
శందోల్: మధ్యప్రదేశ్‌లోని శందోల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు 20 ఏళ్ల యువతికి మద్యం తాగించి, రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. జైత్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గడాఘాట్ ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. అంతకుముందు ఆమెను కారులో అపహరించారు.
ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చి బలవంతంగా మద్యం తాగించారు. రాక్షసకాండ పూర్తయ్యాక ఈ నెల 20న ఆమె ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. నలుగురు కామాంధులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితుల్లో ఒకడు స్థానిక బీజేపీ నాయకుడు విజయ్ త్రిపాఠీ అని తెలిసింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment