
గాయాలతో బయటపడ్డ వైఎస్సార్ సీపీ యువజన విభాగం నేత మధుసూదన్
సాక్షి, కర్నూలు : టీడీపీ నేతల దౌర్జన్యాలు నానాటికి ఎక్కువైపోతున్నాయి. వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం నేత మధుసూదన్‌పై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. దాడి నుంచి తప్పించుకున్న మధుసూదన్ గాయాలతో బయటపడ్డారు.