పాకిస్థాన్‌లో ఇటీవల ముక్కుపచ్చలారని ఏడేళ్ల పసిపాపపై సామూహిక అత్యాచారం జరిపి అనంతరం అగ్నికి ఆహుతి చేసిన మృగాల పైశాచిక చర్య లేదా భారత్‌లోని కురుక్షేత్రలో 15 ఏళ్ల దళిత బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి వార్తలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా......‘చీకటవుతోంది..... సురక్షితం కాదు..... అక్కడికి ఒంటరిగా వెళ్లకు.... .అలాంటి దుస్తులు ధరించినట్లయితే సమస్యలు కోరి తెచ్చుకోవడమే.. ..ఇంత రాత్రి వేళ నీవు బయటకు వెళ్లడం మంచిది కాదు...’ అంటూ అమ్మాయిలను సమాజం హెచ్చరించడం వింటుంటాం. తరాలు మారినా ఈ మాటలు మారలేదు. ఇలాంటి దారుణ కీచక చర్యలకూ తెరపడలేదు. ఎందుకు?