కాలేజీలో కోర్ట్‌ | Vijay's Sarkar shooting spot video goes viral | Sakshi
Sakshi News home page

కాలేజీలో కోర్ట్‌

Published Mon, Jul 30 2018 4:56 AM | Last Updated on Mon, Jul 30 2018 4:56 AM

Vijay's Sarkar shooting spot video goes viral - Sakshi

విజయ్

ఆదివారం విశ్రాంతి తీసుకోకుండా కాలేజీకి వెళ్లారు తమిళ హీరో విజయ్‌. కాలేజీకి వెళ్లిన తర్వాత బోన్‌లో నిలబడ్డారట. కాలేజీకి వెళ్తే బెంచ్‌లు ఉండాలి కానీ కోర్టులో ఉండే బోన్‌లు అక్కడ ఎందుకు ఉన్నాయి? అని కన్‌ఫ్యూజ్‌ కావొద్దు. ‘కత్తి, తుపాకీ’ చిత్రాల తర్వాత హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘సర్కార్‌’. ఇందులో కథానాయికగా కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం చెన్నైలోని ఓ కాలేజీలో కోర్ట్‌ సెట్‌ వేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ అక్కడే జరుగుతోంది. ఈ సినిమాలో ఎన్‌ఆర్‌ఐ పాత్రలో విజయ్‌ కనిపిస్తారట. ‘సర్కార్‌’ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం తర్వాత అట్లీ దర్శకత్వంలో విజయ్‌ నటించబోతున్నారని, ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో మొదలవుతుందని కోలీవుడ్‌ టాక్‌. విజయ్‌–అట్లీ కాంబినేషన్‌లో ‘తేరీ, మెర్సెల్‌’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement