మనుగడ కోసం నిత్యం జరిగే ఒక పొరాటంలో రెండు జీవాల మధ్య జరిగిన కథ ఇది.
మనుగడ కోసం జీవకోటి చేసే పోరాటాలు అన్నీ, ఇన్నీ కావు. ఆహారం లేక చనిపోయే పరిస్థితి కొన్ని జీవాలవైతే.. ఆహారమై చనిపోయే జీవాలు మరికొన్ని. ఇది నిరంతరం సాగే జీవన పోరాటం. ఈ పోరాటంలో ఇష్టమున్నా, లేకపోయినా.. వేటాడటం లేదా బలవ్వడం అనేది సర్వసాధారణం. మనుగడ కోసం నిత్యం జరిగే ఒక పొరాటంలో రెండు జీవాల మధ్య జరిగిన కథ ఇది.
ఆకలితో ఉన్న ఒక పులి.. ఎలుగుబంటిని చూస్తుంది. ఆహారం దొరికిందన్న సంబరంలో ఎలుగుబంటి వైపు పరుగులు తీస్తుంది. ఇది గమనించిన ఆ ఎలుగుబంటి తప్పించుకునే ప్రయత్నం మొదలుపెడుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా పరిగెడుతూ.. పరిగెడుతూ ఇక ముందుకు వెళ్లేలేని ఒక చోటుకు చేరుకుంటుంది. పులి.. ఎలుగుబంటికి మరింత దగ్గరవుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ ఎలుగుబంటి భయం రెట్టింపవుతుంది.
అదే సమయంలో ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోతుంది. అతి కష్టం మీద ఈదుతూ బయట పడ్డానికి శ్రమిస్తూ ఉంటుంది.. పులి ఇంకా భయపెడుతూనే ఉంటుంది. భయపడుతూనే నీళ్ల నుంచి బయటకు వస్తుంది. పులి మరింత దగ్గరవుతుంది. ఇక తానేమీ చేయలేనని అర్థమైన ఆ ఎలుగుబంటి దీనంగా అర్థిస్తుంది... ఆ తర్వాత.. ఏం జరిగిందో చూసి తెలుసుకోండి.