Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Warn Kutami Govt Favour Police at Papireddypalli1
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్‌ జగన్‌

సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్‌ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు. నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే... చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలి. సూపర్‌ సిక్స్‌ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారు. .. బాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్‌ చేయకుండా బాబుకు వాచ్‌మెన్‌లా పని చేస్తున్న పోలీసులకు చెబుతున్నా. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం’’ అని వైఎస్‌ జగన్‌ ఘాటుగానే హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీలో మరీ ఇంతటి ఘోరాలా? ప్రజల్లారా.. ఆలోచించుకోండి

Minimum Security Drought For Ys Jagan Tour In Sri Sathya Sai District2
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్‌ పర్యటనకు కనీస భద్రత కరువు

అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. జనం ఒక్కసారిగా ఎగబడగా.. నియంత్రించేందుకు సరైన పోలీసు సిబ్బంది లేకుండా పోయారు. హత్యా రాజకీయాలకు బలైన వైఎస్సార్‌సీపీ బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్‌ జగన్‌ పరామర్శించి.. ఓదార్చారు.ఈ క్రమంలో రామగిరి పర్యటనలో ఎక్కడా తగిన భద్రతా సిబ్బంది కనిపించలేదు. పైగా హెలిప్యాడ్‌ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో.. ఆ జనం తాకిడితో హెలికాఫ్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల రీత్యా వీఐపీని తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.ఈ పరిణామంతో హెలికాఫ్టర్‌ నుంచి దిగిపోయి రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వపెద్దల ఉద్దేశపూర్వక చర్యలు మరోసారి తేటతెల్లం అయ్యాయని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. జగన్‌ పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. కనీస భద్రత కల్పించకపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో వైఎస్‌ జగన్‌ పర్యటనల సందర్భంగానూ కూటమి ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించింది. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.

IPL 2025: KKR VS LSG Live Updates And Highlights3
KKR VS LSG Updates: రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో.. మార్ష్‌ ఔట్‌

రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో.. మార్ష్‌ ఔట్‌15.2వ ఓవర్‌- 81 పరుగుల వద్ద మిచెల్‌ మార్ష్‌ ఔటయ్యాడు. రసెల్‌ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.సెంచరీకి చేరువవుతున్న మార్ష్‌15 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్‌ 170/1గా ఉంది. మార్ష్‌ (47 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీకి చేరువవుతున్నాడు. మరో ఎండ్‌లో పూరన్‌ కూడా ధాటిగా ఆడుతున్నాడు. పూరన్‌ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. దంచి కొడుతున్న మార్ష్‌హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాక మార్ష్‌ మరింత స్పీడ్‌ పెంచాడు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నాడు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 138/1గా ఉంది. మార్ష్‌ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. పూరన్‌ 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి మార్ష్‌కు జతగా ఉన్నాడు. తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో10.2వ ఓవర్‌- 99 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి మార్క్రమ్‌ ఔటయ్యాడు. హర్షిత్‌ రాణా మార్క్రమ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మిచెల్‌ మార్ష్‌ (34 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. మార్ష్‌కు జతగా పూరన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. ధాటిగా ఆడుతున్న లక్నో ఓపెనర్లునిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లక్నో ఓపెనర్లు ఆతర్వాత గేర్‌ మార్చారు. మార్క్రమ్‌ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (23 బంతుల్లో 34; ఫోర్‌, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో 7 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్‌ 72/0గా ఉంది. గేర్‌ మార్చిన మార్క్రమ్‌ఇన్నింగ్స్‌ ప్రారంభంలో నిదానంగా ఆడిన మార్క్రమ్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో గేర్‌ మార్చాడు. ఆ ఓవర్‌లో అతను 2 బౌండరీలు, సిక్సర్‌ సహా 18 పరుగులు రాబట్టాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 43/0గా ఉంది. మార్క్రమ్‌తో పాటు (28) మార్ష్‌ (13) క్రీజ్‌లో ఉన్నాడు. ఆచితూచి ఆడుతున్న లక్నో ఓపెనర్లుటాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిదానంగా ఆడుతుంది. ఓపెనర్లు ఎయిడెన్‌ మార్క్రమ్‌ (9), మిచెల్‌ మార్ష్‌ (11) ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 20/0గా ఉంది. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 8) కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. నేటి మ్యాచ్‌ కోసం కేకేఆర్‌ ఓ మార్పు చేసింది. మొయిన్‌ అలీ స్థానంలో స్పెన్సర్‌ జాన్సన్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం కేకేఆర్‌, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్‌ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు..కేకేఆర్‌: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్‌ జాన్సన్‌, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్‌ అరోరాలక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి

American company sacks 700 In Donation Scam4
అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!

ఢిల్లీ: అమెరికాలో విరాళాల పేరుతో జరిగిన మోసంలో తానా((తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా)) పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. విరాళాల పేరుతో కంపెనీల నిధుల స్వాహా జరగడంతో ఎఫ్ బీఐ రంగంలోకి దిగింది. గత ఐదేళ్లుగా విరాళాల పేరు చెప్పి ఫ్యానీమే, యాపిల్ కంపెనీ నిధులు స్వాహా చేశారని, తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కైనట్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.దీనికి గాను సుమారు 700 మంది ఉద్యోగులపై వేటు పడింది. తొలగించిన ఉద్యోగుల్లో తానా ఉపాధ్యాక్షుడు ఉన్నట్లు తెలిసింది. చారిట‌బుల్ డొనేష‌న్ మ్యాచింగ్ ప్రోగ్రాం ద్వారా నిధుల దోపిడీకి పాల్పడ్డారు ఉద్యోగులు. విరాళాలిచ్చిన‌ట్లు ప‌త్రాలు సృష్టించి...దానికి స‌మాన‌మైన నిధులను కంపెనీ నుంచి కాజేశరని,. ఎన్జీవోలతో కుమ్మక్కై నిధులను స్వాహా చేసినట్లు జాతీయ ఆంగ్ల పత్రిక టైమ్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

10 Years of PM Mudra Yojana Key Highlights and Top Loan Disbursing States in India5
ముద్రా యోజనకు పదేళ్లు: రూ.20 లక్షల వరకు ఈజీ లోన్స్

ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎమ్‌ఎమ్‌వై) పథకం ఈ రోజుకు (ఏప్రిల్ 8) పదేళ్లను పూర్తిచేసుకుంది. 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి.. భారతదేశం అంతటా 52 కోట్లకు పైగా లబ్ధిదారులకు రూ. 33 లక్షల కోట్లకు పైగా పూచీకత్తు లేని రుణాలను పంపిణీ చేసింది.పీఎమ్‌ఎమ్‌వైస్క్రీన్ పదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ముద్రా యోజన పథకం ఎంతో మందికి.. వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలను కల్పించింది. ఈ పథకం ద్వారా మేలుపొందిన కొంతమందితో మాట్లాడాను. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.Mudra Yojana has given opportunities to countless people to showcase their entrepreneurial skills. Interacted with some of the beneficiaries of the scheme. Their journey is inspiring. #10YearsOfMUDRA https://t.co/QcoIK1VTki— Narendra Modi (@narendramodi) April 8, 2025ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకంవ్యాపారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభమైన ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం.. ఎంతోమంది ఎగడానికి ఆర్థికంగా ఉపయోగపడింది. గతంలో ఈ స్కీమ్ ద్వారా రూ. 10 లక్షలు లోన్ ఇచ్చేవారు. అయితే 2024-25 కేంద్ర బడ్జెట్‌లో పరిమితిని రూ. 20 లక్షలకు పెంచారు. ఈ పథకం నాలుగు రకాలుగా ఉంటుంది. అవి శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్.ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?శిశు: చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి రూ. 50000 వరకు లోన్ అందిస్తారు.కిషోర్: వ్యాపారంలో కొంత స్థిరపడిన తరువాత.. దానిని మరికొంత విస్తరించుకోవడానికి రూ. 50వేలు నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ లభిస్తుంది.తరుణ్ & తరుణ్ ప్లస్: వ్యాపారాలను మరింత విస్తరించాలనుకునేవారికి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లోన్ లభిస్తుంది.

Allu Arjun Turns 43: Allu Sneha Reddy Special Birthday Wishes to Husband6
తోడుగా, నీడగా.. ఐకాన్‌ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్‌

విమర్శలు ఎక్కుపెట్టినవారితోనే శభాష్‌ అనిపించుకున్నాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun). గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు.. అతడి ప్రయాణం చూసిన ఎవరైనా ఔరా అనాల్సిందే! ఈసారి పాన్‌ ఇండియాను కాకుండా పాన్‌ వరల్డ్‌ బాక్సాఫీస్‌కే ఎక్కుపెట్టాడు బన్నీ. అట్లీతో సినిమా.. దీనికి హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ వీఎఫ్‌ఎక్స్‌ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.గడిచిన ఏడాది కష్టంగా..సాదాసీదా హీరో నుంచి ఐకాన్‌ స్టార్‌ వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు బన్నీ. అయితే ఆయన సంతోషాన్నే కాకుండా కష్టాన్ని కూడా ఇష్టంగా పంచుకుంది భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy). గడిచిన ఏడాది బన్నీ పుష్ప 2 హిట్‌తో భారీ విజయం అందుకున్నాడు. కానీ అతడు సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్‌కు వెళ్లినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందడం.. ఆ కేసు తన మెడకు చుట్టుకోవడంతో ఆ సంతోషమే లేకుండా పోయింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ అరెస్టయి ఒక రాత్రి జైలులో గడపడం అతడి జీవితంలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.43వ బర్త్‌డేఅతడు జైలు నుంచి తిరిగి ఇంటికి చేరుకోగానే స్నేహ చంటిపిల్లలా అతడిని హత్తుకుంది. ఆ సమయంలో కుటుంబాన్ని తనే జాగ్రత్తగా చూసుకుంది. తాజాగా ఆమె అల్లు అర్జున్‌కు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నా జీవితంలో ప్రేమను పంచిన నీకు 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జీవితంలో నీతో కలిసి నడుస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. అందులో ఫ్యామిలీ సంతోషంగా ఉన్న వీడియో క్లిప్పింగ్స్‌ను పొందుపరిచింది. అలాగే బన్నీతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు బన్నీకి మీరే బలం అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: పాపకు, నాకు డీఎన్‌ఏ టెస్టు చేయాలన్నారు: కీర్తి భావోద్వేగం

Ktr Chit Chat With Media Over Hcu Land Scam7
KTR: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌,సాక్షి: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (ktr) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు.వరంగల్‌ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebrations) కోసం బీఆర్‌ఎస్‌ (brs) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాలు మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.ఈ తరుణంలో కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ,హెచ్‌సీయూ భూముల వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ‘25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండవ తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌. అందుకే భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇది అతిపెద్ద బహిరంగ సభ అవుతుంది. ఈ సారి డిజిటల్ మెంబర్షిప్ ప్రవేశపెడుతున్నాం. అన్ని జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నెలకో కార్యక్రమం జిల్లాల్లో నిర్వహిస్తాం.అమెరికా దుందుడుకు నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు నష్టపోయారు. మోదీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా మౌనం ఎందుకు?. తర్వాత దెబ్బ తెలంగాణపై పడబోతుంది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఫార్మా ఎగుమతులు ఉంటాయి. వాటిపై ఎఫెక్ట్ ఉండబోతుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు BRS పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల,మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు.

Bill Gates Said Weight Loss Medicines More Effective Than Lifestyle Changes8
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?

ఆరోగ్యపరంగా భారంగా మారిన సమస్య అధిక బరువు(ఊబకాయం). ఇదే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి ప్రధాన కారణమని పదే పదే హెచ్చరిస్తున్నారు నిపుణులు. చెప్పాలంటే ఇదే సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే బరువు తగ్గడం అంత ఈజీకాదు. పైగా ప్రస్తుత ప్రజల జీవన విధానం..అందుకు తగ్గట్టుగా ఉన్న ఒత్తిడులు, ఆందోళనలు వెరసీ బాడీపై ధ్యాస పెట్టే ఛాన్సే లేదు. అందువల్లే ఇది జఠిలమైన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైతం "బరువు తగ్గించుకుందాం..ఆరోగ్యంగా ఉందా" అని పిలుపునిస్తూ అవగాహన కల్పించే యత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌​ కూడా చేరారు. ఏం చేస్తే బరువు తగ్గగలరు అనే అంశం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.ఎంటర్‌ప్రెన్యూర్‌ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్, ఫిగరింగ్ అవుట్‌లో బరువు తగ్గడం అనే అంశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. "ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. డబ్బుతో పరిష్కరించ లేని సమస్య ఇది. నేను ప్రధాని మోదీని కలసినప్పుడూ ఈ విషయం గురించే చర్చించాం. యోగా ఆధారిత ఆసనాలతో ఎలా తగ్గించుకోవచ్చో చెప్పారు మోదీ. కానీ ఆ దిశగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదని, ఇంకా ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో మార్పుకి సిద్ధపడలేకపోతోందని చెప్పారాయన. అయితే నేను జీవశైలిలో మార్పులను విశ్వసించనప్పటకీ....వైద్య ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ప్రగాఢంగా నమ్ముతా. ప్రస్తుతానికి మధుమేహం కోసం అభివృద్ధి చేసిన మందులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న బాధితుల్లో ఓ ఆశను రేకెత్తిస్తోంది. ఈ జీఎల్‌పీ-1 అనే మధుమేహ మందులు ఈ సమస్యకు కొంతమేర శాస్త్రీయ పరిష్కారాన్ని అందించాయి. త్వరలో అందరికి అందుబాటులోకి వచ్చేలా చౌక ధరలలో లభించనున్నాయి. "అని అన్నారు బిల్‌గేట్స్‌. కాగా, ఈ డయాబెటిక్‌ మందులు ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో, జెప్‌బౌండ్ వంటివి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి, తినాలనే కోరికను నివారిస్తాయనేది పరిశోధుకుల వాదన. ఇక GLP-1 అనేది మన శరీరంలో జీర్ణక్రియ, ఆకలి నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ మందులు ఆకలని నిర్వహించడంలో చాలా బాగా హెల్పవుతాయని అంటున్నారు నిపుణులుఏదీఏమైనా జీవనశైలే ముఖ్యమైనది..వైద్య ఆవిష్కరణల కంటే దీర్ఘకాలిక బరువు నియంత్రణలో ప్రధానమైనది జీవనశైలేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అయితే అందరూ లైఫ్‌స్టైల్‌ అనగానే భయపడిపోతున్నారని చెప్పారు. శరీరాన్ని మొత్త కష్టపెట్టకపోయినా..కనీసం కొద్దిపాటి కదలికలకు చోటు ఇస్తే మంచిదంటున్నారు. దీంతోపాటు కొద్దిపాటి ఆరోగ్య చిట్కాలు..పాటించాలి. నమలి నమిలి నెమ్మదిగా తినడం..శరీరానికి వేడి కలిగించేపదార్థాలు తీసుకోవడం.. తదితరాల ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు నిపుణులు. చివగా మోదీ, బిల్‌గేట్స్‌ ఇరువురు ఊబకాయం అనేది కేవలం వైద్యపరమైన సమస్య కాదని, వాళ్ల వాళ్ల సంస్కృతి ఆచారాలతో ముడిపడి ఉన్న లోతైన సమస్యగా అభివర్ణించారు. అయితే దీన్నుంచి బయటపడాలంటే మాత్రం రోజువారీ దినచర్య బ్రషింగ్‌లా జీవనశైలిలో మార్పులు కూడా భాగమైతేనే బరువు తగ్గడం సాధ్యమని నొక్కి చెప్పారు ఇరువురు. View this post on Instagram A post shared by Figuring Out with Raj Shamani (@figuringout.co) (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..)

Pawan Kalyan Son Injured In Singapore9
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్‌ కుమారుడికి గాయాలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సింగపూర్‌ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను వెంటనే స్కూల్‌ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ ఉన్నారు. ఫోన్‌ కాల్‌ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్‌కు సంబంధించన ఏర్పాట్లు అన్నీ అధికారులు చేశారు. దీంతో అక్కిడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్‌ వెళ్లనున్నారు.

Kommineni Comments On Chandrababu Wealth Creation Campaign10
సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ!

ఏ దేశమైనా అభివృద్ది చెందడం అంటే ఏమిటి? పేదరికం తగ్గడం.. పేదల ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడడం! కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కలిగిన వారికి మరింత సంపద సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. దీన్నే అభివృద్ధి అనుకోమంటున్నారు. విశాఖపట్నంలో ఒక మాల్‌ నిర్మాణానికి విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టడం చూస్తే ఈ ఆలోచనే వస్తుంది ఎవరికైనా. రాష్ట్రం ఎటు పోయినా ఫర్వాలేదు... అమరావతిని మాత్రం అప్పులు తెచ్చిమరీ నిర్మాణాలు చేపట్టి అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మరిన్ని డబ్బులు సంపాదించుకుంటే చాలన్నట్టుగా ఉండటం ఇంకో ఉదాహరణ.ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ పేరుత పేదలను ఊరించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తరువాత వాటిని మూలన పడేశారు. బాబు గారికి వత్తాసు పలికి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు హామీల ఊసే ఎత్తడం లేదు. లేని వారికి పైసా విదల్చని వీరిద్దరూ లూలూ మాల్‌కు మాత్రం వేల కోట్లు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కు వద్ద సుమారు 14 ఎకరాల భూమిని లూలూ మాల్‌కు కేటాయించింది. మాల్ నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్, హైపర్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేస్తామన్న ఈ సంస్థ ప్రతిపాదనలకు ఊ కొట్టింది. కానీ ఆరేళ్లపాటు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకపోవడంతో 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసింది.వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించడంపై విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే 2024లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావడం... లూలూ గ్రూప్ తెరపైకి వచ్చింది. మళ్లీ భూముల పందేరం జరిగిపోయింది. మాల్స్‌ వచ్చిన కొత్తలోనైతే వాటిని ప్రోత్సహించేందుకు భూమి ఇచ్చారంటే ఒక అర్థముంది. విశాఖ, విజయవాడల్లో ఇప్పటికే బోలెడన్ని మాల్స్‌ ఉన్నాయి. అది కూడా నగరానికి దూరంగా పార్కింగ్‌ తదితర సౌకర్యాలు కల్పించిన ఓకే అనుకోవచ్చు కానీ.. విశాఖ బీచ్‌ రోడ్‌లో స్థలమివ్వడమంటే...??? ఈ 14 ఎకరాల స్థలం విలువ రూ.1500 కోట్ల నుంచి రూ. రెండు వేల కోట్ల వరకు ఉండవచ్చు. దీనిని ఏకంగా 99 ఏళ్లకు లీజ్ కు ఇవ్వడం కూడా ఆశ్చర్యమే మరి!వీటన్నింటికీ అదనంగా ఇంకో రూ.170 కోట్ల విలువైన రాయితీలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మేళ్లన్నింటికీ లూలూ ప్రభుత్వానికి ఇచ్చేదెంత? నెలకు ముష్టి నాలుగు లక్షల చొప్పున ఏడాదికి రూ.50 లక్షలు మాత్రమే. ఇంకో విషయం.. లూలూ ఏమీ ఆషామాషీ కంపెనీ కాదు. కావాలనుకుంటే సొంతంగా భూములు కొనుక్కోగల ఆర్థిక స్థోమత ఉన్నదే. హైదరాబాద్‌లో ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండానే ఈ సంస్థ భారీ మాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదంతా లూలూ గ్రూపు సంపద మరింత పెంచేందుకే అన్నది లోగుట్టు!లూలూ ఏమీ పరిశ్రమ కాదు. కేవలం షాపింగ్ ఏరియాకు సదుపాయాలు కల్పించే సంస్థ. ఇలాంటి మాల్స్ వల్ల చిన్న, చిన్న వ్యాపారులంతా ఉపాధి కోల్పోయే అవకాశాలెక్కువ. పోనీ మాల్‌లో తక్కువ అద్దెకు షాపులిచ్చి సామాన్య దుకాణదారులను ఏదైనా ఆదుకుంటారా? అంటే అదీ లేదు. దుకాణాల అద్దెలపై ప్రభుత్వానికి నియంత్రణే లేదు. అందుకే శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఈ కంపెనీకి ఇచ్చే రాయితీల మొత్తం రూ.170 కోట్లతో ప్రభుత్వమే షాపింగ్‌ మాల్‌ నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు.బీచ్ సమీపంలోని రిషికొండపై జగన్ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే నానా రచ్చ చేసిన కూటమి పెద్దలు లూలూ గ్రూప్ కు ఇంత భారీ ఎత్తున విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. అమరావతి విషయానికి వస్తే, గత ప్రభుత్వం అక్కడ పేదల కోసం ఇచ్చిన ఏభై వేల ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చాలా గట్టిగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని అంటున్నారు కానీ అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. మరో వైపు సుమారు ఏభై వేల కోట్ల అప్పు తెచ్చి ఖర్చు పెడతామంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన పెద్దలు బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు కేటాయించడం ద్వారా వారు అసత్యాలు చెబుతున్న విషయం తేటతెల్లమైంది. ఇక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకుండా, ధనికులు, బడా భూ స్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చి, వారి సంపద పెంచే దిశగా చంద్రబాబు సర్కార్ సన్నాహం చేస్తోంది.రాజధాని పనుల టెండర్లు తమకు కావల్సినవారికి కేటాయించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం, సిండికేట్ల ద్వారా కథ నడిపించడంపై విమర్శపూర్వక వార్తలు వస్తున్నా, ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. కనీసం అందులో వాస్తవం లేదని చెప్పే యత్నం చేయడం లేదంటే ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. అమరావతి గురించి మాత్రం ఎల్లో మీడియాలో నిత్యం ఊదరగొట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, పది లక్షల కోట్ల పెట్టుబడులు అని, ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే దానిని బ్యానర్‌ కథనాలుగా వండి వార్చారు.ఇలాంటివన్నీ కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఒక పక్క ఐఐటీ విద్యార్థులకే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోందని వార్తలు వస్తుంటే చంద్రబాబు మాత్రం లక్షల ఉద్యోగాలు అమరావతికి తరలి వస్తాయని అంటున్నారు. అమరావతి గ్రామాలలో రూ.138 కోట్లతో 14 స్కూళ్లు, 17 అంగన్ వాడీలు, 16 వెల్‌ నెస్ సెంటర్లను ఆధునికంగా తయారు చేస్తోందని ఎల్లో మీడియా బాకా ఊదింది. మరి ఇదే విధంగా మిగిలిన రాష్ట్రం అంతటా ఎందుకు ఏర్పాటు చేయరు? గత జగన్ ప్రభుత్వం పట్టణం, గ్రామం, ప్రాంతం అన్న తేడా లేకుండా స్కూళ్లను, ఆస్పత్రులను బాగు చేస్తే దానిపై విష ప్రచారం చేసిన ఈ మీడియాకు ఇప్పుడు అంతా అద్భుతంగానే కనిపిస్తోంది. కూటమి సర్కార్ సంపద సృష్టి అంటే బడాబాబులకే అన్న సంగతి పదే, పదే అర్థమవుతోందన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement