మృగాళ్ల రాజ్యంలో.. మరో లేడీ
ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహికంగా లైంగికదాడికి పాల్పడిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తుఫాన్ ధాటికి చిగురుటాకులా చెల్లాచెదురైంది. అలల తాకిడికి గిలాగిలా కొట్టుకున్న చేపపిల్లలా వణికిపోయింది. మండు వేసవిలో ఇంకిపోయిన నీటిగుంతలా ఆవిరైపోయింది. వేటగాడి బాణం దెబ్బకు గాయపడిన పక్షిలా విలవిల్లాడింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో చదువుకుంటున్న ఓ బాలిక తనపై జరిగిన లైంగికదాడికి హతాశురాలైంది.
బరంపురం(ఒడిశా): గంజాం జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహికంగా లైంగికదాడికి పాల్పడిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగింది. సామూహిక లైంగిక దాడి కేసులో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఐసీ అధికారి ఆశ్వినికుమార్ అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బంజనగర్ పోలీస్‌స్టేషన్, బెల్లుగుంటా ఔట్ పోస్ట్ పరిధిలో మందరా గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని బల్లిగుంఠా కళాశాలలో +2 మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే అగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు ఆ విదార్థిని వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సైకిల్‌పై ఇంటికి వస్తున్న సమయంలో దారి మధ్యలో ధనుంజయపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు అడ్డకుని విద్యార్థిని నోరు నొక్కి అక్కడికి దగ్గరలో గల బొడొ నది ఒడ్డున ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకుపోయి సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు.
అనంతరం సొమ్మసిల్లిన విద్యార్థినిని బొడొ నది ఒడ్డున పడేసి వెళ్లిపోయారు. కుమార్తె సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి పలు చోట్ల గాలించాడు. నది ఒడ్డున కూతురు పడిఉన్నట్లు తెలుసుకున్న తండ్రి కుమార్తెను గ్రామస్తుల సహాయంతో ఇంటికి తీసుకు వచ్చాడు. అనంతరం కుమార్తెకు జరిగిన అన్నాయాన్ని తెలుసుకుని కుమార్తెతో కలిసి ళెల్లిగుంఠా పోలీసుఔట్ పోస్టుకు ఫిర్యాదు చేశాడు. గంజాం ఎస్‌పీ ఆశిష్ కుమార్ సింగ్ ఆదేశంతో బంజనగర్ ఐఐసీ, బెల్లిగుంఠా ఔట్‌పోస్ట్ అధికారి కొంత మంది పోలీసు బృందంతో ధనిజాపల్లి గ్రామానికి చేరుకుని లైంగికదాడికి పాల్పడిన నలుగురు నిందిత యువకులను అరెస్ట చేశారు. అరెస్టయిన వారిలో కృష్ణ బెహరా, శంకర్ బిశ్వాల్, గురు బెహరా, పపున్ బారిక్‌లు ఉన్నట్లు..వీరందరినీ కోర్టులో హాజరుపరిచినట్లు బంజనగర్ ఐఐసీ అధికారి అశ్వినికుమార్ చెప్పారు.