విస్తృతంగా ఉన్నాయి. చాలా పెద్ద సైజుల్లోనే లభ్యమవుతున్నాయి. –డాక్టర్ కర్రి రామారావు,జీవవైవిధ్య శాస్త్రవేత్త, డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విశాఖపట్నం కొరత వాస్తవమే.. పొందూరు ఖాదీకి కీలకమైన వాలుగ చేప దవడ కొరత వాస్తవమే. చాలా మంది ప్రత్యామ్నాయాల వేటలో ఉన్నారు. కానీ అవి సఫలీకృతం కాలేదు. మా వంతుగా ఇటీవలే హిరమండలం రిజర్వాయర్‌లో వేరే రకం చేపను వినియోగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. వాలుగుకు ఏదీ సాటి రాదు. –డి.వెంకటరమణ, సెక్రటరీ, ఏఎఫ్‌కేకే, పొందూరు వాలుగుకు ఏదీ సాటిరాదు. పత్తిని శుభ్రం చేసేందుకు వాలుగ చేప దవడకు ప్రత్యామ్నాయం లేదనే చెబుతున్నారు నిపుణులు. ఆ సున్నితత్వం.. ఆ శ్వేతవర్ణం వాలుగుకు ఏదీ సాటిరాదంటున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌లో వాలుగ చేపలు ఉన్నాయని జీవవైవిధ్య పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వేట సాగించే మత్స్యకారులకు దీని వినియోగంపై విస్తృతమైన అవగాహన కల్పించి వారితో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా కూడా ఖాదీ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందంటున్నారు. -
ఉద్దానం కిడ్నీకి రక్షణ కవచం... కిడ్నీభూతంపై సర్కారు యుద్ధం
ఉద్దానం అంటే కొబ్బరి, జీడి తోటలే గుర్తుకొస్తాయి. పరిమళించే పచ్చదనం.. సేదదీర్చే ప్రశాంత వాతావరణమే గుర్తుకొస్తాయి. అయితే ఆ ప్రశాంతత వెనుక గూడు కట్టుకున్న విషాదం ఉంది. గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఉన్నాయి. దశాబ్దాలుగా కబళిస్తున్న కిడ్నీ మహమ్మారిని గత పాలకులు పట్టించుకోలేదు. బాధితులను గాలికి వదిలేశారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. వ్యాధిగ్రస్తుల పాలిట ప్రభుత్వమే పెద్ద రక్షణ కవచంలా నిలిచింది. డయాలసిస్ కేంద్రాలు, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో పాటు బాధితులకు నిరంతర వైద్య సేవలు, నెలనెలా రూ.పది వేల భృతితో కొండంత అండగా నిలుస్తోంది. భవిష్యత్తుపై భరోసా ఇస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్దానాన్ని కిడ్నీ వ్యాధి కబళిస్తోంది. కొన్నేళ్లుగా మరణ మృదంగం మోగుతోంది. ఏ ఊరు వెళ్లినా కిడ్నీ రోగులు కనిపిస్తూనే ఉంటారు. వ్యాధి నియంత్రణకు గత పాలకులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. 2019 వరకు కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు, పరిశీలనలకే పరిమితయ్యారు తప్ప వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోలేదు. తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక నియంత్రణ చర్యలు చేపట్టారు. ఏకంగా కిడ్నీ వ్యాధిపై యుద్ధమే ప్రకటించారు. ఉద్దానానికి ఆరోగ్య భరోసా కల్పించేందుకు నడుంబిగించారు. ఖర్చుకు వెనకాడకుండా ఏం చేయాలో, ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పెరిగిన మందుల సరఫరా.. టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును అక్కడి అధికారులకు ప్రభుత్వం కల్పించింది. కిడ్నీ రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. పాతవి పాడైతే ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతీ శనివారం పలాస సీహెచ్‌సీలో సేవలుందిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మూత్ర పిండాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. పెయిన్ కిల్లర్ వినియోగం తగ్గించాలి. మద్యం, సిగరెట్లు అధికంగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్లు పెరుగుతాయి. మూత్ర పిండాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, వాటి పనితీరు మందగిస్తుంది. అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో సుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే కిడ్నీలకు వడపోత క్లిష్టంగా మారుతుంది. బీపీ కారణంగా శరీరంలో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. కిడ్నీలకు వేగంగా రక్తం రావడం వల్ల ఫిల్టర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. పింఛన్లతో ఆసరా.. టీడీపీ ప్రభుత్వంలో రూ.3,500 పింఛన్‌ను ఇచ్చేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దానిని రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా సీరం క్రియేటినైన్ 5కుపైబడి ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు. ఈ లెక్కన 393 మందికి రూ.10వేలు చొప్పున, 367 మందికి రూ.5వేలు చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగకు చెందిన నీలాపు కేదారి పదేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాలుగేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి వైద్య సహాయం అందకపోవడంతో బరంపురం, విశాఖపట్నంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని లక్షల రూపాయల అప్పుల పాలయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలో వచ్చాక మందుల ఖర్చులకు నెలకు రూ.5వేలు ఇవ్వడంతో కొంత ఆర్థిక భారం తగ్గింది. ఏడాదిన్నర నుంచి సోంపేటలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు నెలకు రూ.10 వేలు పింఛన్‌తో పాటు ఉచితంగా మందులు అందిసున్నారు. వారానికి మూడు సార్లు 108 సిబ్బంది 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోంపేటకు తీసుకెళ్తున్నారు. బాధితులకు అండగా.. ఓ వైపు వ్యాధి మూలాలు కనుగొనేందుకు కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మించడం, మరోవైపు వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యంతో పాటు డయాలసిస్, ఉచిత మందులను పూర్తిస్థాయిలో అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంకోవైపు వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరై ఉండొచ్చన్న నిపుణుల సూచనల మేరకు రూ.700కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మిస్తోంది. పథకం అందుబాటులోకి వస్తే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో 807 గ్రామాల్లో 7,82,707 మందికి ఇంటింటికీ కుళాయిల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. దీనికోసం వంశధార నుంచి 1.12టీఎంసీల వినియోగించనున్నారు. 84 ఎంఎల్ ఫిల్టర్ సామర్ధ్యంతో 571 ట్యాంకుల ద్వారా ఊరూరు తాగునీరు అందించనున్నారు. 50 కిలోమీటర్ల పొడవునా మైగా పైపు లైను నిర్మించి, వాటి కింద మరో 134.818 కిలోమీటర్ల పైపులైన్ వేసి ఇంటింటికీ నీరందించే పనులు చివరి దశకు చేరుకున్నాయి. కిడ్నీ వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు రీసెర్చ్ సెంటర్‌తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా మంజూరు చేశారు. రూ.50కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే ప్రారంభించనున్నారు. పెంచిన డయాలసిస్ సేవలు.. ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 13 పడకలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 19కి పెంచారు. కవిటి సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 10 పడకలుండేవి. ఇప్పుడవి 15కి పెరిగాయి. హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెల గాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇవి కాకుండా ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో 10 పడకలు, బారువ సీహెచ్‌సీలో 10 పడకలతో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు కంటైన్డ్ బేస్డ్ సర్వీసెస్ డయాలసిస్ యూనిట్లను సైతం ఏర్పాటు చేశారు. ఒక్కొక్క యూనిట్లలో ఏడేసి పడకలు ఉన్నాయి. పింఛన్‌తో భరోసా కిడ్నీ సమస్య ఉందని, డయాలసిస్ చేసుకోవాలని ఏడాది క్రితం వైద్యులు సూచించారు. దీంతో పలాస ప్రభుత్వ అసుపత్రిలో డయాలసిస్ చేసుకుంటున్నాను. ఐదు నెలలుగా రూ.10 వేలు పింఛన్ వస్తుంది. మందులు, ఇతర ఖర్చులకు పింఛన్ కొంత వరకు సరిపోతుంది. – పి.కుసమయ్య, కిడ్నీ బాధితుడు, పెద్దబొడ్డపాడు, వజ్రపుకొత్తూరు సర్కారు అండతో.. కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న నేను రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. జగనన్న పుణ్యమా అని నాకు రూ.5వేలు పింఛన్ గత నెల వరకు వచ్చేది. ప్రస్తుతం మరో రూ.5 వేలు పింఛన్ అదనంగా ఈ నెల నుంచి వస్తుంది. ఈ మొత్తంతో కొంత వరకు ఆర్థిక ఇబ్బందులు తీరుతున్నాయి. – సిర్ల కాంతమ్మ, పింఛన్ లబ్ధిదారు, వజ్రపుకొత్తూరు -
నాడు కూలీ... నేడు ఓనర్! కాదేది అతివకు అసాధ్యం
ట్రాక్టర్ నడుపుతున్న బడియా సావిత్రిది శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామం. మత్స్యకార కుటుంబానికి చెందిన సావిత్రి పెద్దగా చదువుకోలేదు. కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్ కూలీగా పనిచేసేది. ఆడవాళ్లు కార్లు, బైక్‌లు, బస్సులు, రైళ్లు, విమానాలు నడుపుతున్నారు, ట్రాక్టర్ కూడా నడపవచ్చు అనుకుంది. డ్రైవింగ్ నేర్చుకుంది. తనకు సొంతంగా ట్రాక్టర్ ఉంటే బావుణ్నని కలగన్నది. స్వయంసహాయక బృందంలో సభ్యురాలు కావడంతో గత ఏడాది ఆమెకు ‘స్త్రీ నిధి’ నుంచి 80వేలు, గ్రామ సంఘం నుంచి లక్ష రూపాయల లోన్ వచ్చింది. ఆ డబ్బు డౌన్ పేమెంట్‌గా కట్టి వాయిదాల పద్ధతిౖపై ట్రాక్టర్ కొన్నది. ప్రస్తుతం తన ట్రాక్టర్‌ను తానే నడుపుతూ వ్యవసాయ పనులు, ఇతరత్రా పనులు చేసుకుంటోంది సావిత్రి. ►విజయవాడ నగరం, రామలింగేశ్వర నగర్ నివాసి రమాదేవి. . భర్త వ్యసనపరుడై మరణించాడు. ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి ఇంత కష్టమైన పనిని చేయడానికి ముందుకు వచ్చింది. ఎయిర్ బ్రేక్ సిస్టమ్ మెకానిక్‌గా పని చేస్తోంది. ►ఆటో నడుపుతున్న సరస్వతి సుమతిది నెల్లూరు నగరం. ఇంటర్ వరకు చదువుకున్న సుమతి పిల్లల పోషణ కోసం ఆటో నడుపుతూ, పిల్లలతో పాటు చదువును మళ్లీ మొదలు పెట్టి బీఎల్ పూర్తి చేసింది. ►స్వరూపరాణిది పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు మండలం, గంగన్నగూడెం. ఆడవాళ్లు వేదాలను ఎందుకు చదవకూడదనే ప్రశ్నకు తానే జవాబుగా నిలవాలనుకుంది. వేదాలు ఔపోశన పట్టి, బ్యాంకు మేనేజర్ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పౌరోహిత్యం చేస్తున్నారు. ►నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు సర్పంచ్ గొడ్డేటి వెంకటసుబ్బమ్మ... పొలం దుక్కి దున్నడంతోపాటు నిమ్మచెట్లకు తెగుళ్లు సోకితే స్ప్రేయర్‌తో క్రిమిసంహారక మందులను స్వయంగా పిచికారి చేస్తుంది. ►కాచరమైన కళమ్మ ఉండేది కుషాయిగూడ హైదరాబాద్‌లో.మొదట భవన నిర్మాణ కార్మికురాలిగా ఉన్న కళమ్మ 30 ఏళ్లుగా ఇండ్లకు, దేవాలయాలకు పెయింటింగ్ వేస్తోంది. ►మదనపల్లె పట్టణంలో రేణుక... డ్రైవింగ్ స్కూల్లో స్వయంగా తానే మహిళలకు డ్రైవింగ్ నేర్పిస్తోంది. ►యదళ్ళపల్లి ఆదిలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్లో ఉంటుంది. గత 5 ఏళ్లుగా మెకానిక్‌గా పనిచేస్తోంది. ►కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పెట్రోలు బంకులో పెట్రోలు పడుతున్న పగిడేల ఉమా మహేశ్వరి. చదవండి: Lalitha Manisha: తెనాలి అమ్మాయి.. డోలు నేర్చుకుని! అరుదైన ఘనత.. 35 రకాల తాళాలతో.. -
భర్తకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్య.. అసలేం జరిగింది?
నరసన్నపేట(శ్రీకాకుళం జిల్లా): మద్యం మహమ్మారి మరో కుటుంబాన్ని నిలువునా బలి చేసింది. రోజూ తాగి వచ్చి వేధించే భర్త తీరును భరించలేక ఓ మహిళ ఏకంగా అతడిని హత్య చేసింది. అందుకు తన సోదరుడి సాయం తీసుకుంది. నరసన్నపేట మండలం పెద్దకరగాంలో మంగళవా రం జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకరగాంకు చెందిన ఇర్రి చంద్రభూషణ్(37)కు పదేళ్ల కిందట తోటపాలేంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. వీరికి మాధురి, లాస్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న చంద్రభూషణ్ తాగుడుకు బానిసైపోయాడు. ఇతర వ్యసనాలు కూడా ఉండడంతో నిత్యం భార్యను వేధించేవాడు. ఈ గొడవ గ్రామంలో పెద్ద మనుషుల వరకు కూడా వెళ్లింది. రచ్చబండలో సంప్రదింపులు జరిగా యి. అయినా చంద్రభూషణ్‌లో మార్పు రాలే దు. వారం కిందటే భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. దీంతో భాగలక్ష్మి తన కన్నవారింటికి వెళ్లిపోయింది. రెండు రోజుల కిందటే భర్త వద్దకు వచ్చింది. వచ్చిన రోజు రాత్రి మళ్లీ వివాదం జరిగింది. దీంతో పోలీసులను ఆశ్రయిస్తే వారు కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటికీ చంద్రభూషణ్ మారలేదు. సోదరుడిని పిలిచి.. మంగళవారం కూడా తాగి ఇంటికి వచ్చిన చంద్రభూషణ్ మళ్లీ భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆమె తన సోదరుడు శివకు ఫోన్ చేసి ఇంటికి పిలిచారు. అతను వచ్చాక మద్యం మత్తులో ఉన్న చంద్రభూషణ్‌పై కర్రలు, మంచం కోళ్లతో దాడి చేసి విపరీతంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక చంద్రభూషణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే శివ పారిపోకుండా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సంఘటన తెలు సుకున్న నరసన్నపేట సీఐ డి.రాము, ఎస్ఐ సింహాచలంలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలను స్థానికుల నుంచి సేకరించారు. వీఆర్వో గవరయ్య, గ్రామ పెద్దమనుషుల మధ్య శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నరసన్నపేట ఎస్ఐ వై.సింహాచలం కేసు నమోదు చేయగా.. సీఐ రాము దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లికి ముందే ప్రేమ.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది -
‘బీసీలకు చంద్రబాబు చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదు’
శ్రీకాకుళం: బీసీలకు చంద్రబాబు నాయుడు చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. బీసీలను అత్యంత అవమానానికి గురిచేసిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు మంత్రి. ప్రస్తుత వైస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ విధంగా సామాజిక న్యాయం జరుగుతుందో ఎమ్మెల్సీ అభ్యర్థులను చూస్తే అర్ధమౌతుందని, సింహభాగం వెనుబడినవారే ఎమ్మెల్సీలుగా ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యం గతంలో ఎవరూ ఈ వర్గాలకు ఇవ్వలేదన్నారు. ‘లోకేష్ వడ్డేరాలను అణగద్రోక్కేస్తున్నామంటున్నారు. మిష్టర్ మాలోకం.. వడ్డేరాలకు ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లో కూర్చో పెడుతున్నాం. మీ నాన్న బీసీలకు ఎంత అన్యాయం చేశాడో చూడు. బలహీనవర్గాలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు అణగొక్కారు. గతంలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారో లోకేష్ చెప్పాలి. ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు కోర్టుకు వెళ్లలేదా?, సిగ్గులేని రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. రాబోయే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారీ వ్యవస్థకు మధ్య జరిగే ఎన్నికలు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును మట్టికరిపించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. -
వైభవంగా ముఖలింగేశ్వరుని త్రిశూల చక్రతీర్థ స్నానం (ఫొటోలు)
-
కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం: పురుషోత్తం
ఇచ్ఛాపురం రూరల్: ఒక సాదాసీదా ఉద్దానం కుర్రా డు. సినిమాలపై ఇష్టం పెంచుకున్నాడు. ఎలాగైనా తనో సినిమా తీయాలని కలలు గన్నాడు. స్టూడియో ల చుట్టూ తిరిగాడు. అనుభవం వచ్చింది గానీ అవకాశం రాలేదు. తనే సినిమా నిర్మించాలని కువైట్ వెళ్లి డబ్బులు కూడబెట్టాడు. సొంతూరిలో జరుగుతున్న కథను తన చిత్రానికి ఇతివృత్తంగా తీసుకున్నాడు. తెలిసిన వాళ్లను నటులుగా తీసుకుని గంటన్నర సినిమాను చిత్రీకరించేశాడు. తన ప్రతిభను చూడండంటూ థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించాడు. ఇదేమీ రాబోయే కొత్త సినిమా కథ కాదు. పరిమిత వనరులతో సినిమా తీసిన కుర్రాడి స్టోరీ. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పురుషోత్తం అన్న టైటిట్ కార్డు వెనుక దాగి ఉన్న విషయాలను తెలుసుకుందాం. ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ గ్రామా నికి చెందిన పురుషోత్తం మజ్జి బీకాం డిగ్రీ పూర్తి చేశాడు. సినిమాలపై చిన్నప్పటి నుంచే విపరీతమైన ఇష్టం ఉండేది. ఆ ఇష్టంతోనే హైదరాబాద్ వెళ్లాడు. స్టూడియోల చుట్టూ తిరిగాడు. కానీ సినిమా అవకాశం అంత సులభంగా రాదని తొందరగానే గ్రహించాడు. సొంతంగా సినిమా తీయాలని నిశ్చయించు కుని స్నేహితులకు చెబితే అంతా నవి్వన వారే గానీ ప్రోత్సహించలేదు. అయినా పట్టు విడవలేదు. సిని మా తీయడానికి డబ్బులు సంపాదించాలని కువైట్ వెళ్లాడు. అక్కడ డబ్బులు కూడబెట్టాడు. సినిమా తీయాలన్న తపనే గానీ అప్పటి వరకు కథ ఏమీ అనుకోలేదు. ఆ క్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సామాజిక సేవలు అందిస్తున్న స్పెషల్ గయ్స్ ఫౌండేషన్ గురించి అతనికి తెలిసి.. ఆ కథనే సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఎస్జీఎఫ్ కార్యకర్తను సంప్రదించి అన్ని విషయాలను సేకరించిన రెండేళ్ల పాటు కష్టపడి 180 పేజీల కథను సిద్ధం చేశాడు. 2020లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో స్వగ్రామానికి చేరుకున్నాడు. రూ.రెండు లక్షలతో సినిమా.. కథ సిద్ధమయ్యాక.. సాంకేతిక వర్గం కోసం అన్వేష ణ ప్రారంభించాడు. ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న స్నేహితుడు అభిరాం బిసాయిని కెమెరామెన్‌గా పెట్టుకున్నాడు. 2020 సెపె్టంబర్ నెలలో తను తీయబోయే సినిమాకు నటులు కావాలంటూ సోషల్ మీ డియాలో చేసిన ప్రకటనకు స్పందన నామమాత్రంగానే వచ్చింది. అయినా వచ్చిన వారినే నటులుగా పెట్టుకున్నాడు. ఉద్దానం పల్లెల్లోనే షూటింగ్ చేశా డు. రెండేళ్ల పాటు ఆటుపోట్లు ఎదుర్కొని సినిమా పూర్తి చేసి ఈ నెల 12న విడుదల చేశాడు. ఓ నలు గురు స్నేహితులు ఓ సేవా సంస్థగా ఏర్పడి అత్యవసర సమయాల్లో రక్తదానం, అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి ఆర్థిక సాయం, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఆదుకోవడం, నిరుపేద విద్యార్థులను చదివించడం వంటి సామాజిక అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రధానంగా ప్రతినాయకుడు చివరకు సామాజిక కార్యకర్తగా మారేలా చిత్రాన్ని రూపొందించాడు. వారం పాటు ఉచిత ప్రదర్శన సామాజిక అంశాలపై తీసిన ఈ చిత్రాన్ని వారం రోజుల పాటు కవిటి మహాలక్ష్మీ సినిమా హాల్ల్లో ప్రదర్శించారు. సుమారు రూ.రెండు లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సందేశాత్మక చిత్రాన్ని చూసిన ప్రతి పది మంది వ్యక్తుల్లో ఒక్కరు తోటి వారికి సాయపడాలన్న ఆలోచన వస్తుందనే ఆలోచనతో ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు పురుషోత్తం తెలిపాడు. సగంలో ఆపేద్దాం అనుకున్నాం.. సినిమా రంగంలో ఏ మా త్రం అనుభవం లేకపోయినా, ధైర్యంతో ముందడుగు వేశాను. ఏడాది పాటు సినిమా షూటింగ్ సమయంలో కొంత మంది నటులు మధ్యలో వైదొలగడం, ఆర్థికంగా ఇబ్బంది పడటంతో సినిమాను మధ్యలో నిలిపివేద్దాం అనుకున్నాను. డబ్బులు కోసం ఏ ఒక్కరి దగ్గర చేయి చాచలేదు. కష్టమో, నష్టమో సినిమా పూర్తి చేసి నా టాలెంట్‌ను నిరూపించుకోవాలని అనుకు న్నాను. ఎవరైనా పెట్టుబడి పెడితే ఇదే చిత్రం పార్ట్–2 తీయాలనుకుంటున్నాను. ఈ చిత్రా న్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. – పురుషోత్తం మజ్జి, తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం -
రోడ్డు ప్రమాదం.. పెళ్లైన మూడో రోజే నవవధూవరులు మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధూవరులిద్దరూ మృత్యువాతపడ్డారు. ఒడిశా సరిహద్దులోని గొల్రంత వద్ద దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పెళ్లైన రెండు రోజులకే దంపతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు.. ఇచ్ఛాపురం బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు నాగరత్నం, రామారావు కుమారుడు వేణుకు (26) ఒడిశాలోని బరంపురానికి చెందిన స్ ప్రవల్లికతో (23) ఈనెల 10న సింహాచలం వరహా లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో వివాహమైంది. పెళ్లికి బంధువులందరూ హాజరయ్యారు. ఈనెల 12న ఆదివారం ఇచ్ఛాపురంలో రిసెప్షన్ జరిగింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సోమవారం సాయంత్రం నూతన జంట ద్విచక్రవాహనంపై ప్రవల్లిక ఇంటికి బరంపురానికి బయల్దేరారు. కాసేపు ఉండి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో గొళంత్రా దగ్గర వెనక నుంచి వస్తున్న ఓ ట్రాక్టర్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అక్కడికక్కడే మృతిచెందింది. వరుడికి తీవ్ర గాయాలవ్వగాని స్థానికులు బరంపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కూడా మృతిచెందారు. కలకాలం కలసి కాపురం చేయాలనుకున్న జంట పెళ్ళి అయిన ఇలా కాళ్ల పారాణి ఆరకముందే మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: Valentine's Day: ఖండాంతరాలు దాటిన ప్రేమ -
బైక్ ను ఢికొన్న ట్రాక్టర్.. పెళ్లి అయిన నాలుగు రోజులకే నవ దంపతులు మృతి
-
శ్రీకాకుళం, మన్యం జిల్లాలో ఏనుగులు హల్ చల్
-
బడుగుల భూముల్లో రాబంధువులు
దశాబ్దాల క్రితం ఆ భూములు నిరుపేద ఎస్సీ, బీసీలకు దాఖలు పడ్డాయి. సర్కారు డీ పట్టాలు ఇచ్చింది. కానీ వారెవరూ వాటిని అనుభవించ లేకపోతున్నారు. కారణం అవి ఎప్పుడో పెత్తందార్లు కబంధ హస్తాల్లో చిక్కుకోవడమే. వారికి టీడీపీ కీలక నేత అండ ఉండటం, అడిగితే అంతు చూస్తారన్న భయంతో బడుగుల వాటి పై ఆశలు వదులుకున్నారు. 2022లో సమాచార హక్కు చట్టం ద్వారా ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దళిత సంఘాలు కోట్ల విలువ చేసే çసుమారు 20 ఎకరాల భూములను టీడీపీ పెత్తందారులు చెర నుంచి రక్షించేందుకు ఉద్యమిస్తున్నారు. అయితే కీలక టీడీపీ నేత సోదరుడు అధికారులపై ఒత్తిడి చేస్తూ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో మరో భూదందా వెలుగులోకి వచ్చింది. కింజరాపు ఫ్యామిలీ స్వగ్రామమైన కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు పక్కనే తులసిపేటలో దాదాపు 19.62ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమి ఆక్రమణకు గురైంది. నిరుపేద ఎస్సీ, బీసీలకు ఇచ్చిన భూమిని అక్కడి పెత్తందార్లు ఆక్రమించుకోగా.. వీరికి టీడీపీ కీలక నేత అండగా నిలిచారు. ఇంకేముంది వారి కబంద హస్తాలనుంచి ఆక్రమిత భూమి బయటకి రావడం లేదు. గట్టిగా అడుగుదామంటే ఎక్కడ చంపేస్తారేమో అన్న.. భయంతో బాధితులు వణికిపోతున్నారు. 19.62 ఎకరాల మేర భూ ఆక్రమణ దివంగత కింజరాపు ఎర్రంనాయుడు, ప్రస్తుత ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీ రాజకీయాల్లోకి రాకముందు అప్పటి ప్రభుత్వం నిమ్మాడకు పక్కనున్న తులసిపేటలోని నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు ల్యాండ్ సీలింగ్ భూమిని డీ పట్టాల కింద ఇచ్చింది. కింజరాపు ఫ్యామిలీ స్వ గ్రామం నిమ్మాడకు కిలోమీటరన్నర దూరంలో ఉ న్న చిట్టివలస రెవెన్యూ పరిధిలో తులసిపేట ఉంది. సర్వే నెంబర్.194/1, 194/7,195/2, 200/1, 203/3బి, 208/2ఎ, 208/2సీ, 217/2, 222/1లోగల 19.62ఎకరాల భూమిని 33 మంది నిరుపేద ఎస్సీలకు, 19 మంది నిరుపేద బీసీలకు డీ పట్టాల కింద ప్రభుత్వమిచ్చింది. అయితే, ప్రభుత్వం తమకిచ్చిన భూములను లబ్ధిదారులు వెంటనే సాగు చేయకపోవడంతో అక్కడనున్న టీడీపీ నేతల అండదండలున్న పెత్తందార్లు ఆక్రమించారు. అంతటితో ఆగకుండా సాగు చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములు కావడంతో భూములు వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. టీడీపీ కీలక నేతలు అండదండలు ఉండటంతో ఆ భూమి మీదకి నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులు వెళ్లడానికి భయపడుతున్నారు. అసలే అక్కడ హత్యా రాజకీయాలు. నిమ్మాడ కేంద్రంగా టీడీపీ కీలక నేత ఫ్యామిలీకి నేర చరిత్ర కూడా ఉంది. వారిని కాదని అక్కడ ముందుకెళ్లడానికి సహజంగానే భయం. అలాంటి పరిస్థితులున్న పక్క గ్రామమే కావడంతో ప్రభుత్వం తమకిచ్చిన భూముల్లోకి వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. ఆందోళనలు చేస్తున్నా.. నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ దళిత మహసభ జిల్లా శాఖ, మరికొన్ని సంఘాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా గత కొన్నాళ్లుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా శాఖ అధ్యక్షుడు, టెక్కలి వాసి బోకర నారాయణరావు సమాచార హక్కు చట్టం కింద ఆ భూముల వివరాలు, పట్టాదారులెవరు, ప్రస్తుత అనుభవదారులు ఎవరన్న వివరాలను లిఖిత పూర్వకంగా అడిగారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమాచార హక్కు చట్టం కింద లిఖితపూర్వంగా 2022 మార్చిలో వివరాలు ఇచ్చింది. 19.62 ఎకరాలను 33 మంది ఎస్సీలకు, 19 మంది బీసీలకు ఇచ్చారని, ఇప్పుడా భూమి ఆక్రమణ జరిగిందని, ఫలానా వ్యక్తుల అనుభవంలో ఉందని నిర్ధారణ కూడా చేస్తూ వివరాల్లో పేర్కొంది. ఆక్రమణలో ఉన్న భూమిని అసలైన లబ్ధిదారులకు అప్పగించాలని కొన్ని నెలలుగా ఆందోళన జరుగుతోంది. అధికారులపై ఒత్తిళ్లు ఆందోళనలు జరుగుతుండటం, ఆక్రమిత భూమి వ్యవహారం వెలుగు చూడటం, సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన రిప్లయ్‌లో ఆక్రమణలు ‘డీ–పట్టా భూములు అప్పగించాలి’ కోటబొమ్మాళి: మండలంలోని చిట్టివలస పంచాయతీ తులసిపేటలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన డీ–పట్టా భూములను గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని దళిత హక్కుల పోరాట కమిటీ జిల్లా కార్యదర్శి ఎడ్ల గోపి, అధ్యక్షుడు పాల పోలారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన తెలిపారు. ఈనెల 20లోగా రెవెన్యూ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ జామి ఈశ్వరమ్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చిట్టి సింహాచలం, బలగ రామారావు, జామాన రామారావు, బమ్మిడి వేణు పాల్గొన్నారు. ఆక్రమణదారులకు అండగా పెద్దలు డీ పట్టా భూముల ఆక్రమణదారులకు రాజకీయ పెత్తనం, అధికారం చెలాయిస్తున్న ఫ్యామిలీ అండదండలు ఉన్నాయి. ఆక్రమణ బాగోతమంతా టీడీపీ కీలక నేతల కనుసన్నల్లోనే జరిగింది. పెద్దల అండదండలు ఉండటంతో నిరుపేదలు ఏం చేయలేకపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ వాదన వినిపిస్తున్నారు. ముందుకెళ్లలేక, వెనక్కి తగ్గలేక నిరుపేద లబ్ధిదారులు అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఆ భూములు అసలైన లబ్ధిదారులకు అప్పగించి న్యాయం చేయాలి. – బోకర నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ దళిత మహసభ జిల్లా శాఖ అధ్యక్షుడు స్వాధీనం చేసుకుంటాం తులసిపేట ప్రభుత్వ భూమిలో ఎస్సీ, బీసీ పేద కుటుంబాలకు పట్టాలిచ్చారని, అవి ఆక్రమణకు గురయ్యాయని టెక్కలి సబ్ కలెక్టర్‌కు దళిత సంఘం నేత ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇటీవల గ్రామానికి మా సిబ్బందిని పంపించాం. కానీ, స్థానికంగా ఎవరూ సహకరించలేదు. బుధ వారం మరికొందరు బాధిత లబ్ధిదారులు ఫిర్యా దు చేయడంతో మళ్లీ గ్రామానికి వెళ్లి సమగ్ర విచారణ జరుపుతాం. అంతా నిర్ధారించుకున్నాక పోలీసుల బందోబస్తు మధ్య ఆ భూములను స్వాధీ నం చేసుకుని, అసలైన లబ్ధిదారులకు అప్పగిస్తాం. – జామి ఈశ్వరమ్మ, తహశీల్దార్, కోటబొమ్మాళి జరిగాయని అధికారులు నిర్ధారించడం వంటి పరిణామాల నేపథ్యంలో అధికారులు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశంతో టీడీపీ కీలక నేత సోదరుడు రంగంలోకి దిగి ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఇప్పుడా భూముల జోలికి పోవద్దని, తాము అధికారంలోకి వస్తామని, అంతవరకు జాప్యం చేయాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. తమ మాట వినకపోతే తాము అధికారంలోకి వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరికలు కూడా చేసినట్టు తెలియవచ్చింది. -
ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. ఉపాధి హామీ కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమదాలవలస మండలం మందడిలో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గురువందల పాపమ్మ, అంబటి సత్తెమ్మ, కురమాల లక్ష్మి మృతి చెందారు. అమలాపురం గౌరమ్మకు తీవ్ర గాయాలు కాగా, శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చదవండి: హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు -
నమ్ముకున్న వారికి వెన్నుపోటు.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎన్నికలకు చాలా కాలం ఉన్నా పచ్చ పార్టీలో ఈ సీటు కోసం పోటీ పెరుగుతోంది. దశాబ్దాలుగా ఇక్కడ చక్రం తిప్పుతున్న సీనియర్ నేత కుటుంబానికి ఈ సారి చెక్ పెట్టాలని టీడీపీ అధినేత నిర్ణయించారట. అయితే తమ కుటుంబానికే శ్రీకాకుళం ఇవ్వాలని వారు గట్టిగా అడుగుతున్నారట. మరి పచ్చ పార్టీ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో? అసలు అక్కడ ఏం జరుగుతోంది? 37 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో చక్రం తిప్పుతున్న గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి వచ్చే సారి సీటు ఇవ్వరాదని టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుందట. నాలుగుసార్లు సూర్యనారాయణ, ఒకసారి ఆయన భార్య లక్ష్మీదేవి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019లో మరోసారి ఆమెకే టికెట్ ఇవ్వగా ధర్మాన ప్రసాదరావు చేతిలో పరాజయం పొందారు. వచ్చే 2024 ఎన్నికల్లో కూడా తమలోనే ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కాని ఈసారి వీరిద్దరికి ఛాన్స్ లేదని జిల్లా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇక్కడ నుండి అసెంబ్లీకి పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. తన బాబాయ్ అచ్చెన్నాయుడు ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటే తాను కూడా అసెంబ్లీకి వెళ్లాల్సిందేనన్నది రామ్మోహన్ నాయుడు ఆలోచనగా ఉంది. ఇందు కోసం ఈయన నరసన్నపేట లేదా శ్రీకాకుళం అనే ఆప్షన్ తీసుకోనున్నారని ఎంపీ సన్నిహితులు చెబుతున్నారు. బాబు నిర్వాకం బట్టబయలు మరోవైపు గుండ అప్పల సూర్యనారాయణకు ముఖ్య అనుచరుడుగా ఉన్న గొండు శంకర్ కూడా శ్రీకాకుళం నుండి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గొండు శంకర్ ద్రోహం చేయడం వల్లే తమకు ఓటమి సంభవించిందని గుండ దంపతుల అనుమానం. అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చంద్రబాబు, యర్రంనాయుడుల వైఖరిని విమర్శించారు గుండ అప్పలసూర్యానారాయణ. చంద్రబాబు వైఖరి వలన పార్టీ తీవ్రంగా నష్టపోనున్నదని, పార్టీలో తనకు అవమానాలు ఎదురయ్యాయంటూ.. తన బాధను చెప్పుకుంటున్న సందర్బంలో వీరిద్దరి మధ్య జరిగిన చర్చ ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సందర్బంలో గొండు శంకర్ అక్కడే ఉన్నాడని, ఆయనే ఈ ఆడియో లీక్ చేసారని గుండ దంపతుల అనుమానం. అప్పటి నుండి గొండు శంకర్ ను వీరిద్దరూ దూరం పెట్టారు. దీంతో గొండు శంకర్ వీరిద్దరికి వ్యతిరేకంగా కొత్త శిబిరం పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దపడుతున్నారు. అచ్చెన్న మాటకు విలువుందా? మరో వైపు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయిన కొర్ను ప్రతాప్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. ఎం.పి రామ్మోహన్ నాయుడు పోటీ చేయకపోతే శ్రీకాకుళంలో తనకు అవకాశం ఇస్తారని ఆయన ఆశిస్తున్నారు. ఈయనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మద్దతు కూడా ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం మీద గుండ దంపతులు అవుట్ డేటెడ్ కావడంతో కొత్తవారు ఈ స్థానం నుండి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఎం.పి రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్, కొర్ను ప్రతాప్ లలో ఎవరు ఈ టికెట్ ను ఎగరేసుకుపోతారో కొద్ది రోజుల్లో తేలిపోతోంది. కొత్తతరం హడావుడితో ప్రస్తుతానికి గుండ దంపతుల శిబిరం మాత్రం బోసి పోయి కనిపిస్తోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అన్నదాతల తెలివికి ప్రతీక ఇది.. భూదేవి ఒడిలో ధాన్యలక్ష్మి
ఊరి దారులు రహస్యంగా దాచుకున్న కథలు కోకొల్లలు. నల్లటి తారు కప్పుకున్న రోడ్లు, తెల్లటి సిమెంటు రంగేసుకున్న బాటలు.. నిజానికి రహదారులు మాత్రమే కావు.. వేల జ్ఞాపకాలకు ద్వారాలు. పల్లెల్లో మట్టి రోడ్ల రోజులు గతించిపోతూ కొన్ని అలవాట్లను తమతో ఉంచేసుకున్నాయి. అలా నిన్నటి కాలం తనతో ఉంచేసుకున్న కథ ‘పాతర’. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఆరు కాలాల పాటు నిల్వ ఉంచడానికి భూమి కడుపును ఆశ్రయించిన అన్నదాతల తెలివికి ప్రతీక ఇది. ధాన్యలక్ష్మి బాధ్యతను భూదేవికే అప్పగించారు. ఇచ్ఛాపురంలోని సరిహద్దు గ్రామాల్లో అక్కడక్కడా ఈ పాతర్లు ఇంకా దర్శనమిస్తున్నాయి. ధాన్యం నిల్వ ఉంచడానికి ఈరోజు అనేక పద్ధతులు ఉండవచ్చు. కానీ సాంకేతికత అనేదే లేని రోజుల్లో నెలల తరబడి ధాన్యం నిల్వ చేయడానికి మన పూర్వీకులు కనిపెట్టిన ఈ విధానం వారి విజ్ఞానానికి ఓ నిదర్శనం. ఇచ్ఛాపురం రూరల్(శ్రీకాకుళం జిల్లా): పల్లె ఒడిలో పెరిగి పెద్దయిన వారికి.. గ్రామాల్లో బాల్యం గడిపిన వారికి పాతర్లు పరిచయమే. కానీ పట్టణీకరణ పెరిగి మట్టికి దూరమైపోతున్న ఈ తరానికి మాత్రం పాతర గురించి కచ్చితంగా తెలియాలి. పాతర వేయడం అంటే భూమిలో గొయ్యి తీసి దాచిపెట్టడం. ఒకప్పుడు ధాన్యం నిల్వ ఉంచడానికి ఎలాంటి సాధనం లేని రోజుల్లో భూమిలో ధాన్యం ఉంచే పద్ధతిని మన పూర్వీకులు అనుసరించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పల్లెల్లో ఇప్పటికీ ఇవి కనిపిస్తున్నాయి. అంత సులభం కాదు.. ∙ఈ ధాన్యాన్ని పాతర వేయడం అంటే అనుకున్నంత సులువేం కాదు. ∙పాతర వేయడానికి రైతుల ఇళ్ల ముందు వీధిలో ఉండే ఖాళీ స్థలాన్ని ఎంచుకొని వృత్తాకారంలో, దీర్ఘ చతురస్త్రాకారంలో నిల్వ చేయాల్సిన ధాన్యం రాశి పరిమాణానికి తగినట్లుగా గోతిని తవ్వుతారు. ∙గోతిని కనీసం ఆరు అడుగుల లోతులో తవ్వడం పూర్తయ్యాక, వరి నూర్పులు సమయంలో వచ్చిన ఎండు గడ్డిని జడలా అల్లుతూ ‘బెంటు’ను తయారు చేస్తారు. ∙దాన్ని గోతిలో పేర్చి, అడుగు భాగంలో కొంటి గడ్డిని పొరలు పొరలుగా అమర్చుతారు. ∙భారీ వర్షాలు కురిసినా నీరు గోతిలో చేరకుండా చాకచక్యంగా పై వరకు అమర్చుతారు. ∙అందులో టార్పాలిన్లు గానీ, వలను గానీ వేసి ధాన్యంను వేస్తారు. ∙అనంతరం ధాన్యంపై ఎండు గడ్డిని వేసి, దానిపై మట్టితో కప్పి ఆవు పేడతో శుభ్రంగా అలుకుతారు. రక్షణ కోసం.. ఒక్కసారి పాతర వేశాక.. ధాన్యం పోతుందన్న దిగులు రైతులకు ఇక ఉండదు. వానలు, దొంగలు, అగ్ని ప్రమాదాలు ఇలా ఏ వైపరీత్యం వచ్చినా పాతరే పంటను కాపాడుకుంటుంది. చాలా ఇళ్లలో ఈ పాతర్లకు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు కూడా చేసేవారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా పేడతో అలికి ముగ్గులు పెట్టి మురిపెంగా చూసుకునేవారు. బియ్యం కావాల్సిన సమయంలో తీసి మిల్లు చేసుకోవడమో దంచుకోవడమో చేసుకునేవారు. పాతర ధాన్యం తిన్న పిల్లలు పుష్టిగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల్లో నానుడి ఉంది. పూర్వం గ్రామాల్లో ఉండే భూస్వాములు రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించేవారు. పంట దిగుబడి తనకే అధికంగా వచ్చిందనడానికి ప్రతీకగా తమ ఇళ్లముందు పాతర్ల రూపంలో తోటి రైతులకు తెలియజెప్పేందుకు వేసేవారని చెబుతారు. పుష్కలంగా పోషకాలు.. పాతర్లలో నిల్వ చేసిన ధాన్యంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ధాన్యం పరిమాణంలో కూడా తేడా వస్తుంది. పాతర్లలో నెలల తరబడి ఉండటంతో ధాన్యం భూగర్భంలో బాగా ముక్కుతాయి. ఇలాం ధాన్యం మిల్లులో వేసి బియ్యం చేయడం కన్నా, ఎండలో వేసి రోట్లో వేసి దంచిన తర్వాత వచ్చిన బియ్యాన్ని ఉపయోగిస్తే మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. బియ్యంతో తయారైన ఆహారం తినడం వల్ల రక్తహీనత సమస్యలు దరికి చేరవు. ఇచ్ఛాపురం మండలంలో చాలా గ్రామాల్లో పాతర్ల పద్ధతిని కొనసాగిస్తుండటం గమనార్హం. – పిరియా శ్రీదేవి, వ్యవసాయాధికారి, ఇచ్ఛాపురం మండలం గ్రామంలో సిమ్మెంట్ రోడ్లు వచ్చినా.. తరతరాలుగా వస్తున్న పాతర సంప్రదాయాన్ని ఇప్పటికీ మేము కొనసాగిస్తూనే వస్తున్నాం. రైతుల ఇళ్ల ముందు వేసిన పాతర ఎంత ఎత్తులో ఉంటే యజమాని ఎన్ని ఎకరాల భూస్వామిగా అప్పట్లో నిర్ధారించేవారు. అప్పట్లో రైతుకు మానసికంగా ఎన్ని కష్టాలు వచ్చి నా, ఈ ధాన్యం పాతర చేసి కష్టాలను మరచిపోయేవారు. దొంగల భయం నుంచి, అగ్ని భయం నుంచి సురక్షితంగా ధాన్యం సంరక్షించుకునేందుకు చక్కని అవకాశం ఈ పాతర్లు. – కొణతాల కనకయ్య, రైతు, తేలుకుంచి, ఇచ్ఛాపురం మండలం -
శ్రీకాకుళం: సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ జెట్ కలకలం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌జెట్ ఒకటి కలకలం సృష్టించింది. కాగా, చేపలవేటకు వెళ్లిన మత్య్సకారులకు నీటిపై తేలియాడుతూ డ్రోన్ జెట్ కనిపించింది. దీంతో, వారు వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు దీన్ని ఎవరు ప్రయోగించారు?, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కాగా, దానిపై ఉన్న అక్షరాలను బట్టి పోలీసులు కోడ్ చేస్తున్నారు. అయితే, ఇది విదేశాలకు చెందినదా?.. లేక స్వదేశంలో తయారైందా? అనే కోణంలో కూడా ఢిల్లీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మరోవైపు, వాతావరణ శాఖకు చెందిన, అంతరిక్ష పరిశోధనాల్లో ఇలాంటి డ్రోన్ జెట్లను శాస్త్రవేత్తలు వాడుతుంటారని సమాచారం. ఇక, దీన్ని ఎవరి ప్రయోగించారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డ్రోన్‌పై ఈస్ట్ కోస్ట్ నావల్ అధికారులు కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే, దీన్ని ఎలాంటి కెమెరాలు లేవు. కానీ.. రేడియో సిగ్నల్స్‌ను పంపే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రం ఉన్నట్టు సమాచారం. -
టీడీపీలో యూజ్ అండ్ త్రో పాలసీ..! అచ్చెన్న వ్యాఖ్యలు నిజమే?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తెలుగుదేశం పార్టీలో యూజ్ అండ్ త్రో పాలసీ మరోసారి తెరపైకి వచ్చింది. పాతపట్నం టీడీపీలో ‘చేతిచమురు’తో క్రియాశీలకంగా వ్యవహరించిన మామిడి గోవిందరావు విషయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయి. పార్టీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నా కూరలో కరివేపాకు మాదిరిగానే వాడుకుంటున్నట్టు మరోసారి స్పష్టమైంది. మామిడి వెంట తిరుగుతున్న వారిపై వేధింపులు ప్రారంభించి.. తనను కాదని వెళ్లితే టార్గెట్ చేయక తప్పదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి కలమట వెంకటరమణ తన చేతల ద్వారా చూపిస్తున్నారు. అధినేతలు తన మాటకే విలువ ఇస్తారని టీడీపీ కేడర్‌కు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం పాతపట్నం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కేడర్‌కు వేధింపులు.. టీడీపీలో డబుల్ గేమ్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరో నేత మామిడి గోవిందరావు మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ వస్తుందనే విధంగా గోవిందరావు దూకుడుగా వెళ్తున్నారు. టీడీపీలో ఉన్న అరకొర కేడర్‌ను నయానో భయానో తనవైపు తిప్పుకుంటున్నారు. దీంతో అక్కడ పార్టీ ఇన్చార్జిగా ఉన్న కలమట వెంకటరమణ ఉనికి తగ్గింది. అటు లోకేష్‌ను, ఇటు చంద్రబాబును తరుచూ కలుస్తూ, వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వదులుతూ గోవిందరావు హడావుడి చేస్తున్నారు. అధిష్టానం వద్దే మామిడికే ప్రాధాన్యత ఉందని టీడీపీలో ఉన్న కార్యకర్తలు ఒక్కొక్కరిగా మామిడి వైపు వస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన కలమట ..ఇంకా వదిలేస్తే తన అస్థిత్వానికే ముప్పుతప్పదని గ్రహించి యాక్షన్‌లోకి దిగారు. కేడర్ చేజారిపోకుండా జాగ్రత్తపడ్డారు. తన నుంచి వెళ్తున్న నాయకులు, కార్యకర్తలపై వేధింపులు మొదలు పెట్టారు. పార్టీ పదవులుండి.. మామిడి వెంట వెళ్తున్న నాయకులపై వేటు వేయిస్తున్నారు. దానికొక ఉదాహరణగా ఎల్‌ఎన్‌పేట పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వెలమల గోవిందరావు తాజాగా మామిడి గోవిందరావు వెంట వెళ్లడంతో ఆయన పదవిని తొలగించారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు, కూన రవికుమార్లకు చెప్పి హుటాహుటీన వెలమల గోవిందరావుకు ఉన్న మండల పార్టీ అధ్యక్ష పదవిని మెండ మనోహార్ అనే వ్యక్తికి కట్టబెట్టారు. దీంతో మామిడి వెంట ఉన్న వెలమల గోవిందరావు మరికొందరు నాయకులు ఎదురుదాడి చేసి కలమటపై ఆరోపణలు చేసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇదంతా చూస్తుంటే నిమ్మాడలో అచ్చెన్నాయుడు చెప్పినట్టు మామిడి గోవిందరావును వాడుకోవడానికే తప్ప అంతకుమించి ఏమీ లేదన్న వ్యాఖ్యల్ని నిజం చేస్తున్నట్టుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ రోజు..మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చే ఆలోచన లేదని.. కలలో కూడా ఊహించొద్దని...నీ కోసం వాడుకోవడానికే ఉపయోగిస్తున్నానని.. పార్టీ కోసం డబ్బులిస్తున్నాడు.. తరుచూ చెక్‌లు తీసుకొచ్చి ఇస్తున్నాడు.. చెక్ కాదు కదా ఆస్తి రాసిచ్చినా పార్టీకి వాడుకుంటాం.. వాడుకోవాలన్నదే నా ఉద్దేశమని కలమట వెంకటరమణకు అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయనిపిస్తోంది. మామిడి గోవిందరావు ఎంత ఖర్చు పెట్టినా, ఎవరి వద్దకు తిరిగినా మా మద్దతు నీకే అన్నట్టుగా కలమటకు అనుకూలంగా అధినేతలంతా వ్యవహరిస్తున్నారు. దీంతో పారీ్టలో అంతర్గత పోరు మరింత ఎక్కువైనట్లయ్యింది.