విజయవాడ ఆస్పత్రి ఘటన.. బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం | CM jagan Announce 10 Lakh Ex Gratia To Molested Woman In Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ ఆస్పత్రి ఘటన.. బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం

Published Fri, Apr 22 2022 12:47 PM | Last Updated on Fri, Apr 22 2022 3:56 PM

CM jagan Announce 10 Lakh Ex Gratia To Molested Woman In Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నిందితులు ఫాగింగ్‌ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి.. వారిని విధులనుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్‌ ఏజెన్సీకి టెర్మినేషన్‌ నోటీసు జారీ చేశారు. సీఎస్‌ ఆర్‌ఎంఓకి షోకాజ్‌ నోటీసు జారీచేశారు. శాఖా పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు.
చదవండి👉 విజయవాడ: టీడీపీ కార్యకర్తల వీరంగం.. వాసిరెడ్డి పద్మపై దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement