gang rape
-
హైదరాబాద్‌లో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: మీర్పేట్లో విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యవకులు ఘాతుకానికి ఒడిగట్టారు.మీర్‌పేట వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న విదేశీయురాలిని లిఫ్ట్ వంకతో తీసుకెళ్లారు. ఆపై పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. సదరు బాధితురాలు జర్మనీకి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
ఆ దుర్మార్గులు టీడీపీ వాళ్లే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో గ్యాంగ్ రేప్‌కు పాల్పడింది టీడీపీకి చెందిన వారేనని స్పష్టమైంది. ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన యువకుల కుటుంబీకులంతా టీడీపీలోనే ఉన్నారు. ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబీకులతో రాజీ చేసేందుకు చివరి వరకు రాజకీయ పలుకుబడి ఉపయోగించారు. నియోజకవర్గంలోని ఓ కీలక నేత ద్వారా సంప్రదింపులు చేయించి బేరసారాలకు, బెదిరింపులకు దిగారు. ఎట్టిపరిస్థితుల్లో రాజీకి అంగీకరించే ప్రసక్తే లేదని, జరిగిన దారుణానికి వెలకట్టడం దారుణమని, దోషులను కఠినంగా శిక్షించాల్సిందేనని బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. రాజీ ప్రయత్నాలు బెడిసికొట్టడంతో పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. ఈ నెల 19వ తేదీన ఇంటి వద్ద తల్లిదండ్రులు లేని సమయంలో వారి ఇద్దరు కుమార్తెల్ని, మరో యువతిని బర్త్‌డే పార్టీకని ముగ్గురు యువకులు పైల శివ, మోహన్, నిందితుడు రాజమహేంద్రం సాయిలు కారులో ఎక్కించుకుని కోసంగిపురం జంక్షన్ వద్ద ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ విద్యార్థినులకు మద్యం కలిపిన కూల్ డ్రింక్స్ తాగించి, రూమ్‌లో బంధించి అత్యాచారం చేసేందుకు తెగబడ్డారు. ఒక విద్యార్థిని ప్రతిఘటించి తప్పించుకోగా, మిగతా ఇద్దరు బలైపోయారు. నిందితులు వారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డు చేశారు. అనంతరం స్పృహ కోల్పోయిన ఆ ఇద్దరు విద్యార్థినుల్ని రాత్రి 10 గంటల సమయంలో ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు. స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని వారు తల్లికి చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయరా?అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకడైన పైల శివ చిన్నాన్న పైల జానకీరావు టీడీపీలో కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతుంటారు. ఈయన బావమరిది చిరు కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈయన కూడా రామ్మోహన్నాయుడి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిందితుడు శివ గతంలో కూడా ఇలాంటి ఘాతకానికి పాల్పడి, రాజీ చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. మరో నిందితుడు మోహన్. ఇతని మేనమామ వెంకట్ కూడా టీడీపీలో ఉన్నారు. ఆ పార్టీ నియోజకవర్గ కీలక నేతలందరితో కలిసి ఉన్న వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యాచార ఘటన బయటకు రాకుండా బాధిత విద్యార్థినుల తల్లికి ఫోన్ చేసి కీలక నేత ఒకరు మాట్లాడినట్లు సమాచారం. తమ కూతుళ్లకు జరిగిన దారుణం పట్ల ఆమె గట్టిగా నిలదీయడంతో పాటు ఈ నెల 21న కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు టీడీపీ కీలక నేతల ద్వారా రాజకీయ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అందువల్లే ఈ ఘటనపై పోలీసులు నోరు విప్పడం లేదు. -
అత్తా, కోడలిపై గ్యాంగ్ రేప్ ఘటనలో ఐదుగురి అరెస్టు
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నల్లబొమ్మనపల్లి సమీపంలో అత్తాకోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వి.రత్న మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వారి నుంచి రూ.5,200 నగదు, రెండు మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. హిందూపురం త్యాగరాజనగర్‌కు చెందిన ఎరికల కావడి నాగేంద్ర, సాకే ప్రవీణ్‌కుమార్, మరో ముగ్గురిని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు హిందూపురం–పాలసముద్రం రోడ్డులోని బిట్ కాలేజీ వెనుక వైపున డంపింగ్ యార్డ్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. హిందూపురం త్యాగరాజనగర్ గుడ్డం ఏరియాలో ఉంటున్న చాకలి శ్రీనివాసులు అలియాస్ శ్రీనాథ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కేసుల్లో పట్టుబడ్డ నిందితులు కరడుగట్టిన నేరస్తులేనని, వారిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. ఎరికల కావడి నాగేంద్ర దోపిడీ, అత్యాచార కేసుల్లో నిందితుడని, అతనిపై అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 37కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. సాకే ప్రవీణ్‌కుమార్‌పై లేపాక్షి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైందన్నారు. పరారీలో ఉన్న చాకలి శ్రీనివాసులు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ కేసులో ముద్దాయని తెలిపారు. ఇతని స్వగ్రామం లేపాక్షి మండలం కల్లూరు కాగా.. ప్రస్తుతం హిందూపురం త్యాగరాజనగర్ గుడ్డం ఏరియాలో ఉంటున్నాడన్నారు.స్పెషల్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూస్తాం: ఎస్పీనిందితులకు స్పెషల్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. ఘటన జరిగిన 48 గంటల్లోపే నిందితులను అరెస్టు చేశామన్నారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేసును ఛేదించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీ వి.రత్న, ఇతర పోలీస్ అధికారులను సీఎం, హోంమంత్రి, డీజీపీలు ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ వి.రత్న, డీఎస్పీ మహేష్ నగదు రివార్డులు అందజేశారు. -
వేర్ ఈజ్ పోలీస్ ప్రభుత్వం?
సాక్షి, అమరావతి/ సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగ అరాచకం రాష్ట్రంలో విశృంఖలంగా సాగిపోతోంది. అమాయకులను వేధింపులకు గురిచేస్తూ, నేరగాళ్లకు అండగా నిలుస్తూ చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోంది. గత 4 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరాచకాలే ఇందుకు నిదర్శనం. తాజాగా దసరా రోజున శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని నల్ల బొమ్మనపల్లిలో అత్త, కోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆగంతకులకు టీడీపీ సర్కార్ కొమ్ముకాస్తూ.. కేసును పక్కదారి పట్టించేందుకూ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే దారుణం జరిగి మూడు రోజులైనా పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైపెచ్చు ఈ ముఠాక నాయకుడైన యువకుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. టీడీపీ నేతలు పెంచి పోషిస్తున్న ఈ నేరగాళ్ల ముఠాకు పొట్ట కూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన కుటుంబం బలైపోయింది. ఓ పేపర్ మిల్లులో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తండ్రి, కొడుకుపై వారి ఇంటి ఎదుటే దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వాచ్‌మేన్ భార్య, కోడలిని బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆత్తా కోడళ్లను బలవంతంగా ఎత్తుకుపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా, ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నిందుతలకు ప్రభుత్వ వత్తాసును స్పష్టంచేస్తున్నాయి. ఆరుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని సీసీ టీవీ రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయి. వారిలో అయిదుగురిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కానీ ఆ ముఠాకు నాయకుడిగా ఉన్న యువకుడిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం తీరు పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలీ రాష్ట్రంలో పోలీసులున్నారా.. ప్రభుత్వముందా అంటూ ప్రజలు, విపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.బాధితులను పరామర్శించేందుకు అనుమతినివ్వని పోలీసులు అత్యాచార బాధితులను కలిసేందుకు ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం అనుమతించడంలేదు. బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నించినా పోలీసులు సమ్మతించలేదు. బాధితులను కలిసేందుకు ఎవరినీ అనుమతించడంలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితులపై ఒత్తిడి తెచ్చి, నిజాలకు పాతరేసి, కేసును పక్కదారి పట్టించాలన్న ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఇతరులెవ్వరూ బాధితులను కలిసేందుకు అనుమతించడంలేదు. ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు బాధితులను కలసి మాట్లాడితే వారు వాస్తవాలు వెల్లడించే అవకాశం ఉన్నందునే ఎవర్నీ అనుమతించడం లేదన్నది సుస్పష్టం.రాష్ట్రమంతా ఇదే దారుణకాండచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాపంగా మహిళలు, యువతులపై అత్యాచారాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ బాలికను అపహరించి అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది జరిగి నాలుగు నెలలైనా ఆ చిన్నారి మృతదేహాన్ని కూడా ఆమె తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారు. ఇక పుంగనూరులో ఇటీవల ఓ ముస్లిం బాలికను అపహరించి హత్య చేశారు. తమ బిడ్డను ఎవరో అపహరించుకుపోయారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అయిదు రోజులు పోలీసులు కాలయాపన చేశారు తప్ప, ఆ చిన్నారిని రక్షించే ప్రయత్నం చేయలేదు. నిత్యం బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, అరాచకాలతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడమేలేదు.వేర్ ఈజ్ ఎమ్మెల్యే బాలకృష్ణనందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో విలన్ ఓ మహిళా అధికారిని ఆమె కుమారుడి ఎదుటే అత్యాచారం చేస్తారు. ఆ సినిమాలో హీరో పాత్రధారి బాలకృష్ణ ఆ విలన్‌ను చంపి శిక్షిస్తాడు. అంతేకాదు.. మహిళల ఔన్యత్యాన్ని కీర్తిస్తూ భారీ డైలాగులు చెబుతారు.. కట్ చేస్తే.. అదే హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఆగంతకులు అత్త, కోడలిపై వారి ఇంట్లోనే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తన నియోజకవర్గంలోనే జరిగిన ఈ ఘోరంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించనే లేదు. కనీసం పోలీసులతో మాట్లాడి నిందితులను వెంటన అరెస్ట్ చేయమని ఆదేశించనూ లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించనూ లేదు. సినిమా షూటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అందుకే హిందూపూర్ ప్రజలే కాదు.. యావత్ రాష్ట్రం ‘వేర్ ఈజ్ పోలీస్.. వేర్ ఈజ్ ప్రభుత్వం.. వేర్ ఈజ్ బాలకృష్ణ’ అని ప్రశ్నిస్తోంది. -
రాష్ట్రంలో అరాచక పాలన
సాక్షి, పుట్టపర్తి: ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కరువైంది. బాలికలు బతకాలంటేనే భయం భయంగా గడపాల్సి వస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి సమీపంలోని పేపరు మిల్లు వద్ద ఓ కుటుంబంలోని ఇద్దరు మహిళలపై శనివారం తెల్లవారుజామున కొందరు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పండుగ రోజున ఓ కుటుంబం అన్యాయానికి గురైతే ప్రభుత్వానికి పట్టదా? బాధితులను పరామర్శిద్దామని సాటి మహిళలుగా నేను (ఉషశ్రీచరణ్), దీపిక హిందూపురం ఆస్పత్రి వద్దకు వెళ్తే.. పోలీసులు లోపలికి అనుమతించలేదు.బాధితులను పరామర్శించాలంటే అధికారంలోనే ఉండాలా? చట్టం మీ చుట్టమా? చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఏదో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాలేజీ బాత్ రూముల్లో వీడియోలు తీసి బయటకు వదిలేస్తున్నారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పొట్ట కూటి కోసం వచ్చే కుటుంబాలపై గ్యాంగ్ రేప్ చేస్తున్నారు..’ అంటూ వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు.సోమవారం సాయంత్రం ఆమె పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, హిందూపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త టీఎన్ దీపిక తదితరులతో కలిసి పుట్టపర్తిలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులును కలిసి గ్యాంగ్ రేప్ విషయమై మాట్లాడారు. నిందితులను త్వరగా పట్టుకుని.. కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ఎందుకు సరైన రీతిలో స్పందించలేదని ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణగా దిశ చట్టం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. మహిళలకు అన్యాయం జరగకుండా ఎస్ఓఎస్ ద్వారా రక్షణ కోరే అవకాశం ఉండేదని చెప్పారు. ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. మొన్న ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లిని కిడ్నాప్ చేసి హత్య చేశారు, అంతకుముందు పుంగనూరు, నంద్యాలలోనూ మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూశాయి, ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గంలో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. -
టీడీపీ కాలకేయుల నుంచి మహిళలను రక్షించాలి
సాక్షి, అమరావతి/హిందూపురం: రాష్ట్రంలోని మహిళలకు టీడీపీ కాలకేయుల నుంచి రక్షణ కల్పించాలని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ డిమాండ్ చేశారు. ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ అత్యంత దుర్మార్గమని, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ఆదివారం హిందూపురం డీఎస్పీ మహేష్‌ను ఆయన కార్యాలయంలో కలసి బాధితుల పరామర్శకు అనుమతించాలని కోరారు.ఇందుకు ఆయన ససేమిరా అన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఇప్పుడు ‘తెలుగు దండుపాళ్యం పార్టీ’గా తయారైందన్న ఆమె.. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అమానుషం జరిగి రెండు రోజులైనా స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం బాధితులకు బాసటగా నిలవలేక పోయారని, నియోజకవర్గాన్ని గాలికి వదిలి సినిమాలకు పరిమితం కావడం బాధాకరమని నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. -
ఏపీలో దారుణం .. అర్ధరాత్రి అత్తా కోడలిపై లైంగిక దాడి
-
ట్రెయినీ ఆర్మీ అధికారులపై దాడి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. యువ సైనికాధికారులను తీవ్రంగా కొట్టి, వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇండోర్ సమీపంలోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు అధికారులు, తమ స్నేహితురాళ్లతో కలిసి బుధవారం మధ్యాహ్నం చోటీ జామ్ వద్ద ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ప్రదేశానికి పిక్నిక్కు వెళ్లారు.తుపాకులు, కత్తులు, కర్రలతో వచ్చిన 8 మంది దుండగులు అకస్మాత్తుగా వారిని చుట్టుముట్టారు. నలుగురినీ చితకబాది వారివద్ద డబ్బు, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఒక అధికారిని, అతడి స్నేహితురాలిని బందీలుగా ఉంచుకున్న దుండగులు రూ.10 లక్షలు తెస్తేనే విడిచిపెడతామంటూ మరో అధికారి, అతడి స్నేహితురాలిని పంపించారు. బాధితుడు హుటాహుటిన తన యూనిట్‌కు వెళ్లి కమాండింగ్ అధికారికి సమాచారమిచ్చారు. ఈ మేరకు పోలీసులు, మిలటరీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిని చూసి దుండగులు పారిపోయారు. నలుగురు బాధితులను పోలీసులు మోవ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. దోపిడీ, అత్యాచారం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మోవ్ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో శాంతి భద్రతలు మచ్చుకైనా కానరావడం లేదని దుయ్య బట్టారు. మహిళలపై జరుగుతున్న నేరాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకర అంశమని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్
టీకమ్గఢ్: మధ్యప్రదేశ్‌లోని టీకమ్గఢ్లో పొలం పనికి వెళ్లిన 13 ఏళ్ల గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఖర్గపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచెర్ గ్రామంలో ఆగస్ట్ 15వ తేదీన దారుణం చోటుచేసుకుంది. అయితే, బాధిత బాలిక కుటుంబీకులు గురువారం ఆ ప్రాంతంలో పర్యటించిన ఇన్చార్జి మంత్రి కృష్ణ గౌర్‌కి విషయం తెలపడంతో వెలుగులోకి వచి్చంది. మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి, సలీం ఖాన్, లాలూ ఖాన్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై భారతీయ న్యాయ్ సంహిత(బీఎన్ఎస్)తోపాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ రోహిత్ కష్వానీ చెప్పారు. ‘బాధిత బాలిక తండ్రి ఢిల్లీలో కార్మికుడిగా పనిచేస్తుండగా, గ్రామంలో తల్లి తన పిల్లలతో ఉంటోంది. ఆగస్ట్ 15న పొలం పనికి వెళ్లిన బాలికను నిందితులు తమ పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు’అని ఖర్గపూర్ స్టేషన్ ఇన్చార్జి మనోజ్ ద్వివేది తెలిపారు. బాధిత కుటుంబీకులు రేప్ విషయాన్ని పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకురాలేకపోయారనే విషయమై దర్యాప్తు చేపట్టామన్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో ఘోరం
జోధ్‌పూర్: రాజస్తాన్‌లోని మహాత్మాగాంధీ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం చోటుచేసుకుంది. జోధ్‌పూర్ నగరంలోని ఈ ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఒకరు ఈ ఆస్పత్రిలో మాజీ ఉద్యోగి కావడం గమనార్హం. జోధ్‌పూర్ సిటీ(వెస్ట్) ఏసీపీ అనిల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం బాలికను ఇంట్లో అమ్మ బాగా కోప్పడింది. దీంతో అలిగిన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి దగ్గర్లోని మహాత్మాగాంధీ ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది. అక్కడ ఒంటరిగా తిరుగుతున్న బాలికతో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు మాటలు కలిపారు. తర్వాత బాలికను ఆస్పత్రి వెనుకభాగంలో ఆస్పత్రి బయోవ్యర్థాలను నిల్వఉంచిన డంపింగ్ యాడ్ వద్దకు తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారు. అమ్మాయి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు బాగా వెతికి చివరకు సోమవారం సూరసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రి సమీపంలో బాలిక జాడ కనిపెట్టారు. అమ్మాయి దొరికిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు వచ్చాక ముందురోజు తాను ఎదుర్కొన్న భయానక ఘటనను తల్లిదండ్రులు, పోలీసులకు అమ్మాయి విడమరిచి చెప్పింది. దీంతో అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి నిందితుల జాడ కోసం వేట మొదలెట్టారు. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్‌చేసి ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం డంపింగ్‌యార్డ్‌లోని ఘటనాస్థలికి వెళ్లి ఫోరెన్సిక్ బృందం సాక్ష్యాధారాలను సేకరించిందని ఏసీపీ చెప్పారు. ‘‘ పోలీసులు ఆస్పత్రికి వచ్చారుగానీ అసలేం జరిగిందో మాకు చెప్పలేదు. మేం అంతర్గతంగా వివరాలు రాబట్టగా నిందితుల్లో ఒకడు మా ఆస్పత్రిలో గతంలో కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగం చేశాడని తెల్సింది’’ అని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫతాసింగ్ భాటి చెప్పారు. రాత్రిళ్లు ఆస్పత్రి పరిసరాల్లో ఎక్కడా చీకటి ఉండొద్దు. లైట్లు బిగించండి. చీకటి ప్రాంతం కనిపించొద్దు’ అని సిబ్బందిని ఆయన ఆదేశించారు. విమర్శలు ఎక్కుపెట్టిన విపక్షాలుబీజేపీ హయాంలో రాష్ట్రంలో ఆటవికపాలన నడుస్తోందని విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘‘ ఆటవిక ఏలుబడికి తాజా ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. శాంతిభద్రతల అంశం అటు ప్రజా ప్రతినిధులకు, ఇటు పోలీసులకు ఏమాత్రం పట్టట్లేదు. దీంతో నేరస్తులకు భయం లేకుండా పోయింది. ఒకప్పుడు నేరాలే జరగని జోధ్‌పూర్‌లో ఇప్పుడు బీజేపీ అస్తవ్యస్థపాలనతో నగరంలో అమ్మాయిలకు రక్షణ కరువైంది’’ అని కాంగ్రెస్ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అన్నారు. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు అనేవే లేవని రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్‌సింగ్ దోస్తారా అన్నారు. -
బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ రోడ్‌వేస్‌కు చెందిన బస్సులో డెహ్రడూన్‌లోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ (ఐఎస్బీటీ)లో ఇద్దరు డ్రైవర్లు, సహా మరో ముగ్గురు ఆగస్టు 12వ తేదీన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 13వ తేదీ తెల్లవారుజామున బస్ టెర్మినల్‌లోని ఓ దుకాణం వద్ద బాలికను గార్డు గుర్తించాడు. వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఉత్తరాఖండ్ రోడ్ వేస్ బస్సును గుర్తించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నేరం జరిగిన బస్సు, మరో బస్సును దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు. మానసికంగా స్థిమితంగా లేని బాలిక సరైన సమాచారం ఇవ్వలేదు. తనది యూపీలోని మొరాదాబాద్ అని తెలిపింది. కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించింది. మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీలోని కశ్మీరీ గేట్ నుంచి బస్సులో డెహ్రడూన్‌కు వచ్చానని, అక్కడ ఐదుగురు వ్యక్తులు తనపై ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక చెప్పిందని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశామని చెప్పారు. -
వనస్థలిపురం ఘటనలో స్నేహితుడి అరెస్ట్
హస్తినాపురం: తనను నమ్మి వచ్చిన చిన్ననాటి స్నేహితురాలికి మద్యం తాగించి.. స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీపీ పి.కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, గౌతంరెడ్డి అనే యువకుడు పాఠశాల స్నేహితులు. యువతికి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో పార్టీ చేసుకునేందుకు సోమవారం రాత్రి 7.30కు వీరిద్దరూ కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్ కాలనీలోని బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ మద్యం తాగారు... ఆ తర్వాత ఇదే రెస్టారెంట్లో గౌతంరెడ్డి గది అద్దెకు తీసుకుని యువతిని తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితుడిని కూడా గదికి పిలిచాడు. ఇద్దరు కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న యువతి గదిలో గౌతంరెడ్డి తో పాటు మరో వ్యక్తి ఉండడంతో తనపై లైంగిక దాడి జరిగిందన్న విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేసింది. దీంతో కంగారు చెందిన ఇద్దరు యువకులు అక్కడ నుంచి పారిపోయారు... బాధితురాలు విషయాన్ని రెస్టారెంట్ సిబ్బంది దృష్టి తీసుకెళ్లగా వారు ఆమె స్నేహితులకు సమాచారం అందించారు. వెంటనే యువతి స్నేహితులు రెస్టారెంట్‌కు వచ్చి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు గౌతంరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడు శివాజీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని ఏసీపీ కాశిరెడ్డి వెల్లడించారు. -
హైదరాబాద్‌లో దారుణం..కారులో యువతిపై గ్యాంగ్ రేప్
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్‌లో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక హత్యాచారం జరిగింది.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని అరెస్ట్ చేసిన జైలుకు తరలించినట్లు పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జేఎస్ఆర్ గ్రూప్ సన్‌సిటీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో బాధితురాలు ట్రైనీగా చేరింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి బాధితురాలితో కలిసి సైట్ విజిట్ నిమిత్తం యాదాద్రికి కారులో వెళ్లారు. అక్కడ సైట్ విజిట్ చేసి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెకు ముందుగా మత్తు మందు కలిపిన ఆహార పదార్ధాలు తినేలా ప్లాన్ చేశారు. ఆమె తినకపోవడంతో మత్తుమందు కలిపిన కూల్‌డ్రింగ్ ఇచ్చారు. ఆ కూల్‌డ్రింక్ తాగిన ఆమెపై కారులోనే దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెకు స్ప్రహ రావడంతో హస్టల్ దగ్గర వదిలేసి పరారయ్యారు. అయితే తనపై జరిగిన దాడిపై బాధితురాలు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును మియాపూర్ పోలిస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సంగారెడ్డి, జనార్ధన్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు విచారణలో చేసిన దారుణాన్ని అంగీకరించారు అని పోలీసులు వెల్లడించారు. -
గంజాయి అలవాటు చేసి మరీ గ్యాంగ్ రేప్
మేడ్చల్, సాక్షి: నగరంలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాచిగూడకు చెందిన మైనర్‌కు సదరు యువకులు గంజాయి అలవాటు చేశారు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక భయంతో ఈ ఘోరాన్ని ఎవరికీ చెప్పడకుండా ఉండిపోయింది. ఈలోపు శరీరంలో మార్పులు రావడంతో బాధితురాలిని, తల్లి నిలదీసింది. దీంతో జరిగిన ఘోరాన్ని బాలిక తల్లికి వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాచిగూడ పోలీసులు.. ఆ కేసును నేరెడ్‌మెట్‌కు బదిలీ చేశారు. పరారీలో ఉన్న యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
‘హమాస్’ అత్యాచారాలు.. యూఎన్ సంచలన నివేదిక
జెరూసలెం: గతఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి(యూఎన్) సంచలన విషయాలు వెల్లడించింది. అక్టోబర్ 7 దాడిలో ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో అక్కడి మహిళలపై అత్యాచారాలు జరిగాయనేందుకు కచ్చితమైన, ఆధారలతో కూడిన సమాచారం ఉందని యుద్ధంలో జరిగిన లైంగిక దాడులపై యూఎన్ నియమించిన ప్రమీల పాటెన్ బృందం తేల్చింది. హమాస్ బంధీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ మహిళలపై ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయని యూఎన్ బృందం తన నివేదికలో తెలిపింది. ఫిబ్రవరిలో పాటెన్తో పాటు నిపుణుల బృందం ఇజ్రాయెల్, వెస్ట్‌బ్యాంక్‌లో పర్యటించారు. గాజా సరిహద్దులోని ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ప్రాంతాలు నోవా మ్యూజిక్ ఫెస్టివల్ సైట్,రోడ్ 232, కిబుట్జ్ రెమ్లలో ఇజ్రాయెలీలపై రేప్‌లతో పాటు గ్యాంగ్ రేప్‌లు జరిగినట్లు రిపోర్టు వెల్లడించింది. చాలా వరకు కేసుల్లో ముందు రేప్ చేసి తర్వాత హత్య చేశారని తెలిపింది. చనిపోయిన మహిళల మృతదేహాలపైన కూడా రెండు చోట్ల అత్యాచారాలు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి బృందం తేల్చింది. ఈ అత్యాచారాలపై సాక్ష్యం చెప్పాల్సిందిగా బృందం కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. అత్యాచార ఘటనలపై యూఎన్ బృందం సభ్యులు మొత్తం 5వేల ఫొటోలు, 50 గంటల సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు రేప్‌కు గురైన బాధితులతో మాట్లాడారు. హమాస్ వద్ద బంధీలుగా ఉండి విడుదలైన వారిని పలువురిని ఇంటర్వ్యూ చేశారు. కాగా, అక్టోబర్ 7న ఇజజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ మెరుపు దాడులు జరిపి వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపి కొంత మందిని బంధీలుగా తమ వెంట తీసుకెళ్లింది. దీనికి ప్రతీకారంగా అప్పటి నుంచి ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై భీకర దాడులు చేస్తోంది. గాజాను మొత్తం చిధ్రం చేసింది. అమెరికా కోరినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. ఇదీ చదవండి..హైతీలో తీవ్ర అరాచకం -
HYD: తార్నాకలో గ్యాంగ్‌రేప్, ఆలస్యంగా వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: తార్నాకలో ఘోరం జరిగింది. లిఫ్ట్ పేరిట ఒక మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు ఐదుగురు. నిందితుల అరెస్ట్‌తో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు. తన స్కూటీపై ఎక్కించుకుని ప్రశాంత్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఫోన్ చేసి తన నలుగురు స్నేహితుల్ని రప్పించుకుని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో మధు యాదవ్, బర్నా యేసు, సిరిగిరి ప్రశాంత్‌కుమార్, పస్తం తరుణ్‌కుమార్, కేశోజువా రోహిత్‌లపై కేసు నమోదు చేసుకున్నారు లాలాగూడ పోలీసులు. ప్రశాంత్.. మధుసూదన్.. రోహిత్ తరుణ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్‌పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్‌లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
వివాహితపై అత్యాచారం
కర్ణాటక: వివాహితపై సాముహిక అత్యాచారం చేసి, దానిని మొబైల్లో రికార్డు చేసి బ్లాక్‌మొయిల్ చేస్తున్న దారుణ ఘటనకు సంబంధించి బెళగావి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గోకాక్ పట్టణంలో సెప్టెంబర్ 5న ఈ దుర్ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోకాక్ చుట్టు పక్కల ఒంటరి మహిళను గుర్తించిన ముఠా సభ్యులు ఆమైపె అత్యాచారం చేశారు. వీరు దోపిడీలకు కూడా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇదే ప్రాంతంలో ఓ ఇంటిలో రూ. 10 లక్షల విలువైన నగలు దోచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులకు అత్యాచారం ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి కేజీ బంగారు నగలు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. -
ఒంటి నిండా పంటి గాట్లతో రకప్తు మడుగులో..
క్రైమ్: మానవ మృగాల అకృత్యాలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వావివరుసలు, వయసు తారతమ్యాలు లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. సామూహిక అత్యాచారానికి గురై.. అత్యంత దీనస్థితిలో ఓ మైనర్ బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సాత్నా జిల్లా మైహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. అర్కండికి చెందిన 11 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. అయితే శుక్రవారం ఉదయం మైహర్ శివారులోని అడవుల్లో శారదా దేవి ఆలయం సమీపంలో రక్తపు మడుగులో బాలిక కనిపించింది. నగ్నంగా పడి ఉన్న బాలికను గమనించిన కొందరు భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను మైహర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒంటి నిండా పంటి గాయాలు ఉన్నాయని.. పదునైన ఆయుధాలతో ఆమె అంతర్గత అవయవాలనూ గాయపరిచారని వైద్యులు నివేదిక ఇచ్చారు. బాలిక పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికుల్లో ఆగ్రవేశాలను రగిల్చింది. ఆస్పత్రికి చేరుకుని ‘‘న్యాయం చేయాలనే’’ నినాదాలతో హోరెత్తించారు వాళ్లు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. వాళ్లను శాంతపరిచారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మైహర్ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్.. బీజేపీ సర్కార్ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో విఫలమైందని విమర్శించగా.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. -
మణిపూర్‌లో కీచక పర్వం.. స్మృతి ఇరానీ స్పందన
ఇంఫాల్/ఢిల్లీ: అల్లర్లలో అట్టుడికిపోతున్న మణిపూర్‌లో కీచక పర్వం వెలుగుచూసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. ఆపై పంట పొలాల్లోకి లాక్కెల్లి కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కెమెరాల సాక్షిగా ఇది జరగ్గా.. ఈ ఘోరానికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా పలువురు రాజకీయ నేతలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్‌లో తాజాగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. సాయం కోసం వాళ్లు కేకలు పెడుతుంటే.. చుట్టూ ఉన్న మూక వాళ్లను ఇష్టానుసారం తాకుకూ వేధించడం అందులో ఉంది. ఆపై వాళ్లను పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్తూ మరో వీడియో వైరల్ అయ్యింది. అయితే ఆపై ఆ ఇద్దరిపై సామూహిక అత్యాచారం జరిగిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లా పరిధిలో మే 4వ తేదీన ఇది జరిగిందని ఐటీఎల్ఎఫ్ (ఆదివాసీ గిరిజన నేతల సంఘం) ఆరోపిస్తోంది. అయితే.. పోలీసులు మాత్రం ఇది వేరే చోట జరిగిందని.. ఎఫ్ఐఆర్ మాత్రం కాంగ్పోక్పిలో నమోదు అయ్యిందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందించారు. హైప్రొఫైల్ కేసుగా దీనిని దర్యాప్తు చేపట్టాలని మణిపూర్ పోలీస్ శాఖను ఆదేశించారు. The horrific video of sexual assault of 2 women emanating from Manipur is condemnable and downright inhuman. Spoke to CM @NBirenSingh ji who has informed me that investigation is currently underway & assured that no effort will be spared to bring perpetrators to justice. — Smriti Z Irani (@smritiirani) July 19, 2023 అంతకు ముందు కేంద్ర శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఘటనపై.. భయంకరమైన ఘటన అని ట్వీట్ చేశారామె. ఘటనపై సీఎం బీరెన్, మణిపూర్ సీఎస్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షించాలని.. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె వాళ్లను కోరినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించామని.. వీలైనంత త్వరగా వాళ్లను పట్టుకుంటామని మణిపూర్ పోలీస్ శాఖ ప్రకటించింది. బాధితులు కుకీ తెగ మహిళలుగా తెలుస్తోంది. *All out effort to arrest culprits as regard to the viral video of 02 (two) women paraded naked :* As regard to the viral video of 02 (two) women paraded naked by unknown armed miscreants on 4th May, 2023, a case of abduction, gangrape and murder etc 1/2 — Manipur Police (@manipur_police) July 19, 2023 PM’s silence and inaction has led Manipur into anarchy. INDIA will not stay silent while the idea of India is being attacked in Manipur. We stand with the people of Manipur. Peace is the only way forward. — Rahul Gandhi (@RahulGandhi) July 19, 2023 ఈ ఘటనకు ఒక్కరోజు ముందు నుంచే మణిపూర్ రణరంగంగా మారడం ప్రారంభమైందన్నది తెలిసిందే. గిరిజన హోదా కోరుతూ మెయితీలు చేస్తున్న విజ్ఞప్తులు.. అక్కడి కుకీ గిరిజనులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి.. మానప్రాణాలు పోతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి.. అపహరణ, గ్యాంగ్‌రేప్‌తో పాటు హత్యానేరాల కింద కేసులు నమోదు చేసినట్లు మణిపూర్ పోలీస్ శాఖ వెల్లడించింది. మరోవైపు పలువురు రాజకీయ నేతలు సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. मणिपुर से आ रही महिलाओं के खिलाफ यौन हिंसा की तस्वीरें दिल दहला देने वाली हैं। महिलाओं के साथ घटी इस भयावह हिंसा की घटना की जितनी निंदा की जाए कम है। समाज में हिंसा का सबसे ज्यादा दंश महिलाओं और बच्चों को झेलना पड़ता है। हम सभी को मणिपुर में शांति के प्रयासों को आगे बढ़ाते हुए… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2023 Attention India! The modesty of two tribal women from Manipur were outraged on 4th May. They were paraded naked, fondled and beaten in full public glare! A disturbing video taken by a perpetrator leaked and got viral today. This breaks all level of humanity. @PMOIndia @NCWIndia — hoihnu hauzel - www.thenestories.com (@hoihnu) July 19, 2023 ట్విటర్లో వీడియోలు తొలగింపు.. చర్యలు? మణిపూర్‌లో ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా ఊరేగిస్తూ.. ఇష్టానుసారం తాకుతూ ఉరేగించిన వీడియో ట్విటర్‌ను కుదిపేసింది. వాళ్లపై సామూహిక అత్యాచారమూ జరిగిందన్న ఆరోపణలతో యావత్ దేశం భగ్గుమంది. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఘటనలకు వీడియోలను తొలగించాలని ట్విటర్‌ను కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా వీడియోను తొలగించాలని ట్విటర్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్రం ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. భారత చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ట్విటర్‌పై చర్యలకు ఉపక్రమించిబోతున్నట్లు సమాచారం. -
బీజేపీ నేత కొడుకు ఘాతుకం.. ఫ్రెండ్స్ తో కలిసి యువతిపై గ్యాంగ్‌రేప్
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధాతియా జిల్లాలో దారుణం జరిగింది. అధికార బీజేపీ పార్టీ ప్రతినిధి కుమారుడు స్నేహితులతో కలిసి ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మైనర్ చెల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. అవమానభారంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ హోం శాఖమంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ధాతియా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన యువతి ఆత్మహత్యకు పాలపడిన తర్వాత విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, భారీ సంఖ్యలో స్థానికులు ఉన్నవ్ పోలీసు స్టేషన్ వద్ద గుమికూడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేంద్ర బుధోలియా స్పందిస్తూ.. ఒకవేళ ఆ అమ్మాయి తన వాంగ్మూలంలో బీజేపీ నాయకుడి కుమారుడి పేరు చెబితే తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మైనర్ బాలిక ఇచ్చిన కంప్లైంట్ లో.. బీజేపీ లీడర్ కొడుకు తన స్నేహితులతో కలిసి మొత్తం నలుగురు తనను, తన సోదరిని తీసుకుని ఒక అజ్ఞాత ప్రదేశానికి తీసుకుని వెళ్లారని, అక్కపై సామూహికంగా అత్యాచారం చేసి తనపై కూడా లైంగిక దడి చేశారని తెలిపింది. సంఘటన అనంతరం ఇద్దరూ ఇంటికి చేరుకోగా తన సోదరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పేర్కొంది. ధాతియా ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడుతో సహా ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని ఒకరు మాత్రం పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుకి చేరువలో ఝాన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని అన్నారు. ఇది కూడా చదవండి: విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం.. -
లైంగిక సుఖానికి దూరమయ్యా... రూ.10,006 కోట్లివ్వండి
రత్లాం: గ్యాంగ్ రేప్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన ఓ వ్యక్తి తనకు ప్రభుత్వం నష్ట పరిహారంగా రూ.10,006.2 కోట్ల చెల్లించాల్సిందేనంటూ కోర్టుకెక్కాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం పట్టణంలో ఈ సంఘటన జరిగింది. గిరిజనుడైన కాంతూ ఆలియాస్ కాంతీలాల్ భీల్(35)ను గ్యాంగ్ రేప్ కేసులో 2020 డిసెంబర్ 23న పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రెండేళ్లపాటు జైల్లో ఉన్నాడు. స్థానిక కోర్టు 2022 అక్టోబర్ 20న అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అంతరం కాంతీలాల్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైల్లో ఉన్నప్పుడు భార్యతో లైంగిక సుఖానికి దూరమయ్యానని, దేవుడిచ్చిన వరం వృథా అయ్యిందని, తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు రూ.10,006.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇందులో రూ.10,000 కోట్లు మానసిక క్షోభ అనుభవించినందుకు మిగతా రూ.6.02 కోట్ల ఇతర ఖర్చుల కోసమని విన్నవించాడు. -
మరో నిర్భయ.. షేర్డ్ ట్యాక్సీలో యువతిపై సామూహిక లైంగిక దాడి
దేశంలో రోజురోజుకు యువతులు, మహిళలపై లైంగికదాడులు పెరుగుతూనే ఉన్నాయి. కొందరు మృగాలు రెచ్చిపోతూ ఆఫీసులకు వెళ్లే యువతులు, నిర్మానుష్య ప్రాంతాల్లో వెళ్లే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. షేర్డ్ టాక్సీలో వెళ్తున్న యువతి లైంగికదాడికి గురైంది. వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన ఓ యువతి.. షేర్డ్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. ఈ క్రమంలో ట్యాక్సీ రాగానే లోపల కూర్చుంది. అయితే, ట్యాక్సీ కొంత దూరం వెళ్లగానే మరో ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. అనంతరం, కొద్ది దూరం వెళ్లగానే యువతిపై యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత, ఆమెను ఎత్మాద్పూర్ ఏరియాలో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఎత్మాద్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా ఆగ్రా సీపీ ప్రీతింధర్ సింగ్ మాట్లాడుతూ.. బాధితురాలు షేర్డ్ టాక్సీ బుక్ చేసుకుని వెళ్తుండగా ముగ్గురూ కలిసి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించి నిందితుల కోసం గాలిస్తున్నాము. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య చిక్సితలు అందిస్తున్నట్టు తెలిపారు. Uttar Pradesh | A woman gave a complaint at Etmadpur police station today. In the complaint, she said she took a shared taxi from Noida and on the way, 3 boys raped her and dropped her near Etmadpur: Preetinder Singh, CP, Agra pic.twitter.com/i1Kxn9Qlil — ANI UP/Uttarakhand (@ANINewsUP) December 28, 2022 -
మైనర్‌పై సామూహిక అత్యాచారం.. 12 గంటలపాటు నిర్బంధించి..
మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కామాంధులు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలే కాకుండా పసిపిలల్లపై సైతం లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో సభ్య సమాజం లదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై కొంతమంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 12 గంటలపాటు బాలికను నిర్భంధించి అత్యంత దారుణంగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. పాల్ఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఈ ఘోరం జరిగింది. పాల్ఘర్ జిల్లా రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16 ఏళ్ల మైనర్ బాలికపై 8 మంది వ్యక్తులు అత్యాచారం చేశారు. డిసెంబర్ 16న(శుక్రవారం) కొందరు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసి మహిమ్ గ్రామంలోని ఖాళీగా ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేగాక అక్కడి నుంచి సముద్ర తీరానికి తీసుకెళ్లి అక్కడి పొదల్లో మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డారు. మొత్తం 12 గంటలపాటు (శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు) బాలికను నిర్బంధించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు సత్పతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: అమానుష ఘటన.. అపార్ట్మెంట్ వద్ద పసికందును వదిలేసిన వ్యక్తులు -
11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో
న్యూఢిల్లీ: తనపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడాన్ని బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 1992 ఉపశమన నిబంధనలకు ఈ కేసుకు వర్తింపజేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో అనుమతివ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు. అలాగే 11 మంది దోషులను ముందుగానే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను ఒకేసారి, ఒకే ధర్మాసనం విచారించే విషయాన్ని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె మూడెళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. అప్పుడు ఆమె వయసు 21 ఏళ్లు. ఐదు నెలల గర్భవతి కూడా. ఈ దారుణ ఘటనలో 11 మందిని దోషులుగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే 15 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వీరిని ఈ ఏడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా' -
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
-
దారుణం.. బ్లాక్మెయిల్ చేసి 8 మంది అత్యాచారం
జైపూర్: రాజస్థాన్ అల్వార్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. 8 మంది యువకులు 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేటు ఫోటోలు రహస్యంగా తీసి బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి బాధితురాలి నుంచి రూ.50వేలు వసూలు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్ 1న ప్రధాన నిందితుడు సోహిల్ తనకు సోదరి వరసయ్యే బాలికకు ఫోన్ చేసి ఓ చోటుకు రమ్మన్నాడు. అక్కడకి రాకపోతే సీక్రెట్‌గా తీసిన ప్రైవేటు చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయంతో అక్కడకు వెళ్లింది. ఒంటరిగా వెళ్లిన ఆమెపై సోహిల్, అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాన్ని ఫోన్లో చిత్రీకరించారు. ఆ తర్వాత నుంచి బాధితురాలిని తరచూ బ్లాక్ చేసి డబ్బు వసూలు చేశాడు సోహిల్. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఓసారి బాలిక డబ్బు ఇవ్వకపోవడంతో నిందితుడు ఆమె వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. వారిని అరెస్టు చేశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: భార్యపై అనుమానం.. బెడ్రూంలో సెల్‌ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత! -
Hyderabad: మహిళ కిడ్నాప్.. సామూహిక అత్యాచారం?
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతానికి చెందిన మహిళ(27)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్–దిడిగి గ్రామ శివారులోని ఓ వెంచర్లో శనివారం ఓ మహిళ మద్యం మత్తులో పడి ఉండగా దారిన వెళ్లే వారు చూసి ఆమెను జహీరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను సంగారెడ్డిలోని సఖి కేంద్రానికి తరలించారు. ఈ విషయమై డీఎస్పీ రఘును వివరణ కోరగా మహిళ మద్యం మత్తులో ఉండడంతో వివరాలు వెల్లడించడం లేదన్నారు. ఇందుకు సంబంధించి కిడ్నాప్, అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. బాధితురాలు పూర్తి వివరాలు సరిగ్గా చెప్పడం లేదన్నారు. తన స్వస్థలం ఒకసారి కూకట్పల్లి అని, మరోసారి బాలానగర్ అని చెబుతోందన్నారు. జహీరాబాద్‌కు ఎలా వచ్చింది.. ఎవరితో వచ్చిందనే వివరాలను కూడా చెప్పడం లేదన్నారు. మద్యం మత్తులో ఉండడం వల్ల ఏమీ చెప్పలేకపోతుందన్నారు. విచారణలో పొంతన లేని సమాధానం ఇస్తోందన్నారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని చెబుతోందన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని, ఇందుకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం విచారణ చేపట్టామని, విచారణ అనంతరమే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉంటే మహిళ పరిస్థితి బట్టి చూస్తే గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకొచ్చి సామూహిక అత్యాచారం జరిపి ఉంటారనే ప్రచారం సాగుతోంది. చదవండి: అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్ -
దేశ రాజధానిలో దారుణం.. 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అతడ్ని కర్రలతో దారుణంగా కొట్టారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో అబ్బాయిలకు కూడా రక్షణ లేదు అని మండిపడ్డారు. మహిళా ప్యానెల్ ఈ ఘటనను గుర్తించి పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. दिल्ली में लड़की तो क्या लड़के भी सुरक्षित नहीं हैं। एक 12 साल के लड़के के साथ 4 लोगों ने बुरी तरह से रेप किया और डंडों से पीटकर अधमरी हालत में छोड़कर चले गए। हमारी टीम ने मामले में FIR दर्ज करवाई। 1 आरोपी गिरफ़्तार, 3 अब भी फ़रार, दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। pic.twitter.com/tXrqK7xkwm — Swati Maliwal (@SwatiJaiHind) September 25, 2022 ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఒక్క నిందితుడిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఘటనపై మహిళా ప్యానెల్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. చదవండి: వీడియో లీక్ ఘటన.. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన ఆర్మీ జవాన్ అరెస్టు -
బాలికపై సామూహిక లైంగిక దాడి! మూడేళ్ల పిల్లాడి కళ్ల ముందే..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/భీమిని: వరసకు అన్నయ్య అయ్యే ఓ బాలుడు, అతని స్నేహితుడు కలసి మూడేళ్ల పిల్లాడి కళ్ల ముందే 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపారు. దీన్ని వీడియో కూడా తీశారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు ప్రకారం.. నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇంట్లో వరసకు కొడుకైన ఓ బాలుడు ఆటో నడుపుతూ నాలుగు నెలలుగా ఉంటున్నాడు. మూడు నెలల క్రితం సదరు వ్యక్తి కూతురుని, మూడేళ్ల బాబును మంచినీళ్లు తీసుకొద్దామని ఆ బాలుడు ఆటోలో బోరింగ్ పంపు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడికి మరో బాలుడు వచ్చాడు. అక్కడి నుంచి నలుగురు ఆటోలో గ్రామ శివారులోని శ్మశాన వాటిక వైపు వెళ్లారు. అక్కడ మూడేళ్ల బాబు సమక్షంలోనే ఇద్దరు బాలురు ఆటో వెనక సీటులో ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారం చేస్తూ సెల్ఫోన్లో వీడియోలు తీశారు. వాటిని స్నేహితులకు పంపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించడంతో విషయం బయటపడలేదు. రెండు రోజుల క్రితం బాలిక.. తన అమ్మమ్మకు ఈ దారుణం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకులా భావించి ఇంట్లో ఉంచుకుంటే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. నిందితులు పరారీలో ఉన్నారు. చదవండి:మరో నిర్భయ.. రన్నింగ్ రైలులో మహిళపై అత్యాచారయత్నం.. ఆ తర్వాత.. -
మైనర్‌పై సోదరుల గ్యాంగ్ రేప్.. అడ్డొచ్చిన బామ్మపైనా..!
భోపాల్: దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసినవారే రాక్షసుల్లా మారి దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ జిల్లాలో వెలుగు చూసింది. వరుసకు సోదరులయ్యే ఇద్దరు యువకులు ఓ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా కొట్టి హత్య చేశారు. ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు వచ్చిన ఆమె బామ్మపైనా నిందితుల్లో ఒకడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తన తండ్రితో కలిసి ముంబైలో నివాసం ఉంటోంది. ఆగస్టు 11న జబల్పూర్లోని తన పెదనాన్న వాళ్ల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 13న బాలికపై ఆమె ఇద్దరు కజిన్ సోదరులు లైంగిక దాడికి పాల్పడ్డారు. రోజుల తరబడి అఘాయిత్యానికి పాల్పడుతూ తీవ్రంగా కొట్టారు. బాధితురాలిని గమనించిన కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయింది. జబల్‌పూర్‌లోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. తన కూతురిపై ఇద్దరు సోదరులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడి తీవ్రంగా కొట్టటం వల్ల ప్రాణాలు కోల్పోయిందని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దుశ్చర్యను ఆపేందుకు వెళ్లిన తన తల్లిపైనా అత్యాచారం చేశారని, ఆమె చెబితేనే తనకు అసలు విషయం తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏఎస్పీ ప్రదీప్ కుమార్ వెల్లడించారు. ఆగస్టు 23న బాధితురాలి మృతదేహాన్ని పరీక్షించామని, వృద్ధురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు చెప్పారు. పోక్సోతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నిందితుల్లో ఒకరని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బాధితురాలికి చికిత్స అందించిన వైద్యులను ప్రశ్నించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి పాడు బుద్ధి.. రక్త పరీక్షల కోసం వచ్చిన మహిళపై.. -
యువతిపై అఘాయిత్యం.. ఆపై వ్యభిచార ముఠాకు విక్రయం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో యువతి సామూహిక అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా బయటపడింది. మూడేళ్ల క్రితం మండ్యకు చెందిన యువతిని ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఆమె ప్రియుడు నగరానికి తీసుకువచ్చాడు. ఆమెను ఒక గదిలో ఉంచి ప్రియుడు, ఆపై మరికొందరు ఒకేసారి ఆమెపై ఘోరానికి పాల్పడ్డారు. శివానందసర్కిల్ వద్ద గల ఒక లాడ్జి యజమాని సంతోష్ కూడా ఇందులో ఉన్నాడు. తరువాత యువతిని వ్యభిచార ముఠాకు విక్రయించారు. ఇటీవల పోలీసులు ఒక లాడ్జిలో జరుగుతున్న పడుపు దందాపై దాడి చేయగా పట్టుబడిన ఈ యువతి దీనగాథను వివరించింది. ఈ ఘటనపై హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, మంజుల, బ్రహ్మేంద్ర, సంతోష్ కుమార్‌లను శనివారం అరెస్టు చేశారు. అలాగే మోసపోయిన యువతి స్టేట్మెంట్ను రికార్డు చేసిన అనంతరం గ్యాంగ్ రేపుపై మరో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
Crime News: బెయిల్‌పై వచ్చి మళ్లీ రేప్ చేశాడు
భోపాల్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ మానవ మృగం.. మరోసారి కిరాతకానికి పాల్పడింది. బెయిల్ మీద బయటకు వచ్చి మరీ స్నేహితుడితో కలిసి మళ్లీ బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది ఇంతటితోనే ఆగలేదు.. మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. అత్యాచార బాధితురాలిపై మళ్లీ అత్యాచారానికి తెగపడ్డాడు దుర్మార్గుడు. ఈసారి స్నేహితుడితో కలిసి అఘాయిత్యాన్ని పాల్పడి.. అంతటితో ఆగకుండా ఆ నేరాన్ని వీడియో తీశాడు. తన మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకోకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలికి ఇప్పుడు 19 ఏళ్లు. రెండేళ్ల కిందట.. ఆమెపై వివేక్ పటేల్ అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ఏడాది తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న టైంలో కత్తితో బెదిరించి తన స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పరారీలో ఉన్న వివేక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెబుతోంది బాధితురాలు. ఇదీ చదవండి: భర్త వివాహేతర సంబంధం! సహించలేక పసిబిడ్డకు ఉరేసి.. -
దారుణం.. కట్నం కోసం స్నేహితులతో కలిసి భార్యపై భర్త గ్యాంగ్ రేప్!
లక్నో: దేశంలో మహిళలపై అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అడిగినంత కట్నం ఇవ్వలేదని ఓ కిరాతకుడు.. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ అమానుష సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆమె భర్త, అతడి స్నేహితులపై ఛకేరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2020, మార్చి 6 నిందితుడితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె భర్త, ఆడపడుచు రూ.2 లక్షలు, కారు కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారు. అయితే.. అడిగిన డబ్బు, కారు ఇవ్వలేకపోవటం వల్ల ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేశారు. ఒక రోజు ఆమె భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి తీసుకొచ్చాడు. నలుగురు కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనను చంపేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సైతం ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మ్రిగాంక్ పతాక్ తెలిపారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
దారుణం.. తొమ్మిదో తరగతి బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలలపాటు..
రాంచీ: జార్ఖండ్ బోకారోలో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు కిరాతకులు మూడు నెలలపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జులై 19న బాధితురాలు ఎలాగోలా నిందితుల చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. అప్పటికే తమ బిడ్డ కన్పించట్లేదని కేసు పెట్టిన తల్లిదండ్రులు విషయం తెలిసిన వెంటనే బాధితురాల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను మనోజ్ కుమార్, విష్ణు కుమార్, మంతోష్ కుమార్‌లుగా గుర్తించారు. మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా.. ఏప్రిల్ 20న బాలిక మార్కెట్ నుంచి తిరిగివస్తుండగా.. ఆటోలో వచ్చిన మంతోష్ కుమార్ మరో ఇద్దరి సాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత బాలికను ఓ గదిలో బంధించి రోజు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను గదిలోనే ఉంచి తాళం వేసి వెళ్లిపోయేవారు. జులై 19న అటువైపుగా వెళ్తున్న ఓ మహిళ బాధితురాలి పరిస్థితిని చూసి రాయితో తాళం పగలగొట్టి విముక్తి కల్పించింది. వెంటనే బాలిక ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ప్రస్తుతం ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: కన్నతండ్రే కాలయముడై... కూతురిని, అల్లుడిని చంపి... -
గ్యాంగ్ రేప్ నిందితులకు డీఎన్ఏ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడు, చట్టంతో విభేదించిన బాలురకు కచ్చితంగా శిక్ష పడేలా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వీరికి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ (టీఐపీ) పూర్తి చేసిన అధికారులు నిందితులకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానాలు అనుమతి మంజూరు చేయడంతో తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అవసరమైన పక్షంలో బాధితురాలి నుంచీ నమూనాలు సేకరించాలని యోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసులో సాదుద్దీన్, మరో ఐదుగురు చట్టంతో విభేదించిన బాలురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు సైతం పట్టుబడి జువైనల్ హోమ్‌కు చేరాడు. అయితే ఇతడు కేవలం బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడానికి సంబంధించి మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సాదుద్దీన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు సహా ఐదుగురు మాత్రం గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాన్సూ బేకరీ నుంచి బాలికను ఇన్నోవా కారులో పెద్దమ్మ గుడి సమీప ప్రాంతాలకు తీసుకువెళ్లిన ఈ ఐదుగురూ గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో వెంట్రుకలు, వినియోగించిన టిష్యూ పేపర్లతో సహా అనేక ఆధారాలు సేకరించారు. బాలిక పోలీసులకు, న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలోనూ తనపై ఆ కారులోనే అఘాయిత్యం జరిగినట్లు బయటపెట్టింది. దీంతో ఇన్నోవా కారులో లభించిన ఆధారాలు క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇప్పుడు సాదుద్దీన్ సహా ఐదుగురి నుంచి సేకరించిన నమూనాలకూ పంపనున్నారు. ఈ రెండింటినీ సరిపోల్చే నిపుణులు ఆ రోజు కారులో ఉన్నది, బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది వీరేనంటూ సాంకేతికంగా నిర్థారించనున్నారు. పోలీసులు దాఖలు చేసే అభియోగపత్రాల్లోనూ ఈ అంశాన్ని పొందుపరుస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపించడానికి ఇది కీలకం కానుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కోర్టుల్లో బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలంటూ పోలీసులు కోర్టును కోరుతున్నారు. కాగా బాలికపై సామూహిక అత్యాచారంలో ఎమ్మెల్యే కుమారుడి పాత్ర లేకున్నా... బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు, ఆధారాలు ఉండటంతోనే జువైనల్ హోమ్‌కు చేరాడు. ఇతడిపై ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద సదరు ఆరోపణలు నమోదు చేశారు. ఆమ్నేషియా పబ్ వద్ద సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఓ కీలక విషయం గుర్తించారు. ఇన్నోవా కారులో అప్పటికే ఉన్న సాదుద్దీన్‌ను దింపిన ఎమ్మెల్యే కుమారుడు అక్కడే కారు ఎక్కాడని, అలా ఈ కేసులో చిక్కాడని తెలుసుకున్నారు. (చదవండి: కోర్టును ఆశ్రయించిన పోలీసులు.. ఎందుకంటే..?) -
మైనర్ బాలిక కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్
-
ఆలస్యంగా వెలుగులోకి.. తల్లితో గొడవపడి బయటికి వెళ్లిన బాలికపై
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. స్టేషన్ పరిధిలో నివాసం ఉండే 14 ఏళ్ల మైనర్ బాలిక ఈ నెల 17న రాత్రి తల్లితో గొడవపడి బయటికి వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ముగ్గురు నలుగురు యువకులు మీ తల్లి దగ్గరకు తీసుకెళుతామంటూ నమ్మించారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తప్పించుకున్న బాలిక శనివారం సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఎక్కడికి వెళ్లావని బాలికను నిలదీయడంతో అసలు విషయాన్ని తెలిపింది. బాధితురాలి తల్లి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు (మంగళవారం) రిమాండ్‌కు తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి: చుక్కలు చూపించింది! పెళ్లి చేసుకున్న నెలకే గెంటేసి.... -
స్నేహం ముసుగులో మైనర్‌పై అత్యాచారం, లైవ్ స్ట్రీమింగ్
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో అమానుషం దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్ నగరంలో స్నేహం ముసుగులో ఇద్దరు యువకులు ఓ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేగాక లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాలను తమ మిత్రునికి లైవ్‌లో స్ట్రీమ్ చేసి రాక్షస ఆనందం పొందారు. ఏడాదిగా బాలికపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించడంతో బాలిక భయపడిపోయింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే బాధితురాలికి మరో వ్యక్తితో నిశ్చితార్థమైంది. దీనిని అదునుగా భావించిన నిందితులు అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి పంపించారు. దీంతో పెళ్లి రద్దు అయ్యింది. బాలిక తల్లిదండ్రులు తన కూతురికి జరిగిన అన్యాయంపై ఝాన్సీ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మొదటగా 2021 జూన్ 2న ఓ హోటల్‌కు తీసుకెళ్లి తనపై అఘాయిత్యం చేశారని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. లైంగికదాడి సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను తర్వాత వాళ్లు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని తెలిపింది. అంతేగాక ఈ విషయం బయటకు చెబితే తన తండ్రిని, సోదరుడిని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపింది. శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. చదవండి: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. మాట్లాడాలని పిలిచి మూడు రోజులు.. -
మైనర్ పై సాముహిక అత్యాచారం... ఫిర్యాదు చేసిందనే కోపంతో తోటి విద్యార్థులే...
పాట్నా: రాను రాను మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాల జరగడం అనేది సర్వసాధారణంగా అయిపోతుందేమో. ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా పరిస్థితి నానాటకీ దిగజారిపోతుందే గానీ చక్కబడుతుందనే ఆశ కానరావడం లేదు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు గురించే వింటున్నాం. చదువుకున్నవాళ్లు సైతం కామంధులై అత్యంత దారుణాలకి ఒడిగడుతున్నారు. అచ్చం అలానే బీహార్‌లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బీహార్‌లోని జాముయ్‌లో ఒక మైనర్ కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా ఆమె పై ఐదుగురు విద్యార్థులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఐదుగురు అదే కోచింగ్ సెంటర్ విద్యార్థులు. ఐతే ఆ బాలిక గతంలో తనతో ఒక అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడంటూ కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఆమె పై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ మైనర్ తల్లిదండ్రులు కోచింగ్ నిర్వాహకులు ఇకపై మీ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇవ్వడంతోనే కోచింగ్ సెంటర్ పంపామని పోలీసులకు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అత్యాచారం చేశారని ఫిర్యాదు కోసం వస్తే.. స్టేషన్లో పోలీసులు..) -
హైదరాబాద్: ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ఉన్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన మానసిక స్థితి సరిగా లేని 30 ఏళ్ల రెండ్రోజుల క్రితం నగరానికి వచ్చింది. శక్రవారం రాత్రి గండిమైసమ్మ నుంచి దుండిగల్‌కు వెళ్లే రోడ్డులోని ఉజ్వల బార్ అండ్ రెస్టారెంట్ పక్కన సదరు మహిళ ఒంటరిగా నిలుచుని ఉంది. ఈ క్రమంలో ఐదుగురు యువకులు ఆమెను ఉజ్వల బార్ వెనుక ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఇమ్రాన్(20)ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. మరికొందరు నిందితులు నర్సింహ, ఖుద్దూస్, ఉమిద్దీన్, ఇమామ్‌లు పరారీలో ఉన్నారు. కాగా నిందితులంతా డి.పోచంపల్లి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లుగా తేలింది. వారిపై 377డీ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మిసిసిపీ ఫెస్టివల్లో అపశ్రుతి -
విజయవాడ ఆస్పత్రి ఘటన.. బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం
సాక్షి, అమరావతి: విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి.. వారిని విధులనుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీ చేశారు. సీఎస్ ఆర్‌ఎంఓకి షోకాజ్ నోటీసు జారీచేశారు. శాఖా పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. చదవండి👉 విజయవాడ: టీడీపీ కార్యకర్తల వీరంగం.. వాసిరెడ్డి పద్మపై దాడి -
భర్తను చెట్టుకు కట్టేసి.. మహిళపై గ్యాంగ్‌రేప్!
ముజఫర్‌నగర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో కొందరు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం చెప్పారు. ఆమె భర్తను చెట్టుకు కట్టేసి దురాగతం సాగించారని తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ ఘటనపై న్యూమండీ పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. చదవండి: (నిర్మాత అని చెప్పి పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయమంటున్నాడు: సహాయనటి) -
Metaverse: కనీవినీ ఎరుగని రీతిలో సామూహిక అత్యాచారం
ప్రపంచంలో ఏదో ఒక మూల.. ప్రతీ నిమిషానికి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరి మహిళలు మృగాల చేతిలో చితికిపోతున్నారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన.. బహుశా ఇది వరకు విని, చదివి ఉండరు. వాస్తవిక ప్రపంచంలోనే కాదు.. వర్చువల్ ప్రపంచంలోనూ ఆడవాళ్ల భద్రతపై అనుమానాల్ని పెంచే ఘటన ఇది. పైగా అవి మరింత ఘోరంగా.. ఆందోళనకరంగా ఉంటాయనే విషయాన్ని రుజువు చేసింది ఇది. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ(43).. ఫేస్బుక్ మెటావర్స్ ‘హోరిజోన్ వెన్యూస్’పై సంచలన ఆరోపణలకు దిగింది. ఆ వేదికపై తాను గ్యాంగ్‌రేప్‌నకు గురయ్యానని ఆమె ఫిర్యాదు చేసింది. వర్చువల్ వరల్డ్‌లోకి జాయిన్ అయిన నిమిషానికే.. తనను ముగ్గురు-నలుగురు (మేల్ అవతార్స్) చుట్టుముట్టి బలాత్కారం చేశారని, ఆపై ఆ అఘాయిత్యాన్ని ఫొటోలు సైతం తీశారని ఆమె వాపోయింది. ఆర్తనాదాలు. అరణ్యరోదనే! అఘాయిత్యం జరుగుతున్న టైంలో తను గట్టిగట్టిగా అరిచినా.. స్పందన కరువైందని ఆమె వాపోయింది. ఆ సమయంలో చాలామంది లాగిన్‌లో ఉన్నారు. కానీ, నా అరుపులను ఎవరూ పట్టించుకోలేదు. పైగా నా అవతార్ మీద ఘాతుకానికి పాల్పడ్డ మగ అవతార్లు మృగాళ్లా ప్రవర్తించాయి. దుర్భాషలాడాయి.. నాపై దాడి చేశాయి. దుస్తులు చించేశాయి. ఏం జరుగుతుందో అర్థం కావడానికే నాకు కొన్ని నిమిషాలు పట్టింది. ఆ భయంకరమైన అనుభవంతో వెంటనే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తీసేసి, లాగౌట్ అయ్యానని ఆమె పేర్కొంది. ఇక ఘటనపై తన అనుభవాన్ని ఓ బ్లాగ్‌లో పంచుకున్న బాధితురాలు. వర్చువల్ ఘటనను అనవసరంగా సీన్ చేస్తోందని కొందరు అంటున్నారు. కానీ, వాస్తవాల నుంచి వర్చువల్ అనుభవాలు వేరు చేయలేవని ఆమె అంటోంది. అందుకే వర్చువల్ ప్రపంచంలోనూ అనుభవాలకు 'వాస్తవికత' ఉంటుందని పేర్కొంది. వర్చువల్ రియాలిటీలో ఎక్కువ మంది ఉన్నప్పుడు.. అక్కడ వాస్తవికతకు ఆస్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలని, తనకు ఎదురైన అనుభవం వర్చువల్ ప్రపంచంలోనూ మరెవరికీ ఎదురు కాకూడదని ఆమె అంటోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పందించని ఫేస్బుక్ మెటావర్స్.. భద్రత విషయంలో మార్పులు చేస్తున్నట్లు ఆ మధ్య ఒక ప్రకటనతోనే సరిపెట్టింది. సంబంధిత వార్త: పక్కన లేకున్నా.. ‘నన్ను బలవంతంగా వాటేసుకుని’!! -
యువతిని ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి.. సాముహిక అత్యాచారం.. ఆపై
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానుషం చోటు చేసుకుంది. ఒక యువతిపై మద్యం, డ్రగ్స్ కుటుంబానికి వారు సాముహికంగా అత్యాచారం చేసి, ఆపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉన్న కస్తూర్బా నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతిని అదే ప్రాంతానికి ఉన్న ఒక యువకుడు ప్రేమించాడు. చాలా రోజులు ఆమె వెంటపడ్డాడు. యువతి ప్రేమను అంగీకరించకపోవడంతో విచారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గతేడాది నవంబరులో జరిగింది. అయితే, తమ కుమారుడి మృతికి ఆ యువతి కారణమని యువకుడి కుటుంబ సభ్యులు ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆయువతిని నిన్న ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చారు. ఆమెను జుట్టుపట్టుకొని కొడుతూ.. నీచంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో కొంత మంది పురుషులు.. ఆ యువతిపై బహిరంగంగానే సాముహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అక్కడ ఉన్న మహిళలు కూడా.. యువతిపై పురుషులు అత్యాచారం చేసేలా ప్రేరేపించారు. ఆమెను నానా దుర్భాషలాడుతూ.... ఆమె జుట్టును కత్తిరించారు. ఆమె ముఖానికి నలుపు రంగు పూశారు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. అవమానపర్చారు. చెప్పులు, బూట్లతో కొడుతూ.. దండలు చేసి యువతి మెడలో వేసి.. ఊరేగించారు. చనిపోయిన బాలుడు కుటుంబానికి చెందిన వారంతా మద్యం, డ్రగ్స్ వ్యాపారస్తులని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఢిల్లీ మహిళ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళను పరామర్శించారు. వెంటనే బాధిత యువతిపై దాడిచేసిన వారందరిని అరెస్టు చేయాలని ట్విటర్ వేదికగా ఢిల్లీ పోలీసు అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఘటనపై 72 గంటలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు నోటిసులు జారీచేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని పోలీసువారిని ఆదేశించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. कस्तूरबा नगर में 20 साल की लड़की का अवैध शराब बेचने वालों द्वारा गैंगरेप किया गया, उसे गंजा कर, चप्पल की माला पहना पूरे इलाक़े में मुँह काला करके घुमाया। मैं दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। सब अपराधी आदमी औरतों को अरेस्ट किया जाए और लड़की और उसके परिवार को सुरक्षा दी जाए। pic.twitter.com/4ExXufDaO3 — Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022 చదవండి: రిపబ్లిక్ డే వేడుకలలో అపశ్రుతి.. తలపై పడిన డ్రోన్ -
యువతిపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు మైనర్ల అరెస్ట్
ముంబై: ముంబైలోని ఈస్ట్రన్ ఉపనగరం గోవండీ ప్రాంతంలో ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. స్థానిక శివాజీనగర్ ఏరియాలోని మట్టీరోడ్డులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అత్యాచారానికి గురైన యువతి ఓ సంస్థలో కేటరర్‌గా పనిచేస్తోంది. శుక్రవారం పనిలోకి వెళ్లిన యువతి సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆమెతో పనిచేసే ఓ యువకుడు తనతో కొంచెం పని ఉందని, మాట్లాడాలని చెప్పి ఆమెను ఇంటికి వెళ్లకుండా ఆపేశాడు. ఆ తర్వాత ఆ యువతిని తీసుకుని ఓ మురికివాడలోని చిన్ని గదిలో బంధించివేశాడు. చదవండి: (నేరస్తుల పాలిట సింహస్వప్నం.. ఏఏ ఖాన్ కన్నుమూత) అనంతరం అతని స్నేహితులకు సమాచారం అందించి ఆ యువతిపై నలుగురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ్నుంచి నిందితులు పారిపోయారు. వెంటనే బాధితురాలు లేచి జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులపై ఐపీఎస్ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (విద్యుత్ బిల్లు కొట్టేందుకు వెళ్లి మైనర్‌పై అఘాయిత్యం) -
Hyderabad: రాజేంద్రనగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం
సాక్షి, రంగారెడ్డి: నగరంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కొందరు దుండగులు ఓ మహిళను ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: (ప్రాణం తీసిన చికెన్ గ్రేవీ, శీతల పానీయం?) -
Nizamabad: రాజు ఘటన మరువకముందే మరో దారుణం
-
మద్యం తాగించి డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి డిగ్రీ చదువుతున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు యువకులు బాధితురాలికి మద్యం తాగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆర్మూర్ డివిజన్లోని ఓ గ్రామానికి చెందిన యువతి బోధన్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. యువతికి జిల్లా కేంద్రంలోని డెకొరేషన్ పనిచేసే శేఖర్ అనే యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. యువతి బర్త్‌డే ఉండడంతో పార్టీ చేసుకోవాలంటూ శేఖర్ ఆమెను జిల్లా కేంద్రానికి రప్పించాడు. సాయంత్రం ఐదు గంటలకు గాయత్రినగర్‌లోని రూమ్‌కు తీసుకెళ్లాడు. అతని స్నేహితులు మరో ముగ్గురిని పిలిచాడు. అక్కడ యువతితో మద్యం తాగించి వారు తాగారు. మద్యం మత్తులో యువతిపై నలుగురు అత్యాచారం జరిపారు. రాత్రి 11 గంటల వరకు రూమ్‌లోనే ఉన్నారు. అనంతరం యువతిని ఇంటికి పంపించేందుకు బైక్‌పై ఆర్మూర్ రోడ్డువైపు వెళ్లారు. అప్పటికే యువతి మద్యం మత్తులో ఉండడంతో ఉదయం పంపించాలని తిరిగి బస్టాండ్ వైపు వచ్చారు. యువకుడికి బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే యువకుడు పరిచయం ఉండడంతో అతనికి ఫోన్‌చేసి ఈ రాత్రికి యువతిని ఉంచేందుకు ఆస్పత్రిలో రూమ్ కావాలని అడిగారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత మద్యం మత్తులో ఉన్న యువతిని ఇద్దరు యువకులు బలవంతంగా ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్నారని గమనించిన ఆస్పత్రి ముందు గల షాపింగ్ మాల్ సెక్యూరిటీ గార్డులు వారిని నిలదీశారు. దీంతో యువకులు, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వివాదం జరిగింది. సెక్యూరిటీ గార్డులు డయల్ 100కు ఫోన్ చేయడంతో యువతిని అక్కడే వదిలివేసి యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఒకటో టౌన్ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పారిపోతున్న నలుగురిలో ఇద్దరిని పట్టుకున్నారు. యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు యువకులను తెల్లవారుజామున పట్టుకున్నారు. నిందితుల్లో శేఖర్‌తో పాటు అతని స్నేహితులు కోటగల్లికి చెందిన భానుప్రకాశ్, నవీన్, బస్టాండ్‌లో పనిచేసే కరీం ఉన్నారు. అడిషనల్ డీసీపీ ఉషావిశ్వనాథ్ యువతిని విచారించి వివరాలు సేకరించారు. బాధితురాలిని సఖీ కేంద్రానికి తరలించారు. -
జిరాక్స్ కోసం వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం
కన్నౌజ్: పత్రాలను జిరాక్స్ తీయించుకోవడానికి సైబర్ కేఫ్‌కు వెళ్లిన ఇద్దరు బాలికలను నలుగురు వ్యక్తులు బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది. సెప్టెంబర్ 13న ఈ ఘటన జరిగింది. ఓ మహిళ సహా మొత్తం ఆరు మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. అత్యాచారాన్ని నిందితులు వీడియో తీశారని, ఈ ఘటన బయటకు చెప్తే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించినట్లు 17 ఏళ్ల బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం రూ. 10 వేలు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు. దీంతో తాను, తన మిత్రురాలు కలసి తమ ఇళ్లలో దొంగతనం చేసి డబ్బు చెల్లించినట్లు చెప్పారు. డబ్బు పోయిన సంగతిని తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయగా, అత్యాచారం విషయం బయటకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. కేఫ్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు కూడా తేలిందన్నారు. చుట్టుపక్కల వారు సైతం ఆ కేఫ్ వద్ద యువతులను పలు మార్లు చూసినట్లు చెప్పారని పేర్కొన్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదవండి: (ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని..) -
దారుణం: మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక లైంగిక దాడి
నీముచ్: మహిళా పోలీసులకు కూడా రక్షణ కరువైందని తెలిపే తాజా ఉదాహరణ ఇది. ఓ మహిళా కానిస్టేబుల్(30)పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ అకృత్యాన్ని వీడియో తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల మొదటి వారంలో ఘటన చోటుచేసుకోగా బాధితురాలు 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలితో నిందితుడు ఏప్రిల్ నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయం కొనసాగిస్తున్నాడు. తన సోదరుడి బర్త్‌డే పార్టీకి ఆహ్వానించగా బాధితురాలు వెళ్లింది. అక్కడే ఆమెపై ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అయిదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని, అతడి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. -
వివాహితపై గ్యాంగ్ రేప్
మేడికొండూరు (తాడికొండ): ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న దంపతులను అటకాయించి గుర్తుతెలియని దుండగులు వారిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. భార్యాభర్తలిద్దరినీ కత్తులతో బెదిరించిన వారు భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్ల ముందే భార్యపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. గుండెలను దహించే ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు రోడ్డులో బుధవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. జిల్లాలోని సత్తెనపల్లి రూరల్ మండలం పెంటపాడుకు చెందిన దంపతులు కొంతకాలంగా సత్తెనపల్లిలో ఉంటున్నారు. బంధువుల ఇంట బారసాల కార్యక్రమానికి బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు వెళ్లారు. వేడుక అనంతరం రాత్రి 9.30 గంటలకు సత్తెనపల్లికి ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. పాలడుగు రోడ్డు మూలమలుపు వద్ద దారికి అడ్డంగా చెట్టుకొమ్మ పడి ఉండటంతో ద్విచక్ర వాహనం ఆపారు. ఇంతలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లపై నుంచి నలుగురు దుండగులు ఒక్కసారిగా కిందకు దూకారు. మద్యం మత్తులో ఉన్న వారు కత్తులు చూపి దంపతులను బెదిరించారు. పక్కనే ఉన్న పొలాల్లోకి వారిని, ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లారు. భర్తను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. చెట్టుకు కట్టేసి అరిస్తే చంపుతామని బెదిరించారు. అనంతరం మహిళపై నలుగురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నారు. తర్వాత వారిద్దరినీ రోడ్డుపైకి తీసుకొచ్చి ద్విచక్రవాహనం స్టార్ట్‌చేసి అరవకుండా వెళ్లిపోవాలని బెదిరించారు. సుమారు 3 గంటల పాటు దంపతులను చిత్రహింసలకు గురిచేశారు. తీవ్ర వేదనతో బయలుదేరిన దంపతులు అర్ధరాత్రి సమయంలో సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడి పోలీసులు మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేడికొండూరు పోలీసులు సత్తెనపల్లి వెళ్లి బాధితులను కారులో ఎక్కించుకుని ఘటనా ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన దంపతులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరోవైపు.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించాయి. గుంటూరు అర్బన్ అడిషనల్ ఎస్పీ గంగాధరం, సౌత్‌జోన్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, మేడికొండూరు సీఐ మారుతీకృష్ణ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసినట్లు అదనపు ఎస్పీ గంగాధరం వివరించారు. పోలీసుల అదుపులో అనుమానితులు దాడి దోపిడీ, లైంగిక దాడి ఘటన జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో కొత్తగా కోల్డ్‌స్టోరేజీ నిర్మాణం జరుగుతోంది. అక్కడ పనులు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఉంటున్నారు. వీరిలో ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
మైసూరు అత్యాచార ఘటన: కీలక విషయాలు వెలుగులోకి
సాక్షి, బెంగళూరు: మైసూరులో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసు దర్యాప్తులో పురోగతి కనిపించింది. ఈ కేసుకు సంబంధించి అయిదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. ఆరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టయిన అయిదుగురు తమిళనాడులోని తరుప్పూర్ జిల్లాకు చెందిన అరటిపండ్లు విక్రయించే కూలీలుగా పోలీసులు గుర్తించారు. అయితే వారిలో ఒకరు 17 ఏళ్ల బాలనేరస్తుడని అనుమానిస్తున్నారు. తమిళనాడులోని సత్యమంగళలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో వ్యక్తిని కర్ణాటకలోని చామరాజనగర్‌లో పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన నలుగురు నిందితుల్లో ముగ్గురు నేర చరిత్ర కలిగి ఉన్నారు. చదవండి: మైసూరు ఘటన: వీడియోలు తీసి.. 3 లక్షలు డిమాండ్ కాగా మైసూరు నగరం చాముండి కొండ సమీపంలో ఈనెల 24న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు ప్రత్యేక బృందాలు ఈ కేసును వివిధ కోణాల్లో విచారిస్తున్నాయి. తొలుత ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారని వార్తలు వచ్చాయి. వీరంతా మైసూరులో ఇంజినీరింగ్ చదువుతున్నారని, వీరిలో ముగ్గురు తమిళనాడు, ఒకరు కేరళకు చెందిన వారని దర్యాప్తులో వెలుగు చూసినట్లు ప్రచారం జరిగింది. అయితే తరువాత వారికి ఈ నేరంతో సంబంధం లేనట్లు తేలింది. -
బెంగళూరు గ్యాంగ్‌రేప్ కేసు: 12 మంది నిందితుల అరెస్టు
బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. 22 ఏళ్ల యువతిని 12 మంది యువకులు సాముహిక అత్యాచారం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాగా, ఈ ఏడాది మే నెలలో, అత్యాచార ఘటన జరిగిందని బెంగళూరు పోలీసు అధికారి కమల్ పంత్ తెలిపారు. ఈ కేసును కేవలం ఐదు వారాల వ్యవధిలోనే పూర్తి చేసి, కోర్ట్‌లో చార్జ్‌షిట్ దాఖలు చేశామని ఈరోజు (గురువారం) ట్వీట్ చేశారు. అదే విధంగా, ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించినందుకు, దీనిలో పాల్గోన్న అధికారులకు 1 లక్ష రూపాలయలను రివార్డుగా ప్రకటించారు. అయితే, నిందితులంతా బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ గ్యాంగ్, బంగ్లాదేశ్‌కు చెందిన యువతిని, మూడేళ్ల క్రితం అక్రమంగా తీసుకోచ్చి అస్సాం, పశ్చిమబెంగాల్, తెలంగాణ, కర్ణాటకలో తిప్పుతూ ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిమధ్య డబ్బుల విషయంలో గొడవ రావడంతో, మిగతావార ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. వీరంతా ఒకే గ్రూప్‌కు చెందినవారుగా భావిస్తున్నారు. అయితే, 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్‌లో ఇద్దరు యువతులు ఉన్నట్లు గుర్తించారు. అరెస్టు సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురిపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయపడ్డారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారి కమల్ పంత్ తెలిపారు. -
గ్యాంగ్‌రేప్; ఎవరికైనా చెబితే నగ్న వీడియోలు నెట్లో పెడతాం..
సాక్షి, నరసరావుపేట టౌన్: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ కృష్ణయ్య మంగళవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన ఓ యువతి భర్తతో విభేదాల కారణంగా నరసరావుపేట పట్టణంలో ఒంటరిగా నివసిస్తోంది. తన దగ్గర ఉన్న 47 సవర్ల బంగారాన్ని భద్రపరచమని సుమారు ఏడాది కిందట బరంపేటకు చెందిన ఆవుల మస్తాన్‌రావు, కనపర్రు గ్రామానికి చెందిన గుంజి శ్రీనివాసరావులకు ఇచ్చింది. అయితే బంగారం తిరిగి ఇవ్వకపోవటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసి బంగారం తిరిగి ఇప్పిస్తానని మాజీ రౌడీషీటర్ గుజ్జర్లపూడి ఆనంద్ విజయ్‌కుమార్ అలియాస్ కన్నల్ పోలీస్ స్టేషన్లో ఆరు నెలల కిందట ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాసనగర్‌లో ఓ గృహం అద్దెకు తీసుకొని యువతిని అక్కడ ఉంచాడు. ఈ ఏడాది మార్చి 14వ తేదీన కన్నల్, అతని స్నేహితుడు వినుకొండ నియోజకవర్గ ఓ పార్టీ ఇన్చార్జి అట్లూరి విజయకుమార్ కలిసి గృహంలో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎక్కడైనా చెబితే తమ దగ్గర ఉన్న నగ్నవీడియోలు నెట్లో పెడతామని ఆమెను బెదిరించారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై టూటౌన్ పోలీసులు అదే రోజు గ్యాంగ్‌రేప్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితులిద్దరు పరారై ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మంగళవారం కేసులో రెండవ నిందితుడైన అట్లూరి విజయకుమార్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: ‘ఇప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేదు’ -
బాలికపై సామూహిక అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం అత్యాచారానికి గురైన బాలిక చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ విషయంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇంతవరకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. వివరాల ప్రకారం..యూపీలోని హమీర్పూర్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆసుపత్రికి తరలించే నాటికి ఆమె పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలో బుధవారం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఆమె చనిపోయిన తర్వాతే విషయం తెలిసిందని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉందని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తమ కుమర్తెపై ఐదుగురు వ్యక్తులు సోమవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలి తండ్రి మీడియాతో వాపోయాడు. నిందితుల నుంచి ప్రాణహాని ఉంటుందేమోనన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపాడు. చదవండి : (బస్సులో పరిచయం, విటమిన్ ట్యాబ్లెట్లు అని నిద్రమాత్రలు) (టీ చేయను అనడం భర్తను రెచ్చగొట్టడం కాదు: కోర్టు) -
దారుణం: యువతికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్
శందోల్: మధ్యప్రదేశ్‌లోని శందోల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు 20 ఏళ్ల యువతికి మద్యం తాగించి, రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జైత్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గడాఘాట్ ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. అంతకుముందు ఆమెను కారులో అపహరించారు. ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చి బలవంతంగా మద్యం తాగించారు. రాక్షసకాండ పూర్తయ్యాక ఈ నెల 20న ఆమె ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. నలుగురు కామాంధులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితుల్లో ఒకడు స్థానిక బీజేపీ నాయకుడు విజయ్ త్రిపాఠీ అని తెలిసింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు. చదవండి: (అందమైన అమ్మాయిలతో మసాజ్.. 55 లక్షలు దోచుకున్నారు) -
32ఏళ్ల మహిళపై పాశవిక అత్యాచారం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కేంద్రం ఎన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చిన వాటిని మానవ మృగాళ్లు లెక్క చేయడం లేదు. బదౌన్ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 32ఏళ్ల మహిళ బలైపోయింది. ఈ సామూహిక అత్యాచారానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాకింగ్ సంఘటన తెరపైకి వచ్చింది. మహిళపై సామూహిక అత్యాచారం 5 నెలల క్రితం జరిగింది. అయితే ఈ సంఘటన వీడియో నెట్లో ప్రసారం అయిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి బాధితురాలు గురువారం (జనవరి 28) పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఐదుగురు మైనర్లు ఉన్నారు.(చదవండి: ఇంటి దొంగే.. రూ.10 కోట్లు డిమాండ్!) ఐదు నెలల క్రితం కట్టెల కోసం దగ్గరలోని అడవికి వెళ్ళినప్పుడు అక్కడ యువకులు తనపై సామూహిక అత్యాచారం పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితులు గ్యాంగ్‌రేప్‌ను కూడా చిత్రీకరించారని తెలిపింది. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియో వైరల్ చేస్తామని, తన భర్త, పిల్లలను చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఆమె తెలిపారు. అయితే, వీడియో ప్రసారం అయిన తర్వాతే ఆ మహిళ ధైర్యాన్ని కూడగట్టుకొని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. బడాన్ జిల్లా ఎస్ఎస్పి సంకల్ప్ శర్మ మాట్లాడుతూ.. నిందితుల్లో ఒకరు ఈ వీడియో క్లిప్‌లను గ్రామ పరిసర ప్రాంతాలలోని కొంతమందికి రూ.300 చొప్పున విక్రయించారని తెలిపారు. దీంతో ఈ వీడియో బయటకి వచ్చినట్లు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కూడా బదౌన్ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 50ఏళ్ల మహిళ అంత్యంత దారుణంగా బలైపోయింది. దేవాలయానికి వెళ్లిన 50ఏళ్ల మహిళపై కామాంధులు విరుచుకుపడ్డారు. ఆమె దేహంతో ఆటబొమ్మతో ఆడుకున్నట్లుగా అత్యంత కిరాతకంగా.. పాశవికంగా ఇష్టమొచ్చినట్లుగా ఆడుకున్నారు. -
దివ్యాంగురాలిపై లైంగిక దాడి, చూపు కోల్పోయిన బాలిక
బిహార్: దివ్యాంగురాలు అని కూడా చూడకుండా 15 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బిహార్‌లోని మధుబాన్ జిల్లాలో బుధవారం జరిగింది. మధుబాన్ జిల్లా ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హర్లకి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌవహ బర్హి గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన (చెవిటి, మూగ) బాలిక (15) తన స్నేహితులతో కలిసి మేకల్ని తోలుకొని అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వెంట పడి బాలికను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాంతో తోటి బాలికలు వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి ఆ బాలిక తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. దుండగుల దాడిలో ఆ బాలిక కంటిచూపు కోల్పోయింది. బాధితురాలిని మధుబానీలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ పాశవిక దాడి ఘటనపై బిహార్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఘటనను ఖండిస్తున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. -
జైలులో యువతిపై గ్యాంగ్ రేప్?
మధ్యప్రదేశ్ : జైలులోని ఓ యువతిపై పోలీసులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్ ఇన్‌చార్జ్‌తో సహా ఐదుగురు పోలీసులు 10 రోజుల పాటు సదరు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఓ హత్య కేసులో 20 ఏళ్ల యువతి రేవా జిల్లాలోని మాంగ్వాన్ పోలీసుల కస్టడీలో ఉంది. అక్టోబర్ పదో తేదీన జైలును తనిఖీ చేసేందుకు అడిషనల్ జిల్లా జడ్జితో పాటు కొందరు లాయర్ల వెళ్లగా ఈ విషయం బయటపడింది. తనపై మే 9వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు ఐదుగురు పోలీసులు లాకప్‌లోనే అత్యాచారం చేసినట్టు వివరించింది. ఈ విషయాన్ని మూడు నెలల క్రితమే జైలు వార్డెన్‌కు చెప్పానని, అయినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొంది. కాగా సదరు యువతిని అరెస్టు చేసిందే మే 21వ తేదీన అని, అడిషనల్ జిల్లా జడ్జి జ్యుడీషియల్ ఎంక్వైరీ ఆదేశాల నేపథ్యంలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. -
యూపీలో ‘నిర్భయ’
న్యూఢిల్లీ/హాథ్రస్: నిర్భయ ఘటనను తలపించే మరో దారుణం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 19 ఏళ్ల దళిత యువతిని నలుగురు అగ్రవర్ణ యువకులు అత్యంత దారుణంగా గాయపర్చి, పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ యువతి చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయింది. తెగిన నాలుక, విరిగిన ఎముకలు, పూర్తిగా చచ్చుపడిపోయిన కాళ్లు, పాక్షికంగా పక్షవాతానికి గురైన చేతులు, మెడకు, వెన్నెముకకు అయిన తీవ్ర గాయాలు.. ఆ యువతిపై ఆ రాక్షసులు సాగించిన దమనకాండకు సాక్ష్యాలుగా నిలిచాయి. దేశవ్యాప్తంగా నిరసనలకు, నిర్భయ చట్టానికి కారణమైన 8 ఏళ్ల క్రితం నాటి నిర్భయ అత్యాచార ఘటనను ఈ దారుణం గుర్తుకు తెచ్చింది. దళిత యువతి మృతిపై పౌర సమాజ కార్యకర్తలు, దళిత సంఘాలు, భీమ్ ఆర్మీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించాయి. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వెలుపల భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో వేలాది మంది ధర్నాకు దిగారు. ఆ దళిత యువతికి న్యాయం చేయాలని, దోషులను బహిరంగంగా ఉరి తీయాలని నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా దళితులంతా వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఆజాద్ పిలుపునిచ్చారు. ఆటవిక రాజ్యం నడుస్తున్న యూపీలో మరో దళిత యువతి బలి అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో, యూపీలోని హాథ్రస్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని హాథ్రస్ ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. సందీప్, రాము, లవ్‌కుశ్, రవి తనపై అత్యాచారం చేశారని, వారిని అడ్డుకుంటుండగా, గట్టిగా గొంతు నులిమారని, అప్పుడు నాలుక తెగిందని బాధిత యువతి మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించింది. బాధిత మహిళను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించకుండా.. పరిస్థితి పూర్తిగా విషమించిన తరువాత, సోమవారం సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అలాగే, బాధితుల ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదని, నాలుగైదు రోజుల తరువాత కేసు నమోదు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. అసలేం జరిగింది.. సుమారు రెండు వారాల క్రితం, సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాథ్రస్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం, బాధితురాలి సోదరుడు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆ రోజు ఉదయం పశువులకు గడ్డి కోసేందుకు తల్లి, అన్నతో కలిసి ఆమె పొలంకు వెళ్లింది. కాసేపయ్యాక గడ్డిమోపుతో ఆమె సోదరుడు ఇంటికి తిరిగి వెళ్లాడు. యువతి తల్లికి కొద్ది దూరంలో ఉండి గడ్డి కోస్తుంది. ఇంతలో, వెనక నుంచి వచ్చిన ముష్కరులు ఆమె నోరు మూసి, చున్నీని మెడకు చుట్టి దూరంగా లాక్కెళ్లారు. కాసేపటికి కూతురు కనిపించడం లేదని గుర్తించిన తల్లి వెతకగా.. దారుణంగా అత్యాచారానికి గురై, రక్తమోడుతూ, ఒళ్లంతా గాయాలతో, అపస్మారక స్థితిలో కనిపించింది. మొదట, ఆమెను అలీçగఢ్లోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చేర్చారు. అయితే, చికిత్సకు స్పందించడం లేదని..మెడకు అయిన గాయం కారణంగా కాళ్లు పూర్తిగా, చేతులు పాక్షికంగా చచ్చుబడిపోయాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దాంతో, ఆమెను సోమవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ వైద్యశాలకు తీసుకువచ్చారు. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందింది. అరెస్ట్ చేశాం.. నిందితులు అగ్రవర్ణాలకు చెందిన వారయినందున, ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదని వచ్చిన ఆరోపణలు సత్యదూరమని ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. ఆ నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని, బాధితురాలు మరణించినందున వారిపై పెట్టిన కేసుల్లో హత్యానేరం కింద ఐపీసీ 302 సెక్షన్‌ను కూడా చేరుస్తామన్నారు. 8 రోజులు ఏం చేశారు? ‘జవాబుల్లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఘటన జరిగిన తరువాత, ఫిర్యాదు అందిన తరువాత 8 రోజుల పాటు పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు? బాధిత యువతిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు? ఆ నలుగురు రాక్షసులపై ఎన్ఎస్ఏ(నేషనల్ సెక్యూరిటీ యాక్ట్) కింద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ దారుణంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ ష్రినతే ప్రశ్నల వర్షం కురిపించారు. దళిత యువతి మృతికి మొత్తం సమాజం సిగ్గుతో తల దించుకోవాలని ఢిల్లీ సీఎంæ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ హత్యాచార ఘటనపై క్రికెటర్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, ఫర్హాన్ అఖ్తర్ ఆవేదనను వ్యక్తపరిచారు. వెల్లువెత్తిన నిరసనలు దళిత యువతి హత్యాచారంపై నిరసనలు వెల్లువెత్తాయి. ‘ప్రభుత్వం మా ఓపికను పరీక్షించవద్దు. వారిని ఉరి తీసేవరకు మేం విశ్రమించం’ అని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ స్పష్టం చేశారు. ఆమెను ఎయిమ్స్‌కు మార్చి, మరింత మెరుగైన చికిత్స అందించాలన్న తన విజ్ఞప్తిని యూపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ యువతి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆజాద్ పేర్కొన్నారు. సమాచారం తీసుకున్నాం.. ఈ ఘటనకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలు చెప్పాలని పోలీసులను ఆదేశించామని జాతీయ మహిళాకమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
ఘోరం: మైనర్ బాలికపై 30 మంది అత్యాచారం
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో దారుణం జరిగింది. మైనర్ బాలికను 30 మంది మానవ మృగాలు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. ఈలాత్ నగరంలోని రెడ్ సీ రిసార్ట్ చూడటానికి వెళ్లిన పదహారేళ్ల బాలికపై మానవ మృగాల కన్ను పడింది. దీంతో అదే రిసార్ట్‌లో ఆమెను గదిలో నిర్బంధించి ఆమెపై ముప్పై మంది అత్యాచారం చేశారు. ఈ ఘటనతో కుంగిపోయిన ఆ బాలిక తనకు జరిగిన ఘోరాన్ని గతవారం పోలీసులకు చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ వార్తతో దేశమంతా ఉలిక్కిపడగా, అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. (ఫేస్బుక్లో ప్రియురాలి ఫొటో, సెల్‌నెంబర్...) ఇంతటి క్రూరమైన నేరానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని, అమ్మాయిలపై దారుణాలకు చరమగీతం పాడాలని నినదిస్తూ తెల్ అవివ్, జెరూసలేం నగరాల్లో ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. ఈ ఘటనపై దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ ఇది షాకింగ్‌గా ఉందని, అసలు మాటలు రావడం లేదన్నారు. నిందితులపై విచారణకు ఆదేశించామన్నారు. "ఇది ఓ అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం మాత్రమే కాదు, మానవత్వాన్ని వంచించి చేసిన నేరం. దీన్ని మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉంద"ని ఆ దేశ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్ అన్నారు. ఇజ్రాయెల్‌లోని ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు అత్యాచారానికి గురవుతున్నారని 'మస్టికెరియాట్' మహిళా హక్కుల సంఘం కార్యకర్త ఇలానా వెజ్మాన్ తెలిపారు. అబ్బాయిలకు చిన్న తనం నుంచే ఈ విషయంలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. (వివాహితపై సామూహిక లైంగిక దాడి) -
వివాహితపై సామూహిక అత్యాచారం
వేలూరు: తిరుపత్తూరు జిల్లా జవ్యాది కొండ సమీపంలో వివాహితపై నలుగురు యువకులు కలిసి అత్యాచారం చేసిన సంఘటన సంచలనం రేపింది. జవ్యాది కొండ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు. ఇతను బెంగళూరులో ఉంటూ పనిచేస్తున్నాడు. ఇతని భార్య ఒంటరిగా గ్రామంలో నివశిస్తోంది. మంగళవారం సాయంత్రం ఆ మహిళ ఇంటి సమీపంలోని పొలం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన అలగేశన్, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కలిసి ఆమె వద్దకు వెళ్లారు. వెంటనే ఆమెను నలుగురు కలిసి సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. అయితే గంటల తరబడి వివాహిత ఇంటికి రాక పోవడంతో ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న బంధువులు ఆమెను గాలించారు. ఆ సమయంలో వివాహిత ఒక ముళ్ల పొదల్లో స్పృహ తప్పి పడి ఉండడాన్ని గమనించి తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. స్పృహ వచ్చిన అనంతరం ఆమె తనను నలుగురు యువకులు కలిసి అత్యాచారం చేసినట్లు తెలిపింది. వీటిపై బంధువులు తిరుపత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. -
గర్భిణిపై ముగ్గురి లైంగికదాడి
తమిళనాడు ,అన్నానగర్ : కడలూర్లో భర్తతో వస్తున్న 5నెలల గర్భిణిని కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. పుదుప్పాలైయమ్ ప్రాంతానికి చెందిన 21ఏళ్ల మహిళ.. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో కలిసి కడలూర్‌లోని ఓ థియేటర్లో సినిమా చూసి తిరిగి వస్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. భర్తపై విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను బలవంతగా ఎత్తుకెళ్లారు. కమ్మియమ్‌పేటలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత ఆ మహిళను కారులోనే తీసుకొచ్చి ఇంటి సమీపంలో వదిలివెళ్లిపోయారు. దీనిపై బాధితురాలు పుదునగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు ఎస్పీ శాంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాధితురాలి చేతికి కానిస్టేబుల్ ఐడీ కార్డు
భువనేశ్వర్/పూరీ: పూరీ జిల్లాలో ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కేసులో మాజీ పోలీసు కానిస్టేబుల్ జితేంద్ర శెట్టిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కానిస్టేబుల్‌తో పాటు మరో నిందితుడిని కూడా అరెస్టు చేసినట్లు సెంట్రల్ రేంజ్ డీఐజీ అశిష్ సింగ్ తెలిపారు. పూరీ పట్టణం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం యువతిపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ఇద్దరు నిందితుల్ని కోర్టులో హాజరుపరుస్తారు. రానున్న 20 రోజుల్లో నిందితులకు వ్యతిరేకంగా నేరారోపణ చిట్టా ఖరారు చేసి కోర్టులో ప్రవేశపెడతారు. ఈ కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిర్వహించేందుకు న్యాయస్థానం అనుమతిని అభ్యర్థిస్తామని అశిష్ సింగ్ మీడియాకు వివరించారు. బాధిత యువతి పట్ల అవాంఛనీయ ప్రచారం నివారించి నైతిక విలువలకు పట్టం గట్టాలని ఆయన అన్ని వర్గాలను అభ్యర్థించారు. బాధిత యువతికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాంగ్మూలం నమోదు చేశారు. మాజీ కానిస్టేబుల్ దగ్గర ఐడీ కార్డు ఈ విచారకర సంఘటనలో ప్రధాన నిందితుడు జితేంద్ర శెట్టిని లోగడే విధుల నుంచి బహిష్కరించినట్లు సెంట్రల్ రేంజ్ డీఐజీ అశిష్ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో పాత గుర్తింపు కార్డు ఆయన ఆధీనంలో ఎలా ఉందనే కోణంలో విచారణ సమాంతరంగా చేపట్టనున్నట్లు తెలిపారు. 2016 వ సంవత్సరంలో జితేంద్ర శెట్టిని పోలీసుసేవల నుంచి బహిష్కరించారు. ఇప్పటి వరకు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులకు వ్యతిరేకంగా వేర్వేరు కేసుల్ని నమోదు చేశారు. బస్సు కోసం నిరీక్షిస్తున్న యువతిని నలుగురు దుండగులు మోసగించి తీసుకుపోయి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కుంభార్‌పడా పోలీసు స్టేషన్లో బాధిత యువతి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించింది. కాకత్పూర్ వెళ్లేందుకు నిమాపడా ప్రాంతంలో బస్సు కోసం వేచి ఉండగా లిఫ్టు ఇస్తామని యువతిని మభ్య పెట్టి లోబరుచుకుని వాహనంలో తీసుకుపోయారు. ఈ కథ వెనుక నలుగురు దుండగులకు మాజీ పోలీసు కానిస్టేబుల్ సారథ్యం వహించాడు. ఝాడేశ్వరి ఆలయం వెనుక ప్రభుత్వ క్వార్టర్లో ఈ నలుగురు నిందితులు యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు కుంభార్‌పడా స్టేణ్‌లో ఫిర్యాదు దాఖలైంది. బాధిత యువతి చేతికి చిక్కిన పర్సు నుంచి నిందిత మాజీ కానిస్టేబుల్ జితేంద్ర శెట్టి గుర్తింపు కార్డు లభించింది. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసి కుంభార్‌పడా స్టేషన్లో విచారణ చేస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు. దర్యాప్తు కోసం నాలుగు బృందాలు: డీజీపీ భువనేశ్వర్: పూరీ జిల్లాలో సంభవించిన సామూహిక లైంగిక దాడి కేసులో నిందితులకు కోర్టు కఠిన శిక్ష ఖరారు చేసేలా ఆధారాలు సేకరిస్తున్నట్టు తాత్కాలిక డీజీపీ సత్యజిత్ మహంతి మంగళవారం తెలిపారు. ఈ కేసు విచారణ, దర్యాప్తు కోసం నాలుగు వేర్వేరు బృందాల్ని పూరీ జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇందులో రెండు బృందాలు పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల గాలింపులో తలమునకలై ఉన్నాయి. మిగిలిన రెండు దర్యాప్తు బృందాలు పకడ్బందీగా ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సత్యజిత్ మహంతి వివరించారు. -
ట్రిపుల్ తలాక్: ఆ వెంటనే మామ గ్యాంగ్‌రేప్
జైపూర్: రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. మామ, భర్త సోదరుడితో కలిసి కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం అల్వార్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రాజస్ధాన్ ఆల్వార్‌కు చెందిన మహిళ(25)కు తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పిన అనంతరం.. బాధితురాలి మామ(భర్త తండ్రి)లోని మృగాడు బయటికి వచ్చాడు. కొడుకు విడాకులు చెప్పిన మరుక్షణమే తమ్ముడితో కలిసి కొడలిపై లైంగిక దాడికి పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందాడు ఆ ఉన్మాది. మరుసటి రోజు పుట్టింటికి వెళ్లిన బాధితురాలు తండ్రికి జరిగిన ఘటన గురించి చేప్పింది. తండ్రితో కలిసి బాధిత మహిళ సోమవారం భివాండి మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళకు గత శుక్రవారం తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పిన కొద్ది గంటలకే.. అతని అన్న తనపై దాడి చేశాడని, అంతేకాక తన మామయ్యతో పాటు అతని తమ్ముడు లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం కింద కేసు నమోదు చేసుకుని అమెను వైద్య పరీక్షలు నిమత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాధిత మహిళ ఫిర్యాదుతో ట్రిపుల్ తలాక్, అత్యాచారం కేసు కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని, ప్రస్తుతం బాధితురాలిని వైద్యపరీక్షల కోసం హస్సీటల్కు పంపించామని పోలీసులు తెలిపారు. అయితే ముస్లిం వర్గానికి చెందిన భర్త తన భార్యకు నోటి మాటగా గానీ, రాత ద్వారా గానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా లేదా ఇంకేరకంగానైనా ‘తలాక్’ను చెప్పడం అక్రమం. దీనిని ముస్లిం మహిళ వివాహ భద్రత చట్టం–2019 (యాక్ట్ నంబర్ 20 ఆఫ్ 2019) చాప్టర్–2లో పొందుపరచబడింది. ఎవరైనా ముస్లిం భర్త ‘తలాక్’ పదాన్ని అతని భార్యపై ప్రయోగిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. -
అతడిని అడ్డుకుని.. గ్యాంగ్‌రేప్ చేశారు
న్యూఢిల్లీ: ఉద్యోగం చేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న ఓ యువతిపై కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తానన్న స్నేహితుడిని కలవడానికి పార్కుకు వెళ్లిన ఆమెపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. నిరక్షరాస్యురాలైన 21 ఏళ్ల యువతి ఉద్యోగం చేసి తన కుటుంబానికి సాయంగా ఉండాలనుకుంది. ఇందుకోసం అమె ఉద్యోగ వేటలో ఉండగా పరిచయం ఉన్న వ్యక్తి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం బాధిత యువతిని నోయిడాలోని పార్కుకు రమ్మని చెప్పాడు. ఆ వ్యక్తికి తన సోదరుడితో కూడా పరిచయం ఉండటంతో తెలిసిన వ్యక్తే కదా అని యువతి నమ్మి వెళ్లింది. దీనిని అవకాశంగా తీసుకున్న కామాంధుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించడంతో కాపాడమంటూ బాధితురాలు కేకలు పెట్టింది. అదే సమయంలో అటుగా వెళుతున్న గుడ్డు, షాము అనే ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి అతడిని తన్నితరిమేశారు. గండం తప్పిందని బాధితురాలు అనుకుంటుండగానే ఈ ఇద్దరు ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అంతేకాకుండా తమ స్నేహితులైన బ్రిజ్ కిశోర్, పీతంబర్, ఉమేశ్‌లకు ఫోన్ చేసి పిలిపించి బాధితురాలిపై లైంగిక దాడి చేయించారు. తర్వాత ఈ ఐదుగురు అక్కడి నుంచి పారిపోయారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బాధితురాలు బుద్దానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపినట్లు ఎస్ఎస్పీ వైభవ్ కృష్ణ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. సెక్టర్ 63 వద్ద బుధవారం రాత్రి కొంతమంది యువతిపై లైంగిక దాడి చేశారని.. ఈ కేసులో ఆరుగురు నిందితులుగా ఉన్నారని (బాధిత యువతి స్నేహితుడితో కలిపి) వారిలో నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాధితురాలికి ఆస్పత్రిలో చిక్సిత అందిస్తున్నామని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వెల్లడించారు. బాధితురాలు, రవి ఇచ్చిన సమాచారం ఆధారంగా 12 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వీరి ఆచూకీ చెప్పిన వారికి రూ.25 వేలు నజరానా ఇస్తామని ప్రకటించారు. -
మత్తుమందిచ్చి స్నేహితుడి భార్యపై..
చెన్నై, టీ.నగర్: ఆలయ ఉత్సవంలో కేసరి తోపాటు మత్తు చాక్లెట్ ఇచ్చి స్నేహితుని భార్యను నగ్నంగా వీడియో తీయడంతో పాటు సామూహిక అత్యాచారం జరిపిన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై విరుగంబాక్కం గాంధినగర్ ప్రాంతానికి చెందిన మహిళ (26). ఈమె భర్త వడ్రంగి. మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్యగా బాధితురాలిని వివాహం చేసుకున్నాడు. ఇలావుండగా మహిళ భర్త వడ్రంగి పనిపై గత జూలై నెలలో పొరుగూరికి వెళ్లి రెండు నెలల తర్వాత ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య మెడలోని మూడు సవర్ల బంగారు నగ కనిపించనందున ప్రశ్నించాడు. అందుకామె మీ స్నేహితుడు వినోద్‌కుమార్ (30), హరీష్‌కుమార్ మీరు ఊరెళ్లిన సమయంలో ప్రసాదం అంటూ మత్తుమందిచ్చి తనపై అత్యాచారం జరిపి మూడు సవర్ల బంగారు నగ అపహరించినట్లు తెలిపింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన భర్త, భార్యతో కలిసి దీనిపై బుధవారం టీ.నగర్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వినోద్‌కుమార్, సతీష్‌కుమార్‌పై కేసు నమోదు చేసి ఇరువురి కోసం గాలిస్తున్నారు. -
కైలాసగిరిపై గ్యాంగ్‌రేప్ యత్నం
ప్రేమ పేరుతో వల వేశాడు.. షికారుకు వెళ్దామంటూ ముద్దు ముద్దు మాటలతో మభ్యపెట్టాడు. కానీ అతని మాటల వెనుక.. ముద్దుముచ్చట్ల వెనుక చెరబట్టే కీచక పథకం ఉందన్న విషయం తెలియక గుడ్డిగా అతడిని నమ్మి కైలాసగిరిపైకి వెళ్లిన ఆమెకు ఆ కామాంధుడి విషపు ఆలోచనలు తెలిసొచ్చాయి. ఏకాంతం పేరుతో పొదల్లోకి తీసుకెళ్లి ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అతగాడికి ముగ్గురు స్నేహితులు తోడయ్యారు. రాక్షసంగా తన మీద పడిన వారిని తీవ్రంగా ప్రతిఘటిస్తూ.. ఆ యువతి కేకలు వేసింది. ఆమె అదృష్టం బాగుండి ఆ కేకలు అటుగా వెళ్తున్న పికెట్ పోలీసుల చెవిన పడ్డాయి. వెంటనే వారు అక్కడికి చేరుకొని యువతిని రక్షించారు. సామూహిక లైంగిక దాడికి యత్నించిన నలుగురినీ పట్టుకొని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్రమత్తంగా వ్యవహరించి యువతి మాన, ప్రాణాలను కాపాడిన పోలీసులను నగర పోలీస్ కమిషనర్ మీనా అభినందించారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలోని ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న యువతి(19)ని జోడుగుళ్ళపాలేనికి చెందిన డగోడుపల్లి నరేష్ (17) కొన్నాళ్ళుగా ప్రేమ పేరిట వెంటపడుతూ వస్తున్నాడు. ఓసారి సరదాగా కైలాసగిరి వెళ్దామంటూ ఎప్పటి నుంచో అడుగుతుండటంతో కాదనలేక సరే అంది. ఆ మేరకు బుధవారం సాయంత్రం ఇద్దరూ కలిసి కైలాసగిరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ఉందామంటూ పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకువెళ్ళాడు. వెంట తెచ్చుకున్న మద్యం సేవించాడు. తర్వాత ఒక్కసారిగా అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఇంతలో ఆమె ప్రతిఘటించడంతో దగ్గరలోనే ఉన్న ముగ్గురు స్నేహితులకు ఫోన్‌చేశాడు. మల్లె నూకరాజు (17), గలావిల్లి రమణ(23) గరికిన నూకరాజు(18).. అనే ముగ్గురు అక్కడికి వచ్చారు. నలుగురూ సామూహిక అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా వేసిన కేకలు పక్కనే పికెటింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు వినపడింది. వెంటనే పోలీసులు పొదలోకి వెళ్ళి ఆ యువతిని రక్షించారు. పారిపోతున్న నలుగురు యువకులను వెంటాడి పట్టుకుని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల్లో నరేష్ ఐటీఐ చదువుతుండగా, మల్లె నూకరాజు కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. రమణ బైక్ మెకానిక్ కాగా గరికిన నూకరాజు డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. వీరిలో నరేష్, మల్లెనూకరాజు మైనర్లు కావడం గమనార్హం. నిందితులు అదుపులో ఉన్నారని, విచారణ చేస్తున్నామని, సమగ్ర వివరాలు గురువారం వెల్లడిస్తామని ఆరిలోవ సీఐ కష్ణ కిషోర్‌కుమార్ చెప్పారు. ఆరిలోవ పోలీసులు భేష్.. సీపీ ఓ యువతి మాన, ప్రాణాలను రక్షించిన ఆరిలోవ పోలీసులను నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీసీపీ రంగారెడ్డి అభినందించారు. పోలీసులు సరైన సమయంలో స్పందించకుంటే మద్యం మత్తులో ఉన్న నిందితులు ఏ అఘాయిత్యానికైనా పాల్పడే ప్రమాదం ఉండేదన్నారు. ఇటీవల ప్రత్యేకించి కైలాసగిరి, తొట్లకొండ, రుషికొండ ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెంచామని చెప్పారు. ఫలితంగానే ఓ అవాంఛనీయ ఘటనను అడ్డుకోగలిగామని అన్నారు. -
నిందితులంతా నేర చరితులే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఓ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 3 బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులంతా నిజామాబాద్ శివారు లోని సారంగాపూర్ గ్రామానికి చెందిన వారని తేలింది. శుక్రవారం సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఓ యువతిపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పా ల్పడి..సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిం చిన విషయం విదితమే. ప్రధాన నిందితుడు మక్కల సురేశ్‌తోపాటు నాగరాజు, శంకర్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల నేర చరిత్ర అఘాయిత్యానికి పాల్పడిన నిందితులకు నేర చరిత్ర ఉంది. నిందితుల్లో ఒకరైన నాగరాజు ఆటో నడుపుకుంటూ జులాయిగా తిరుగుతుంటాడు. గతంలో ఇదే గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి ఓ యువతిపై అత్యాచారానికి యత్నించాడు. మిగిలిన నిందితులపై కూడా 6వ టౌన్ పోలీస్‌స్టేషన్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. నిందితుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందుకు వివరాలు వెల్లడించడం కుదరదని కేసు దర్యాప్తు అధికారి రఘునాథ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. నిందితులను వెంటనే పట్టుకోండి: డీజీపీ సారంగాపూర్ గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసుశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆరా తీశారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సీపీ కార్తికేయను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తు అధికారి రఘునాథ్, ఏసీపీ శ్రీనివాస్‌లతో కేసు పురోగతిపై సమీక్షించారు. పోలీసులకు చిక్కారిలా.. ప్రధాన నిందితుడు మక్కల సురేష్ యువతిని ద్విచక్ర వాహనంపై సారంగాపూర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చారు. రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు. ఆటోలో వచ్చి ఆరుగురు ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీన్ని మరో ఇద్దరు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఓ కేసు విచారణ నిమిత్తం అటువైపు వెళ్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్లకు రోడ్డు పక్కన కొంత దూరంలో ఆటో కనిపించింది. నిర్మానుష్య ప్రాంతంలో ఆటో ఉండటాన్ని అనుమానించిన పోలీసులు అటువైపు వెళ్లి చూడగా.. ఆటోలో కూర్చుని సెల్ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు యువకులు కనిపించారు. వారిని ప్రశ్నించగా.. ఏడుగురు స్నేహితులం బహిర్భూమికి వచ్చామంటూ దాటుకునే ప్రయత్నం చేశారు. గద్దించి అడుగగా.. వారికి ఫోన్ చేయించి స్పీకర్ ఆన్ చేయించడంతో యువతి అరుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత కిడ్నాప్, రోజూ గ్యాంగ్ రేప్!
జైపూర్: రాజస్థాన్‌లో ఎప్పటిలాగే మహిళలపై అత్యాచారాలు అధికంగా కొనసాగుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలను అరికడతామంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అత్యాచారాలు తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపించడం లేదు. రాజస్థాన్‌లోని బెహరార్‌లో జూలై 20వ తేదీన ఓ 24వ తేదీన పెళ్లయినా ఓ యువతిని నలుగురు కిడ్నాప్ చేసి గుర్తుతెలియని చోటుకు తీసుకెళ్లారు. పర్సులో ఉన్న ఆరువేల రూపాయల నగదు, వంటిపైనున్న నగలను దోచుకున్నారట. ఆ తర్వాత మానం దోచుకునేందుకు ఎగబడ్డారట. ప్రతి రోజు ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి వరుసగా గ్యాంగ్ రేప్ చేసేవారట. రోజుకో చోటుకు తీసుకెళ్లి ఇలాగే అత్యాచారం చేస్తూ వచ్చారట. దాదాపు నెలన్నర రోజులు ఇలాగే మృగాళ్ల రాక్షసత్వానికి గురవవడంతో ఆమె గర్భవతి కూడా అయిందట. ఓ రోజు మత్తు నుంచి స్పృహలోకి వచ్చి చూస్తే తనను నిర్బంధించిన ఇంట్లో ఎవరూ లేరట. ‘మత్తులో ఉంది, పైగా తమ చేతుల్లో ఇంతగా నలిగాక ఎక్కడికి పోతుందిలే అన్న దుండగుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకొని ఆ యువతి పారిపోయి వచ్చింది’ అని బెహరార్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. రెండు రోజుల క్రితం తమను ఆశ్రయించిన ఆ యువతి ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసుకొని వైద్య చికిత్సల కోసం ఆస్పత్రికి పంపించామని చెప్పారు. అలాగే కుటుంబ సభ్యులకు కబురు పెట్టామని కూడా సదరు పోలీసు అధికారి తెలిపారు. తనను కిడ్నాప్ చేసిన నలుగురు యువకుల పేర్లను అనిల్ కుమార్, దయానంద్, రామ్ అవతార్, రొహతాశ్‌లుగా ఆ యువతి వెల్లడించిందని పరారీలో ఉన్న ఆ నలుగురిని పట్టుకునేందుకు కృషి చేస్తున్నామని పోలీసు అధికారి చెప్పారు. -
ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్, ప్రియుడు ఆత్మహత్య
జైపూర్: మహిళలు, బాలికలపై అత్యాచారం,హత్యలకు పాల్పడుతున్న వారికి ఉరిశిక్షల అమలుపై తీవ్ర చర్చ నడుస్తుండగానే రాజస్థాన్‌లో జరిగిన మరో అమానవీయ ఘటన కలకలం రేపింది. నిందితుల్లో నలుగురిని ఆదివారం అరెస్టు చేయడంతో గత నెలలో జరిగిన ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ప్రేమికులైన దళిత యువతీ యువకులు జులై 13వ తేదీ బైక్ పై వెడుతుండగా , ముగ్గురు దుండగులు వారిని కత్తులతో, రాడ్లతో అటకాయించారు. యువకుడిని కొట్టి, సెల్‌ఫోన్ లాక్కుని అతణ్ణి అక్కడినుంచి బలవంతగా పంపించేశారు. అనంతరం ప్రియురాలు(20)ని నిర్మానుష్య ప్రదేశానికి లాక్కొనిపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మరో ఇద్దరు కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ పాశవిక కృత్యంతో ఆమెకు గర్భస్రావమైంది. మరోవైపు ప్రియురాల్ని కాపాడలేకపోయానన్న ఆవేదనతో ఆ యువకుడు ఊర్లో ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూలై 13 రాత్రి బన్స్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సునీల్, జితేంద్ర, వికాస్, విజయ్, పప్పు గుర్జార్‌గా గుర్తించామని బన్స్వారా డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్, ప్రభతి లాల్ తెలిపారు. నిందితుల్లో నలుగురిని ఆదివారం అరెస్టు చేయగా, ఒకరిని జూలై 26న అరెస్టు చేశామన్నారు. యువకుడి తండ్రి, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు సహా, కిడ్నాప్, సామూహిక అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదుచేశామని డీఎస్పీ తెలిపారు. -
మరిదిని చంపి.. వదినపై పోలీసుల గ్యాంగ్ రేప్!
సాక్షి, జైపూర్: దొంగతనం చేశారంటూ దళితులైన మరిది, వదినను అరెస్టు చేసిన కేసులో.. కస్టడీలో ఉన్న మరిది చనిపోవడం, పోలీసులు తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ వదిన వాంగ్మూలం ఇవ్వడం రాజస్థాన్‌లో సంచలనం రేపుతోంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీతో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఆరుగురు కానిస్టేబుళ్లను సస్సెండ్ చేసింది. అంతేకాక, జిల్లా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణకు ఆదేశించింది. ’రాజస్థాన్‌లోని చురు పోలీసులు దొంగతనం కేసులో నా తమ్ముడి(22)ని జూన్ 30న అనుమానితుడిగా తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న నా భార్య(35)ను తీసుకెళ్లారు. ఆ తర్వాత 6వ తేదీ రాత్రి నా తమ్ముడిని చిత్ర హింసలు పెట్టి చంపేశారు. ఈ ఘటనకు సాక్ష్యంగా ఉన్న నా భార్యపై సామూహికంగా అత్యాచారం చేసి, చేతి గోర్లను పీకేసి హింసించారు. ఎనిమిది రోజుల పాటు నా భార్యను అక్రమంగా నిర్బంధించి తమ్ముడు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత 10వ తేదీన విడిచిపెట్టారు’ అని మృతుని సోదరుడు మీడియాకు తెలిపారు. మృతుని సోదరి మాట్లాడుతూ.. 6వ తేదీన తన తమ్ముడిని గ్రామానికి తీసుకొచ్చి ఇదే నీ చివరి చూపని చెప్పారని విలపిస్తూ చెప్పింది. 8 రోజుల తర్వాత వచ్చిన వదిన ఆరోగ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పింది. ఈ దొంగతనం కేసులో మరిది, వదినలను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయలేదని తమ దృష్టికి వచ్చిందని చురు జిల్లా అదనపు ఎస్పీ ప్రశాంత్ కుమార్ శర్మ వెల్లడించారు. మృతుని పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందనీ, మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చామన్నారు. సామూహిక అత్యాచారం కేసులో బాధిత మహిళ వాంగ్మూలం తీసుకున్నామనీ, ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతోందని క్రైమ్ బ్రాంచ్ అదనపు డీజీపీ బీఎల్ సోనీ పేర్కొన్నారు. -
బానోకు 50 లక్షలు కట్టండి
న్యూఢిల్లీ: 2002లో గుజరాత్లో గోద్రా అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విషయంలో నిర్లక్ష్యం చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గుజరాత్ సర్కార్‌ను ఆదేశించింది. ఆ అధికారులకు పెన్షన్ ప్రయోజనాలు నిలిపివేయాలని.. బాంబే హైకోర్టు దోషిగా తేల్చిన ఐపీఎస్ అధికారికి రెండు ర్యాంకులు తగ్గించాలని (డిమోట్) ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడినధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. బానోకు పరిహారంగా రూ.5 లక్షలు ఇవ్వాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె తిరస్కరించింది. తనకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బానో తరఫున అడ్వొకేట్ శోభా గుప్తా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు దోషులుగా ప్రకటించిన అధికారులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. వీరిలో ఒక ఐపీఎస్ అధికారి వచ్చే ఏడాది రిటైర్ కాబోతున్నారని, మిగతా నలుగురు ఇప్పటికే రిటైర్ అయ్యారని పేర్కొన్నారు. వీరిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు నివేదించారు. ఈ దారుణ ఘటన తర్వాత బానో దుర్భర జీవితం గడిపిందని.. భయపడుతూ వివిధ ప్రాంతాల్లో తలదాచుకుందని పేర్కొన్నారు. ఆమెకు ఆమోదయోగ్యమైన పరిహారం చెల్లించాలని కోర్టును కోరారు. ఇక గుజరాత్ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఆనాడు ఏం జరిగింది? గోద్రా అల్లర్ల సమయంలో 2002 మార్చి 3న అహ్మదాబాద్ దగ్గర్లోని రాధికాపూర్‌లో బానోపై గ్యాంగ్‌రేప్ జరిగింది. ఆమె కుటుంబసభ్యులు 14 మందిని అత్యంత పాశవికంగా హతమార్చారు. మృతుల్లో ఆమె తల్లి, రెండేళ్ల కూతురు ఉన్నారు. ఘటన జరిగినపుడు బానో 5నెలల గర్భిణి. అప్పటినుంచి న్యాయం కోసం పోరాడుతోంది. పోలీసులు, ఎన్జీవో సహా పలు కోర్టులను ఆశ్రయించింది. న్యాయం జరగకపోయే సరికి చివరకు సుప్రీంకోర్టులో కేసువేసింది. కేసును కోర్టు సీబీఐకి అప్పజెప్పింది. 2004లో ఈ కేసుకు సంబంధించి తగిన ఆధారాలు సేకరించిన అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సీబీఐ అరెస్టు చేసింది. చివరికి 2008లో బిల్కిస్ బానో కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు పోలీసు అధికారులు, ఓ ప్రభుత్వ డాక్టరు సహా 19 మందిపై అభియోగాలు నమోదు చేసింది. వీరిలో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2008 జనవరి 11న తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ నిందితులు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను 2017లో ముంబై హైకోర్టు బలపరిచింది. వీరిలో ముగ్గురిని ఉరి తీయాలని సీబీఐ వాదించింది. కోర్టు సీబీఐ వాదనను తోసిపుచ్చింది. -
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో స్నేహితులతో కలిసి..
హస్తినాపురం: మద్యం మత్తులో ఓ మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను వనస్థలిపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, సీఐ వెంకటయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు. కొత్తపేటకు చెందిన మహిళ(32) మ్యాక్స్ జీవిత బీమా సంస్థలో ఏజెంట్‌గా పని చేసేది. రెండేళ్ల క్రితం ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. మన్సురాబాద్‌కు చెందిన సీసీ కెమెరాల వ్యాపాపారి మనోజ్‌కుమార్ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో గత కొన్ని నెలలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె మనోజ్ కుమార్‌పై ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత సోమవారం ఆమె మనోజ్ కుమార్‌కు ఫోన్ చేయడంతో ఆమెను స్నేహమైనగర్ కాలనీకి రప్పించాడు. అక్కడికి వచ్చిన బాధితురాలి పట్ల మనోజ్‌కుమార్ అతని స్నేహితులు అసభ్యకరంగా ప్రవర్తించడమేగాక అతని స్నేహితులు కోహెడ గ్రామానికి చెందిన కొలను సిద్దార్థరెడ్డి, మీర్‌పేటకు చెందిన సతీష్, బాబీ, జంగారెడ్డి మద్యం మత్తులో తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రెండు కార్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
వెలుగులోకి పొల్లాచ్చి మృగాళ్ల మరో దారుణం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: పొల్లాచ్చికి చెందిన నలుగురు మృగాళ్లు లైంగికదాడులే కాదు, ఓ చిన్నారిపై వరుసగా సామూహిక అత్యాచారానికి పాల్పడి ప్రాణాలు కూడా తీసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఒక ఆడియో వైరల్ అవుతోంది. పొల్లాచ్చిలో తిరునావుక్కరసర్ సహా నలుగురు యువకులు యువతులు, మహిళలతో ఫేస్బుక్ ద్వారా పరిచయాలు పెంచుకుని, ప్రేమ, మాటలతో లోబరుచుకుని లైంగికదాడులకు పాల్పడడం రాష్ట్రంలో కలకలం రేపింది. అంతేగాక తమ వలలో పడిన యువతుల నగ్నదృశ్యాలను, లైంగికదాడులను సెల్‌ఫోన్ వీడియో దృశ్యాలను చిత్రీకరించి పదే పదే లైంగిక హింసకు పాల్పడడం, భయభ్రాంతులకు గురిచేసి సొమ్ముదోచుకోవడం వంటి రాక్షసకృత్యాలకు పాల్పడ్డారు. (చదవండి: భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు) ఇలా వందమందికి పైగా యువతులు తమ ధన, మానాలను కోల్పోగా ఓ చిన్నారి ప్రాణాలను కూడా కోల్పోయిన సమాచారం బాధిత యువతి ఆడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘తిరునావుక్కరసర్ నలుగురు యువకులతోపాటు ఈ ముఠాలో మరో 8 మంది ఉన్నారు. బాధిత యువతుల్లో ఆరుగురు నా వద్ద తలదాచుకుని ఉండేవారు. వారిలోని ఒక చిన్నారిపై ఆ యువకులు పదేపదే లైంగిక దాడులకు పాల్పడడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి మృతదేహాన్ని వారి పైశాచికత్వానికి సాక్ష్యంగా నిలిచిన ఇంటికి సమీపంలో పూడ్చిపెట్టారు. ఈ ఘోరాన్ని ఎలా బైటపెట్టాలో తెలియక ఇన్నాళ్లు తపించాను. ఇప్పటికి ధైర్యం తెచ్చుకుని ఆడియో ద్వారా వెలుగులోకి తెచ్చాను’ అని ఆమె చెప్పారు. ఈ ఆడియోలోని వివరాలపై ఆరా తీస్తున్నామని సీబీసీఐడీ అధికారి ఒకరు చెప్పారు. మద్రాసు హైకోర్టులో మహిళా న్యాయవాదుల పిటిషన్ రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసిన పొల్లాచ్చి అత్యాచారాల పరంపర కేసును మహిళా పోలీసు ఉన్నతాధికారిచే విచారణ జరిపించేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ మహిళా న్యాయవాదులు మద్రాసు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదులు అజిత, ఆదిలక్ష్మి లోకమూర్తి, సుధ దాఖలు చేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి. పొల్లాచ్చి లైంగికవేధింపులకు గురైన యువతి పేరును బైటపెట్టడం ద్వారా బాధితులకు రక్షణ కల్పించే విషయంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైంది. అంతేగాక బాధిత యువతి కేసు విషయంలో విశ్వాసాన్ని కోల్పోయింది. అంతేగాక బాధిత యువతులు, వారి కుటుంబీకులకు తగిన రక్షణ కల్పించడంలో కూడా తగిన హామీని ఇవ్వలేకపోయింది. ఈ కారణాల వల్ల సీబీఐలోని ఉన్నత మహిళాఅధికారిచే కేసు విచారణ చేపట్టేలా ఆదేశించాలి. బాధిత యువతులకు మానసిక స్థైర్యంకల్పించేలా మానసిక నిపుణులచే కౌన్సెలింగ్, వైద్య సదుపాయం, న్యాయపరమైన తోడ్పాటు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. బాధిత యువతులకు సాక్షులకు భద్రత చట్టం కింద రక్షణ కల్పించాలి. విద్యాసంస్థల్లో అవగాహనా శిబిరాలు నిర్వహించాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై ఈనెల 29న విచారణను చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తహీల్ రమణి, న్యాయమూర్తి దురైస్వామిలతో కూడిన బెంచ్ ప్రకటించింది. చదవండి...(పొల్లాచ్చి కేసు : మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు) డీఎంకే నేత కుమారుడికి సీబీసీఐడీ సమన్లు ఇదిలా ఉండగా, పొల్లాచ్చి ఘటనపై డీఎంకే నేత కుమారుడికి సీబీఐ సమన్లు జారీచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరునావుక్కరసర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని అనుసరించి ఈనెల 28వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా డీఎంకే పొల్లాచ్చి నగర ఇన్చార్జ్ తెన్రల్ సెల్వరాజ్ కుమారుడు మణిమారన్‌కు సీబీసీఐడీ పోలీసులు మంగళవారం సమన్లు జారీచేశారు. బాధిత యువతి అన్నపై దాడిచేసిన కేసులో అరెస్టయి బెయిల్‌పై బైటకువచ్చిన బార్ నాగరాజ్ సైతం ఆదేరోజున విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపారు. -
ఐసియూ పేషెంట్‌పై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మీరట్‌లోని ఒక ప్రయివేటు హాస్పిటల్లో ఐసియూలో చికిత్సపొందుతున్న మహిళ (29) పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరీ ఈ ఘాతుకాలని పాల్పడటం కలకలం రేపింది. నిందితుల్లో ఒక డాక్టరు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. శనివారం రాత్రి ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం శ్వాస సంబంధమైన ఇబ్బందులతో బాధిత మహిళ ఆసుపత్రిలో చేరారు. అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమెకు మరింత జాగ్రత్తగా చికిత్స అందించాల్సిన సిబ్బంది ఆమెపై దురాగతానికి పాల్పడ్డారు. స్పృహలోనికి వచ్చిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముందస్తు పథకం ప్రకారం మత్తు ఇంజక్షన్ ఇచ్చి..అక్కడి సిసీటీవీని ఆఫ్ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టామని సీనియర్ అధికారి హరిమోహన్ సింగ్ తెలిపారు. ఇప్పటికే ఒక మహిళ సహా, అయిదుగురి నిందితులను అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందం త్వరితగతిన విచారణ చేస్తోందన్నారు. -
అన్నా నన్ను వదిలేయి, నిన్ను నమ్మికదా వచ్చాను
సాక్షి ప్రతినిధి, చెన్నై: యువతులను మాయమాటలతో ప్రలోభపరుచుకుని వారి జీవితాలతో చెలగాటమాడిన నలుగురు నిందితులపై వివిధ పార్టీల నేతలు, సామాజిక సంఘాల ప్రతినిధులు భగ్గుమంటున్నారు. వారికి ఎంత పెద్ద శిక్ష వేసినా చాలదని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారిని నిలువునా కాల్చివేయాలని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు సందేశాలు పెడుతున్నారు.పాఠశాల, కాలేజీ విద్యార్థినులు, గృహిణులతో స్నేహం నటించడం, మాయమాటలతో లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడడం, ఈ దృశ్యాలను సెల్ఫోన్ల ద్వారా వీడియోగా చిత్రీకరించి బెదిరించి సొమ్ము చేసుకోవడం ఈ నలుగురు కామాంధుల నిత్యకృత్యం. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన మనుషుల రూపంలో ఉండే కీచక బృందానికి తిరునావుక్కరసర్ అనే యువకుడు నాయకుడు కాగా శబరిరాజన్,వసంతకుమార్, సతీష్ అనుచరులు. సుమారు రెండేళ్లుగా సాగుతున్న దారుణాలను నెలరోజుల క్రితం ఓ బాధిత యువతి బయటపెట్టడంతో వెలుగుచూసింది. ముగ్గురు నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న తిరునావుక్కరసర్ రెండురోజుల క్రితం తిరుపతిలో పట్టుబడ్డాడు. వీరి నుంచి సేకరించిన 5 సెల్ఫోన్లలో హృదయ విదారకమైన దృశ్యాలు బయటపడ్డాయి. అనేక మంది యువతులు నగ్నంగా నిల్చుని ‘అన్నా నన్ను వదిలేయి, నిన్ను నమ్మికదా వచ్చాను’ అంటూ బిగ్గరగా రోదిస్తుండగా ఈ యువకులు వికృతానందం పొందుతున్నారు. మరికొందరు యువతులచేత బలవంతంగా డాన్సులు వేయించారు. ఇలా సుమారు 200 మంది యువతులు వీరి బారిన పడినట్లు సమాచారం. అయితే బయటపడితే పరువు పోతుందనే భయంతో ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో ఈ మృగాళ్లు మరింత రెచ్చిపోయారు. ఎట్టకేలకూ పాపం పండగా పోలీసులకు చిక్కారు. నిందితులు అరెస్టయిన తరువాత మరో బాధిత యువతి పోలీçసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిందితులపై గూండా చట్టం ప్రయోగించి కేసులు పెట్టారు. నిందితుల వెనుక అధికార అన్నాడీఎంకే నేతల హస్తం ఉందని, వీడియో దృశ్యాలను చెరిపివేయడం ద్వారా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డీఎంకే ఆరోపిస్తోంది. ఇదే ఆరోపణలపై ఎంపీ కనిమొళి మంగళవారం పొల్లాచ్చిలో ధర్నా చేపట్టింది. దీంతో ఈ కేసు తీవ్రత దృష్టా విచారణ బాధ్యతను సీబీసీఐడీకి అప్పగించారు. జామీను కోరుతూ తిరునావుక్కరసర్ చేసుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. పొల్లాచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్ మంగళవారం చెన్నై పోలీస్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నటీనటులు శరత్‌కుమార్, సిద్ధార్థ్, జీవి ప్రకాష్ కుమార్, గాయత్రీరఘురాం, గాయని చిన్మయి తీవ్రంగా ఖండించారు. కోయంబత్తూరులో ఇండియా మానవర్ సంఘం వారు మంగళవారం ధర్నా చేయగా ఐదు మంది మహిళలు సహా 51 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
పొల్లాచ్చి సంఘటన బాధిస్తోంది!
పెరంబూరు: కొన్ని రోజులుగా పత్రకల్లోనూ, సామాజిక మాధ్యమాల్లో, ప్రసార సాధనాల్లోనూ వస్తున్న పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార ఘోర సంఘటన మనసును కలిచివేస్తోందని దక్షిణ భారత నటీనటుల సంఘ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘ నిర్వాహకం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలాంటి ఆకృత్యాలను కొంతమంది చాలా కాలంగా చేస్తున్నట్లు ఆధారపూర్వకంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారన్నది గుర్తించి, వారు ఎంత పెద్ద వారైనా కఠినంగా శిక్షించాలని పోలీసుశాఖకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఈ సంఘటనపై పోలీస్అధికారులు నిజాయితీగానూ, ధైర్యంగానూ చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నామన్నారు. ఆ నిజాయితీకి దక్షిణభారత నటీనటుల సంఘం ఎప్పుడు మద్దతుగా నిలుస్తుందని అన్నారు. అదే విధంగా సెల్ఫోన్లో ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముప్పు ఉందన్నది ఈ తరం యువత అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మనకు మంచి భవిష్యత్‌ను అందించడానికి మన తల్లిదండ్రులకు ఉండే బాధ్యత, కలలు మరెవరికీ ఉండవన్నారు. అందువల్ల కొంత వయసు వరకూ యువత తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరితోనూ పరిచయాలు, స్నేహాసంబంధాలు పెట్టుకోవద్దని దక్షిణ భారత నటీనటుల సంఘం కోరుకుంటోందని పేర్కొన్నారు. -
పిల్లలను బంధించి తల్లిపై లైంగిక దాడి..
జీవనోపాధి కోసం భర్త ఆటో నడిపేందుకు వెళ్లగా నలుగురు పిల్లలతో ఒంటరిగా ఉన్న మహిళపై కామాంధులు తెగబడ్డారు.పిల్లలను గదిలో బంధించి లైంగిక దాడి చేశారు. ఈ దుర్ఘటన శనివారం రాత్రిపహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట: జీవనోపాధి కోసం భర్త ఆటో నడిపేందుకు వెళ్లగా ఆమె పిల్లలతో కలిసి ఇంట్లో ఉంటోంది. ఒంటరిగా ఉన్న ఆమెపై కామాంధులు తెగబడ్డారు. నలుగురు పిల్లలను ఒక గదిలో బంధించి దారుణంగా లైంగిక దాడి చేశారు. ఒకరు బెదిరిస్తూ ఉండగా మరో ఇద్దరు సమాజం తలదించుకునేలా అత్యాచారం చేశారు. బంధువులే రాబందులుగా మారి కొనసాగించిన ఈ దుస్యాసన పర్వం నగర శివారులోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. జల్పల్లి వాదే ముస్తఫా బస్తీకి హర్యానా నుంచి షాకీర్ ఖాన్ కుటుంబం ఇటీవలే వలస వచ్చి నివాసం ఉంటుంది. షాఖీర్‌ఖాన్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండగా....అతని భార్య (25) నలుగురు పిల్లలతో కలిసి ఇంటి వద్దే ఉంటుంది. వీరికి దగ్గరలోనే సమీప బంధువులు కూడా నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం భర్త ఆటోకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించిన బంధువులు ఆజాద్, అంజాద్‌లతో పాటు వారి స్నేహితుడు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి మంచినీరు అడిగారు. తెలిసిన వారే కావడంతో ఆమె ఇంట్లోకి వెళ్లి నీరు తెచ్చేంతలోపే బంధించారు. నలుగురు పిల్లలను మూడో వ్యక్తి పక్క గదిలో ఉంచి ఎవరికైనా చెపితే చంపేస్తామంటూ బెదిరించి కాపలగా ఉన్నాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. విధులు ముగించుకొని అర్ధరాత్రి వచ్చిన భర్తకు ఆమె జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. దీంతో అతడు ఆదివారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మా పరిధి కాదంటున్న పోలీసులు.. కాగా గృహిణిపై లైంగిక దాడికి జరిగిన ఇల్లు హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సరిహద్దుగా ఉండడంతో ఇరు కమిషనరేట్ల అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిషోర్ ఝా, ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్ ఎం.ఎ.రషీద్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వర్ రావులు రాగా...అటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం ఇన్‌ఛార్జి ఏసీపీ యాదగిరి రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ ఎం.శంకర్లు ఘటనా స్థలానికి చేరుకొని మా పరిధి కాదంటే...మా పరిధి కాదంటూ సతమతమయ్యారు. చివరకు పహాడీషరీఫ్ పోలీసులే కేసు నమోదు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారుల సూచనకనుగుణంగా అవసరమైతే తామే కేసును బదిలీకి తీసుకుంటామని ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్ ఎం.ఎ.రషీద్ సాక్షికి తెలిపారు. -
గ్యాంగ్‌రేప్ నిందితుల అరెస్ట్
నెల్లూరు, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నలుగురు నిందితులను చెంగాళమ్మ ఆలయ సమీపంలోని వాటంబేడురోడ్డులో గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేశామని గూడూరు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఆదేశాల మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో నిందితులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బొగ్గులకాలనీకి చెందిన వి.వినయ్‌కుమార్ అలియాస్ నాని (20), టి.నవీన్ అలియాస్ లడ్డా (26), సాయినగర్‌కు చెందిన ఎ.దేవా (22), రాజేంద్రన్ తమిళసెల్వం అలియాస్ తమిళ్ తండ్రి (22) జల్సాలకు అలవాటుపడ్డారు. రైల్వేస్టేషన్‌ను కేంద్రంగా చేసుకుని బ్యాచ్‌గా ఉండి ఒంటరిగా దొరికిన వారివద్ద నుంచి సెల్ఫోన్లు, నగదు లాక్కోవడం చేస్తుంటారు. వారు తిరగబడితే దాడి చేసి గాయపరుస్తుంటారు. ఊరికి వెళ్లేందుకు ఉండగా.. ఈనెల 3వ తేదీన బాధిత యువతి తన స్నేహితుడితో కలిసి ఊరికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌లోని విచారణ కేంద్రంలో వివరాలు తెలుసుకుంది. అనంతరం వారిద్దరూ మొదటి నంబర్ ప్లాట్‌ఫాం మీద కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో బహిర్భూమి కోసం యువతి గూడ్స్ ఇంజిన్ షెడ్ వద్దకు వెళ్లగానే గంజాయి మత్తులో జోగుతున్న నలుగురు యువకులు ఆమెను బలవంతంగా లాకెళ్లారని తెలిపారు. యువతి స్నేహితుడిపై దాడిచేసి అతని పర్సులోని రూ.500 నగదు లాక్కుని ఆమెపై పైశాచికంగా దాడి చేశారు. అత్యాచారానికి పాల్పడ్డారు. సైరన్ వినగానే.. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ సైరన్ వినగానే నలుగురూ యువతిని బలవంతంగా కాళంగినది ఒడ్డున అక్కంపేట రైల్వేస్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారని తెలిపారు. నిందితుల వద్ద బాధిత యువతికి సంబంధించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు నలుగురిపై నిర్భయ కేసు నమోదు చేశామని, వీరిని కోర్టులో హాజరు పెట్టనున్నామని తెలిపారు. మహిళా రక్షక్ విభాగం ఏర్పాటు చేస్తాం సూళ్లూరుపేట, తడ, ప్రాంతాల్లో సెల్‌ఫోన్ కంపెనీలో మహిళా కార్మికులు అధికసంఖ్యలో పనిచేస్తున్నారు కాబట్టి వీలైనంత త్వరగా మహిళా రక్షక్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించనున్నామని డీఎస్పీ తెలిపారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకదళాన్ని ఏర్పాటు చేశామన్నారు. సూళ్లూరుపేటలో లేడీస్ హాస్టళ్లు నడుపుతున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కంపెనీల యాజమాన్యాలే సొంతంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసేలే సూచనలు ఇస్తామన్నారు. ఈ కేసు విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకుని నిందితులను పట్టుకోవడంతో చొరవ చూపిన సీఐ కిషోర్‌బాబు, ఎస్సై విశ్వనాథరెడ్డి, వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఎస్పీ నుంచి క్యాష్ రివార్డులిస్తే ఆ నగదును బాధిత యువతికి అందజేస్తామని సిబ్బంది సీఐ తెలిపారు. -
దారుణం : కళ్లెదుటే కూతురుపై గ్యాంగ్ రేప్
పట్నా : బిహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రి కళ్లెదుటే కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. వివరాలు.. బిహార్‌లోని కిషన్ గంజ్ జిల్లాకు చెందిన ఓ 19 ఏళ్ల యువతిపై ఆరుగురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగడానికి నీళ్లు కావాలంటూ ఇంటికి వచ్చిన దుండగులు యువతిని, ఆమె తండ్రిని కిడ్నాప్ చేసి, పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తాళ్లతో కట్టేశారు. అనంతరం తండ్రి కళ్లెదుటే కూతురిపై ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుతో కోదోవాడి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని కిషన్‌గంజ్ ఎస్పీ ఆశిశ్ తెలిపారు. -
అత్యాచార కేసు విచారణ ముమ్మరం
నెల్లూరు, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనా స్థలాన్ని మంగళవారం పోలీసులు పరిశీలించారు. యువతిపై అత్యాచార ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ క్రమంలో కేసుకు సంబంధించి విచారణను పోలీసులు ముమ్మురం చేశారు. సీఐ ఎన్.కిషోర్‌బాబు మరోమారు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఓ యువకుడి పాత్ర ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు. కాగా నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
భూమాత మాట్లాడగలిగితే..!
రేప్ అయిన అమ్మాయి గురించిఆత్మ వచ్చి సాక్ష్యం చెప్పలేదు. ఎందుకంటే.. తను చనిపోయింది.హతురాలైన ఆ అమ్మాయి గురించి పిపిలీ గ్రామం సాక్ష్యం చెప్పలేదు. ఎందుకంటే ఆమె దళితురాలు.పొలంలో ఆమెపై రేప్ జరిగింది కనుక.. ఆ భూమాత మాట్లాడితే కానీ నిజం బయట పడదా?! ఆమెకు న్యాయం చేకూరదా? గొల్లుమని ఏడుపు.. ఆసుపత్రి బయట! తల్లి గుండెలు బాదుకుంటోంది. తండ్రి చేష్టలుడిగి పోయాడు. ఆమె కుప్పకూలి పోతుండగా అతడు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. లోపల ఒక అమ్మాయి చనిపోయింది.చనిపోయిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్లు. అప్పటికి ఏడు నెలలుగా ఆ అమ్మాయి చావుబతుకుల మధ్య సెమీ–కోమాలో రెపరెపలాడుతోంది. కళ్లు తెరుస్తోంది. చూస్తోంది. వెంటనే స్పృహ కోల్పోతోంది. ఒక్క మాటైనా మాట్లాడగలిగే స్థితిలో లేదు. ఇరవై మూడేళ్ల ‘నిర్భయ’పై బస్‌లో గ్యాంగ్ రేప్ జరగడానికి ఐదు నెలల ముందు.. కటక్‌లోని శ్రీరామ చంద్ర భాంజా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పందొమ్మిదేళ్ల ఆ ఒడిశా అమ్మాయి కోమాలోంచి మరణంలోకి జారుకున్న సంగతి.. నిర్భయ ఘటన వచ్చినంతగా నేటికీ ప్రపంచం దృష్టికి రాలేదు!‘‘బాడీని తీసుకెళ్లండి’’.. లోపల్నుంచి ఎవరో వచ్చి చెప్పారు. 2012 జూన్ 21 ఆ రోజు. చెడ్డ రోజు అది ఆ తల్లిదండ్రులకు. అయితే వారి జీవితంలో అంతకన్నా చెడ్డ రోజు.. నవంబర్ 28, 2011.‘‘వరి పొలాల్లో పడి ఉంది. ఒంటి మీద బట్టల్లేవు. చూస్తుంటే... మనమ్మాయిలా ఉంది’’ఉదయాన్నే ఇంటి ముందుకు కబురు! తల్లికి కడుపులో దేవినట్లుగా అయింది. ‘భగవంతుడా.. నా కూతురు కాకూడదు’.. చెప్పులైనా వేసుకోకుండా పొలాల్లోకి పరుగులు తీసింది. వెనకాలే ఆమె భర్త. పొలాల్లో పడి ఉన్నది వాళ్ల కూతురే! ‘నా కూతురు కాకూడదు దేవుడా’ అని అంతకుముందే వేడుకున్న ఆ తల్లి.. కూతుర్ని ఆ స్థితిలో చూసి.. ‘ఏ కూతురికీ ఇలా కాకూడదు దేవుడా’ అని అక్కడే కూలబడిపోయింది. కూతురి ఒంటి మీద బట్టలు చిరిగి ఉన్నాయి. దేహంపై కొన్ని చోట్ల బట్టలు పక్కకు తప్పి ఉన్నాయి. తీవ్రమైన గాయాలున్నాయి. రక్తం మరకలున్నాయి. కాస్త ఊపిరి కూడా ఉంది.‘అమ్మా.. నా తల్లీ’ అని కూతుర్ని చేతుల్లోకి ఎత్తుకున్నాడు తండ్రి. దళిత కుటుంబం వారిది. అర్జునగొడ వాడ వారుండేది. అర్జునగొడ íపిపిలీ గ్రామంలో ఉంటుంది. పిపిలీ గ్రామం పూరి జిల్లాలో ఉంటుంది. పూరి జిల్లా ఒడిశాది. ఒడిశా నవీన్ పట్నాయక్‌ది. ముఖ్యమంత్రి ఆయన. ఆయన వరకు వెళ్లింది విషయం.ఇక్కడ.. లోకల్ ఆసుపత్రి నుంచి పై ఆసుపత్రికి, పై ఆసుపత్రి నుంచి ఆ పై ఆసుపత్రికి.. అక్కడి నుంచి కటక్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి చేరింది.. కొన ఊపిరితో ఉన్న ఆ యువతి దేహం. ఎవరు చేశారు? నలుగురు యువకులు. ఏం చేశారు? ఆ కన్న హృదయాలు చెప్పలేకపోయాయి. పోలీసులు చెప్పారు. కిడ్నాప్, అత్యాచారం, హత్యాయత్నం. ఢిల్లీ యువతి నిర్భయ, ఆ ఒడిశా యువతి.. ఇద్దరూ డెత్బెడ్ మీద ఉండి ఇంటికి చేరకుండానే కన్ను మూసినవారే. నిర్భయ తన ప్రాణాలతో పద్నాలుగు రోజులు పోరాడి ఓడిపోయింది. ఆ పద్నాలుగు రోజుల్లోనూ మెలకువ వచ్చిన ప్రతిసారీ ఆమె అన్నమాట ఒక్కటే.‘వాళ్లను వదిలిపెట్టొద్దు.. వాళ్లను వదిలిపెట్టొద్దు.’వదిలిపెట్టలేదు న్యాయస్థానం. మొత్తం ఆరుగురు. రామ్‌సింగ్, ముఖేశ్‌సింగ్, వినయ్‌శర్మ, ఒక మైనర్, పవన్‌గుప్త, అక్షయ్ ఠాకూర్! మైనర్కి తప్ప అందరికీ మరణశిక్ష పడింది. కేసు విచారణలో ఉన్నప్పుడే రామ్‌సింగ్ తీహార్ జైల్లో చనిపోయాడు. మైనర్ని కోర్టు విడుదల చేసింది. కోర్టు నిబంధనల ప్రకారం మైనర్ పేరు బయట పెట్టకూడదు. కానీ పేరు బయటికి వచ్చి ఉంది. అతడికి రెండు పేర్లు ఉన్నాయి. మహ్మద్ అఫ్రోజ్, రాజు. నిర్భయ అయినా ‘వాళ్లను వదిలిపెట్టొద్దు’ అని అనగలిగింది కానీ, ఆ పందొమ్మిదేళ్ల ఒడిశా అమ్మాయికి అలా అనే ఓపిక కూడా లేకపోయింది. తనసలు ఈ లోకంలోనే లేదు. నిర్భయ ఘటన జరగడానికి ముందే.. అలాంటి దారుణమైన అకృత్యానికే గురైన అభాగ్యురాలు ఆమె. న్యాయస్థానాలు ఆమె పేరును బయట పెట్టకూడదని ఆంక్షలు విధించాయి కనుక ‘నిర్భాగ్య’ అనే పిలుచుకుందాం. ఆమెకు జరిగిన ‘న్యాయం’ ఏమిటో తెలుసుకుంటే ఆమెను నిర్భాగ్య అనకపోవడం అన్యాయమే అనిపిస్తుంది. గొల్లుమని ఏడుపు.. కోర్టు బయట! తల్లి గుండెలు బాదుకుంటోంది. తండ్రి చేష్టలుడిగి పోయాడు. ఆమె కుప్పకూలి పోతుండగా అతడు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. లోపల ఒక అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది. అన్యాయం జరిగిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్లు. నిర్భయ కేసులో తొమ్మిది నెలలకు తీర్పు వచ్చింది. ఈ ‘నిర్భాగ్య’ కేసులో ఏడేళ్లకు తీర్పు వచ్చింది! నిర్భయ కేసులో అందరికీ ఉరిశిక్ష పడింది. నిర్భాగ్య కేసులో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు! అందరూ అంటే నలుగురు. ప్రశాంత్ ప్రధాన్, సుకాంత్, గుణస్వాయిన్, ప్రేమానంద నాయక్. మొదటి ఇద్దరూ అన్నదమ్ములు. వాళ్లిద్దర్నీ సరైన సాక్ష్యాధారాలు లేవని డిసెంబర్ 24న కోర్టు విడుదల చేసింది. తీర్పు విన్న వెంటనే నిర్భాగ్య తల్లిదండ్రులు అచేతనులయ్యారు. ‘నా కూతురు ఆత్మ శాంతించదు’ అని ఆ తల్లి బోరున విలపించింది. మిగతా ఇద్దరి పేర్లు అసలు చార్జిషీటులోనే లేవు! అయితే పాత పోలీస్ రికార్డుల్లో ఉన్నాయి.2008లో పిపిలీ గ్రామంలో జరిగిన ఒక లైంగిక వేధింపుల కేసులో వీళ్లు నలుగురూ నిందితులు. వాళ్లు చేసిన తప్పుడు పనికి సాక్ష్యమిచ్చింది నిర్భాగ్య. అప్పుడు ఆ అమ్మాయి వయసు పదహారేళ్లు. అప్పుడే ఆమె మీద ఆ నలుగురి కన్నుపడింది. పడిన విషయం ఐదో కంటికి తెలీదు. ఇప్పుడు కోర్టు కంటికీ తెలియలేదు. తెలియనివ్వలేదు. సత్యమేవ జయతే : ఒడిశా మంత్రి! పద్దెనిమిదేళ్లుగా ఒడిశాకు నవీన్ పట్నాయకే సీఎం. ఆయన పార్టీ బి.జె.డి. (బీజూ జనతాదళ్’). 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో ముఖ్యమంత్రి పార్టీకి ప్రస్తుతం ఉన్న సీట్లు 118. కాంగ్రెస్‌కు పదిహేను, బీజేపీకి పదీ ఉన్నాయి. ఉన్న కొద్ది సీట్లోతోనే ‘నిర్భాగ్య’ కోసం పోరాడుతున్నాయి ప్రతిపక్షాలు. అయితే ‘నిర్భాగ్య’ను చంపిన హంతకులను కింది కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంపై ‘స్టేట్ క్రైమ్ బ్రాంచి’ హైకోర్టుకు వెళుతోంది కాబట్టి అంతకుమించి ప్రభుత్వమైనా చేయవలసింది ఏముంటుందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రదీప్ మహారథి అంటున్నారు. దోషులను రక్షిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో 2012లోనే ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే మంత్రి పదవిలో ఉండి, ‘సత్యమేవ జయతే. బాధితురాలికి న్యాయం జరగాలి’ అని అనడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ‘మహారథి మెదడు లోపల ఏముందో మాకు తెలియడం లేదు. ఆయన పలికిన ‘న్యాయం’ అనే మాటకు అర్థమేమిటో ఆయన చెప్పాలి’’ అని మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుమిత్రా జెనా అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నాయకురాలు ప్రభాతీ పరిదా విమర్శిస్తున్నారు. -
హైదరాబాద్‌లో దారుణం..16ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కామాటీపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గొల్లాకిడికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై 11మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కామాటీపుర పోలీస్ స్టేషన్లో బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గొల్లాకిడికి చెందిన 16ఏళ్ల బాలికపై 11 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసి బాధితురాలిని బెదిరిస్తూ నరకం చూపించారు. ఈ విషయాన్ని బయటపెడితే సోషల్‌మీడియాలో వీడియో పెట్టి వైరల్ చేస్తామని బెదిరింపులకు దిగారు. కామాంధుల చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు గత నెల 24న కామాటీపుర పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. బాలికపై గత నాలుగేళ్ల నుంచి అత్యాచారానికి పాల్పడినట్లుగా వైద్యుల రిపోర్టులలో తేలిందని తల్లిదండ్రులు చెప్పారు. ఆదివారం సుమారు 200 మంది స్థానికులు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. బాలికకు నరకం చూపించిన కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే..
భువనేశ్వర్ : ఓ 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై అన్నయ్య స్నేహితుడే దారుణానికి ఒడిగట్టాడు. సోదరి వరుసయ్యే యువతిని పథకం ప్రకారం కిడ్నాప్ చేసి మరో ఐదుగురితో కలిసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అన్నయ్య స్నేహితుడే కదా! అని నమ్మిన ఆ యువతికి తీరని శోకాన్ని మిగిల్చాడు. రెండు రోజుల పాటు ఓ గదిలో బంధించి నరకం చూపించారు. మృగాళ్లలా ఆ యువతిని అతికిరాతకంగా చెరచటంతో బాధితురాలు ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తమ వాంఛను తీర్చుకున్న దుండగులు బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. జార్ఖండ్‌లోని చక్రదాపుర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రూర్కెలాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని గత డిసెంబర్ 30న ఇంటికెళ్లడానికి రైల్వే స్టేషన్లో వేచి ఉంది. ఈ క్రమంలో ఆ యువతి దగ్గరకు వచ్చిన ఆమె అన్నయ్య స్నేహితుడు ఆమెను నమ్మించి తప్పుడు ట్రైన్ ఎక్కించాడు. రైలు ఎక్కాక తాను సరైన ట్రైన్ ఎక్కలేదనే విషయాన్ని గ్రహించిన ఆమె.. నిలదీయడంతో జార్ఖండ్ లోథపుర్ స్టేషన్లో దిగుదామని, అక్కడి నుంచి బస్సులుంటాయని నమ్మించాడు. ముందే ప్లాన్ చేసిన నిందితులు యువతిని బలవంతంగా లోథ్‌పుర్‌లోని ఓ ఇంటిని తీసుకెళ్లి రెండు రోజుల పాటు అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయడంతో బాధితురాలు స్థానికులు సాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ గ్యాంగ్ రేప్ వ్యవహారం వెలుగు చూసింది. ఈ ఘటనపై రూర్కెలా ఎస్పీ మాట్లాడుతూ.. ఇంత వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని, బాధితురాలు ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతుందని తెలిపారు. -
దీపావళి విందులో మత్తుమందిచ్చి సామూహిక అత్యాచారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: దీపావళి విందు అంటూ యువతిని ఇంటికి ఆహ్వానించాడు. మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి తన నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన సంఘటన నిందితుని అరెస్ట్‌తో ఆలస్యంగా వెలుగుచూసింది. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన 21 ఏళ్ల యువతి ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. యువతి పనిచేస్తున్న దుకాణానికి సమీపంలోని పట్టుచీరల వ్యాపారి చిన్నప్ప(43)తో వృత్తిపరమైన పరిచయం ఏర్పడింది. దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 8వ తేదీన దుకాణాలకు సెలవు కావడంతో సదరు చిన్నప్ప ఆ యువతికి ఇంటికి వెళ్లి తన ఇంటిలో పండుగ ప్రత్యేక విందు కార్యక్రమం ఉందని ఆహ్వానించాడు.యువతిని తన బైక్‌లో తీసుకెళ్లాడు. అయితే ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇదేమని ప్రశ్నించిన యువతికి విందు ముగిసింది. భార్యాపిల్లలు ఇప్పుడే వస్తారని మభ్యపెట్టి తాళం తీసి లోపలికి తీసుకెళ్లాడు. ఆ తరువాత ఆపిల్ జ్యూస్, కూల్‌డ్రింక్ ఇచ్చాడు. వాటిని తాగిన యువతి కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంది. మధ్యాహ్నం 11 గంటలకు అతని ఇంటికి వెళ్లిన యువతి మధ్యాహ్నం 3 గంటలకు స్పృహలోకి రాగానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఆ మరుసటి రోజు నుంచి తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో యువతి తల్లి కుంభకోణంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా సామూహిక అత్యాచారానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. యువతి మర్మాంగానికి వైద్యులు తొమ్మిది కుట్లు వేశారు. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుంభకోణం మహిళా పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న చిన్నప్పను మంగళవారం అరెస్ట్‌చేశారు. అయితే పోలీసు విచారణలో చిన్నప్ప, మరో వస్త్ర వ్యాపారి సహా మొత్తం ఐదుగురు అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. దీంతో నిందితులందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించారు. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి మద్దతు ప్రకటించారు. -
విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన
ఇబ్రహీంపట్నం : ఫేస్బుక్ పరిచయంతో ఓ విద్యార్థినిని హోటల్‌రూమ్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఇబ్రహీంపట్నంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మైలవరంలోని ఓ కళాశాలలో చదువుతున్న అమ్మాయికి ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈనెల 11న స్థానికంగా ఉన్న కేవీఆర్ గ్రాండ్ హోటల్ రూమ్‌ను బుక్‌చేసుకుని కారులో ఆ అమ్మాయిని తీసుకువెళ్లాడు. కొంత సమయానికి అతని స్నేహితులు మరో ఇద్దరు ఆ రూమ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ సన్నివేశాలను సెల్ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లినట్లు తెలిసింది. బెదిరింపులు.. అనంతరం సెల్ల్లో చిత్రీకరించిన వ్యక్తులు మొదటి వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాలని యత్నించారు. వీడియోను ఫేస్బుక్, వాట్సాప్‌లో పెడతామని బెదిరిం చారు. కొండపల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ముగ్గురి మధ్య పంచాయతీ నిర్వహించారు. విషయం పోలీసులకు తెలియటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లైంగిక దాడి జరగలేదు : సీపీ ఓ టీవీ చానల్లో మంగళవారం ప్రచారమైనట్లుగా ఇబ్రహీంపట్నంలోని కేవీఆర్ గ్రాండ్ హోటల్లో యువతిపై గ్యాంగ్ రేప్ జరగలేదని నగర సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. చానల్లో గ్యాంగ్ రేప్ వార్త చూసిన వెంటనే తాము అప్రమత్తమై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామన్నారు. హోటల్‌కు వచ్చి వెళ్లిన యువతి ఆచూకి తెలుసుకుని ఆమెతో మాట్లాడామని.. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఆమె స్పష్టం చేసిందన్నారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో హోటల్‌కు వెళ్లినమాట వాస్తవమేనని.. అతనితోపాటు మిత్రులు ఇద్దరు హోటల్‌రూమ్‌లో తనపై అసభ్యంగా ప్రవర్తించగా.. ప్రతిఘటించి వారి బారి నుంచి బయటపడ్డానని వివరించారని చెప్పారు. ఈ విషయం బయటకు పొక్కితే కుటుంబ పరువు పోతుందని భయపడి కేసు పెట్టలేదని ఆమె వివరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె నగరానికి దూరంగా ఉన్నారని.. రాగానే కేసు పెట్టమని కోరామని చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. -
బీటెక్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
సాక్షి, మైలవరం : కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫేస్బుక్ వేదికగా యువతిని పరిచయం చేసుకున్న నిందితుడు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అంతేగాకుండా ఈ సంఘటనను మొబైల్లో చిత్రకరించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వ్యవహారం బయటకు తెలిసింది. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న బాధితురాలికి నిందితుడు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి వంచించాడు. ఇబ్రహీంపట్నంలోని కేవీఆర్ గ్రాండ్ లాడ్జ్‌కి తీసుకు వచ్చి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనా బాధితురాలు భయంతో విషయాన్ని బయటకు చెప్పలేదు. నిందితులు మణికంఠ, ధీరజ్, భాషాలుగా పోలీసులు గుర్తించారు. వీరి కోసం మూడు ప్రత్యేక టీంలు గాలిస్తున్నాయి. బాధితురాలు సహకరిస్తే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా విచారించడానికి సన్నాహాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
సీబీఎస్ఈ టాప్ ర్యాంకర్‌పై సామూహిక అత్యాచారం
-
ప్రియురాలి గ్యాంగ్‌రేప్.. ప్రియుడి ఆత్మహత్య
కోర్బా: కళ్లెదుటే ప్రియురాలు గ్యాంప్రేప్నకు గురవడంతో మనస్తాపం చెందిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చత్తీడ్గఢ్లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు..కటోఘోరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సవాన్ సాయి(21), మైనర్ బాలిక(17) కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం సాయి అకస్మాత్తుగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు విచారణలో భాగంగా మైనర్ బాలికను ప్రశ్నించగా..ఆమె అసలు విషయం చెప్పడంతో గ్యాంగ్ రేప్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 1న సాయంత్రం తానూ, సవాన్ సాయి ఓ పాఠశాల వద్ద కూర్చున్నామని, ఆ సమయంలో ఈశ్వర్ దాస్(22), ఖేమ్ కన్వర్(21) అనే ఇద్దరు వచ్చి సవాన్ సాయితో గొడవ పడ్డారని తెలిపింది. ఆ తర్వాత సవాన్ సాయి కళ్లెదుటే తనను రేప్ చేశారని బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాతి రోజు గ్రామంలో రేప్ చేసిన యువకులు, మరికొందరికి ఆ సంఘటన గురించి చెప్పారని, బహుశా దీనిని అవమానంగా భావించి సవాన్ సాయి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డ నిందితులు ఈశ్వర్ దాస్, కన్వర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. -
పోర్న్ వీడియో చూసి ఐదుగురు బాలురు..
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. పోర్న్ వీడియోలు చూసి 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలురు 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసిన బాలురు ఆ తర్వాత చిన్నారిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని సాహస్‌పూర్‌లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాహస్పూర్ చెందిన ఐదుగురు బాలురు, అక్కడే ఉన్న బాలికను ఆడుకుందామని నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఫోన్లో పోర్న్ వీడియోలు చూసినట్లు నిందితుల్లో ఒకడైన బాలుడు తెలిపారన్నారు. అనంతరం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాల్య గృహంకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
13 ఏళ్ల బాలికపై 17మంది కామాంధులు..
-
చెన్నైలో మృగాళ్లు
చెన్నై: వినికిడి లోపం ఉన్న 11 ఏళ్ల బాలికకు మత్తుమందులు ఇచ్చి 7 నెలలపాటు అనేక మంది పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ సంఘటన చెన్నైలో జరిగింది. ఈ కేసులో 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మంగళవారం కోర్టుకు తీసుకురాగా న్యాయవాదులే మూకుమ్మడిగా నిందితులపై దాడి చేశారు. నిందితుల తరఫున ఏ లాయరూ వాదించరని న్యాయవాదుల సంఘం తేల్చి చెప్పింది. కోర్టు నిందితులకు జూలై 31 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చెన్నైలోని అయణవరం ప్రాంతంలో ఉన్న ఓ అపార్టుమెంటులో బాలిక నివసిస్తోంది. అదే అపార్టుమెంటులో పనిచేస్తున్న లిఫ్ట్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ సహా పలువురు నిర్వహణ సిబ్బంది బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. 7వ తరగతి చదువుతున్న ఈ బాలికపై అత్యాచారం చేసే ముందు నిందితులు ఆమెకు మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం, మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయాలను తాగించడం, పొడి రూపంలో ఉన్న మాదక ద్రవ్యాలను ముక్కుతో పీల్చేలా చేసేవారని వెల్లడించారు. బాలికపై దారుణానికి పాల్పడుతూ వీడియోలు కూడా తీశారన్నారు. తొలుత లిఫ్ట్ ఆపరేటర్ బాలికపై అత్యాచారానికి పాల్పడగా, ఆ తర్వాత పలువురు అతనికి జత కలిసి 7 నెలల పాటు ఆమెను హింసించారని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని బాలిక తన అక్కకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాలిక తండ్రి ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘11 మంది తనపై అత్యాచారం చేశారని అమ్మాయి చెప్పింది. వారికి సహకరించిన మరో ఆరుగురిని కూడా కలిపి మొత్తం 17 మందిని అరెస్టు చేశాం’ అని పోలీసులు చెప్పారు. దీన్ని ప్రత్యేకమైన కేసుగా పరిగణించి విచారణ చేస్తున్నామన్నారు. నిందితులపై లాయర్ల దాడి నిందితులందరినీ మంగళవారం పోలీసులు మహిళా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిందితులను కోర్టు నుంచి బయటకు తీసుకొస్తుండగా అక్కడ ఉన్న దాదాపు 50 మంది న్యాయవాదులు వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో నిందితులను రెండు గదుల్లో ఉంచి పోలీసులు రక్షణ కల్పించారు. లాయర్లకు భయపడి దాదాపు 5 గంటలు వారంతా ఆ గదుల్లోనే ఉన్నారు. రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో లాయర్లు శాంతించడంతో నిందితులను కస్టడీకి తరలించారు. -
ట్రాప్.. రేప్
విజయవాడలో పోకిరీ మూకల ఆగడాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అమాయకులైన ఆడపిల్లలను నమ్మించి వంచనకు గురిచేస్తున్నారు. అసభ్య వీడియోలు తీసి వేధిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారి అరాచకాలకు పాల్పడుతున్నారు. మత్తులో కూరుకుపోయిన కొందరు యువకులు శివారు ప్రాంతాల్లోని విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్నారు. దీంతో విద్యార్థినులు చిత్రవధ అనుభవిస్తున్నారు. శివారులోని రెండు పోలీసుస్టేషన్ల పరిధిలో ఆగడాలు తీవ్రంగా ఉన్నాయి. సాక్షి, అమరావతిబ్యూరో : రాజధానిలో ఆకతాయి గ్యాంగ్‌ల విశృంఖలత్వానికి అడ్డుకట్ట వేసే వారు కరువయ్యారు. కాలేజీ విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని పోకిరీ గ్యాంగ్‌లు పెట్రేగిపోతున్నాయి. పథకం ప్రకారం విద్యార్థినులను ట్రాప్ చేస్తున్నారు. ఆ పోకిరీ మూకలో ఒకరు యువతిని ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి నమ్మిస్తారు. ఆ యువతిని అజ్ఞాత ప్రదేశానికి తీసుకువెళ్లి అసభ్యంగా వీడియోలు తీస్తున్నారు. తమ మాట వినకపోతే సోషల్‌మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేస్తూ వేధింపుల పరంపర కొనసాగిస్తున్నారు. ఇంట్లో చెప్పలేక వారి వేధింపులు తట్టుకోలేక ఎంతోమంది యువతులు బాధితులుగా మారుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసి నిలదీస్తున్న కుటుంబసభ్యులపై దాడులకు సైతం తెగబడుతున్నారు. ఇదేదో ఎప్పుడో ఎక్కడో ఓసారి జరుగుతున్న దారుణం కాదు... విజయవాడ పరిసరాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న విషపు వల. ఇక యువతులను టీజింగ్, ఇతర వేధింపులకు అయితే అడ్డూ అదుపూ లేకుండాపోయింది. కాలనీలు, శివారు ప్రాంతాల్లో తిష్టవేసిన పోకిరీలు ఆగడాలకు యువతులు హడలెత్తుతున్నారు. ఆ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలోనేఅత్యధికంగా... ప్రధానంగా కమిషరేట్‌లోని ఓ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ... ఆ సమీపంలోని జిల్లా ఎస్పీ పరిధిలోకి వచ్చే మరో పోలీస్ స్టేషన్ పరిధిలో పరిస్థితి తీవ్రత ఎక్కువుగా ఉంది. ఆ రెండు పోలీస్స్టేషన్ల పరిధిలోనే ఎక్కువుగా కాలేజీలు ఉన్నాయి. శివారులో ఉండటంతోపాటు ఎక్కువగా జనసంచారం లేని ఆ ప్రాంతాలను ఆకతాయిలు తమ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చేసుకుంటున్నారు. ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక కొందరు ధైర్యం చేసి కుటుంబసభ్యులకు విషయాన్ని చెబుతున్నారు. వారిలో చాలా కొద్దిమంది తల్లిదండ్రులే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో లెక్కకు మించి ఫిర్యాదులు నమోదు అవుతుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు తక్షణం స్పందిస్తూనే ఉన్నారు. యువతులకు సంబంధించిన వ్యవహారం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా కేసులను డీల్ చేస్తున్నారు. చాలావరకు కేసుల్లో పోకిరీలను తీసుకువచ్చి ‘తమదైన శైలిలో’ బుద్ధి చెప్పి పంపిస్తున్నారు. అయినప్పటికీ ఆకతాయిల ఆగడాలు పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు. ఆ రెండు పోలీస్స్టేషన్ల పరిధిలో కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. డ్రగ్స్ మహమ్మారి కూడా... పోకిరీల విశృంఖలత్వానికి డ్రగ్స్ మరింత కిక్ ఇస్తున్నాయి. శివారులో ప్రాంతాలు డ్రగ్స్ రాకెట్‌కు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. గంజాయితోపాటు మరికొన్ని డ్రగ్స్ విక్రయం జోరుగా సాగుతోంది. సీఆర్డీఏ ప్రాంతంలో కొన్ని గ్రామాలు కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా సాగుతోంది. అక్కడ నుంచి శివారుప్రాంతాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. ఆకతాయి మూకలు వారంతపు రోజుల్లో ప్రత్యేకంగా డ్రగ్స్ పార్టీలు పెట్టుకుని మరీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకూంటూ భీతావాహ పరిస్థితులు సృష్టిస్తున్నారు. తీవ్ర గాయాలతో శివారులోని ఆసుపత్రుల్లో చేరుతున్నారు కూడా. వారు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు రక్త పరీక్షల్లో వెల్లడవుతోందని ఆసుపత్రివర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతపై పోలీసులు దృష్టి సారించారు. పెడదారి పడుతున్న యువతను కట్టడిచేసే విషయంపై కమ్యూనిటీ పోలీసింగ్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. త్వరలోనే కార్యాచరణను చేపట్టనున్నారు. -
మృగాళ్లలా ప్రవర్తించారు.. వదిలిపెట్టొద్దు
సంచలనం సృష్టించిన కొట్టాయం మహిళ గ్యాంగ్‌రేప్ కేసుపై కేరళ హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులైన నలుగురు మత గురువులను తక్షణమే అరెస్ట్ చేయాలని బుధవారం పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితుల్లో ఒకరు లొంగిపోగా.. మరో ముగ్గురి కోసం పోలీసులు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నారు. కొట్టాయం: గత నెలలో 34 ఏళ్ల తన భార్యపై నలుగురు మత గురువులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని చర్చి మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేస్తూ.. ఆమె భర్త ఓ ఆడియో క్లిప్ విడుదల చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో దుమారం చెలరేగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత మహిళ నుంచి ఫిర్యాదు నమోదు చేశారు. ‘20 ఏళ్ల క్రితం సదరు చర్చి ఫాదర్ లోబర్చుకున్నాడని, వివాహం చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. ఆపై పాపపరిహారం కోసం ముగ్గురు మత గురువులను ఆశ్రయించగా.. వాళ్లు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి మరీ వాళ్లు కూడా తనపై అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా, 2006లో మహిళకు వివాహం కాగా, వాళ్ల వేధింపులు మాత్రం ఆగలేదంట. దీంతో జరిగిన విషయాన్ని భర్తకు వివరించగా.. ఆయన మత గురువుల ఆరాచకాలను వెలుగులోకి తెచ్చాడు. మృగాళ్లలా ప్రవర్తించారు.. కాగా, ఈ కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మత గురువులు మృగల్లా ప్రవర్తించారు. ఓ మహిళపై 20 ఏళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నారంటే వారిని మనుషులు పరిగణించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది. అంతేకాదు వాళ్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన కోర్టు.. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దీంతో నిందితుల్లో ఒకడైన ఫాదర్ జాబ్ మాథ్యూ పోలీసులకు గురువారం లొంగిపోయాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే కేరళలో గత 18 నెలలుగా.. మొత్తం 12 మంది మత గురువులను లైంగిక దాడుల కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మేమేం రక్షించట్లేదు.. కాగా, ఈ వ్యవహారంలో చర్చి అధికారులపైనా విమర్శలు చెలరేగాయి. వారిని రక్షిస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఫిర్యాదు అందగానే వారిని తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశాం. ఇప్పుడు వారికి-చర్చికి ఎలాంటి సంబంధం లేదు’ అని ఓ ప్రకటనలో చర్చి మేనేజ్మెంట్ పేర్కొంది. -
బిహార్‌లోని ఛప్రా జిల్లాలో దారుణం
-
స్కూల్లోనే బాలికపై క్లాస్మేట్స్ మృగవాంఛ
తొమ్మిదో తరగతి చదివే బాలికకు స్కూల్ నరకాన్ని తలపించింది. ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు, విద్యార్థులు సహా ఏకంగా 18 మంది ఏడు నెలలుగా ఆమెపై మృగవాంఛ తీర్చుకుంటున్నారు. బాధితురాలు ధైర్యం చేయటంతో చివరకు విషయం వెలుగులోకి రాగా.. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... పట్నా: బిహార్‌లోని ఛప్రా జిల్లా పర్సాఘడ్‌లోని ఓ స్కూల్లో బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గతేడాది డిసెంబర్లో ఓ కేసులో బాలిక తండ్రి జైలు పాలయ్యాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరైన ఓ క్లాస్మేట్ ఓదార్చినట్లు నటించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్స్‌పాల్, మరో ఇద్దరు టీచర్లు సహా ఐదుగురు విద్యార్థులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారికి జత కలిసిన మరికొందరు విద్యార్థులు అప్పటి నుంచి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ ఏడు నెలలుగా మృగవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ మధ్యే తండ్రి జైలు నుంచి విడుదల కావటంతో జరిగిన దారుణాన్ని అతనికి చెప్పుకుని కూతురు విలపించింది. దీంతో ఎక్మా పోలీస్ స్టేషన్లో తండ్రిసాయంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రిన్సిపాల్‌తోపాటు ఓ టీచర్‌ను, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు అధికారి అజయ్‌కుమార్ సింగ్ వెల్లడించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం తరలించిన అధికారులు.. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు. -
మంద్సౌర్ కేసు: దిగ్భ్రాంతికర అంశాలు
భోపాల్ : సంచలనం సృష్టించిన మంద్సౌర్ గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసులు దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడించారు. ఈ దారుణం ముందుగానే అనుకుని.. ప్లాన్ ప్రకారం జరగలేదని, అప్పటికప్పుడు దుష్టుల బుర్రలో పుట్టిన ఆలోచన అని పోలీసులు అధికారులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఆసిఫ్(24), ఇర్ఫాన్(20) పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. జరిగిన దారుణం గురించి ఇచ్చిన నిందితుడు ఇర్ఫాన్ నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. ‘ఈ సంఘటన జరిగిన రోజున బాలిక పాఠశాల ఆవరణలో ఒంటరిగా నిల్చుని ఉంది. ఆ సమయంలో ఇర్ఫాన్ అక్కడి నుంచే వెళ్లాడు. అక్కడ ఒంటరిగా ఉన్న బాలికను చూశాడు. మరో పది నిమిషాల తర్వాత ఇర్ఫాన్ అక్కడికి వచ్చేటప్పటికి కూడా ఆ బాలిక ఇంకా అక్కడే ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. దాంతో ఇర్ఫాన్ ఆ బాలిక దగ్గరకు వెళ్లి మిఠాయిలు కొనిపిస్తానని నమ్మబలికి చిన్నారిని తనతో తీసుకెళ్లాడు. బాలికను తీసుకెళ్తున్న సమయంలో ఎవరైనా ఈ విషయం గురించి అడిగితే స్కూల్ అయిపోయినా బాలికను తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదని.. అందుకే తాను బాలికను ఇంటికి తీసుకెళ్తున్నాను చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం బాలికను పాఠశాల వెనక ఉన్న పాడుబడిన లక్ష్మీదర్వాజ అనే బిల్డింగ్‌కు తీసుకెళ్లాడు. తర్వాత తన స్నేహితుడు ఆసిఫ్‌కు ఫోన్ చేశాడు. అనంతరం వారు దారుణంగా ఆ చిన్నారిని అత్యాచారం చేసి గొంతు కోశార’ని పోలీసులు తెలిపారు. అయితే ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తెలపగా, నిందితులు మాత్రం తాము ఇద్దరమే అని చెప్పారు. -
మాందసౌర్ ఘటన : మరో పిడుగులాంటి వార్త
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఇటీవల ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఇద్దరు వ్యక్తులు అత్యంత కిరాతంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన మరునాడే ఇద్దరు నిందితులను ఆసీఫ్(24), ఇర్ఫాన్(20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు బాధిత బాలిక తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూతురి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్న బాధితురాలి తల్లిదండ్రులు పిడుగులాంటి ఈ వార్తతో తమ కూతురి భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా నిందితుడు ఇర్ఫాన్ తల్లి తన కుమారుడికి అండగా నిలిచారు. తన కుమారుడు అమాయకుడని, తను ఎలాంటి తప్పు చేసి ఉండడని ఆమె తెలిపారు. సీబీఐతో విచారణకు సిద్ధమని, విచారణలో తన కుమారుడు తప్పు చేసినట్లు రుజవైతే ఎలాంటి శిక్షకైన సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. అయితే నిందితుడు ఇర్ఫాన్ మూడు రోజుల పాటు రిమాండ్‌లో ఉంచనున్నట్లు పోలీసులు తెలిపారు. -
అతడి తల నరికి తెస్తే 5 లక్షలు : బీజేపీ నేత
భోపాల్ : మంద్సౌర్ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడి తల నరికి తెస్తే ఐదు లక్షలు ఇస్తానంటూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత సంజీవ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు లేదా ప్రభుత్వం ఆ పని చేయలేకపోతే.. అతని తల నరికి తెచ్చిన వారికి నేనే 5 లక్షలు ఇస్తా అని సంజీవ్ మిశ్రా అన్నారు. కాగా, సంజయ్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. మంద్‌సౌర్‌లో 8 ఏళ్ల బాలికపై జరిగిన రేప్‌పై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇప్పటికే స్పష్టం చేశారు. బాధిత చిన్నారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చారు. అయితే ఆ డబ్బు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. తనకు డబ్బు అవసరం లేదని, నిందితున్ని ఉరి తీయాలని ఆ చిన్నారి తండ్రి డిమాండ్ చేశారు. -
మీకోసమే వచ్చారు.. కృతజ్ఞతలు తెలపండి!
ఇండోర్: అసలే కుమార్తెపై అఘాయిత్యంతో కుమిలిపోతున్న తల్లిదండ్రులతో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అమానవీయంగా ప్రవర్తించారు. ‘మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన ఎంపీకి కృతజ్ఞతలు తెలపండి’ అంటూ తీవ్రమైన బాధలో ఉన్న కుటుంబసభ్యుల్ని ఆదేశించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మంద్‌సౌర్‌లో జూన్ 26న ఓ మైనర్ బాలిక(8)పై ఇద్దరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఇండోర్ ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సుదర్శన్ గుప్తా, మంద్సౌర్ ఎంపీ సుధీర్‌తో కలసి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అత్యుత్సాహం చూపిన ఎమ్మెల్యే సుదర్శన్.. ‘ఎంపీ సుధీర్‌కు కృతజ్ఞతలు తెలపండి. ఆయన మిమ్మల్ని కలుసుకునేందుకే ప్రత్యేకంగా ఆస్పత్రికి వచ్చారు’ అని చెప్పారు. దీంతో తెల్లబోయిన బాధితురాలి తల్లిదండ్రులు ఇద్దరికీ చేతులెత్తి దండం పెట్టారు. ఇంతలో మీడియాను గమనించిన సుదర్శన్.. ‘ఇంకేమైనా అవసరముంటే చెప్పండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన బాధితురాలి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు మైనర్ బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది. -
మాందసౌర్ ఘటన; బీజేపీ నేతల అత్యుత్సాహం
భోపాల్ : ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన మృగాళ్ల అకృత్యాలను మాత్రం అడ్డుకోలేక పోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ భారత్ మహిళలకు చాలా ప్రమాదకరమైన దేశంగా గుర్తించింది. ఒక వైపు ఈ విషయం గురించి ఆందోళనలు జరుగుతుంటే...మరో వైపు మృగాళ్లు మాత్రం వీటిని ఏ మాత్రం లెక్క చేయకుండా తమ అకృత్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే మధ్యప్రదేశ్, మాందసౌర్‌లోని ఓ ఎనిమేదళ్ల చిన్నారిని ఇర్ఫాన్(20) అనే వ్యక్తి అపహరించి అత్యంత దారుణంగా అత్యచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలాంటి దారుణాలను అరికట్టలేని నాయకులు, జరాగాల్సిన నష్టం జరిగాక, తీరిగ్గా పరామార్శల పేరుతో వచ్చి బాధితులను మరింత ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఇండోర్‌లో జరిగింది. మాందసౌర్‌లో గ్యాంగ్‌రేప్‌కు గురై, తీవ్ర గాయలతో బాధపడుతున్న బాలికను మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే సదరు బాలికను సందర్శించడానికి బీజేపీ మంత్రి సుధీర్ గుప్తా ఆస్పత్రికి వచ్చారు. ఆయన రాకకు మురిసిపోయిన ఆ పార్టీ నాయకులు కొందరు మంత్రి గారేదో మహా ఘనకార్యం చేసినట్లు భావించారు. ఆ ఆనందంలో సుదర్శన్ గుప్తా అనే ఓ బీజేపీ నాయకుడు ‘మీ అమ్మాయిని కలవడానికే మంత్రిగారు ఇంత దూరం వచ్చారు. వెళ్లండి, వెళ్లి ఆయనకు ధన్యవాదాలు తెలపండి’ అంటూ బాధితురాలి కుటుంబ సభ్యులకు చెప్పాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు మంత్రి గారి దగ్గరకు వెళ్లి చేతులు కట్టుకుని నిల్చుని ధన్యవాదాలు తెలిపారు. ఈ మొత్తం తతంగాన్నంతా ఎవరో వీడియో తీసారు. ఈ వీడియో కాస్తా లీక్ అవడంతో వీడియోలోని బీజేపీ నాయకున్ని తీవ్రంగా వియర్శిస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాందసార్ ఘటనపై స్పందిస్తూ నిందుతులను ఉరి తీయాలని చెప్పడం తెలిసిందే. -
ఆగని అత్యాచారాల పర్వం
రాంచీ/న్యూఢిల్లీ/గ్వాలియర్: ప్రభుత్వం ఎన్నిచట్టాలు తీసుకొస్తున్నా దేశంలో కామాంధుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా జార్ఖండ్‌లో ఓ ఎన్జీవో సంస్థకు చెందిన ఐదుగురు మహిళల్ని దుండుగులు ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడగా.. మధ్యప్రదేశ్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్యచేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ఓ మైనర్ బాలికపై 10 మంది నీచులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వలసలు, మనుషుల అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు 11 మందితో కూడిన ఓ ఎన్జీవో బృందం ఈ నెల 19న జార్ఖండ్‌లోని కుంతి జిల్లా ఛోఛంగ్ గ్రామానికి వెళ్లి వీధి నాటకాన్ని ప్రదర్శించింది. ఇంతలో అక్కడికి బైక్‌లపై వచ్చిన దుండగులు తుపాకీ గురిపెట్టి ఐదుగురు మహిళల్ని సమీపంలోని అటవీప్రాంతానికి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని మొబైల్ ఫోన్లతో రికార్డు చేసి పోలీసులకు చెబితే ఈ వీడియోలను వైరల్ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై డీఐజీ అమోల్ హోమ్కర్ మాట్లాడుతూ.. గ్యాంగ్‌రేప్‌కు సంబంధించి తమకు ఫిర్యాదులేవీ అందలేదని తెలిపారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుకున్న సమాచారం ఆధారంగా 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు జాతీయ మహిళా కమిషన్(ఎన్డబ్ల్యూసీ) ముగ్గురు సభ్యుల విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు బొకారో జిల్లాలో ఓ మైనర్ ఆదివాసీ బాలికపై నలుగురు యువకులు గురువారం గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. మైనర్ బాలిక రేప్,హత్య.. తల్లిదండ్రులతో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆరేళ్ల చిన్నారిపై మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గుర్తుతెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా గొంతునులిమి హత్యచేశాడు. అర్థరాత్రి సమయంలో బాలిక నీళ్లు తాగేందుకు వెళ్లింది. ఎంతసేపయినా రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు గాలింపు చేపట్టగా వివాహ వేదికకు సమీపంలో బాలిక మృతదేహం లభ్యమైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక(15)పై 10 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. జహంగీరాబాద్ సర్కిల్ అధికారి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి సోమవారం ఓ వివాహ వేడుకకు హాజరయిందని తెలిపారు. ఇంతలో బాలికకు పరిచయమున్న ఇద్దరు వ్యక్తులు సమీపంలోని పుణ్యక్షేత్రానికి వెళ్దామంటూ బాధితురాలిని బైక్‌పై ఎక్కించుకున్నారు. అనంతరం వీరితో పాటు మరో 8 మంది దుండగులు మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. నిందితులపై ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అస్సాంలోని కోక్రాఝర్‌లో ఆరేళ్ల బాలికపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. -
యువతిపై సామూహిక అత్యాచారం
సాక్షి, గుంటూరు : యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లాలోని నెహ్రూనగర్‌లో చోటుచేసుకుంది. నల్లచెరువుకు చెందిన యువతిని కిడ్నాప్ చేసిన రఫీ అనే ఆటో డ్రైవర్ స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. కీచకుల బారినుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతినిల ఆస్పత్రికి తరలించారు. -
దారుణాతి దారుణం.. గ్యాంగ్ రేప్
రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు చోచాంగ్ గ్రామానికి వచ్చిన ఓ ఎన్జీఓ బృందానికి చెందిన ఐదుగురు మహిళలపై దుండగులు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు. వలసలు, మానవ అక్రమ రవాణాలపై అవగాహన కల్పించేందుకు 11 మంది సభ్యులతో కూడిన ఎన్జీఓ బృందం గ్రామానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దుండగులు బృందంలోని పురుషులను చితకబాది ఐదుగురు మహిళలను సమీప అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి తుపాకీ గురిపెట్టి లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. నిందితులను గుర్తించిన పోలీసులు ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారని డీఐజీ అమోల్ వీ హోంకర్ తెలిపారు. లైంగిక దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు ఘటనపై అధికారులకు తెలియపరచలేదని, తమకు అందిన సమాచారం మేరకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. బాధిత మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. -
కిడ్నాప్ చేసి.. సామూహిక అఘాయిత్యం
మండ్య: దేవాలయానికి వెళ్లిన మహిళను అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘోరం మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీరంగ పట్టణం సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన మహిళ ఈ నెల 4వ తేదీన సమీపంలో ఉన్న కరిఘట్ట దేవాలయానికి వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన సంజయ్, బిడ్డా, రమేష్ ముగ్గురు కలిసి మహిళను కారులో ఎత్తుకెళ్తారు. సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకోని వెళ్ళి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, చెబితే అందరికీ చిత్రాలు పంపిస్తామని, తాము పిలిచినప్పుడల్లా వచ్చి కోరిక తీర్చాలని హెచ్చరించారు. దాంతో బాధిత మహిళ వారి వేధింపులను తట్టుకోలేక బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపింది. దీంతో వారు బాధితురాలితో కలిసి శ్రీరంగ పట్టణం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు నిందితులపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. పాతకక్షల కారణంగానే మహిళ పైన ఈ ముగ్గురు ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తుందని పోలీసులు తెలిపారు. దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
దారుణం : విషం ఇచ్చి మరీ అత్యాచారం..
చండీగఢ్: హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. పదోతరగతి చదువుతోన్న ఓ విద్యార్థికి విషం ఇచ్చి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి మైనర్, మరో ఇద్దరు బాధితురాలికి బంధువులు కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేహాబాద్ జిల్లాలోని భట్టుకలాన్ గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు దుండగులు మంగళవారం కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అనంతరం ఆమెను ఊరి చివర ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న మరో వ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమెకి విషం ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ కోల్పొంది. అనంతరం ఆమెను ఇంటికి సమీపంలో వదిలి పారిపోయారు. కాగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తమ కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. కూతురు ఆచూకీ కోసం వెతికారు. ఇంతలోనే ప్రాణప్రాయ స్థితిలో ఉన్న కూతురిని ఇంటి ముందు చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. కాగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గిరిలో మైనర్ బాలుడిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు తప్పించుకున్నారని, హరియాణా డీఎస్పీ(హెడ్‌క్వార్టర్స్) గురుదయాళ్ సింగ్ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
రేణిగుంటలో దారుణం
తిరుపతి క్రైం : రేణిగుంట సమీపంలో నక్కల కాలనీలో ఓ వృద్ధురాలిపై కొందరు అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఎస్పీ అభిషేక్ మొహంతికి సోమవారం ఫిర్యాదు చేశారు. నక్కలకాలనీకి చెందిన వృద్ధురాలు(60)కు అన్బెగన్, అలీ (27) ఇద్దరు కుమారులు ఉన్నారు. అలీ తన సమీప బంధువైన తిరుత్తణికి చెందిన ఎలాంగిన్ శంకర్ కుమార్తెను ప్రేమించాడు. తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు. బాలికకు వేరే పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాలిక, అలీ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు ఈ నెల 22న రేణిగుంటలోని అలీ ఇంటిపై దాడి చేసి అతని తల్లిని వివస్త్ర ను చేసి వాహనంలో తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై బాలిక తండ్రి, కుమారుడు, మరో ఇద్దరు రోజూ అత్యాచారం చేశారు. అంతటితో ఆగక ఆమె కుమారుడికి ఫోన్ చేసి తన కుమార్తెను అప్పగించేంత వరకు అత్యాచారం చేస్తూనే ఉం టామని హెచ్చరించారు. దీంతో అలీ వెంటనే తిరుపతిలోని తమ నాయకుడు వేలిమురగన్ వద్దకు వచ్చి జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించాడు. ఆ నాయకుడు బాలిక తల్లిదండ్రులను పంచాయతీకి రావాలని కోరాడు. వారు తిరుత్తణి సరిహద్దుల్లో వృద్ధురాలిని వదిలిపెట్టామని తెలిపారు. అలీ కుటుంబ సభ్యులు తిరుత్తణి సరిహద్దులకు వెళ్లారు. ఇంతలో బాలిక తల్లిదండ్రులు తిరుపతికి చేరుకుని బాలికను తమతో పాటు తీసుకెళ్లారు. దీనిపై బాధితులు గాజులమండ్యం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
స్నేహితులతో కలిసి వాచ్‌మన్ దురాగతం
టీ.నగర్: చెన్నై టీ.నగర్లో సోమవారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి మహిళపై స్నేహితులతో కలిసి అత్యాచారం జరిపిన నేపాలి వాచ్‌మెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్ దేశానికి చెందిన వ్యక్తి (29) టీ.నగర్ సౌత్‌బోగ్ రోడ్డులో అపార్ట్మెంట్లో వాచ్‌మన్. ఇతనికి భార్య (25), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాచ్‌మన్ కావడంతో వ్యక్తి అదే అపార్ట్మెంట్లో మూడో అంతస్తులో ఇల్లు కేటాయించారు. పగలు అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా, రాత్రి సమీపంలోని ప్రైవేటు సంస్థలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు.త్వ్యక్తిబంధువైన నేపాల్ దేశానికి చెందిన వినోద్ (28) అతని పక్కనున్న భవనంలో వాచ్‌మన్. ఇదిలాఉండగా బాధిత వ్యక్తి సోమవారం రాత్రి ప్రైవేటు సంస్థలో పనికి వెళ్లాడు. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ సమయంలో వినోద్ స్నేహితులు అరుణ్‌కుమార్, జయచంద్రన్‌తో కలిసి ఇంటి డాబాపై మద్యం తాగారు. అనంతరం ముగ్గురు బాధిత వ్యక్తి ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. భర్త వచ్చి ఉంటాడని భావించి భార్య తలుపు తీసింది. ముగ్గురు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించారు. అమె గట్టిగా కేకలు వేయడంతో ఆగ్రహించి నిద్రిస్తున్న బిడ్డలను హతమారుస్తానని బెదిరించి ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త వచ్చిన తరువాత బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. దీనిపై భార్యతో కలిసి మాంబళం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వినోద్‌ను అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నారు. -
మేనమామ కుమారులే తనపై..
కర్ణాటక, ముళబాగిలు: మేనమామ కుమారులే తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి స్వయంగా రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై తాలూకాలోని మల్లనాయకనహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని బసవరాజపుర గ్రామానికి చెందిన ఆర్ హరీష్(28), ఆర్ మెహన్(24)లను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు..గత మార్చి నెల 3న తాలూకాలోని బసవరాజపుర గ్రామానికి చెందిన యువతి తన సంబంధీకుల ఇల్లు కన్నెత్త గ్రామానికి వచ్చింది. ఆ సమయంలో తన మామ కుమారులైన హరీష్, మోహన్లతో పాటు వారి స్నేహితులు ముగ్గురు ఇంట్లోకి ప్రవేశించి తనపై సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఎస్పీ రోహిణి కటౌచ్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాధితురాలిని కోలారులోని ఎస్ఎన్ఆర్ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. దాదాపు రెండు నెలల క్రితం జరిగిన ఘటన అనంతరం బాధితురాలు మానసిక దిగ్భ్రాంతికి గురై రైలులో ఉత్తరభారత దేశానికి వెళ్లి అనంతరం తిరిగి వచ్చి ఫిర్యాదు చేసింది. ఆరోపణలు తిరస్కరిస్తున్న గ్రామస్తులు : అయితే బాధితురాలు చేస్తున్న ఆరోపణలను గ్రామస్తులు తిరస్కరిస్తున్నారు. గ్రామంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకోలేదని మేనమామల నుంచి సదరు యువతి పలుమార్లు డబ్బులు తీసుకు వెళ్లేదని, మరోమారు డబ్బులు ఇవ్వనందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని గ్రామస్తులు అంటున్నారు. -
ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
పశ్చిమగోదావరి, తణుకు : తెలిసీ తెలియని వయసు.. సినిమాలు, సెల్ఫోన్ల ప్రభావం.. ఆ బాలలను దారితప్పేలా చేసింది. ఫలితంగా అభంశుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టించింది. తణుకు మండలం తేతలి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. అ«ఘాయిత్యానికిపాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత బాలికను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తేతలి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక తణుకు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. శుక్రవారం సాయంత్రం చిన్నారి అమ్మమ్మ ఇంటి సమీపంలోని పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ ఉండగా నలుగురు మైనర్ బాలలు ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆడుకుందాం రా అని తేతలి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఆడుకుంటున్న బాలికకు సమీపంలో నివాసం ఉంటున్న ఎనిమిది, నాలుగు, రెండో తరగతి చదువుతున్న ఇద్దరు మొత్తం నలుగురు మైనర్ బాలలు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తొలుత జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఆడుకుంటున్న చిన్నారితో కాసేపు ఆడుకున్న వీరంతా ఇక్కడ కాదు అంటూ సమీపంలోని ఒకటో నెంబరు ప్రాథమిక పాఠశాల వద్దకు తీసుకెళ్లారు. పాఠశాల వెనుక ప్రాంతానికి తీసుకెళ్లిన వీరంతా ఆ బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడుస్తున్న ఆమెను కొద్దిసేపు అక్కడే ఉంచి అనంతరం ఇంటికి పంపించి వేశారు. ఏడుస్తూ ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని అమ్మమ్మ, పెద్దమ్మతో చెప్పింది. దీంతో అఘాయిత్యానికి పాల్పడిన బాలల ఇళ్లకు వెళ్లిన చిన్నారి బంధువులు వారితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై సీహెచ్‌వీ రమేష్ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలిక నుంచి స్టేట్మెంట్ తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, తణుకు సీఐ కేఏ స్వామి తేతలిలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వికటించిన ‘పంచాయితీ’ తేతలి గ్రామంలో చోటుచేసుకున్న అఘాయిత్యం ఆ నోటా ఈ నోటా గ్రామం అంతా పాకింది. ఇదే సమయంలో అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు బాలలకు చెందిన కుటుంబ సభ్యులు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, సర్పంచి కోట నాగేశ్వరరావు వద్దకు చేరుకున్నారు. తమ పిల్ల లను కాపాడాలని కోరడంతో బాధిత బాలిక తల్లిదండ్రులతో శుక్రవారం సాయంత్రం గ్రామంలో ‘పంచాయితీ’ ఏర్పాటు చేశారు. ఇరువర్గాలను కూర్చోబెట్టి మాట్లాడుతున్న క్రమంలో మీడియా అక్కడకు చేరుకోవడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అక్కడే ఉన్న నలుగురు బాలలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధిత బాలికను తొలుత పోలీసు స్టేషన్‌కు తరలించి అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యాచారం కేసు నమోదు : కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తేతలి గ్రామంలో మైనర్ బాలికపై నలుగురు బాలురు అత్యాచారం చేశారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. తేతలిలో సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతోపాటు బాధిత బాలిక, తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలిక నుంచి సేకరించిన వివరాలు మేరకు నలుగురు బాలురపై 376 సెక్షన్ కింద అత్యాచారం కేసు నమోదు చేశామన్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వచ్చిన రిపోర్టులు ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. -
కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి మహిళపై అత్యాచారం
సేలం: భర్తకు దూరంగా ఉంటున్న మహిళను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, పర్యాటక ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం కలిపిన శీతలపానీయం తాగించి అత్యాచారం చేసిన ముగ్గురు యువకులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ధర్మపురి జిల్లా అరూర్ తాలూకా మొరప్పూర్ గ్రామానికి చెందిన మహిళ (25) వివాహిత. భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటోంది. ఆమెకు తండ్రి లేడు, తల్లి మూగ. ఈ స్థితిలో తాత అనారోగ్యం కారణంగా 20 రోజుల కిందట సేలం జీహెచ్‌లో చేరారు. ఆయన కోసం మహిళ ఆస్పత్రికి వెళ్లి వచ్చేది. ఆస్పత్రిలో సేలం సమీపం అలగాపురానికి చెందిన నయీమ్ (25)తో పరిచయం ఏర్పడింది. గత 29న నయీమ్ ఆమెతో ప్రేమిస్తున్నట్టు, పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. తర్వాత ఆమెను సేలం, ఏర్కాడు ప్రాంతాలకు తీసుకెళ్లి చత్తిరంలోని లాడ్జిలో దిగారు. ఆమెకు మద్యం కలిపిన శీతలపానీయాన్ని తాగించి నయీమ్, అతని సోదరుడు నఫీస్ (29), స్నేహితుడు రంజిత్ అత్యాచారం చేశారు. మత్తు నుంచి మేల్కొన్న తర్వాత ఆమెను కత్తితో బెదిరించి మళ్లీ అత్యాచారం చేశారు. ఆమె వద్ద నుంచి ఏటీఎం కార్డు తీసుకుని రూ.30వేలు నగదు డ్రా చేశారు. విషయం బయటకుచెబితే ఆమె తల్లిని హత్య చేస్తామని బెదిరిం చారు. అనంతరం వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు బుధవారం డైఫీ జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు చెప్పింది. ఆయన సహాయంతో గురువారం సేలం కమిషనర్ శంకర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి గురువారం నయీమ్, నఫీస్, రంజిత్‌లను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది. -
మదర్సాలో అత్యాచారం.. మౌల్వీ అరెస్ట్
లక్నో: కథువా, సూరత్, ఉన్నావ్ ఘటనలు మరిచిపోక ముందే మరో అఘాయిత్యం చర్చనీయాంశంగా మారింది. పదేళ్ల బాలికను మదర్సాలోకి లాక్కెల్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన యూపీని కుదిపేస్తోంది. ఈ ఘటనతో ఘజియాబాద్‌లో అలజడి చెలరేగగా.. ఆందోళనకారుల డిమాండ్‌తో మదర్సా మౌల్వీ.. గులామ్ షాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ కమిషనర్(క్రైమ్‌బ్రాంచ్)రామ్ గోపాల్ నాయక్ ధృవీకరించారు. అసలేం జరిగింది... ఏప్రిల్ 21న ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ యువకుడు ఆమెను ఆటోలో తీసుకెళ్లటం పోలీసులు గుర్తించారు. ఆ టీనేజర్ బాలిక కుటుంబానికి తెలిసిన వ్యక్తే. దీంతో అతని ఫోన్ కాల్ ఆధారంగా మదర్సాపై మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో టీనేజర్, మౌల్వీతోపాటు మరో ఇద్దరు అక్కడ ఉన్నారు. ఆ బాలికను చాపలో చుట్టి ఉంచారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు గుర్తించిన పోలీసులు.. ఆమె నుంచి వాంగ్మూలం సేకరించి టీనేజర్‌ను అరెస్ట్ చేశారు. మౌల్వీ అరెస్ట్‌కు డిమాండ్.. ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఒక్కసారిగా మతం రంగు పులుముకుంది. బుధవారం చిన్నగా మొదలైన ఆందోళనలు శుక్రవారం ఉదయానికి తారా స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మౌల్వీని అరెస్ట్ చేయాలంటూ హిందూ అతివాద సంఘాలు ధర్నాలు చేపట్టాయి. హైవేలను దిగ్భందించి నిరసనలు తెలిపాయి. చివరకు బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ.. సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. పరిస్థితులు చేజారుతుండటంతో శుక్రవారం సాయంత్రం గులామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నా భర్త అమాయకుడు.. అయితే పోలీసులు మదర్సాపై దాడి చేసిన సమయంలో తన భర్త అక్కడ లేడని మౌల్వీ భార్య మీడియాకు చెబుతున్నారు. ఘటన వెలుగులోకి వచ్చాక కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ తమ ఇంటిపై దాడి చేశారని.. తన భర్తను తగలబెడతామని బెదిరించారని ఆమె తెలిపారు. శుక్రవారం ఉదయం ఇంటిపై దాడి జరగ్గా.. సాయంత్రానికి పోలీసులు వచ్చి తన భర్తను అరెస్ట్ చేశారని ఆమె వివరించారు. మరోవైపు బాలిక వాంగ్మూలంపై పోలీసులు స్పష్టత ఇవ్వకపోవటంతో అనుమానాలు నెలకొన్నాయని మౌల్వీ భార్య చెబుతోంది. తన భర్త అమాయకుడని.. ఆయన్ని అనవసరంగా ఇరికించాలని చూస్తున్నారని ఆమె అంటోంది. -
క్యాబ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీ : క్యాబ్ బుక్ చేసుకున్న యువతిపై ఆ క్యాబ్ డ్రైవర్‌తో పాటు, తోటి ప్రయాణికుడు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. బాధిత మహిళ సెక్టార్ 126 నుంచి నోయిడాకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. అయితే అంతకుముందే ఆ కారులో వేరే ప్రయాణికుడు ఉండటంతో ఆమె అందులో వెళ్లేందుకు నిరాకరించారు. అతడు దగ్గర్లోనో దిగిపోతాడు అని డ్రైవర్ చెప్పడంతో నమ్మి ఆమె క్యాబ్ ఎక్కింది. అయితే ఇదే అదనుగా భావించిన క్యాబ్ డ్రైవర్ కారును జర్చా అటవీ ప్రాంతానికి తరలించాడు. ఆమెకు బలవంతంగా మద్యం పట్టించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అత్యాచారంతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మహిళపై సామూహిక అత్యాచారం?
ఆదిలాబాద్‌రూరల్: వైద్యం పేరిట నమ్మించి తీసుకొచ్చిన మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మహిళ నుంచి డబ్బుల వసూలుకు ఒత్తిడి తేచ్చి నగ్నంగా ఉన్న ఫొటోలు బయటపెడతామంటూ బెది రించడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచా రం మేరకు.. ఆదిలాబాద్ మండలంలోని ఓ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ చర్మవ్యాధితో బాధపడుతోంది. వ్యాధి నయం చేయిస్తామని మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు కారులో ఆదిలాబాద్ మండలంలోని ఓ పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి తీసుకొచ్చారు. మత్తు నీళ్లు తాగించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పే ర్కొంది. మహారాష్ట్రకు చెందిన వ్యక్తులతోపాటు స్థానికులైన ఒకరిద్దరు కలిసి మహిళపై సామూహిక అత్యాచారం చేసినట్లు తెలిసింది. మహారాష్ట్ర నుంచి రావడానికి రవాణా ఛార్జీ కింద రూ.7వేలు సద రు మహిళ తన బ్యాంకు ఖాతా నుంచి ఇచ్చినట్లు సమాచారం. మళ్లీ రూ.25 వేలు అవసరమని ఫోన్ ద్వారా డిమాండ్ చేసినట్లు తెలిసింది. తన వద్ద లేవని సదరు మహిళ చెప్పడంతో నగ్నంగా తీసిన ఫొటోలు అందరికీ పంపిస్తామంటూ మెసేజ్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని బాధిత మహిళ తనకు తెలిసిన ఓ వ్యక్తికి వివరించడంతో వారు పోలీస్‌స్టేష న్కు తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరాలు అడుగగా.. దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. -
బాలికపై ముగ్గురు యువకులు దారుణం
గౌహతి : ఐదో తరగతి చదువుతున్న బాలికపై సామూహిక లైంగికదాడి జరిగింది. ముగ్గురు యువకులు లైంగిక దాడి చేసి, అనంతరం కిరోసిన్ పోసి నిప్పటించారు. ఈ దుర్ఘటన అస్సాంలోని నాగోన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతి చదువుతున్న బాలిక స్కూల్ అయిపోగా ఇంటికి తిరిగొచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు. దాంతో అదే పాఠశాలకు చెందిన ముగ్గురు ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగికదాడి చేశారు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. అది గమనించిన ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకున్నారు. అప్పటికే 90శాతం కాలిన గాయాలు అవడంతో ప్రాణాలు పోయాయి. కాగా, ఇంతటి దారుణానికి పాల్పడిన ఆయన ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు జువైనల్స్ అని పోలీసులు పేర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకే గ్రామానికి చెందినవారని ,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఐదేళ్ల బాలికను పైశాచికంగా..
థానే : మహారాష్ట్రలోని థానేలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై సామూహిక అత్యచారం జరిగింది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బాలికపై అతి పైశాచికంగా అత్యచారానికి పాల్పడినట్లు వైద్యులు తెలిపారు. ఓ బాలిక రోడ్డుపై ఏడుస్తుండగా ఒక వ్యక్తి ఆ బాలికను థానే పోలీస్‌స్టేషన్‌కి తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించాడు. అనుమానం వచ్చిన పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రాజస్తాన్‌లో గ్యాంగ్‌రేప్
కోటా : రాజస్తాన్‌లోని బరన్ జిల్లాలో మృగాళ్లు రెచ్చిపోయారు. బంధువుల ఇంటికెళుతున్న ఓ మహిళ(40)పై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ దారుణాన్ని మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. ఈ వీడియోను నిందితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించారు. రాజస్తాన్‌లోని కోటాలో ఓ డాబాలో పనిచేస్తున్న బాధితురాలు ఫిబ్రవరిలో బంధువుల్ని కలుసుకునేందుకు బరన్‌కు చేరుకున్నారు. అక్కడ బాధితురాలికి పరిచయమున్న చేతన్(21) ఆమెను బంధువుల ఇంటి దగ్గర దింపుతానని చెప్పి బైక్‌పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం చేతన్ ఇచ్చిన సమాచారంతో మరో ఐదుగురు యువకులు అక్కడకు చేరుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని నిందితులు మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. అనంతరం మరుసటి రోజు బాధితురాలిని బంధువుల ఇంటి వద్ద వదిలిన యువకులు.. ఈ సంగతి ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు బరన్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 5న ఫిర్యాదు చేశారు. దీంతో దుండగులపై ఐపీసీ సెక్షన్ 376తో పాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరికోసం గాలిస్తున్నారు. -
లైంగిక దాడి చేస్తే ఇక ఉరే
సాక్షి, రాజస్థాన్ : రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్లపై లైంగిక దాడికి పాల్పడితే మరణశిక్ష విధించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును శుక్రవారం ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం పన్నెండేళ్లు అంతకంటే తక్కువ వయసు గల బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మరణ శిక్ష లేదా పద్నాలుగేళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష, లేదా 20 సంవత్సరాల యావజ్జీవ కఠిన కారాగార శిక్ష లేదా చనిపోయే వరకు జైల్లోనే ఉంచేందుకు అవకాశం కల్పించారు. రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ ఈ బిల్లును (క్రిమినల్ లా బిల్లు-2018) ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. దేశంలో మధ్యప్రదేశ్ తర్వాత ఇలా ప్రత్యేకంగా చట్టం చేసింది తాజగా రాజస్థానే. మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. -
టెన్త్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
సాక్షి, బెంగళూరు (విజయపుర): విజయపుర జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని (15)పై కొందరు దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడి, ఆ ఘోరం బయటపడకుండా హత్య చేయబోయారు. బాలిక రోజూ మాదిరి స్కూల్ ముగించుకుని సాయంత్రం 4:30 సమయంలో ఇంటికి బయలుదేరగా, నలుగురు దుండగులు బాలికను బలవంతంగా అరటి తోటలోకి ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. కుమార్తె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి వెతుకుతూ అరటి తోట వద్దకు చేరుకున్నాడు. అక్కడ కుమార్తె హాహాకారాలు విని పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఆయన వెళ్లేటప్పటికే బాలికను అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి దుండగులను తరిమికొట్టడంతో పాటు వీరేశ్ అనే నిందితున్ని పట్టుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌కు చెందిన బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందిన 12 గంటల్లోనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఆదిలాబాద్ డీఎస్పీ కే.నర్సింహారెడ్డి సోమవారం స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం ఇంద్రవెల్లికి చెందిన రాథోడ్ సంజీవ్(30) బాలికకు ఫోన్లో మాయమాటలు చెప్పడంతోపాటు ఆమె స్నేహితురాలు తనతోనే ఉందంటూ నమ్మబలికాడు. ఆదిలాబాద్‌లోని స్టార్ మెడికల్ దగ్గరికి పిలుపించుకున్నాడు. సంజీవ్ తన స్నేహితులైన ఉట్నూర్‌కు చెందిన కే.విశాల్(35), ఇంద్రవెల్లికి చెందిన కే.విజయ్ ప్రకాశ్(35)లతో కలిసి కార్లో ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి రోడ్డు ప్రాంతంలో ఉన్న జి.సంతోష్(30) ఫాం హౌజ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ నలుగురూ కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక డయల్ 100కు ఫోన్‌చేసి వివరించగా, వెంటనే రంగంలోకి దిగిన పట్టణ సీఐ వి.సురేష్, ఎస్సై ఎంఏ బాకి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. పట్టణ పోలీసుస్టేషన్లో అత్యాచారం కింద కేసు నమోదు చేయగా, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఆదేశాల మేరకు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి ఫిర్యాదు ఇవ్వగా, 12 గంటల్లోనే ఈ కేసును ఛేదించినట్లు వివరించారు. నాలుగు సెల్ఫోన్లు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కేసును త్వరగా ఛేదించిన సీఐ, ఎస్సైలను ఎస్పీ ఈ సందర్భంగీఆ అభినందించారు. -
వికారాబాద్‌లో గ్యాంగ్‌రేప్
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం ఇబ్రహీంపూర్ తాండాలో దారుణం చోటుచేసుకుంది. గిరిజన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొలం పనికి వెళ్లి వస్తుండగా యువకులు బాలికను అడ్డగించి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్, వీడియో తీసి..
పట్నా : ఆరుగురు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. బిహార్ లో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా రేప్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. జనవరి 31 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా మంగళవారం రాత్రి వెలుగు చూసింది. ఈ సంఘటన బోజ్ పుర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, రేప్ దృశ్యాలను మొబైల్ లో రికార్డు కూడా చేశారు. అక్కడితో ఆగకుండా వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేశారు. గ్యాంగ్ రేప్ వీడియో వైరల్ అవ్వడంతో ఈ విషయం బాధితురాలి తండ్రికి తెలిసింది. బాధితురాలి తండ్రి పాట్నాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరా మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆరుగురు యువకులు తన కూతురిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురు బర్హరా పోలీస్ స్టేషన్ సమీపంలో బహిర్భూమికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికని వైద్యపరీక్షల కోసం సదర్ ఆసుపత్రికి తరలించినట్టు అరా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పూనమ్ కుమారి చెప్పారు. నిందితుల్లో ఒకడైన క్రిష్ణా యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు, మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పూనమ్ తెలిపారు. -
యువతిపై అత్యాచారం
అనంతపురం సెంట్రల్: ప్రియుడితో కలిసి షికారుకెళ్లిన ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన గురువారం ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు వర్గాలు తెలిపిన మేరకు... హిందూపురానికి చెందిన ఓ యుతి అనంతపురంలో ఉంటూ చదువుకుంటోంది. చిన్ననాటి స్నేహితుడితో కలిసి ఆత్మకూరు మండలం పంపనూరు దేవాలయానికి గురువారం వెళ్లింది. దారి మధ్యలో ఆగి కబుర్లు చెప్పుకుంటుండగా ఇద్దరు యువకులు పోలీసులమంటూ అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? పోలీసు స్టేషన్‌కు పదండంటూ బెదిరించారు. బెదిరిపోయిన ఆ యువతిని తమ బైక్‌లో ఓ వ్యక్తి ఎక్కించుకొని ఆత్మకూరు వైపు వెళ్లాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత చెట్లపొదల్లోకి తీసుకు పోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి బా«ధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం నిందితులను గుర్తించినట్లు తెలిసింది. సదరు నిందితులు గతంలో గొర్రెల దొంగలుగా తేలింది. అయితే బాధిత యువతి ఫిర్యాదు చేయడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఏం చేయాలనే విషయంపై పోలీసు అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. అత్యాచారం కేసు నమోదు చేయకపోయినా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. రౌడీషీట్ కూడా ఓపెన్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. -
కుందులి ఘటనపై ఉలికిపాటు
భువనేశ్వర్: కొరాపుట్ జిల్లా కుందులి గ్రామంలో గ్యాంగ్‌రేప్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడిన బాలిక సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగినట్లు ప్రకటించిన విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. దీంతో మేలుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్న న్యాయ కమిషన్ పరిధిని విస్తరించాలని ఆదేశించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఉత్తర్వుల్ని జారీ చేశారు. లోగడ సామూహిక అత్యాచారంపట్ల న్యాయకమిషన్ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. తాజాగా ఆమె ఆత్మ హత్యకు పాల్పడడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో బాలిక ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల్ని ఆరా తీసే రీతిలో విచారణ జరపాలని న్యాయ కమిషన్ విచారణ పరిధి విస్తరణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా జడ్జి హోదా కలిగిన అధికారి న్యాయ విచారణ నిర్వహిస్తారు. కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ చట్టం–1952 పరిధిలో ఈ విచారణ కొనసాగుతుంది. కొరాపుట్ పోలీసులు నిర్వహిస్తున్న విచారణ బాధ్యతల్ని రాష్ట్ర క్రైం శాఖ చేపడుతుంది. స్థానిక పోలీసుల్ని విచారణ నుంచి తప్పిస్తారు. ఫోరెన్సిక్ వివాదమే కారణమా! కుందులిలో బాలికపట్ల సామూహిక అత్యాచారం సంఘటనపై వైజ్ఞానిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ జారీ చేసిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఈ సంస్థ రూపొందించిన ప్రాథమిక, తుది నివేదికల్లో పొంతన లేకుండా పోయింది. ప్రాథమిక నివేదికలో అత్యాచారానికి గురైన బాలిక లోదుస్తులపై వీర్యపు మరకల్ని గుర్తించారు. ఈ మరకలు ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు చెందినవిగా కూడా ధ్రువీకరించారు. తుది నివేదిక రూప కల్పనలో ఇటువంటి ఛాయలపట్ల ప్రస్తావన లేకపోవడంతో వివాదానికి బీజం పడింది. ప్రాథమిక నివేదికలో బాలికపట్ల సామూహిక అత్యాచారం సంకేతాలు స్పష్టం కాగా తుది నివేదికలో ఇటువంటిదేమీ లేనట్లు సూచించడం చర్చనీయాంశంగా మారింది. ఇంతలో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి న్యాయ కమిషన్ విచారణ పరిధిని విస్తరించి బాలిక ఆత్మహత్య ఉదంతాన్ని జోడించి విచారణ కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 22వ తేదీన బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు డీజీపీ సిఫారసు కుందులి బాలిక సామూహిక అత్యాచారం సంఘటనపై రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక వివాదాస్పదం అయింది. ఈ పరిస్థితుల్లో వివాదం తొలగించేందుకు ఈ నివేదికతో పాటు సామూహిక అత్యాచారం ప్రాథమిక సాక్ష్యాధారాల్ని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ(సీఎఫ్ఎస్ఎల్)కి సిఫారసు చేసినట్లు రాష్ట్ర డీజీపీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ బుధవారం తెలిపారు. రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదికలో తారతమ్యాలపట్ల నిగ్గు తేల్చేందుకు డీజీపీ లోగడ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని తొలగించేందుకు ఉన్నత స్థాయి పరీక్షల కోసం కోల్‌కత్తాలో పనిచేస్తున్న కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సిఫారసు చేసినట్లు సీఐడీ పోలీసు సూపరింటెండెంట్ వివరించారు. బాధిత బాలిక నమూనాల్ని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపేందుకు స్థానిక న్యాయస్థానం ముందస్తు అనుమతి పొందినట్లు డీజీపీ స్పష్టం చేశారు. ప్రాథమిక నివేదిక లీకేజీయే వివాదాలకు ప్రేరణ అత్యంత గోప్యంగా పదిల పరచాల్సిన రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక బట్టబయలైంది. పరీక్షలు నిర్వహించే బాధ్యతాయుతమైన నిపుణుల అధీనంలోనే ఈ నివేదిక వివరాలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక నివేదిక బహిరంగం కావడంతో ఆ విభాగం అవాక్కయింది. ఈ దిశలో విచారణ జరుగుతోంది. బాధ్యుల్ని గుర్తించిన మేరకు తగినస్థాయిలో చర్యలు చేపడతామని రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ డైరెక్టర్ లోగడ ప్రకటించారు. -
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
సాక్షి, ఒడిశా: తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని(14)పై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బౌద్ జిల్లా కాంటమాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోడిబాహల్ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత విద్యార్థిని తన మామ ఉండే గ్రామంలో ఓ వివాహానికి హాజరైంది. తన అత్తతో కలిసి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఊరి చివరకు వెళ్లింది. ఇది గమనించిన ఇద్దరు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు. -
న్యాయం దక్కలేదని తనువు చాలించింది..
సాక్షి, భువనేశ్వర్ : సామూహిక లైంగిక దాడికి గురైన మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనతో ఒడిషా అట్టుడికింది. ఈ ఉదంతంపై కాంగ్రెస్, బీజేపీ బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. పలు ప్రాంతాల్లో కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు విపక్షాలు డిమాండ్ చేశాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకు దిగిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 10న కోరాపుట్ జిల్లాలోని ముసగడ గ్రామంలో ఇంటికి వెళుతున్న బాలికను అటకాయించిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాలిక పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మంగళవారం ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు బాధితురాలి మృతి ప్రభుత్వ వైఫల్యమని బీజేపీ, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. ఘటనకు నిరసనగా సీఎం నవీన్ పట్నాయక్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. -
బహిర్భూమికి వెళ్లిన నిండు గర్భిణిపై.!
ఉత్తర ప్రదేశ్: సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. ప్రస్తుతం మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. అదేదో సినిమాలో చెప్పిన విధంగా చెట్టుకు చీర కట్టినా కామాంధులు వదలటం లేదు. ఏకంగా నెలలు నిండిన(గర్భిణి) ఓ 32 ఏళ్ల మహిళపై కొంతమంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కచౌలా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కచౌలా గ్రామానికి చెందిన ఓ గర్భిణి శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లింది. ఒంటరిగి వెళ్తున్న ఆమెను చూసి కొంత మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గట్టిగా అరవడంతో నోటిలో అరుపులు వినబడకుండా ఓ గుడ్డ పెట్టారు. అయితే బయటి వెళ్లిన మహిళ ఎంత సేపటికీ రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెంది గాలింపులు చేపట్టారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి స్థానికి ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
హరియాణాలో మరో ఘోరం
ఫతేహాబాద్ : ‘కురుక్షేత్ర నిర్భయ’ ఘటనపై ఆందోళనలు చల్లారకముందే హరియాణాలో మరో ఘోరం జరిగింది. ఫతేహాబాద్ జిల్లా భుథాన్ గ్రామంలో 20 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఇద్దరు యువకులు దాడిచేసి, పారిపోయారు. ఈ ఘటనపై ఫతేహాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ఎస్‌హెచ్‌వో బీమ్లాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. సీఎం స్పందన : రాష్ట్రంలో వరుసగా జరుగుతోన్న హత్యలు, అత్యాచారా ఘటనలపై ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారంటూ ముగ్గురు ఐజీ స్థాయి అధికారులపై బదిలీవేటు వేశారు. వేధింపులపై ఫిర్యాదుచేయాలనుకునే మహిళలు 1090 లేదా 100 నంబర్‌కు ఫోన్ చేయాలని సీఎం ఖట్టర్ సూచించారు. -
మహిళలపై కాదు, మగాళ్లపై దృష్టి పెట్టాలి!
-
మహిళలపై కాదు, మగాళ్లపై దృష్టి పెట్టాలి!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లో ఇటీవల ముక్కుపచ్చలారని ఏడేళ్ల పసిపాపపై సామూహిక అత్యాచారం జరిపి అనంతరం అగ్నికి ఆహుతి చేసిన మృగాల పైశాచిక చర్య లేదా భారత్‌లోని కురుక్షేత్రలో 15 ఏళ్ల దళిత బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి వార్తలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా......‘చీకటవుతోంది..... సురక్షితం కాదు..... అక్కడికి ఒంటరిగా వెళ్లకు.... .అలాంటి దుస్తులు ధరించినట్లయితే సమస్యలు కోరి తెచ్చుకోవడమే.. ..ఇంత రాత్రి వేళ నీవు బయటకు వెళ్లడం మంచిది కాదు...’ అంటూ అమ్మాయిలను సమాజం హెచ్చరించడం వింటుంటాం. తరాలు మారినా ఈ మాటలు మారలేదు. ఇలాంటి దారుణ కీచక చర్యలకూ తెరపడలేదు. ఎందుకు? ఇప్పటివరకూ మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడల్లా సమాజం మహిళలపై దృష్టిని కేంద్రీకరించి ఇలాంటి మాటలతో హెచ్చరిస్తోంది. నీతి సూక్తులు చెబుతోంది. అందుకే పరిస్థితిలో మార్పులేదు. అయితే ఇక్కడ దృష్టిని కేంద్రీకరించాల్సింది దారుణాలకు పాల్పడుతున్న మగవాళ్లపై. నీతి బోధలు చేయాల్సింది, హెచ్చరికలు చేయాల్సింది వారికే. మగవాళ్లు చిన్న పిల్లల నుంచి ఎదుగుతున్నప్పుడే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరి నుంచి గురువుల వరకు వారికి సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పాలి. మహిళలను గౌరవపరిచే సంస్కతిని నేర్పించాలి. ఇలాంటి అభిప్రాయాలను పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న ప్రత్యామ్నాయ సాంస్కృతిక పత్రిక ‘మోస్కీ’, సామాజిక కార్యకర్త అల్వీనా జాడూన్, బాలీవుడ్ హిందీ సినిమా ‘హిందీ మీడియం’లో నటించిన పాకిస్థాన్ సినీ తార సారా ఖబర్లు వ్యక్తం చేశారు. వాళ్లు వ్యక్తం చేసిన అభిప్రాయల వీడియోలో సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. ‘సమాజంలో జరుగుతున్న దారుణాలను ఎదుర్కోవడం సమష్టి బాధ్యత. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే అందుకు కారకులు ఎవరు? మగవాళ్లు. ఆడవాళ్లకు కాదు, ప్రవర్తనా నియమావళి మగవాళ్లకు ఉండాలి. ఆడవాళ్ల మీది నుంచి దృష్టిని మగవాళ్లవైపు మళ్లించనప్పుడే మార్పు వస్తుంది. ‘మా ఆడవారు మంచివారు. గౌరవనీయులు. పవిత్రులు’ అని ఈ సమాజంలో చాలా మంది చెబతూ ఉంటారు. అవును, మీ ఆడవారు మంచి వారు, పూజ్యులే. మరి మీ మగపిల్లల సంగతేమిటీ? వారు మంచివారు కాదా? వారికి మంచీ, మర్యాదలు నీర్పలేదా? ముఖ్యంగా మహిళల పట్ల ఎలా నడుచుకోవాలో ప్రవర్తనా నియమావళిని ఎందుకు నిర్దేశించలేదు?’ అంటూ మోస్కీ వీడియో కొత్త వాదనను ముందుకు తీసుకొచ్చింది. పాక్ సామాజిక కార్యకర్త అల్వీనా జండూన్ అదే తరహాలో మాట్లాడారు. ‘ఇలాంటి దారుణాలను ఎవరు అరికడతారు? ఏటేటా చెప్పిన మాటలనే చెబుతూ, చేసిన వాగ్దానాలనే చేస్తూ ఓట్లు అడుక్కునే రాజకీయ నాయకులు మారుస్తారా? మహిళల మీది నుంచి దృష్టిని మగవాళ్లపైకి మళ్లించి సమస్యను పరిశీలించినప్పుడే పరిష్కారం దొరకుతుంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు. జైనాబ్ ఘటనపై టీవీలో పాకిస్థాన్ తార సారా ఖబర్ కన్నీళ్లపర్యంతమవుతూనే కఠినంగా మాట్లాడారు. ‘ఈ ఘోర కృత్యాలను ఆపాల్సిందిగా నేను ఎవరికి విజ్ఞప్తి చేయాలో కూడా అర్థం కావడం లేదు. ప్రజలారా! ఎవరో వస్తారని, సాయం చేస్తారని ఎదురు చూడకండీ. మీరే కార్యరంగంలోకి దూకండి. మీ రక్షణ కోసం మీరే పోరాడండీ. మీ పిల్లలకు నేర్పండి, వారిని వారు ఎలా రక్షించుకోవాలో’ అని ఖబర్ పిలుపునిచ్చారు. జైనాబ్‌కు న్యాయం జరగాలంటూ వేలాది మంది పాకిస్థాన్ ప్రజలు ప్రతి రోజూ వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. -
ప్రకాశం జిల్లాలో గ్యాంగ్ రేప్, హత్య
సాక్షి, సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులో దారుణం జరిగింది. ఒక మహిళపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఆపే హతమార్చి సమీపంలోని వ్యవసాయబావిలో పడేశారు. బుధవారం ఉదయం మహిళ శవాన్ని బావిలో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాతమాగులూరు గ్రామ సమీపంలో వైష్ణవి గ్రానైట్‌లో కనకమ్మ(35) అనే మహిళ వాచ్‌మన్‌గా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడి అనంతరం హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. కండువా మెడకు చుట్టి హతమార్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. శవం పడిఉన్న తీరును గమనించిన స్థానికులు సామూహిక అత్యాచారం జరిగిందని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోకపోవడంతో గ్రామస్తులు శవాన్ని వెలికితీసేందుకు సంశయిస్తున్నారు. ఒంటిపై దుస్తులు ఉన్న తీరు, శరీరంపై గాయాలను బట్టి గ్యాంగ్ రేప్ జరిగిందని భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యార్థినిపై లైంగికదాడి... ఇద్దరికి జీవిత ఖైదు
సాక్షి, తిరువణ్ణామలై: పాఠశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగికదాడి చేసిన కేసులో ఇద్దరికి జీవిత శిక్ష విధిస్తూ జిల్లా మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. తిరువణ్ణామలై జిల్లా త్యాగి అన్నానగర్‌కు చెందిన అశ్విన్, వినోద్‌లపై పలు కేసులున్నాయి. సారోన్ ప్రాంతానికి చెందిన టీచర్ దంపతుల కుమార్తె (16) అదే ప్రాంతంలో పదవ తరగతి చదివేది. సాయంత్రం వేళల్లో అదే ప్రాంతంలో ట్యూషన్‌కు వెళ్లి వచ్చేది. 2014 డిసెంబర్ 29న ట్యూషన్ ముగించుకొని సాయంత్రం 7 గంటలకు ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో బాలుర పాఠశాల వద్ద దాగి ఉన్న అశ్విన్, వినోద్‌లు కలిసి కత్తి చూపించి కిడ్నాప్ చేసి ఆటోలో తరలించి లైంగికదాడి చేశారు. అనంతరం ఆటోలో తీసుకొచ్చి ఇంటి సమీపంలో వదిలి పెట్టి పరారయ్యారు. ఆ సమయంలో చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో పరారయ్యారు. దీనిపై తిరువణ్ణామలై మహిళా పోలీస్ స్టేషన్లో విద్యార్థిని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి తిరువణ్ణామలై మహిళా కోర్టులో విచారణ జరిగింది. ఐదు సంవత్సరాలుగా విచారణ జరిపిన న్యాయమూర్తి ఆఖరి తీర్పు వెలువరించారు. అశ్విన్, వినోద్లకు జీవిత శిక్ష, రూ: 4 వేల జరిమానా విదించారు. -
దారుణం : ఓటు వేయలేదని గ్యాంగ్‌రేప్.. హత్య
రాంచీ : జార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల్లో తన భార్యకు మద్ధతు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఒక కుటుంబంపై పగ పెంచుకుని దాష్టీకానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబంలోని 13 ఏళ్ల బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే... పాకూరు జిల్లా లిట్టిపారా గ్రామ పంచాయితీలో ‘ముఖియా’ పదవి కోసం కొన్నాళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. ప్రేమ్‌లాల్ హంసద అనే వ్యక్తి భార్య ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు ఓటు వేయలేదు. దీంతో వారి మూలంగానే తన భార్య ఓడిపోయిందన్న కోపంతో ప్రేమ్‌లాల్ రగిలిపోయాడు. జనవరి 8న బహిర్భూమికని వెళ్లిన బాలికను తన సోదరుల సహకారంతో అపహరించాడు. ఆపై వారంతా కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ప్రాణాలు తీశారు. చివరకు బాలిక మృత దేహాన్ని సమీపంలోని బ్లెవాన్ అటవీ ప్రాంతంలో పడేశారు. బాలిక కనిపించకుండా పోయే సరికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిచ్చిన సమాచారం మేరకు బాలిక శవాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆపై నిందితులపై తల్లిదండ్రుల ఫిర్యాదు చేయటంతో వారిని అరెస్ట్ చేశారు. తీవ్ర విమర్శలు... నిందితులు రాజకీయంగా కాస్త పలుకుబడి ఉన్నవారు కావటంతో తొలుత కేసు నమోదు చేసుకునేందుకు పోలీసులు తటపటాయించారు. అయితే ప్రతిపక్షాల ఆందోళన, తల్లిదండ్రుల నిరసన ప్రదర్శనతో పోలీసులపై విమర్శలు గుప్పించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి.. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఎలాంటి తమపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని.. సాక్ష్యాలు సేకరించటంలో జాప్యం మూలంగానే అరెస్ట్ ఆలస్యం అయ్యిందని పాకూరు జిల్లా ఎస్పీ శైలేంద్ర బర్న్వాల్ వెల్లడించటం విశేషం. నిందితులు ప్రేమ్‌లాల్, శ్యామూల్, కథి, శిశు హందలు నేరాన్ని ఒప్పుకోవటంతో వారిని రిమాండ్‌కు తరలించినట్లు వారు వివరించారు. -
వర్ధమాన నటిపై గ్యాంగ్ రేప్
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధానిలో మరో దాష్టీకం చోటు చేసుకుంది. పలు టీవీ సీరియళ్లలో సహాయక పాత్రల్లో నటించిన మోడల్(23) గ్యాంగ్ రేప్‌కి గురైంది. పోలీసుల కథనం ప్రకారం... బిహార్‌కు చెందిన సదరు యువతి మోడలింగ్ కోసం ఢిల్లీకి వచ్చి స్థిరపడింది. ఈ క్రమంలో పలు సీరియళ్లలో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే ఓ ముగ్గురు వ్యక్తులు ఆమెను కలిసి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని ఆమెతో నమ్మబలికారు. ముంబైలో ఉన్న ఓ స్టార్ డైరెక్టర్ కొత్త వాళ్ల కోసం అన్వేషణ ప్రారంభించాడని.. నేరుగా ఆయనతోనే మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో డిసెంబర్ 25న సరోజినీ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి.. ఆ ముగ్గురు ఆమెపై ఈ దారుణానికి తెగబడ్డారు. మరుసటి రోజు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారిని అరెస్ట్ చేశారు. అయితే కాసేపటికే వారిని విడుదల చేసినట్లు తెలియటంతో సదరు మోడల్ ఆందోళనకు సిద్ధమైంది. వారి వల్ల తన ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని ఆమె భయపడుతోంది. అయితే వారిని బెయిల్ పై విడుదల చేశామని.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. -
బాలికపై సామూహిక లైంగికదాడి
రాయికల్(జగిత్యాల): జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని 8వ తరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు దుండగులు సామూహికంగా అత్యాచారం చేసి వీడియో, ఫొటోలు తీసిన సంఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన విద్యార్థిని రాయికల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం ప్రత్యేక తరగతుల కోసం వెళ్లింది. రోజూ విద్యార్థిని సోదరుడు ఆమెను పాఠశాల వద్ద దిగబెడుతుండగా.. ఆదివారం కరీంనగర్‌కు పనిమీద వెళ్లడంతో .. తన స్నేహితుడైన ఓ మైనర్‌కు తన చెల్లెలిని తీసుకురమ్మని చెప్పాడు. దీంతో అతడు రాయికల్‌కు వచ్చాడు. ఈ సమయంలో అతడి స్నేహితుడు రెడ్డి విజయ్ రావడంతో ఇద్దరూ కలిసి బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. గమనించిన విద్యార్థిని గొడవ చేసేందుకు ప్రయత్నించగా.. చంపుతామని బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు. తర్వాత ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టారు. విషయం ఎవరికైనా చెబితే చంపుతామని, సెల్ఫోన్లో తీసిన దృశ్యాలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. సోమవారం తన మేనబావ రాజుకు చెప్పడంతో నిందితులకు దేహశుద్ధి చేశాడు. సాయంత్రం మైనర్‌ను పోలీసులకు అప్పగించాడు. బాధితురాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల డీఎస్పీ భద్రయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘ఎట్టి పరిస్థితుల్లోనైనా పోలీస్ ఆఫీసర్ అవుతా’
భోపాల్: గత అక్టోబర్‌లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన భోపాల్ రేప్ ఘటన నిందితులకు 52 రోజుల తర్వా ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవితకాల శిక్ష విధించింది. ఈ శిక్షపై స్పందించిన బాధితురాలు.. ‘నాకు వారిని చంపేయాలని ఉంది. కానీ కోర్టు జీవితకాల శిక్ష విధించడం సంతోషమే. వారు చచ్చేంత వరకు జైలులో శిక్షను అనుభవిస్తారు. నాకు జరిగిన అన్యాయం ఏ అమ్మాయికి జరగవద్దు. అందుకే పోలీస్ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఒక వేళ యూపీఎస్సీ పరీక్ష ఉత్తీర్ణ కాకపోతే మధ్యప్రదేశ్ ప్రభుత్వ సాయంతో పోలీస్ ఆఫీసర్‌ను అవుతా’ అని ధీమా వ్యక్తం చేసింది. గత అక్టోబర్ 31న భోపాల్ శివారు గ్రామంలో నివసించే బాధితురాలు కోచింగ్ సెంటర్ నుంచి రైల్వేష్టేషన్‌కు షార్ట్ కట్ రూట్లో వెళుతుండగా ఇద్దరు తాగుబోతులు అటకాయించారు. బలవంతంగా చేతులు, కాళ్లు కట్టేసి, పక్కనున్న కల్వర్టు దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దుస్తులు ఇవ్వమని అడిగితే నిందితుల్లో ఒకడు ఇప్పుడే వస్తానని వెళ్లి, దుస్తులతోపాటు మరో ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చాడు. నలుగురు కలిసి సుమారు నాలుగు గంటలపాటు అత్యాచారం జరిపారు. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే ‘సినిమా కథలు చెబుతున్నావా?’ అని వెటకారాలు ఎదురయ్యాయి. చివరికి బాధితురాలే కీచకులను గుర్తించి, గల్లాపట్టి లాక్కొస్తేగానీ కేసు నమోదుకాలేదు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరం నడిబొడ్డున చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. -
యూపీలో మరో అకృత్యం
సాక్షి, షహజహన్‌పూర్ : ఉత్తర్ ప్రదేశ్‌లో మరె దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద నడుకుచుంటూ వెళుతున్న యువతిని నలుగురు యువకులు కారులో కిడ్నాప్ చేసి.. ఆపై చెరుకుతోటలో సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని షహజహన్‌పూర్‌లో జరిగింది. స్థానిక రోజా ప్రాంతంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. నలుగురు యువకులు బలవంతంగా కార్లోకి ఎక్కించుని తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు 20 ఏళ్ల యువతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈఘటనపై పోలీస్ స్టేషన్ ఇన్చార్జీ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. యువతి పెట్టిన కేసును రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. బాధితురాలు అరోపించిన వ్యక్తుల్లో షారుఖ్, నసీరుద్దీన్, అరుణ్, మరో వ్యక్తిపై కేసును పెట్టినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. ‘బాధితురాలి తండ్రి ఓ మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనను రేప్ చేశారని ఆరోపిస్తూ బాధితురాలు నలుగురిపై ఫిర్యాదు చేయగా.. వారంతా ఆమె తండ్రి చేసిన హత్య కేసులో సాక్షులుగా ఉన్నారు. బాధితురాల్ని వైద్యపరీక్షల నిమిత్తం పంపిన పోలీసులు, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. -
తమ్ముడి భార్య పై అన్నఅత్యాచారం
-
తమ్ముడి భార్యపై అన్న అత్యాచారం
సాక్షి, బులంద్‌షెహర్ : ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. తాజాగా బులంద్‌షెహర్ పట్టణంలోని ఒక మహిళపై ఆమె బావ (భర్త అన్న), అతని స్నేహితుడు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై తండ్రితో కలిసి బాధితురాలు కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న బాధితురాలికి రషీద్అనే యువకుడితో వివాహం అయింది. వివాహం అయిన రెండో రోజే అమెపై భర్త అన్న, అతని స్నేహితుడు అత్యాచారం చేశారు. ఈ ఘటన తరువాత వారం రోజులకే భర్త బాధితురాలికి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. దీనిపై బాధితురాలు డిసెంబర్ 11న కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చొరవతో.. భర్త, అతని అన్న, స్నేహితుడు, ఇతర కుటంబ సభ్యులపై కేసు నమోదు అయింది. పెళ్లయిన రెండోరోజే భర్త.. ఆమెను ఇంట్లో వదలిపెట్టి బయటకు వెళ్లాడు. సరిగ్గా ఇదే సమయంలో బావ మహమ్మద్ రఖీబ్, అతని స్నేహితుడు ఇంట్లోకి వచ్చారు. ఇద్దరూ కలిసి నన్ను బలవంతంగా గదిలోకి ఎత్తుకెళ్లి నాపై ఒకరితరువాత ఒకరు అత్యాచారం చేశారు. అదే సమయంలో రఖీబ్ అత్యాచారం చస్తున్న సమయంలో అతని స్నేహితుడు మొబైల్లో వీడియో తీశాడని చెప్పారు. ఈ ఘటనను ఎక్కడైనా చెబితే.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు బాధిత యువతి తెలిపింది. ఈఘటన మొత్తం భర్తకు చెప్పాకే తెలిసింది.. అతని మోసం. అతనికి అప్పటికే వివాహం అయిందని.. అన్న కోసమే నిన్ను ఇక్కడకు తీసుకువచ్చానని చెప్పారు. ఇక అక్కడ ఉండి లాభం లేదనుకుని.. పారిపోయి పుట్టింటికి వచ్చి.. తల్లిదండ్రుల సాయంతో కేసు పెట్టినట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా.. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఆ యువతి చెప్పేదంతా కట్టుకథ అని రషీద్ తల్లి కొట్టిపారేసింది. ‘నా కుమారుడు రషీద్‌కు ఎప్పుడో వివాహమైంది. అతడు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు. ఆమె చెప్పేదంతా పచ్చి అబద్దం. నా కుమారులిద్దరూ అమాయకులు’ అని ఆమె చెబుతోంది. -
స్కూల్ మానేసిన అబ్బాయిలు పెద్ద నేరం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాల సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఓ యువతిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి జరిగిన ఘటన మరువకముందే జహంగిపురి ప్రాంతంలో మరో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఐదుగురు జువెనైల్స్ కలిసి ఓ మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి తెలిసినవాళ్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తాం అని బెదిరించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఐదుగురు జువెనైల్స్ జహంగిరి ప్రాంతంలోని మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ వద్ద భవనం వెనుకకు ఆమెను రాత్రి 10గంటల ప్రాంతంలో బలవంతంగా తీసుకెళ్లారు. ఆమె అరిచే ప్రయత్నం చేసినా గొంతు నొక్కిపట్లి అరిస్తే చంపేస్తామని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు కూడా బాధితురాలు ఉండే ప్రాంతంలో ఉండేవారేనని, మధ్యలోనే స్కూల్ మానేసిన వీరు చెత్త డంపింగ్ యార్డ్‌లో పనులు చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. వారు బాల నేరస్తులు కాకుంటే కోర్టుకు తీసుకెళతామని చెప్పారు. -
మధ్యప్రదేశ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం
సాగర్: ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఓ యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మర్చిపోకముందే ఆ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. సాగర్ జిల్లా దేవల్ గ్రామంలో తన ఇంట్లో నిద్రపోతున్న ఓ మైనర్ యువతి(15)పై ఇద్దరు దుండగులు గురువారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె సాయం కోసం అరవడంతో సదరు యువతిపై దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ప్రస్తుతం 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఇక్కడి బుందేల్‌ఖండ్ వైద్యకళాశాల, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్రసింగ్ ధాకడ్ తెలిపారు. ఈ దుర్ఘటన సమయంలో బాలిక తల్లి ఇంట్లోలేదన్నారు. బాధితురాలి తండ్రి కొనేళ్లక్రితమే చనిపోయాడన్నారు. బాలిక తాత ఇంటిబయటే నిద్రపోతున్నప్పటికీ.. ఆయనకు చెవులు విన్పించకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు సర్వేష్ సేన్(21)ను అదుపులోకి తీసుకున్నామనీ.. మరో మైనర్ నిందితుడు పరారీలో ఉన్నాడనీ జిల్లా సూపరింటెండెంట్ ఎస్.శుక్లా తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376(డి), పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
చెలరేగిన మృగాళ్లు
తుమకూరు: కామాంధులు చెలరేగిపోయారు. బాలికకు సినిమా చూపిస్తానని చెప్పి పాడుబడిన ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లి ఐదుగురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని యల్లాపుర గ్రామం సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాలిక స్నేహితుడు హరీష్‌తో పాటు మధు, కేశవ్, చిదానంద, చందు ఈ ఘోరానికి పాల్పడ్డారు. బాలికతో హరీష్ స్నేహంగా ఉండేవాడు. అతని మిత్రులందరూ కలిసి ఈ పన్నాగానికి కుట్ర పన్నారు. అతడు ఆమెను ఆటోలో ఎక్కించుకుని సినిమాకని బయల్దేరాడు. మార్గమధ్యంలో అతని స్నేహితులు కూడా ఆటోలో వచ్చారు. అనంతరం యల్లాపుర సమీపంలో ఉన్న ఓ పాడు బడిన కర్మాగారంలోకి తీసుకెళ్లి ఘోరానికి ఒడిగట్టి పరారయ్యారు. బాధితురాలు తన బంధువుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హరీష్, చిదానందలు దొరికిపోగా, మిగతావారి కోసం గాలిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న హరీష్, చిదానంద్ -
భర్త ముందే.. భార్యపై ఘోరం
సాక్షి, బెంగళూరు/ దొడ్డబళ్లాపుర: కామాంధులు చెలరేగిపోతున్నారు. ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వివరాలు... తుమకూరుకు చెందిన 26 ఏళ్ల వివాహిత ఉపాధి కోసం నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లికి వచ్చి ఓ గార్మెంట్ పనిచేస్తోంది. వారం రోజుల క్రితం స్థానిక దూబరహళ్లి గ్రామంలో ఇంటిని అద్దెకు తీసుకుంది. ఆమె ఉద్యోగానికి వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే ఆటోడ్రైవర్ వెంటపడే వాడు. ఎన్ని సార్లు చెప్పినా పద్ధతి మార్చుకోలేదు. నవంబర్ 19న కూడా వెంకటేష్ ఆమె వెంట పడ్డాడు. సహనం కోల్పోయిన మహిళ చెప్పుతో వెంకటేష్‌ను కొట్టింది. గ్రామస్తుల మధ్య తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని అతడు స్నేహితులైన రౌడీషీటర్ రాఘవేంద్ర, పునీత్, విజయ్ కుమార్‌తో కలిసి అదే రోజు రాత్రి మహిళ ఇంటికి వచ్చాడు. ఆమె భర్తను మారణాయుధాలతో బెదిరించి అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బంధువులు, స్నేహితుల సూచనల మేరకు 21వ తేదీన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన వెంకటేష్, రాఘవేంద్ర, పునీత్‌లను శనివారం అరెస్టు చేశారు. విజయ్‌కుమార్ పరారీలో ఉన్నాడు. కాగా ఈ కేసుకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. బాధితురాలికి ప్రధాన నిందితుడైన వెంకటేష్‌కు మధ్య మొదటి నుంచి సన్నిహిత సంబంధముందని తెలుస్తోంది -
ఉత్తరప్రదేశ్‌లో నర్సుపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బెరైలీలో నర్సుపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ముగ్గురిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. రోహిల్‌ఖండ్ మెడికల్ కళాశాలలో నర్సుగా పని చేస్తున్న ఆమెను ఎత్తుకుపోయిన దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులను విచారిస్తున్నట్లు వెల్లడించారు. -
దాష్టీకం: 10 ఏళ్ల బాలికపై మూడు నెలలుగా గ్యాంగ్ రేప్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో భోపాల్ నగరం నడిబొడ్డున ఓ యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఓ 10 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు స్వీట్స్ ఆశగా చూపి గత మూడు నెలలుగా పలుమార్లు అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు వివరాల ప్రకారం.. భోపాల్‌లోని జెహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై అదే కాలనీలో వాచ్‌మన్‌గా ఉండే నన్హూలాల్(65), మరో ముగ్గురు వ్యక్తులు గోకుల్ పన్వాల్(45), గ్యానేంద్ర పండీట్(36), సుమన్‌పాండే(50)లు గత మూడు నెలలుగా పలుమార్లు అత్యాచారం జరిపారు. చివరిసారిగా నవంబర్ 12న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అప్పటి నుంచి బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన ఆమె తల్లి ఆరాదీయగా అసలు విషయం తెలిసింది. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఆ బాలిక ఇంటి పక్కనే ఉండే సుమన్ స్వీట్లను బాలికకు ఆశ చూపి ఈ ఘాతుకానికి ఒడి గట్టాడు. అంతే కాకుండా ఇతరులతో గ్యాంగ్ రేప్ చేయించాడు. నలుగురి నిందితులని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్ అధికారి ప్రీతమ్ మీడియాకు వివరించారు. బాలిక నివసించే ప్రాంతంలోనే నన్హూలాల్ వాచ్‌మన్ కాగా.. గోకుల్ పాన్ షాప్ నిర్వహిస్తుండగా.. గ్యానేంద్ర డ్రైవర్‌గా .. థాకుర్ పని మనిషిగా పని చేస్తున్నారు. 15 రోజుల్లోనే భోపాల్‌లో వరుస గ్యాంగ్ రేప్ ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. -
వారిని బహిరంగంగా ఉరితీయండి...
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ యువతిని నలుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బాధితురాలు తీవ్రంగా స్పందించింది. ఈ దారుణమైన నేరానికి పాల్పడినందుకు గాను నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేసింది. ఈ మొత్తం సంఘటనపై పోలీసులు కూడా చేత కాని వారులాగా ప్రదర్శించారని తెలిపింది. '' నిందితులకు శిక్ష కఠినంగా ఉండాలి. ఇలాంటి నేరాలకు పాల్పడానికి ఇతరులు బయటపడేలా వీరికి శిక్ష ఉండాలి. వీరికి మరణశిక్షనే ఉండాలి. వీధుల్లో వీరిని ఉరితీయాలి. దీంతో మిగతా వాళ్లు ఇలాంటి నేరాలకు పాల్పడానికి సాహసించరు'' అని బాధితురాలు పూజ(పేరు మార్పు) డిమాండ్ చేసింది. ఈ సంఘటన అనంతరం ఆమె తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసుపై పోలీసులు ప్రవర్తన చాలా దారుణంగా ఉందని తెలిపింది. ఒక పోలీసు స్టేషన్ నుంచి మరో పోలీసు స్టేషన్‌కు తనకు బలవంతంగా పంపించారని తెలిపింది. ఒక పోలీస్ దంపతుల కుమార్తె అయిన తనకే ఈ పరిస్థితి వస్తే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. మంగళవారం రాత్రి పూజపై దుండగులు ఈ పాశవిక ఘటనకు పాల్పడ్డారు. చివరికి దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు హబీబ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా 'నువ్వు చెప్పేది సినిమా కథలా ఉంది' అని హేళన చేశారు. హబీబ్‌గంజ్ లోకల్, ఎంపీ నగర్, హబీబ్‌గంజ్ జీఆర్పీ స్టేషన్లలోని పోలీసులు ఈ కేసు మా పరిధిలోకి రాదంటూ బాధితురాలిని 24 గంటలు తిప్పించారు. దీంతో చివరికి బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి ఇద్దరు నిందితుల్ని పట్టుకుని స్టేషన్‌కు తీసుకురావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో హబీబ్‌గంజ్, ఎంపీ నగర్, జీఆర్పీ పోలీస్స్టేషన్లకు చెందిన ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ అయ్యారు. -
భోపాల్‌లో కీచకపర్వం
భోపాల్: భోపాల్‌లో దారుణం చోటుచేసుకుంది. సివిల్స్ కోచింగ్‌కు వెళ్లివస్తున్న ఓ యువతిని అడ్డుకున్న నలుగురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరికి దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు హబీబ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ‘నువ్వు చెప్పేది సినిమా కథలా ఉంది’ అని హేళన చేశారు. హబీబ్‌గంజ్ లోకల్, ఎంపీ నగర్, హబీబ్‌గంజ్ జీఆర్పీ స్టేషన్లలోని పోలీసులు ఈ కేసు మా పరిధిలోకి రాదంటూ బాధితురాలిని 24 గంటలు తిప్పించారు. దీంతో చివరికి బాధితురాలు తన తల్లిదండ్రులతో కలసి ఇద్దరు నిందితుల్ని పట్టుకుని స్టేషన్‌కు తీసుకురావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోచింగ్ నుంచి తిరిగొస్తుండగా.. మధ్యప్రదేశ్‌లోని ఎంపీ నగర్లో సివిల్స్ శిక్షణ పొందుతున్న యువతి హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తోంది. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో కోచింగ్ ముగించుకుని తిరిగివస్తుండగా దారిలో గోలు బీహారీ, అమర్ అనే ఇద్దరు దుండగులు ఆమెను అడ్డుకున్నారు. బలవంతంగా సమీపంలోని నిర్మానుష్యంగా ఉన్న కల్వర్టు దగ్గరకు ఈడ్చుకెళ్లి రేప్‌చేశారు. ఈ పాశవిక దాడిలో దుస్తులు చినిగిపోవడంతో వేసుకోవడానికి ఏదైనా ఇవ్వాల్సిందిగా యువతి వారిని వేడుకుంది. ఇందుకు సరేనన్న గోలు దుస్తులతో పాటు మరో ఇద్దరిని తీసుకొచ్చాడు. అనంతరం నలుగురు కలసి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. మద్యం సేవిస్తూ మధ్యమధ్యలో సిగరెట్, తంబాకు కోసం విరామం ఇస్తూ దాదాపు 3 గంటల పాటు యువతిపై దారుణానికి పాల్పడ్డ దుండగులు రాత్రి 10 గంటల సమయంలో ఆమె దగ్గరున్న చెవి రింగులు, ఫోన్, వాచ్, పర్సును గుంజుకుని పరారయ్యారు. ఈ పాశవిక ఘటన హబీబ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో జరిగింది. ప్రతిపక్షాల విమర్శలు బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించడంపై కాంగ్రెస్ పార్టీ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన చేపట్టింది. పోలీస్ దంపతుల కుమార్తె ఎఫ్ఐఆర్ నమోదు కోసం మూడు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత అజయ్ సింగ్ విమర్శించారు. దీంతో ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్, ఫిర్యాదును సకాలంలో స్వీకరించని హబీబ్‌గంజ్, ఎంపీ నగర్, జీఆర్పీ పోలీస్స్టేషన్లకు చెందిన ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.. ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. కథలు చెబుతున్నావా? భద్రతా విభాగంలో పనిచేస్తున్న తల్లిదండ్రుల సాయంతో తనపై జరిగిన దారుణాన్ని ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన యువతికి అక్కడ హేళనలు ఎదురయ్యాయి. యువతి వాంగ్మూలాన్ని విన్న పోలీస్ అధికారి ఒకరు సినిమా కథలు చెబుతున్నావా? అని హేళనగా మాట్లాడారు. హబీబ్‌గంజ్ లోకల్ పోలీస్‌స్టేషన్‌తో పాటు ఎంపీ నగర్, హబీబ్‌గంజ్ జీఆర్పీ పోలీసులు ఈ ఘటన మా పరిధిలోకి రాదన్నారు. గత్యంతరం లేక యువతి తెల్లవారేవరకు తండ్రితో కలసి జీఆర్పీ స్టేషన్‌ముందే నిరీక్షించింది. తిరిగి ఇంటికి వెళుతుండగా హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్ సమీపంలోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డ గోలు, అమర్లను గుర్తించిన యువతి..తండ్రి సాయంతో వారిని తీసుకొచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో అప్పగించింది. -
నగరం నడిబొడ్డున 3గంటలపాటు గ్యాంగ్ రేప్
భోపాల్ : నగరం అడవిగా మారింది. కొన్ని క్రూరమృగాళ్లు కలిసి ఓ ఆడబిడ్డను వేటాడి, మూడు గంటలపాటు పీక్కుతిన్నాయి. నెత్తురుకారుతున్న తనవుతో.. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే ‘సినిమా కథలు చెబుతున్నావా?’ అని వెటకారాలు ఎదురయ్యాయి. చివరికి బాధితురాలే కీచకులను గుర్తించి, గల్లాపట్టి లాక్కొస్తేగానీ కేసు నమోదుకాలేదు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరం నడిబొడ్డున చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఐఏఎస్ కోచింగ్‌కు వెళ్లొస్తూ : భోపాల్ శివారు గ్రామంలో నివసించే ఓ యువతి ఐఏఎస్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటోంది. ప్రతిరోజూ భోపాల్ నడిబొడ్డులోని హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ ద్వారా రాకపోకలు సాగించేంది. గురువారం సాయంత్రం.. కోచింగ్ సెంటర్ నుంచి రైల్వేష్టేషన్‌కు షార్ట్ కట్ రూట్లో వెళుతోన్న ఆమెను ఇద్దరు తాగుబోతులు అటకాయించారు. బలవంతంగా చేతులు, కాళ్లు కట్టేసి, పక్కనున్న కల్వర్టు దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ చోటు నుంచి హబీబ్‌గంజ్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు దూరం కేవలం 100 మీటర్లు మాత్రమే!! దుస్తులు ఇమ్మంటే ఇంకో ఇద్దరిని తీసుకొచ్చారు : మధ్యమధ్యలో సిగరెట్, తంబాకు కోసం విరామం ఇస్తూ గంటలపాటు యువతిపై అత్యాచారం చేశారు. దుస్తులు పూర్తిగా చినిగిపోవడంతో వేసుకోవడానికి ఏవైనా ఇమ్మని బాధితురాలు వేడుకుంది. నిందితుల్లో ఒకడు ఇప్పుడే వస్తానని వెళ్లి, దుస్తులతోపాటు మరో ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చాడు. నలుగురూ కలిసి ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారు. ఆమె దగ్గరున్న ఫోన్, వాచ్, పర్స్‌లను గుంజుకొని, చివరికి రాత్రి 10 గంటల తర్వాత విడిచిపెట్టారు. సినిమా కథలు చెబుతున్నావా? : నడవలేని స్థితిలో ఎలాగోలా రైల్వే స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు.. తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఆ రాత్రే.. తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే స్టేషన్ ఇన్చార్జి.. బాధితులు చెప్పిన కథనాన్ని నమ్మలేదు. పైగా, ‘సినిమా కథలు చెబుతున్నారా?’ అని ఎద్దేవా చేశాడు. అదే స్పాట్లో మళ్లీ కనిపించారు : తెల్లవారిన తర్వాత బాధితురాలు, ఆమె తండ్రి అసహాయ స్థితిలో పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చిన హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ వైపునకు కదిలారు. సరిగ్గా అత్యాచారం జరిగిన ప్రదేశంలో.. తనను చెరబట్టిన ఇద్దరు కూర్చొని ఉండటం గమనించిందా యువతి. తండ్రి సహాయంతో ఆ ఇద్దరినీ తన్ని, గల్లాపట్టుకొని ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసింది. ఇక పోలీసులు కేసు నమోదుచేయక తప్పనిసరైంది. నిందితులను గొలూ బిహారీ, అమర్ భుటూలుగా గుర్తించారు. విపక్షాల ఆందోళన.. సీఎం సీరియస్ : హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్ వద్ద గ్యాంగ్ రేప్, పోలీసుల అలసత్వంలపై విపక్ష కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణ చర్యగా ఫిర్యాదు నమోదు చేయడంలో అలసత్వం వహించిన పోలీస్ అధికారులను సస్సెండ్ చేశారు. బాధితురాలు అప్పగించిన ఇద్దరు నిందితుల ద్వారా మరో ఇద్దరిని పట్టుకున్నారు. మొత్తం నలుగురిపైనా నిర్భయ, తదితర చట్టాలకింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇద్దరూ భద్రతాదళ ఉద్యోగులే కావడం గమనార్హం. జాతీయ మహిళా కమిషన్ సైతం భోపాల్ గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించింది. కేసు వివరాలు పంపాల్సిందిగా మధ్యప్రదేశ్ డీజీపీకి శుక్రవారం ఒక లేఖ రాసింది.