ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య | తinter sutudent suicide | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 15 2017 2:21 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

వీరబల్లి: ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో జరిగింది. వీరబల్లి మండలం మట్లి వడ్డేపల్లెకు చెందిన నాగచాలం రాయచోటిలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని అతడి ఇంటికి గుట్టుచప్పుడు కాకుండా తరలించినట్లు సమాచారం.

ఉదయం 7 గంటల ప్రాంతంలో విద్యార్థి ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అతను చనిపోయినట్లు ధ్రువీకరించారు. కాగా, తమ కుటుంబం గురించి వార్తలు వస్తే తాము కూడా చనిపోతామని అక్కడికి వెళ్లిన మీడియాను మృతుడి కుటుంబీకులు బెదిరించారు. అధికారుల వాట్సప్‌లలో విషయం వెలుగు చూడడంతో రాయచోటి రూరల్‌ సీఐ రాజు. వీరబల్లి ఏఎస్సై మృతుని కుటుంబాన్ని విచారించారు. సీఐను వివరణ కోరేందుకు యత్నించగా వివరాలు ఇపుడే చెప్పలేమని వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement