
రాంచీ : మద్యం మత్తులో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ తన పై అధికారులను సోమవారం కాల్చి చంపాడు. చత్తీస్‌గఢ్‌కు చెందిన జవాన్ జార్ఖండ్‌లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ సంఘటనలో అసిస్టెంట్ కమాండెంట్, అసిస్టెంట్ ఎస్‌ఐ చనిపోయారని, కాల్చిన జవాను గాయపడ్డాడని సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి. ఘటనకు గల కారణాలు తెలియదని, విచారణ చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, భద్రతా దళాల్లో ఇలాంటి సంఘటలు వరుసగా చోటుచేసుకుంటుండడంతో జవాన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.