
తిరుపతి క్రైం : రేణిగుంట సమీపంలో నక్కల కాలనీలో ఓ వృద్ధురాలిపై కొందరు అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఎస్పీ అభిషేక్ మొహంతికి సోమవారం ఫిర్యాదు చేశారు. నక్కలకాలనీకి చెందిన వృద్ధురాలు(60)కు అన్బెగన్, అలీ (27) ఇద్దరు కుమారులు ఉన్నారు. అలీ తన సమీప బంధువైన తిరుత్తణికి చెందిన ఎలాంగిన్ శంకర్ కుమార్తెను ప్రేమించాడు. తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు. బాలికకు వేరే పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాలిక, అలీ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు ఈ నెల 22న రేణిగుంటలోని అలీ ఇంటిపై దాడి చేసి అతని తల్లిని వివస్త్ర ను చేసి వాహనంలో తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై బాలిక తండ్రి, కుమారుడు, మరో ఇద్దరు రోజూ అత్యాచారం చేశారు.
అంతటితో ఆగక ఆమె కుమారుడికి ఫోన్ చేసి తన కుమార్తెను అప్పగించేంత వరకు అత్యాచారం చేస్తూనే ఉం టామని హెచ్చరించారు. దీంతో అలీ వెంటనే తిరుపతిలోని తమ నాయకుడు వేలిమురగన్ వద్దకు వచ్చి జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించాడు. ఆ నాయకుడు బాలిక తల్లిదండ్రులను పంచాయతీకి రావాలని కోరాడు. వారు తిరుత్తణి సరిహద్దుల్లో వృద్ధురాలిని వదిలిపెట్టామని తెలిపారు. అలీ కుటుంబ సభ్యులు తిరుత్తణి సరిహద్దులకు వెళ్లారు. ఇంతలో బాలిక తల్లిదండ్రులు తిరుపతికి చేరుకుని బాలికను తమతో పాటు తీసుకెళ్లారు. దీనిపై బాధితులు గాజులమండ్యం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment