
సాక్షి, అమరావతి: ఈ నెల 14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు వాయుమార్గంలో చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా మకరంపురం గ్రామానికి సీఎం చేరుకుంటారు.
ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభిస్తారు. పలాస చేరుకుని వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్‌ను ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి పలాస రైల్వే గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు హాజరవుతారు. తిరుగు ప్రయాణమై తాడేపల్లి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment