ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మండలంలోని ఉల్లగళ్లు, పసుపుగళ్లు, కొమ్మవారం తదితర గ్రామాల్లో శనివారం రాత్రి భారీ గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. చెట్టు విరిగి మీద పడడంతో బండారు పుల్లారావు (42) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయా గ్రామాల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.