కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం: పురుషోత్తం | Sakshi Exclusive Interview With Director Purushottam | Sakshi
Sakshi News home page

కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం: పురుషోత్తం

Published Mon, Feb 20 2023 11:12 AM | Last Updated on Mon, Feb 20 2023 11:12 AM

Sakshi Exclusive Interview With Director Purushottam

ఇచ్ఛాపురం రూరల్‌: ఒక సాదాసీదా ఉద్దానం కుర్రా డు. సినిమాలపై ఇష్టం పెంచుకున్నాడు. ఎలాగైనా తనో సినిమా తీయాలని కలలు గన్నాడు. స్టూడియో ల చుట్టూ తిరిగాడు. అనుభవం వచ్చింది గానీ అవకాశం రాలేదు. తనే సినిమా నిర్మించాలని కువైట్‌ వెళ్లి డబ్బులు కూడబెట్టాడు. సొంతూరిలో జరుగుతున్న కథను తన చిత్రానికి ఇతివృత్తంగా తీసుకున్నాడు. తెలిసిన వాళ్లను నటులుగా తీసుకుని గంటన్నర సినిమాను చిత్రీకరించేశాడు. తన ప్రతిభను చూడండంటూ థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించాడు. ఇదేమీ రాబోయే కొత్త సినిమా కథ కాదు. పరిమిత వనరులతో సినిమా తీసిన కుర్రాడి స్టోరీ. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పురుషోత్తం అన్న టైటిట్‌ కార్డు వెనుక దాగి ఉన్న విషయాలను తెలుసుకుందాం.  

ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ గ్రామా నికి చెందిన పురుషోత్తం మజ్జి బీకాం డిగ్రీ పూర్తి చేశాడు. సినిమాలపై చిన్నప్పటి నుంచే విపరీతమైన ఇష్టం ఉండేది. ఆ ఇష్టంతోనే హైదరాబాద్‌ వెళ్లాడు. స్టూడియోల చుట్టూ తిరిగాడు. కానీ సినిమా అవకాశం అంత సులభంగా రాదని తొందరగానే గ్రహించాడు. సొంతంగా సినిమా తీయాలని నిశ్చయించు కుని స్నేహితులకు చెబితే అంతా నవి్వన వారే గానీ ప్రోత్సహించలేదు. అయినా పట్టు విడవలేదు. సిని మా తీయడానికి డబ్బులు సంపాదించాలని కువైట్‌ వెళ్లాడు. అక్కడ డబ్బులు కూడబెట్టాడు. 

సినిమా తీయాలన్న తపనే గానీ అప్పటి వరకు కథ ఏమీ అనుకోలేదు. ఆ క్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సామాజిక సేవలు అందిస్తున్న స్పెషల్‌ గయ్స్‌ ఫౌండేషన్‌ గురించి అతనికి తెలిసి.. ఆ కథనే సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఎస్‌జీఎఫ్‌ కార్యకర్తను సంప్రదించి అన్ని విషయాలను సేకరించిన రెండేళ్ల పాటు కష్టపడి 180 పేజీల కథను సిద్ధం చేశాడు. 2020లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో స్వగ్రామానికి చేరుకున్నాడు.  

రూ.రెండు లక్షలతో సినిమా.. 
కథ సిద్ధమయ్యాక.. సాంకేతిక వర్గం కోసం అన్వేష ణ ప్రారంభించాడు. ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న స్నేహితుడు అభిరాం బిసాయిని కెమెరామెన్‌గా పెట్టుకున్నాడు. 2020 సెపె్టంబర్‌ నెలలో తను తీయబోయే సినిమాకు నటులు కావాలంటూ సోషల్‌ మీ డియాలో చేసిన ప్రకటనకు స్పందన నామమాత్రంగానే వచ్చింది. అయినా వచ్చిన వారినే నటులుగా పెట్టుకున్నాడు. ఉద్దానం పల్లెల్లోనే షూటింగ్‌ చేశా డు. రెండేళ్ల పాటు ఆటుపోట్లు ఎదుర్కొని సినిమా పూర్తి చేసి ఈ నెల 12న విడుదల చేశాడు. ఓ నలు గురు స్నేహితులు ఓ సేవా సంస్థగా ఏర్పడి అత్యవసర సమయాల్లో రక్తదానం, అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి ఆర్థిక సాయం, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఆదుకోవడం, నిరుపేద విద్యార్థులను చదివించడం వంటి సామాజిక అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రధానంగా ప్రతినాయకుడు చివరకు సామాజిక కార్యకర్తగా మారేలా చిత్రాన్ని రూపొందించాడు. 

వారం పాటు ఉచిత ప్రదర్శన 
సామాజిక అంశాలపై తీసిన ఈ చిత్రాన్ని వారం రోజుల పాటు కవిటి మహాలక్ష్మీ సినిమా హాల్‌ల్లో ప్రదర్శించారు. సుమారు రూ.రెండు లక్షల వ్యయంతో నిర్మించిన ఈ సందేశాత్మక చిత్రాన్ని చూసిన ప్రతి పది మంది వ్యక్తుల్లో ఒక్కరు తోటి వారికి సాయపడాలన్న ఆలోచన వస్తుందనే ఆలోచనతో ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు పురుషోత్తం తెలిపాడు. 

 సగంలో ఆపేద్దాం అనుకున్నాం..  
సినిమా రంగంలో ఏ మా త్రం అనుభవం లేకపోయినా, ధైర్యంతో ముందడుగు వేశాను. ఏడాది పాటు సినిమా షూటింగ్‌ సమయంలో కొంత మంది నటులు మధ్యలో వైదొలగడం, ఆర్థికంగా ఇబ్బంది పడటంతో సినిమాను మధ్యలో నిలిపివేద్దాం అనుకున్నాను. డబ్బులు కోసం ఏ ఒక్కరి దగ్గర చేయి చాచలేదు. కష్టమో, నష్టమో సినిమా పూర్తి చేసి నా టాలెంట్‌ను నిరూపించుకోవాలని అనుకు న్నాను. ఎవరైనా పెట్టుబడి పెడితే ఇదే చిత్రం పార్ట్‌–2 తీయాలనుకుంటున్నాను. ఈ చిత్రా న్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 
–  పురుషోత్తం మజ్జి, 
తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement