
వైఎస్సార్‌సీపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సామాజిక సాధికార యాత్ర సోమవారం రెండు ప్రాంతాల్లో జరగనుంది.
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సామాజిక సాధికార యాత్ర సోమవారం రెండు ప్రాంతాల్లో జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును, అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ సాగుతున్న సామాజిక సాధికార యాత్ర విశేష ప్రజాదరణ పొందుతోంది. ఇందులో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది.
అనంతపురం జిల్లా:
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. వైఎస్సార్ సర్కిల్ దాకా బస్సు యాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా:
ఎచ్చెర్లలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ ఆధ్వర్యంలో జరగనున్న బస్సుయాత్ర సాగనుంది. ఉదయం 11గంటలకు రణస్థలంలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం ర్యాలీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎచ్చర్ల మండలం చిలకపాలెంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
చదవండి: జనం మెచ్చిన 'జగన్'