
సాక్షి, ఢిల్లీ: బీజేపీ నేతలతో అపాయింట్ ఖరారు కాకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం హడావుడిగా ఢిల్లీకి బయలుదేరిన పవన్... బీజేపీ నేతలను కలుస్తారంటూ జనసేన ప్రచారం చేసింది. జేపీ నడ్డా తో పాటు హోంమంత్రి అమిత్‌షాలను కలుస్తారంటూ జనసేన లీకులు ఇచ్చింది. ఎవరితోనూ అపాయింట్‌మెంటు లభించకపోవడంతో ఆయన నిన్నటి నుంచి ఢిల్లీలోనే నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. గత పర్యటనలోనూ పవన్ కల్యాణ్ ఇదే పరిస్థితి చవిచూశారు.