గుంటూరు జిల్లా కాకునూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన మంగళగిరి షాహిదా(29) అనే వ్యవసాయ కూలీ ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందింది.
గుంటూరు జిల్లా కాకునూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన మంగళగిరి షాహిదా(29) అనే వ్యవసాయ కూలీ ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. పొలంపనులకు వెళ్లిన షాహిదా పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన సాటి కూలీలు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.