
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాల సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఓ యువతిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి జరిగిన ఘటన మరువకముందే జహంగిపురి ప్రాంతంలో మరో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఐదుగురు జువెనైల్స్ కలిసి ఓ మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి తెలిసినవాళ్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తాం అని బెదిరించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ ఐదుగురు జువెనైల్స్ జహంగిరి ప్రాంతంలోని మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ వద్ద భవనం వెనుకకు ఆమెను రాత్రి 10గంటల ప్రాంతంలో బలవంతంగా తీసుకెళ్లారు. ఆమె అరిచే ప్రయత్నం చేసినా గొంతు నొక్కిపట్లి అరిస్తే చంపేస్తామని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు కూడా బాధితురాలు ఉండే ప్రాంతంలో ఉండేవారేనని, మధ్యలోనే స్కూల్ మానేసిన వీరు చెత్త డంపింగ్ యార్డ్‌లో పనులు చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. వారు బాల నేరస్తులు కాకుంటే కోర్టుకు తీసుకెళతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment