
శ్రీకాకుళం: ఒకరికి కళ్లు లేవు. మరొకరికి కాళ్లు పని చేయవు. వీరి బతుకు ముళ్ల బాటన వెళ్లకుండా మూడు ముళ్ల బంధంతో దేవుడు అందంగా ముడివేశాడు. ఆమె కడకొంగు ఆయనకు చేతి ఊతం. అతని గుండె చప్పుడు బిడ్డకు లాలి గీతం. పుట్టుకతో వచ్చిన లోపాలను సర్దుబాట్లతో అధిగమిస్తూ ఈ జంట అన్యోన్యంగా ఇలా ముందుకు వెళ్లడం పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment