'నిమిర్‌' అంటున్న ఉదయనిధి స్టాలిన్ | Udhayanidhi Stalin Nimir first look | Sakshi
Sakshi News home page

'నిమిర్‌' అంటున్న ఉదయనిధి స్టాలిన్

Published Fri, Oct 6 2017 11:05 AM | Last Updated on Fri, Oct 6 2017 11:05 AM

Udaya nidhi Stalin Nimir

సాక్షి, చెన్నై : ఉదయనిధి స్టాలిన్ తాజా చిత్రానికి నిమిర్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన చిత్రం మహేశింటే ప్రతీకారం. ఆ చిత్ర తమిళ రీమేక్‌లో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నమిత ప్రమోద, పార్వతీనాయర్‌ నటిస్తుండగా సీనియర్‌ దర్శకుడు మహేంద్రన్, సముద్రఖని, ఎంఎస్‌.భాస్కర్‌ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.

ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను బుధవారం కేరళలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్ లాల్‌  ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ మలయాళ చిత్రం మహేశింటే ప్రతీకారం చిత్రం మంచి విజయం సాధించిందన్నారు. ఆ చిత్ర కాన్సెప్ట్‌ ఫీల్‌ పోకుండా తమిళంలో మరింత వినోదాన్ని జోడించి తెరకెక్కిస్తున్నామని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను తెన్ కాశీలో 36 రోజులు చిత్రీకరించినట్లు తెలిపారు. ఇతర భాగాన్ని దుబాయ్‌లో చిత్రీకరించామన్నారు.

ఈ చిత్రంలో కథానాయకుడి పాత్రకు ఉదయనిధి స్టాలిన్ కాకుండా మరొకరిని ఊహించుకోలేమన్నారు. ఆయన ఇక విద్యార్థిలా తన సూచనల మేరకు చాలా బాగా నటించారని అన్నారు. దర్శకుడు మహేంద్రన్ అంటే తనకు చాలా గౌరవమని, ఆయన్ని ఈ చిత్రంలో డైరెక్ట్‌ చేయడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలను దర్శకుడు సముద్రఖని రాయగా, సంగీతాన్ని దర్బుక శివ, ఛాయాగ్రహణం ఏకాంబరం అందిస్తున్నారు. చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement