సారీ అమ్మా..వెళ్లిపోతున్నా... | Nursing student fell under the train suicide | Sakshi
Sakshi News home page

సారీ అమ్మా..వెళ్లిపోతున్నా...

Published Fri, Jul 8 2016 7:38 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

వరంగల్ నగరానికి చెందిన నర్సింగ్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

వరంగల్ నగరానికి చెందిన నర్సింగ్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని కొత్తవాడ బ్యాంకు కాలనీకి చెందిన నాంపల్లి అభినవ్(22) బీఎస్సీ నర్సింగ్ సెకండియర్ చదువుతున్నాడు. నాలుగు రోజులుగా ఇంట్లో నుంచి వెళ్లిన అభినవ్ శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

మతదేహం వద్ద డెత్ నోట్ లభించినట్టు రైల్వే సీఐ స్వామి తెలిపారు. ‘ఇన్ని రోజులు నేను జీవితాన్ని ఎంజాయ్ చేశాను.. దీనికి నేనే బాధ్యున్ని.. ఇక ఆ ఎంజాయ్ అయిపోయింది...ఈ లైఫ్ మీద ఇంట్రస్ట్ లేదు.. అందుకే వెళ్లిపోతున్నా.. అమ్మా సారీ...మా ఫ్రెండ్స్‌కు ఏమీ తెలియదు. వారిని ఏమీ అనొద్దు..మిస్‌యూ బడ్డీస్’ అని నోట్‌లో రాసి ఉంది. తన భర్త మర ణించి ఏడాదవుతుందని, అప్పటి నుంచి తన కుమారుడు అభినవ్ అదోలా ఉంటున్నాడని, ఇలా ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదని అభినవ్ తల్లి రేణుక బోరున విలపించింది. ఆమె వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్నది. రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు రైల్వే సీఐ వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement