భయంతో పరుగెత్తాను..
కొండాపూర్ అటవీ ప్రాంతంలో బొందె గుట్ట, గొర్లెల్ల గుట్ట మధ్య మా పొలం ఉంది. అక్కడే పశువులు కూడ కట్టేస్తాం. ఎప్పటిలాగే పొలం వద్దకు పడుకోడానికి వెళ్లాను.
కొద్దిసేపు మంట పెట్టుకుని పశువులకు మేత వేయడానికి వెళ్లాను. కుక్క అరుస్తూ వచ్చి కంటపడింది. వెంటనే లైట్ వేసి చూడగా చిరుత కొద్ది దూరంలో నిలబడి ఉంది. భయంతో హడలిపోయాను. వెంటనే పరుగెత్తి పక్క పొలంలో ఉన్న వారి వద్దకు వెళ్లాను. తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాం. పొలానికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. – రెడ్డిపల్లి అంజిలయ్య, కొండాపూర్
ఆనవాళ్లు చిక్కడం లేదు..
కొండాపూర్, ఆశిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుందని సమాచారం వచ్చింది. తమ సిబ్బంది వెళ్లి పరిశీలించారు. చిరుత అనడానికి సరైన ఆధారాలు దొరకడం లేదు. హైనా కూడ చిరుతలాగే కనిపిస్తుంది. అదే ఉండవచ్చని మా అనుమానం. రైతులు చూసినట్లు చెపుతున్నా తమకు స్పష్టత రావాలి. ఒకవేళ చిరుత ఉంటే బోను ఏర్పాటు చేస్తాం. రైతులు పశువులను బయట కట్టేయకూడదు. ఒంటరిగా వెళ్లకపోవడం మచింది. చేతిలో ఎపుడు కర్ర పట్టుకుని పొలానికి వెళ్లాలి. – మక్బూల్ హుస్సేని, రేంజ్ ఆఫీసర్, మహమ్మదాబాద్
Comments
Please login to add a commentAdd a comment