బాలుడిపై మహిళ లైంగిక వేధింపులు | woman molestation attempt boy vijayawada | Sakshi
Sakshi News home page

బాలుడిపై మహిళ లైంగిక వేధింపులు

Published Sun, Jun 10 2018 1:11 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

woman molestation attempt boy vijayawada - Sakshi

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ సెంట్రల్‌): పదిహేనేళ్ల బాలుడిపై ఓ మహిళ(45) లైంగిక వేధింపులకు పాల్పడింది. ఈ ఘటన శనివారం కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌ వాంబే కాలనీకి చెందిన ఓ మహిళ(45)కు ఇద్దరు కుమార్తెలున్నారు. ఆమె భర్త ఎనిమిదేళ్ల కిందట చనిపోగా.. కొంత కాలం కిందట ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసింది. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్న ఆమె కన్ను.. తన ఎదురింటిలో ఉంటున్న బాలుడిపై పడింది. 

టీవీ సరిగా రావడం లేదని.. ఫ్యాను తిరగడం లేదంటూ బాలుడిని తరచూ ఇంటిలోకి పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడుతుండేది. ఆమె చేష్టలతో విసిగిపోయిన ఆ బాలుడు గతేడాది వేరే ఊరిలో ఉంటున్న తన బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే పదో తరగతి పూర్తిచేసి ఇటీవల తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ మహిళ మళ్లీ బాలుడిని తన ఇంటికి రమ్మని పదేపదే పిలవడం.. రాత్రి సమయంలో అపార్ట్‌మెంట్‌ పై నిద్రిస్తున్న బాలుడి వద్దకు వెళ్లి లైంగికంగా వేధిస్తుండేది. ఆమె చేష్టలను గమనించిన బాలుడి స్నేహితులు..

 పది రోజుల కిందట ఈ విషయాన్ని అతని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు ఆ మహిళకు దేహశుద్ధి చేశారు. కాగా, తనను అకారణంగా కొడుతున్నారంటూ ఆమె ‘నున్న’ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆ బాలుడికి, మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో నిందితురాలిపై పోలీసులు.. ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు. మహిళను అరెస్టు చేసి కోర్టులో హాజరపరచగా.. న్యాయస్థానం ఆమెకు 15 రోజుల రిమాండ్‌ విధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement