కాటమరాయుడు మోషన్ పోస్టర్ విడుదల
సమ్మర్ సీజన్ కోసం శరవేగంగా సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమా మోషన పోస్టర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు.
సమ్మర్ సీజన్ కోసం శరవేగంగా సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమా మోషన పోస్టర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. హీరో పవన్‌తో పాటు హీరోయిన్ శ్రుతి హాసన్ ఇద్దరూ కలిసి దీపాలు పెడుతున్నట్లుగా ఉన్న ఈ 20 సెకన్ల పోస్టర్‌ను అభిమానుల కోసం విడుదల చేశారు.
శివబాలాజీ, అజయ్, అలీ, కమల్ కామరాజు, చైతన్యకృష్ణ సహా పలువురు నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత శరత్ మరార్ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్నారు. గతంలో 'గోపాల... గోపాల'తో పవన్ కల్యాణ్ మనసు చూరగొన్న దర్శకుడు కిశోర్ పార్థసాని (డాలీ) కూడా తనపై నిర్మాత, హీరో పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అనువైన సొంత టీమ్‌తో చకచకా షూటింగ్ చేస్తున్నారు. హిట్ సినిమా కథాంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని, పూర్తిగా తెలుగు వాతావరణం, పాత్రలతో తయారవుతున్న 'కాటమరాయుడు' వార్తలను బట్టి చూస్తే, వచ్చే వేసవిలో విడుదలయ్యేలాగే ఉంది.
