
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో ఆరబెట్టిన ధాన్యంపై రాళ్లవాన
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/ మంగపేట/కేసముద్రం/కురవి/నర్సంపేట: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీలో వడగళ్ల వాన దంచికొట్టింది. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం(కె) మండలాల పరిధిలో సోమవారం రాత్రి భారీ వర్షం పడటంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. వడగళ్ల వానతో ధాన్యం గింజలు రాలిపోయాయి.
మంగపేట మండల పరిధిలో వాడగూడెం, పాలాయిగూడెం, చుంచుపల్లి, కొత్తమల్లూరు, మల్లూరు, తిమ్మంపేట, నర్సింహాసాగర్, పూరేడుపల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి, కురవి, సీరోలు మండలాల్లోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వరంగల్ జిల్లా నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది.