juvenile
-
పోర్షే కారు కేసు: ‘నిందితుడిని మేజర్‌గా పరిగణించండి’
ముంబై: పుణెలో సంచలనం రేపిన పోర్షే కారు రోడ్డు ప్రమాదం ఘటన పూర్తి నివేదికను పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు(జేజేబీ)కి అందజేశారు. పూర్తిగా విచారించేందుకు నిందితుడిని మేజర్‌గా పరిగణించాలని పోలీసులు గతంలో జేజేబీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ అభ్యర్థనకు మద్దతుగా కేసులోని పూర్తి వివరాలు, సాక్ష్యాధారాల నివేదికను క్రైం బ్రాంచ్ పోలీసులు జేజేబీకి అందజేశారు. చదవండి: రీల్‌ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!‘‘ రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను జేజేబీకి సమర్పించాం. ఈ రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడే కీలకంగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు( మే 19) సాయంత్రం నుంచి ప్రమాదం జరిగే సమయంలో అన్ని సాక్ష్యాలు సేకరించాం. ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్నాం. మైనర్ బాలుడు కారు నడిపినట్లు ప్రత్యక్ష సాక్షి చూశాడు. విచారణ సమయంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాం. కోసీ రెస్టారెంట్, బ్లాక్ క్లబ్ రెస్టారెంట్లో మద్యం సేవించినట్లు గుర్తించాము. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణానికి కారణం మైనర్ బాలుడే. ఇలా.. మైనర్ బాలుడికి సంబంధించి పూర్తి వివరాలు జేజేబీకి అందించాం’’ అని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇప్పటికైనా మేజర్‌గా పరిగణించి విచారించేందుకు సహకరిచాలని జేజేబీని క్రైం బ్రాంచ్ అధికారి కోరారు.ఈ కేసులో మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయడానికి అతని తల్లిదండ్రులు, సాసూన్ హాస్పిటల్ డాక్టర్ల సాయం తీసుకున్నారు. దీంలో విచారణలో వారి నిర్వాకం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేయగా జైలులో ఉన్నారు. బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయడానికి ప్రయత్నించిన మైనర్ బాలుడి తండ్రికి, డాక్టర్లకు మధ్యవర్తులుగా పనిచేసిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పుణె పోర్షే కేసు: ‘ నాకేం గుర్తు లేదు.. అప్పడు తాగి ఉన్నా..!’ -
బ్యాంకును కొల్లగొట్టిన పిల్లలు!
పిల్లలకు ఆటలంటే ఎంతో ఇష్టమనే సంగతి మనందరికీ తెలిసిందే. కొందరు పిల్లలు ఇండోర్ గేమ్స్‌ను ఇష్టపడతారు. మరికొందరు పిల్లలు బయట ఆడుకుంటారు. అయితే టైమ్ పాస్ కోసం బ్యాంకును కొల్లగొట్టిన చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఎప్పుడు ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నకిలీ పిస్తోళ్లతో దొంగ, పోలీసు ఆట ఆడే వయసు కలిగిన ముగ్గురు చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. ఈ పిల్లల వయస్సు కేవలం 11, 12, 16 ఏళ్లేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ వింత కేసు వెలుగు చూసింది. ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం ముగ్గురు బాలులు కలిసి టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని స్థానిక బ్యాంకును దోచుకున్నారు. మార్చి 14న గ్రీన్‌పాయింట్ ప్రాంతంలోని వెల్స్ ఫార్గో బ్యాంక్‌కు వెళ్లి క్యాషియర్‌కు బెదిరింపు నోట్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. తరువాత వారు బ్యాంకులోని డబ్బు కొల్లగొట్టి, అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీసీటీవీని పరిశీలించగా చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారని తెలిసి ఆశ్చర్యపోయారు. రిటైర్డ్ జువెనైల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి మైక్ ష్నైడర్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కేసును చూడటం ఇదే మొదటిసారన్నారు. హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం చిన్నారులు దోపిడీకి పాల్పడిన సమయంలో క్యాషియర్‌కు తుపాకీ చూపించలేదు. అయితే వారు తమ వద్ద ఆయుధం ఉందని పేర్కొంటూ క్యాషియర్‌కు బెదిరింపు నోట్ ఇచ్చారు. తరువాత డబ్బు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ సంఘటన తర్వాత ఈ ముగ్గురు దొంగల(పిల్లల) చిత్రాలతో కూడిన పోస్టర్లను పోలీసులు వివిధ ప్రదేశాలలో అతికించారు. ఈ పోస్టర్లను చూసిన ఆ చిన్నారుల తల్లిదండ్రులు వారిని పోలీసులకు అప్పగించారు. -
జార్జియాలో క్లర్క్ గా పనిచేస్తోన్న భారతీయుడి హత్య..
న్యూయార్క్: జార్జియాలోని రెన్స్ ఫుడ్ మార్ట్ లో గుమాస్తాగా పనిచేస్తోన్న భారతీయుడు మణిందర్ సింగ్ ను ఇద్దరు ఆగంతకులు కాల్చి చంపారు. 36 ఏళ్ల మణిందర్ సింగ్ అనే భారతీయుడు అగస్టాలోని రైసర్ రోడ్డులో ఉన్న రెన్స్ ఫుడ్ మార్ట్ లో పని చేస్తున్నాడు. నెలరోజుల క్రితమే మణిందర్ ఇక్కడ క్లర్క్ గా చేరాడు. అతడి భార్య, తల్లితో కలిసి అక్కడ దగ్గర్లోనే నివాసముంటున్నాడు. జూన్ 28న మణిందర్ యధావిధిగా ఫుడ్ మార్ట్ లో విధులు నిర్వర్తిస్తుండగా 15 ఏళ్ల వయసుండే ఇద్దరు టీనేజర్లు స్టోర్ లోకి తుపాకులతో వచ్చి మణిందర్ ను మొదట బెదిరించి దోచుకోవాలనుకున్నారు. కానీ మణిందర్ వారిని అడ్డుకోబోవడంతో వారిద్దరూ కాల్పులు జరిపారు. దీంతో మణిందర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రెన్స్ పోలీసులు మాట్లాడుడుతూ.. హంతకులిద్దరి వయసు 15 ఏళ్ళు ఉంటుంది, పరిపక్వత లేని కారణంగా వారు మాస్కులు ధరించలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని చాలా తేలిగ్గా గుర్తించాము. ఒకతన్ని కేవలం నాలుగు గంటల్లోనే పట్టుకున్నామని రెండో వ్యక్తిని ఎనిమిది గంటల్లో పట్టుకుని జువైనల్ కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మణిందర్ సింగ్ మృతికి సంబంధించిన వార్త అమెరికాలోని భారతీయులకు దావానలంలా విస్తరించింది. మణిందర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు వారు "గో ఫండ్ మి" ద్వారా ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు.. -
సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. మైనర్‌కు స్పెషల్ టాస్క్!
న్యూఢిల్లీ: మొహాలీలోని పంజాబ్ పోలీసు హెడ్‌క్వార్టర్‌పై మే 9న జరిగిన గ్రెనేడ్ దాడి ఘటనలో ఓ జువైనల్‌తో సహా ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. వారిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను హత్య చేసే పనిని అరెస్టైన జువైనల్ (మైనర్)కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్‌తో పాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసిన మరో వ్యక్తిని అర్షదీప్ సింగ్‌గా గుర్తించారు. ఆగస్టు 4న హరియాణాలో ఐఈడీని స్వాధీనం చేసుకున్న కేసులో నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడ్డ నిందితుడు లారెన్స్ బిష్ణోయ్, జగ్గూ భగ్వాన్ పూరియాలు.. సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలని మైనర్‌తో పాటు దీపక్ సురాక్పుర్, మోను దగర్‌కు బాధ్యతలు అప్పగించారు. పంజాబ్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై గ్రెనేడ్ దాడిలో అరెస్టయిన జువైనల్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన వ్యక్తి కాగా.. దీపక్ హరియాణాలోని సురఖ్పుర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ‘మహారాష్ట్ర నాందెడ్‌లో ఏప్రిల్ 5న బిల్డర్ సంజయ్ బియాని హత్య కేసులో జువైనల్ నిందితుడు. అలాగే.. గత ఏడాది ఆగస్టు 4న అమృత్‌సర్‌లో గ్యాంగ్‌స్టర్ రాణా కండొవాలియా హత్య కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు.. పంజాబ్‌లోని తరణ్ తరణ్ ప్రాంతానికి చెందిన అర్షదీప్ సింగ్.. కరుక్షేత్ర ప్రాంతంలో ఐఈడీ రికవరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే.. మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాలో నిందితుడు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జువైనల్‌తో పాటు అర్షదీప్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలని లారెన్స్ బిష్ణోయ్, సురఖ్పుర్, దగర్‌లు తనకు టాస్క్ ఇచ్చినట్లు జువైనల్ తెలిపాడు. ఆ తర్వాత ఖాన్ కన్నా ముందు కొండవాలియాను హత్య చేయాలని సూచించటంతో అతడిని హతమార్చారు. దర్యాప్తులో వెల్లడించిన మరిన్ని కేసులను పరిశీలిస్తున్నాం’ అని పోలీసు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ప్రియుడంటే కియారాకు ఎంత ప్రేమో, వైరల్ వీడియో -
నేరాల్లో దిట్ట.. జువైనల్ హోం సిబ్బంది కళ్లుగప్పి..
సాక్షి, కాచిగూడ: నింబోలి అడ్డలోని బాలికల జువైనల్ హోం నుంచి ఓ యువతి పారిపోయిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్ కుమార్తె సమ్రీన్(18) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వివిధ నేరాలకు సంబంధించి నెల రోజుల క్రితం బాలికా సదన్‌కు తీసుకువచ్చారు. సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో సమ్రీన్ సిబ్బంది కళ్లుగప్పి ప్రధాన గేట్ తాళం తీసుకుని పారిపోయింది. విషయం తెలుసుకున్న బాలికా సదన్ సిబ్బంది ప్రమీల కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్భయ కేసు: ఆ మైనర్ ఇప్పుడెక్కడా?!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. ఢిల్లీలోని తీహార్ సెంట్రల్ జైలులో జైలు నెంబర్ 3లో ఈరోజు ఉదయం 5:30 గంటలకు వారిని ఉరితీశారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగిక దాడి చేసి.. అతి కిరాతకంగా చంపేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. మరో వ్యక్తి మైనర్ అని తేలింది. దీంతో అతనికి జువైనల్ యాక్ట్ కింద జైలు శిక్ష విధించి విడుదల చేశారు. ప్రస్తుతం అతను దక్షిణ భారత దేశంలో.. రహస్య జీవితాన్ని గడుపుతున్నట్టు తెలిసింది. (చదవండి: నిర్భయ దోషులకు ఉరి అమలుపై మోదీ) ఢిల్లీకి 220 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ గ్రామానికి చెందిన సదరు మైనర్‌కు బస్సు ఓనర్ రామ్ సింగ్.. క్లీనర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. 11 ఏళ్లకే ఇళ్లు వదిలి వచ్చిన ఆ మైనర్‌ను రామ్ సింగ్ చేరదీశాడు. నిర్భయ ఘటన సమయంలో మైనర్ కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడని నిరూపణ అయింది. రేప్ కేసులో దోషిగా తేలిన మైనర్‌ను కొన్నాళ్లు జైలులో ఉంచారు. ఆ తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. అయితే, అతన్ని ఢిల్లీకి దూరంగా పంపేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇక ఎప్పుడూ అతని ముఖాన్ని కప్పిఉంచడం వల్ల ఆ మైనర్‌ను ఎవరూ గుర్తుపట్టలేరు. అతని ఆనవాళ్లు ఎవరికీ తెలియదు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతను ఓ వంటవాడిగా జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం. అతనిపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉంటుంది. (చదవండి: నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!) -
స్కూల్ మానేసిన అబ్బాయిలు పెద్ద నేరం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాల సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఓ యువతిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి జరిగిన ఘటన మరువకముందే జహంగిపురి ప్రాంతంలో మరో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఐదుగురు జువెనైల్స్ కలిసి ఓ మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి తెలిసినవాళ్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తాం అని బెదిరించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఐదుగురు జువెనైల్స్ జహంగిరి ప్రాంతంలోని మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ వద్ద భవనం వెనుకకు ఆమెను రాత్రి 10గంటల ప్రాంతంలో బలవంతంగా తీసుకెళ్లారు. ఆమె అరిచే ప్రయత్నం చేసినా గొంతు నొక్కిపట్లి అరిస్తే చంపేస్తామని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు కూడా బాధితురాలు ఉండే ప్రాంతంలో ఉండేవారేనని, మధ్యలోనే స్కూల్ మానేసిన వీరు చెత్త డంపింగ్ యార్డ్‌లో పనులు చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. వారు బాల నేరస్తులు కాకుంటే కోర్టుకు తీసుకెళతామని చెప్పారు. -
జువెనైల్ జస్టిస్ బోర్డు మెంబర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సెంట్రల్ : జువెనైల్ జస్టిస్ బోర్డు మెంబర్ల ఎంపికకు ఈనెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం పర్యవేక్షణాధికారి యల్లప్ప ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ది డైరెక్టర్ జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసు, వెల్ఫేర్/ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ శాఖ, డోర్ నంబర్ 31–1–3ఎన్, సర్దార్ పటేల్ రోడ్డు, మారుతీనగర్, విజయవాడ–520004 అడ్రస్సుకు దరఖాస్తులు పంపాలన్నారు. వివరాలకు http://wcdsc.ap.nic.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలన్నారు. -
ఆ బాల నేరస్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది.. నలుగురు దోషులకూ మరణ శిక్ష కూడా ఖరారైంది. అయితే ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు దోషుల్లో ఒకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా మరొకరు మాత్రం బాల నేరస్తుడు కావడంతో.. మూడేళ్ల పాటు బోస్టన్ స్కూల్లో ఉన్న తర్వాత విడుదల చేసేశారు. ఇప్పుడు ఈ తీర్పుతో ఏమాత్రం సంబంధం లేకుండా స్వేచ్ఛా ప్రపంచంలో తిరుగుతున్న ఆ బాల నేరస్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. ఇప్పుడు కొత్త జీవితంలో సెటిలైపోయాడు. అతడికి ఇప్పుడు 23 ఏళ్ల వయసు. తన సొంత ప్రాంతానికి దూరంగా.. దక్షిణాదిన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియకుండా ఒక ధాబాలో వంటవాడిగా పని చేసుకుంటున్నాడు. సర్వసాధారణంగా ఈ తీర్పు రాగానే మరోసారి టీవీ చానళ్ల కళ్లన్నీ అతడిమీదే పడతాయి కాబట్టి, అతడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ చెప్పడం లేదు. చివరకు అతడు పనిచేసే ధాబా యజమానికి కూడా అతడు ఫలానా అని తెలియదు. ఆ బాల నేరస్తుడి పునరావాసం బాధ్యతలు చూస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు మాత్రమే ఈ విషయాలన్నీ తెలుసు తప్ప.. వేరెవ్వరికీ అతడెవరో కూడా తెలిసే అవకాశం ఏమాత్రం లేదు. జైలు నుంచి విడుదలైన ఏడాది తర్వాత అతడిని దక్షిణాదిన ఒక ధాబాలో వంటవాడిగా చేర్చినట్లు మాత్రం తెలిపారు. 2015 డిసెంబర్ 20వ తేదీన అతడు విడుదలయ్యాడు. కొన్నాళ్ల పాటు ఒక స్వచ్ఛంద సంస్థ వద్ద ఉన్నాడు. ఆ తర్వాత వంటవాడిగా వచ్చేశాడు. ఢిల్లీకి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి నుంచి 11 ఏళ్ల వయసులో అతడు పారిపోయి వచ్చేశాడు. అతడి తల్లి, తండ్రి ఇద్దరూ అనారోగ్యంతో మంచం పట్టగా, మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులను అతడి అక్క మాత్రమే పోషిస్తుంది. అతడు ఢిల్లీ వచ్చిన తర్వాత నిర్భయ కేసులో మరో నిందితుడైన రామ్‌సింగ్ పంచన చేరాడు. అతడి దగ్గర బస్సు క్లీనర్ పనిలో కుదురుకున్నాడు. బోస్టన్ స్కూల్లో ఉన్నప్పుడు అతడు చాలా క్రమశిక్షణతో ఉండేవాడని అంటున్నారు. అక్కడినుంచి బయటకు వచ్చిన తర్వాత భక్తిమార్గంలోకి వెళ్లిపోయాడు. గెడ్డం పెంచుకుని రోజుకు 5 సార్లు నమాజ్ చేసేవాడు. మొదట్లో అతడిని ఒంటరిగా ఉంచేవారు. కానీ తర్వాత హైకోర్టు పేలుడు కేసు నిందితుడితో కలిసి ఒక డార్మిటరీలో ఉంచారు. వంట అంటే అతడికి చాలా ఇష్టం. దాంతో అక్కడ సిబ్బంది చేసే వంటల్లో కూడా సాయం చేసేవాడు. తరచు మిగిలిన వాళ్లు కూడా అతడి వంటల కోసం అడిగేవారట. బయటకు వచ్చిన తర్వాత కూడా అందుకే వంట పనిలో కుదురుకున్నాడు. అయితే, పాత నేరచరిత్ర దృష్ట్యా ఇంటెలిజెన్స్ బ్యూరో మాత్రం అతడి మీద ఓ కన్నేసి ఉంచింది. -
పోలీసుల అదుపులో బాల నేరస్తులు
ఏలూరు అర్బన్ : నగరంలోని పలుఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు బాల నేరస్తులను టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం కోర్టుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని ఇళ్లలో దొంగతనాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో టూటౌన్ పోలీసులు కొంతకాలంగా అనుమానితులపై నిఘా పెట్టారు. తంగెళ్లమూడికి చెందిన నలుగురు బాలురు నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితులు తంగెళ్లమూడి వంతెన వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారంతో టూటౌన్ సీఐ ఉడతా బంగార్రాజు, ఎస్సై అల్లు దుర్గారావు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 185 గ్రాముల బంగారు నగలు, సుమారు 750 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. -
ఆమె కోసం వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన మహిళతో ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తనే రమ్మందని చెప్పి ఆమెను కూడా పోలీసులకు పట్టించాడు. టీవీలో క్రైమ్ డ్రామాను మరిపించేలా ఉన్న ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ఫేస్బుక్లో 'జిందా' పేరుతో ఉన్న 26 ఏళ్ల మహిళతో బాలుడు పరిచయం పెంచుకున్నాడు. సోమవారం వారిద్దరూ వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో కలుసుకున్నారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె హఠాత్తుగా పోలీసులకు ఫోన్ చేసింది. తనపై అతడు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏకాంతంగా గడపడానికి రావాలని ఆమె కోరిందని, తాను తిరస్కరించినా పదేపదే అడగడంతో కాదనలేక వచ్చానని పోలీసులతో బాలుడు చెప్పాడు. దీంతో ఇద్దరిపైనా పోలీసులు కేసు పెట్టారు. బాలుడిపై అత్యాచారం కింద, మహిళపై 'పోస్కో' చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదంతా 'హనీట్రాపింగ్'లో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. -
ఆ జువైనల్ కు ఐఎస్ తో అనుబంధం?
నిర్భయ కేసులో దోషిగా ఉన్న బాల నేరస్థుడుపై మరిన్ని అభియోగాలు వెలుగు చూస్తున్నాయి. అతడు సంక్షేమ గృహంలో ఉన్నపుడు కాశ్మీర్ జిహాదీల్లో చేరే ఆలోచనలో ఉన్నట్లుగా అనుమానించిన నిఘా వర్గాలు... తాజాగా అతడికి ఐసిస్ తో అనుబంధాలు ఉన్నట్లు చెప్తున్నాయి. ఢిల్లీలో మెడికల్ విద్యార్థినిపై బస్సులో అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డ బాల నేరస్థుడికి జిహాదీలతో సంబంధాలు ఉన్నట్లుగా ఇంటిలిజెన్స్ వర్గాలు మరోమారు అనుమానిస్తున్నాయి. కేసులో మూడు సంవత్సరాల నిర్బంధ శిక్ష అనంతరం అతని విడుదల విషయంలో అనేక అభ్యంతరాలు వెల్లడైన విషయం తెలిసిందే. అతడు తిరిగి సమాజానికి ఎటువంటి హాని తలపెట్టడని హామీ ఇవ్వాలంటూ విడుదలకు ముందు కోర్టుకు అభ్యర్థనలూ వెల్లువెత్తాయి. అదే నేపథ్యంలో స్పందించిన కేద్రం ఢిల్లీ హైకోర్టుకు ఇంటిలిజెన్స్ రిపోర్టును సమర్పించింది. జువైనల్.. సంక్షేమ గృహంలో ఉన్నపుడు జిహాదీల్లో చేరేందుకు యోచించినట్లు హోం వ్యవహారాల శాఖ కూడ నివేదిక ఇచ్చింది. చివరికి 2015 డిసెంబర్ లో జువైనల్ సంక్షేమ గృహంనుంచీ అతడు విడుదలయ్యాడు. కాగా ప్రస్తుతం ఆ నేరస్థుడు కొన్ని ప్రత్యేక నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించి, అధికారులను అప్రమత్తం చేశాయి. అతడిపై ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్చరించాయి. కానీ అతడిగురించిన ఏ ఇతర వివరాలనూ వెల్లడించలేదు. ఉత్తర ప్రదేశ్ లోని నిఘా వర్గాల ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్భయ గ్యాంగ్ రేప్ నేరస్థుడి కదలికలను నిఘానేత్రంతో గమనిస్తున్నారు. కాశ్మీరీ యువత.. సదరు జువైనల్ ను జిహాదీల్లో చేరాలని ప్రేరేపిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. రాష్ట్రంలోని బదౌన్ జిల్లాకు చెందిన 21 ఏళ్ళ ఆ నేరస్థుడిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆర్నెల్లక్రితం రిఫార్మ్ హోమ్ లో మూడేళ్ళ శిక్షను పూర్తి చేసుకొని బయటపడ్డ అతడు మరో ఐదుగురితో కలసి అతి క్రూరంగా గ్యాంగ్ రేప్ జరిపిన (నిర్భయ) కేసు... 2012 లో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రేపింది. అంతేకాదు ఇండియాలో మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రపంచం దృష్టి పడేలా చేసింది. -
‘బదులు’ తీర్చుకునే శిక్ష.. సంస్కరణేనా?
సందర్భం: జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2000 (జె.జె. యాక్ట్ బాల న్యాయ చట్టం)కు 2014లో రాసిన ముసాయిదా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. గతంలోనే లోక్‌సభ ఆమోదించింది కనుక ఇది చట్టంగా మారింది. దీని ప్రకారం దారుణ నేరాలు (అంటే ఏమిటో నిర్వచనం చెప్పలేదు) చేసినవారు 16 -18 ఏళ్ల మధ్యవారయినా వారిని జువెనైల్ బోర్డు విచారించి పెద్దలతో సమానంగా సాధారణ కోర్టులకు, తర్వాత శిక్ష పడితే పెద్దల జైలుకు పంపవచ్చన్నమాట. సవరణకు ప్రధాన కారణం నిర్భయ కేసులో ఒక నిందితుడు మైనర్ కావడం వలన మూడేళ్ల జువెనైల్ హోమ్‌లో ఉండి విడుదల కావటం. నిర్భయ తల్లిదండ్రుల దుఃఖాన్ని, దానికి లభిస్తున్న సానుభూతిని, దానిలో అంతర్గతంగా దాగిన.. గత మూడేళ్లుగా అత్యాచారాలు తగ్గడం లేదన్న ఆక్రోశాన్ని ఉపయోగించి భిన్నాభిప్రాయాల్ని రాజ్యసభలో పూర్వపక్షం చేశారు. దారుణ ఘటనను అందరూ నిరసించాలి. అయితే ఏ శిక్ష కూడా ఒక ప్రజాస్వామ్య నాగరిక న్యాయ వ్యవస్థలో ‘బదులు’ తీర్చుకునేదిగా ఉండరాదు. ఒక పరిణతి చెందిన సమాజం ఎంతో అరుదైన, ఘోరమైన ఒక నేరం వల్ల పెల్లుబికిన దుఃఖంపై ఆధారపడి చట్టాలు చేయడం న్యాయం మౌలిక సూత్రాలకే భంగం కలిగిస్తుంది. ఈ చట్టం కావాలన్న వారు.. 16-18 ఏళ్ల కౌమార వయస్కులు లైంగిక నేరాలు చేయడం వేగంగా పెరుగుతున్నదనీ, ఈ కాలంలో బాలల్లో మానసిక పరిణతి చాలా వేగంగా జరుగుతున్నదనీ, వయస్సును అడ్డం పెట్టుకుని నేరాలు నిర్భయంగా చేస్తున్న వారికి కఠిన శిక్ష తప్పవనే సందేశం పంపాలనీ, దానివల్ల స్త్రీలు, బాలికలకు రక్షణ లభిస్తుందనీ చెబుతున్నారు. ఇక మానసిక పరిణతికి సంబంధించి చూస్తే.. కౌమార వయస్సులో మానసిక, శారీరక భావోద్వేగ పరమైన, మెదడులో నిర్మాణాత్మకమైన తీవ్ర మార్పులు జరుగుతాయని బాలలతో పని చేసే వారందరికీ తెలుసు. మెదడులో వైట్ మ్యాటర్ పెరిగి, గ్రే మ్యాటర్ తగ్గుతుంది. భావోద్వేగాల నియంత్రణ విభాగానికి, అనుభూతి సమాచార విభాగానికి మధ్య పూర్తిస్థాయి సమన్వయం 16 ఏళ్లతో ప్రారంభమై 20 ఏళ్ల దాకా కొనసాగుతుంది. 16 ఏళ్లకే పోటీలకు సంబంధించిన నిర్ణయాలు చేయగలిగే శక్తి ఏర్పడుతుంది. కాని చేస్తున్నది తప్పని తెలిసినా, దాని ఆధారంగా నియంత్రించుకునే శక్తి ఇంకా ఏర్పడదు. అట్లాగే ప్రమాదాన్ని ఫలితాల్ని, చట్టాల్ని, శిక్షల్ని తక్కువగా ఊహిస్తారు. ప్రతికూల ప్రభావాలు పనిచేయటం, స్థిరత్వం దూరదృష్టి లేకపోవడం ఈ 16-18 ఏళ్ల వయస్సు లక్షణాలు - వారిని పెద్దలుగా భావించి విచారించవచ్చనడాన్ని ఏ అధ్యయనమూ ఆమోదించడం లేదు. కనుకనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ సవరణల బిల్లును రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన అని చెప్పినా కేబినెట్ దాన్ని ఖాతరు చేయలేదు. ఇక కఠిన శిక్షల విషయం చూస్తే అమెరికా 90లలో బాలల నేరాల పట్ల తీవ్ర చర్యలు చేపట్టింది. కొన్ని రాష్ట్రాల్లో 10 ఏళ్ల వారినైనా పెద్దలతో సమంగా విచారించవచ్చు. కాని అనేక పరిశోధనల ఫలితంగా 2005 నుండి వైఖరి మార్చుకుంటున్నది. ఈ కఠిన శిక్షల వల్ల నేరాల నివారణ జరగలేదు సరికదా కరడుగట్టిన నేరస్తులతో గడిపి అత్యాచారాలకు ఎర అయ్యి ఈ బాలలు కరడుగట్టిన నేరస్తులుగా సమాజంలోకి ప్రవేశిస్తున్నారు. కనుకనే ఇప్పుడు జైళ్లు మూసి వేసి ఆ డబ్బు పునరావాసంపైనా, కమ్యూనిటీలో భాగంగా బాలల్ని సరిదిద్దడం పైనా ఖర్చు చేయాలని ప్రయత్నం చేస్తున్నది. ఈ చట్టం వల్ల కౌమార ప్రేమికులు నేరస్తులుగా ముద్రపడి పెద్దల జైలుకి వెళతారు. బాలనేరస్తులు పెద్దల జైలుకే వెళతారు. మన జైళ్లలో ఖైదీలలో పరివర్తన తెచ్చే ప్రయత్నం అటుంచి వారిని మనుషులుగా కూడా పరిగణించరు. అంటే 7 ఏళ్లు, 10 ఏళ్లు శిక్ష అనుభవించిన జైలు అనుభవంతో జిత్తులు నేర్చిన నేరస్తులుగా బాలలు యువకులుగా సమాజంలో తిరిగి ప్రవేశించడం దేనికి దారితీస్తుంది? దారుణ నేరాలు చేసిన బాలల కోసం ప్రత్యేక విచారణ, స్వల్పకాలపు శిక్షలు సంస్కరణా సంస్థలు ఎందుకు ఆలోచించకూడదు. ఒకసారి నేరం చేస్తే దాన్ని సరిచేసుకునే అవకాశం ఇవ్వకపోవటం ఏ మానవత్వానికి ప్రతీక? కఠిన శిక్షల బెదిరింపు పనిచేస్తే ‘నిర్భయ’ సవరణల తర్వాత లైంగిక దాడులు తగ్గాలి కదా! పెద్దలే శిక్షలకు భయపడనప్పుడు వివక్షపై అంచనా సరిగా లేని ఉద్రేకపూరిత కౌమార వయస్కులను ఈ కఠినత్వం ఆపుతుందా? ఈ బాలనేరస్తుల్లో 55 శాతం మంది కుటుంబ ఆదాయం ఏడాదికి 25 వేలు. వలసలు, ఛిద్రమైన కుటుంబాలు, బూతును నిరంతరం చూడటం, వారు చిన్నప్పటి నుండి శారీక, మానసిక, లైంగిక హింసకు బాధితులుగా ఉండటం, అత్యధికులు ప్రాథమిక విద్యలేని వారు కావడం, ఇంటాబయటా నిర్లక్ష్యానికి ఎరకావడం.. బాల నేరస్తుల జీవిత సాధారణ సత్యాలు.. ఒక కనీసపు బాల్యాన్ని భద్రతని చివరికి ఆహారాన్ని కూడా ఇవ్వడంలో విఫలమైన సామాజిక రాజకీయ వ్యవస్థలు వారిని నేరస్తులుగా మార్చడానికి బాధ్యులు కాదా? ఇప్పటికైనా ఈ నేరమయ ప్రవర్తనల మూలాలకు బాధ్యత తీసుకుని బాలలకు మరొక అవకాశం ఇవ్వడం ఈ వ్యవస్థల కనీస ధర్మం కాదా? జువెనైల్ హోమ్స్ ఏ సౌకర్యాలూ లేకుండా అత్యాచారాలకు మాదకద్రవ్యాలకు నిలయాలుగా ఉన్నా యని జస్టిస్ వర్మ కమిషన్ పేర్కొంది. వాటిని బాగు చేయటం ఎవరి బాధ్యత? నిర్భయ సవరణలలో 16 ఏళ్లలోపు అని ఒకచోట 18 ఏళ్లలోపు అని మరొక చోట బాలల వయస్సు రాశారు. 15ఏళ్లు దాటిన బాలికతో ఆమె భర్త లైంగిక సుఖం పొందితే (అతని వయస్సు ఎంతైనా) నేరం కాదని రాశారు. అంటే 18ఏళ్లలోపు మైనర్ బాలికల్ని లైంగిక అత్యాచారం చేసే హక్కుని నిర్భయంగా భర్తలకే కట్టబెట్టిన దేశం.. ఏ స్త్రీలకి రక్షణ కల్పిస్తుంది? ఒకే చట్టంలో, వివిధ చట్టాల్లో పరస్పర విరుద్ధాంశాలు ఏ రకమైన న్యాయం చేస్తాయి? వీటినెందుకు పట్టించుకోరు? ఈ సవరణలు రాజ్యాంగ స్ఫూర్తిని, బాలలుగా ఒక కొత్త జీవితాన్ని పొందే హక్కుని, అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందంలో 37, 38 ఆర్టికల్‌ని- ఉల్లంఘిస్తున్నాయి. కనుకనే సుప్రీంకోర్టు ‘‘మీరు అతడ్ని నిరవధికంగా నిర్బంధించాలని కోరుతున్నారా? సంస్కరించాలని కోరుతున్నారా?’’ అని ప్రశ్నించింది. బాలలకు విధించే ఏ శిక్షయినా సంస్కరణకూ పునరావాసానికి దారితీయాలి. కొత్త నేరస్తుల్ని ఉత్పత్తి చేయడానికి కాదు. వ్యాసకర్త సామాజిక కార్యకర్త, దేవి మొబైల్ : 9848622829 -
నేరము-శిక్ష
చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఒక బిల్లును చట్టసభ ఆమోదించడం సాధారణ మైన విషయమే. కానీ మంగళవారం రాజ్యసభ ఆమోదించిన జువనైల్ జస్టిస్ చట్టం సవరణ బిల్లు తీరే వేరు. నిర్భయ ఉదంతంలో మూడేళ్ల శిక్ష పూర్తిచేసుకున్న బాల నేరస్తుడి విడుదల సందర్భంగా మొదలైన ఆందోళనలూ, వాదోపవాదాలూ ఇంత కాలంనుంచి పెండింగ్‌లో ఉన్న ఆ సవరణ బిల్లు హడావుడి ఆమోదానికి దారి తీశాయి. కాంగ్రెస్‌తోసహా వివిధ పక్షాలు తమ వైఖరులను చివరి నిమిషంలో సవరించుకోవడంవల్ల బిల్లు ఆమోదం సులభమైంది. ఇది చట్టమైతే బాలురలో పెరిగిపోతున్న నేర స్వభావానికి అడ్డుకట్టవేయడం సాధ్యమవుతుందని బిల్లుపై చర్చను ప్రారంభించిన కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ అభిప్రాయపడ్డారు. కఠిన చట్టాలనేవి సమాజంలో నేర నిరోధానికి తోడ్పడతా యన్నది నిజమే కావొచ్చుగానీ...వాటికవే ఒక మంచి సమాజాన్ని నెలకొల్పలేవు. అది సుసాధ్యం కావడానికి దోహదపడే ఎన్నో అంశాల్లో చట్టాలు ఒక భాగం. ముఖ్యంగా అలాంటి నేరాలకు దోహదపడుతున్న అవిద్య, పేదరికం, మహిళలను కించపరిచే ధోరణుల వంటివాటిని నియంత్రించడం... క్రిమినల్ కేసుల్లో సత్వర విచారణ జరిగి నేరస్తులకు శిక్షపడేలా చూడటం ఎంతో ముఖ్యం. అత్యాచారం విష యమై భారీయెత్తున ఆందోళన జరగడం ఇటీవలికాలంలో ఒక్క నిర్భయ ఉదంతం లో మాత్రమే సంభవించింది. ఆ స్థాయి ఉద్యమమైనా మన వ్యవస్థల్లో చురుకు దనం తీసుకురాలేదని గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఢిల్లీలోని వివిధ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో మహిళలపై, బాలికలపై నేరాలకు సంబంధించి మూడేళ్లుగా 3,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే మహిళపై జరిగే నేరాల్లో 26 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఢిల్లీలో పరిస్థితి కాస్త మెరుగు. అక్కడ 42 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. ఇలాంటి అంశాల్లో లోతైన చర్చ జరిగి కేసులు పెండింగ్‌లో ఉండటానికీ, నేరస్తులు తప్పించుకోవడానికీ దోహదపడుతున్న కారణాలను నిగ్గుదేల్చి సరిదిద్దితే ఫలితం ఉంటుంది. ఇలాంటి అంశాలపై దృష్టి సారించకుండా మహిళల సంరక్ష ణకూ, బాలల హక్కులకూ మధ్య పోటీపెట్టే స్థితి ఏర్పడటం దురదృష్టకరమైనది. నిర్భయ ఉదంతంలో నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సైతం లైంగిక నేరాలను అదుపు చేయడానికి అలాంటి కేసుల సత్వర విచారణ మాత్రమే తోడ్పడు తుందని స్పష్టంగా చెప్పింది. బాల నేరస్తుల వయసును సవరించాలన్న వాదనతో ఆ కమిటీ ఏకీభవించలేదు. మూడేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో నిర్భయ ఉదంతం చోటుచేసుకున్న ప్పుడే అందులో పాలుపంచుకున్న బాలుడి గురించి విస్తృతంగా చర్చ జరిగింది. మిగిలిన నలుగురు నిందితులకూ ఉరిశిక్షలు పడగా, బాల నేరస్తుణ్ణి మూడేళ్లపాటు రిమాండ్ హోంకు పంపారు. మిగిలిన నేరస్తులకు ఏమాత్రం తీసిపోకుండా నేరంలో పాలుపంచుకున్న ఆ బాలుడికి అంత తక్కువ శిక్షతో సరిపెట్టడం న్యాయం కాదని అప్పట్లోనే కొందరు మహిళా సంఘాల నేతలూ, న్యాయవాదులూ వాదించారు. ఇప్పుడూ అలాంటి వాదనలే ముందుకొచ్చాయి. అతని విడుదలను అడ్డుకోవ డానికి ఢిల్లీ హైకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి, సుప్రీంకోర్టులో ఢిల్లీ మహిళా కమిషన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని అనుసరించి అతడి విడుదలను అడ్డుకోవడం సాధ్యపడదని రెండు కోర్టులూ తీర్పునిచ్చాయి. రాష్ట్రపతి ఆమోదం పొందిన తేదీనుంచి కొత్త చట్టం అమలవుతుంది గనుక నిర్భయ కేసు నిందితుడికి తాజా చట్టం కూడా వర్తించదు. రాజ్యసభలో జువనైల్ చట్టంపై జరిగిన చర్చను ప్రస్తావించుకోవాలి. బిల్లులోని అంశాలపై పలువురు కాంగ్రెస్ సభ్యులు మొదట్లో సంశయాలను వ్యక్తంచేశారు. జువెనైల్ నేరాలు పెరిగిపోతున్నాయన్న మేనకాగాంధీ వాదనను తిప్పికొడుతూ మొత్తం నేరాల్లో బాల నేరస్తుల ప్రమేయం ఉన్నవి 1.2 శాతం మాత్రమేనని చెప్పారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్నదే తమ వాదన అయినా, మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఉన్నందువల్ల ఆ వైఖరిని మార్చుకున్నామని గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. చట్టాల రూపకల్పనలో అయినా, విధానపరమైన నిర్ణయాల్లో అయినా సహేతుకత ప్రాతిపదిక కావాలి తప్ప భావోద్వేగాలది పైచేయి కాకూడదు. జువనైల్ చట్ట సవరణ బిల్లు ఆమోదంలో భావోద్వేగాలపాలు ఎక్కువైందని చెప్పక తప్పదు. నిర్భయ తల్లిదండ్రుల ఆవేదనను అర్ధం చేసుకోవచ్చు. ఉన్నత చదువులు చదివిన కుమార్తె ఉన్నట్టుండి ఉన్మాదుల దుండగానికి బలైపోవడం అత్యంత విషాదరకమైనది. వారు జీర్ణించుకోలేనిది. ఆ నేరగాళ్లను ఉరి తీసి చంపాల్సిందేనని వారు పట్టుబట్టడాన్నీ ఎవరూ తప్పుబట్టరు. బాధితుల వేదన ఆ స్థాయిలోనే ఉం టుంది. రాజ్యసభలో తృణమూల్ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఈ ఆవేదనకే అద్దం పట్టారు. నిర్భయ స్థానంలో తన కూతురు ఉంటే అందుకు కారకులైన దుండ గులను కాల్చిచంపేవాడినన్నారు. వ్యక్తుల్లో ఉండే ఈ ప్రతీకారేచ్ఛ వ్యవస్థకు ఉం డదు. నేరస్తులను దారి తప్పినవారిగా గుర్తించి వారిని సంస్కరించాలని చూస్తుంది. జువనైల్ వయసు 16కు తగ్గించడంవల్ల నేరాలు ఏమేరకు తగ్గుతాయన్న విషయాన్నలా ఉంచి, దానివల్ల వచ్చే దుష్పరిణామాలను, అది దుర్వినియో గమయ్యే ప్రమాదాన్ని పెద్దల సభ పరిగణనలోకి తీసుకోలేదు. టీఆర్ఎస్ నేత కె. కేశవరావు అన్నట్టు మన జువనైల్ హోంలు బాల నేరస్తుల్ని సంస్కరించడానికి బదులు వారిని మరింతగా రాటుదేలుస్తున్నాయి. అలాగే తెలిసీ తెలియని వయసులో ఆడ, మగ పిల్లలు ఇల్లొదిలి వె ళ్లిన సందర్భాల్లో బాలుడిపై కక్ష తీర్చుకోవడం కోసం పిల్ల తల్లిదండ్రులు అత్యాచారం కేసులు పెడుతున్నారని వెల్లడైంది. ఈ తరహా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్టంలో ఎలాంటి ఏర్పాట్లూ లేవు. నిందితుడైన బాలుడు చేసిన నేరం ఎలాంటిదో జువనైల్ జస్టిస్ బోర్డులోని మానసిక నిపుణులు నిర్ణయించాకే కఠిన శిక్ష విధింపు ఉంటుందన్న మేనకాగాంధీ వాదనలో పసలేదు. ఇవాళ చట్టం చేయడానికి దోహదపడిన భావోద్వేగాలు రేపన్న రోజున జువనైల్ జస్టిస్ బోర్డులను ప్రభావితం చేయవన్న గ్యారెంటీ ఏం లేదు. మున్ముందైనా ఈ చట్టం అమలు తీరు ఎలా ఉన్నదో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులకు సిద్ధపడాలి. -
బాల నేరస్తుడిపై సుప్రీంకోర్టు ఏమందంటే..
న్యూఢిల్లీ: బాల నేరస్తుల చట్టాల్లో మార్పులు తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం తమను ఇరకాటంలో పడేస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మూడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరస్తుడు(ప్రస్తుతం 20 ఏళ్లు)ని విడుదల చేయకుండా ఉండాలని ఢిల్లీ మహిళా కమిషన్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది. అవేంటంటే.. మీరు అభ్యర్థించినట్లుగా ఏ చట్టం ప్రకారం మేం ఇంకా అతడిని అదుపులో ఉంచుకోగలం? ఏదైనా జరిగిందంటే అది చట్టానికి లోబడే, చట్ట ప్రకారమే జరిగింది. మేం చట్టానికి అతీతులం కాదు రాజ్యాంగంలోని 21 నిబంధన ప్రకారం ఒక వ్యక్తి హక్కును మేం హరించలేము. చట్టంలో అలాంటి అవకాశం పొందుపరచలేదు. మేం మీ ఆందోళనను అర్ధం చేసుకోగలం.. కానీ, ఈ కేసులో చట్టం మూడేళ్లకు మించి బాల నేరస్తుడిని అదుపులో ఉంచుకునేందుకు అనుమతించదు ఒక వేళ ప్రభుత్వం ఆ మేరకు చట్టంలో మార్పులు చేసే క్రమంలో ఏడు నుంచి పదేళ్ల సమయం పడితే అప్పటి వరకు అతడిని అదుపులో ఉంచుకోగలమా? ఆ విధంగా చేసేందుకు మాకు చట్ట అనుమతి ఏది? అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. -
ఢిల్లీ మహిళా కమిషన్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో బాలనేరస్తుడి విడుదలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. చట్ట ప్రకారం అతడిని మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నిర్బంధించే అవకాశం లేదని ఉన్నత ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆందోళన కారుల అభిప్రాయాల పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, చట్టానికి విరుద్ధంగా ఏమీ చేయలేమని పేర్కొంది. ఈ వ్యవహారంలో కేంద్ర వైఖరిని కూడా ధర్మాసనం తప్పుబట్టింది. కాగా బాల నేరస్తుడి విడుదలను సవాల్ చేస్తూ ఢిల్లీ మహిళ కమిషన్ ...సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పుతో... మహిళా సంఘాలు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయంపై జ్యోతిసింగ్ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరుగుతుందని తనకు తెలుసని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ స్పందన ఇంతకంటే గొప్పగా ఉంటుందని తాను ఆశించలేదన్నారు. అటు ఇది దేశానికి జరిగిన పెద్ద ద్రోహమని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి అభిప్రాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో బాలనేరస్తుడి (జువైనల్)గా ఉన్న నిందితుడు ఆదివారం విడుదలైన విషయం తెలిసిందే. ఆందోళన కారుల తీవ్ర నిరసనల నేపథ్యంలో అతడిని రహస్య ప్రదేశానికి తరలించారు. 2012లో అత్యంత కిరాతకంగా విద్యార్థినిపై అత్యాచారం జరిపిన ఆరుగురు నిందితుల్లో ఒకడైన అతణ్ని విడుదల చేయొద్దని, కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఊపందుకున్న విషయం విదితమే. నిర్భయపై జరిగిన అమానుష హింసలో జువైనల్ పాత్ర కూడా ఉందని, మైనర్ అనే పేరుతో క్షమించరాదని, నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ మహిళా కమిషన్ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖతోపాటు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ మానవహక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించారు. -
'నేరం గెలిచింది.. మమ్మల్ని పాతాళానికి తొక్కారు'
న్యూఢిల్లీ: తమ విషయంలో నేరమే గెలిచిందని ఢిల్లీలో లైంగిక దాడికి గురై ప్రాణాలుకోల్పోయిన నిర్భయ(జ్యోతిసింగ్) తల్లి ఆశాదేవీ అన్నారు. తమ మూడు సంవత్సరాల పోరాటం వృధా అయిందని, శూన్యంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరస్తుడు(ప్రస్తుతం 20 ఏళ్లు) ఆదివారం బాల నేరస్తుల సంరక్షణ గృహం నుంచి విడుదలయ్యాడు. అతడిని తన సొంతప్రాంతం ఉత్తరప్రదేశ్‌కు పంపించకుండా ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు అప్పగించారు. అతడి విడుదల సందర్భంగా నిరసన తెలుపుతున్న నిర్భయ(జ్యోతిసింగ్) తల్లిదండ్రులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రవర్తన తీరు, దేశ న్యాయవ్యవస్థపట్ల వారు తీవ్రంగా కలత చెందారు. మిగిలిన నలుగురు నేరస్తులను కూడా విడిచిపెడతారా అని ప్రశ్నించారు. తమ మూడేళ్ల పోరాటం శూన్యంగా మిగిలిందంటూ కంటతడిపెట్టారు. ఈ న్యాయవ్యవస్థ తమ కుటుంబాన్ని పాతాళానికి తొక్కేసిందని అన్నారు. బాల నేరస్తుల చట్టంలో మార్పులు తీసుకురావడానికి ఇంకా ఎన్ని అత్యాచారాలు, హత్యలు జరగాలి అని కూడా ఆమె ప్రశ్నించారు. -
‘నిర్భయ’ దోషి విడుదల
హైడ్రామా నడుమ విడుదలైన బాల నేరస్తుడు ♦ స్వచ్ఛంద సంస్థకు అప్పగించిన పోలీసులు.. ♦ ‘నిర్భయ’ జ్యోతి సింగ్ తల్లిదండ్రుల ఆగ్రహం; ఢిల్లీలో కొనసాగిన నిరసనలు ♦ విడుదలను అడ్డుకునేందుకు ఢిల్లీ మహిళ కమిషన్ విఫల యత్నం ♦ శనివారం అర్ధరాత్రి దాటాక సుప్రీం కోర్టులో ఎస్ఎల్ పిటిషన్.. ♦ విడుదలపై స్టేకు వెకేషన్ బెంచ్ నిరాకరణ; నేడు విచారణ న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరుస్తుడు(ప్రస్తుతం 20 ఏళ్లు) ఆదివారం బాల నేరస్తుల సంరక్షణ గృహం నుంచి విడుదలయ్యాడు. ఆ బాల నేరస్తుడిని సొంతప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ పంపించకుండా.. అతడి కోరిక మేరకు ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. అక్కడ అతడిపై ఎలాంటి పోలీసు పర్యవేక్షణ ఉండదు. గ్యాంగ్ రేప్ బాధితురాలు జ్యోతి సింగ్ తల్లిదండ్రులు, పలువురు సామాజిక కార్యకర్తలు ఈ ‘నిర్భయ’ దోషి విడుదలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జ్యోతి సింగ్‌పై అమానుష అత్యాచారానికి పాల్పడిన ఆరుగురిలో అత్యంత పాశవికంగా ప్రవర్తించిన వ్యక్తికి.. కేవలం బాల నేరస్తుడన్న కారణంగా మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించి, విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. పరివర్తన చెందేందుకు అవకాశమివ్వాలంటూ విడుదలను మరి కొందరు సమర్ధించారు. నిర్భయ దోషి విడుదలను వ్యతిరేకిస్తూ, అతడికి మరణశిక్ష విధించాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో ఆదివారం కూడా నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. బాల నేరస్తుడి పునరావాసం కోసం రూ. 10 వేలు, కుట్టుమిషన్ అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. విడుదలైన తరువాత ఎక్కడికెళ్లాలనుకుంటున్నావన్న ప్రశ్నకు.. సొంత ప్రాంతమైన యూపీలోని బదాయూకు వెళ్తే తన ప్రాణాలకు ప్రమాదముందన్న భయాన్ని ఆ బాల నేరస్తుడు వ్యక్తపరిచాడని, అందువల్ల అతడి కోరిక మేరకు ఒక ఎన్జీవోకు అప్పగించామని పోలీసు వర్గాలు తెలిపాయి. అర్ధరాత్రి దాటాక హైడ్రామా.. ‘నిర్భయ’ కేసు దోషి విడుదలలో శనివారం రాత్రి నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. ఆ బాల నేరస్తుడి విడుదలను నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను మూడు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆ దోషి విడుదల దాదాపు ఖరారైన సమయంలో.. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలీవాల్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని, బాల నేరస్తుడి విడుదలను అడ్డుకోవాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఈ కేసును.. జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన వెకేషన్ బెంచ్‌కు అప్పగించారు. అనంతరం, జస్టిస్ ఏకే గోయల్ నివాసంలో అత్యవసర విచారణ జరిపిన వెకేషన్బెంచ్.. రాత్రి 2 గంటల సమయంలో బాల నేరస్తుడి విడుదలపై స్టే విధించేందు కు నిరాకరించి, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. విడుదలకు ముందు బాల నేరస్తుడి మానసిక స్థితిని పరీక్షించలేదని లాయర్లు గురుకృష్ణ కుమార్, దేవదత్ కామత్‌లు బెంచ్ ముందు వాదించారు. అలాగే, బాల నేరస్తుల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఈ మూడేళ్ల కాలంలోనూ అతడిలో ఏ విధమైన పశ్చాత్తాపం కనిపించకపోగా, మరింత ఆవేశపూరితంగా మారాడంటూ ఇంటలిజెన్స్ విభాగం నివేదిక ఇచ్చిందని బెంచ్‌కు వివరించారు. ఈ సమయంలో అతడిని విడుదల చేయడం సమాజానికి ప్రమాదకరమని దేవదత్ కామత్ హెచ్చరించారు. కోర్టు పరిధిలో ఉంది.. విడుదల చేయొద్దు విడుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనున్నందున.. ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లినందున ఆ బాల నేరస్తుడిని ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వం విడుదల చేయబోవని ఆశించామని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి తెలిపారు. దీనిపై జువనైల్ జస్టిస్ బోర్డ్‌కు లేఖ కూడా రాశానన్నారు. విడుదలను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని స్వాతి వ్యాఖ్యానించారు. అయితే, చివరి రోజు వరకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా, ఆఖరి క్షణంలో సుప్రీంకోర్టు తలుపు తట్టడాన్ని బాధితురాలు జ్యోతిసింగ్ తల్లిదండ్రులు తప్పుబట్టారు. విడుదలను అడ్డుకోకుండా మూడేళ్లు కాలయాపన చేశారని జ్యోతిసింగ్ తల్లి ఆశాదేవీ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపి, లాఠీ చార్జీలను భరిస్తే కానీ ఈ ప్రభుత్వాలు మాట వినిపించుకోవని జ్యోతిసింగ్ తండ్రి బద్రీసింగ్ పాండే అన్నారు. రూ. 10 వేలు.. కుట్టుమిషన్: ఆ బాల నేరస్తుడికి పునరావాస ప్రణాళిక సిద్ధం చేశామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అతడికి రూ. 10 వేలు, ఒక కుట్టుమిషన్‌ను అందించి ఉపాధి కల్పించాలన్నది ఆ ప్రణాళిక అని పేర్కొంది. విడుదల సరికాదు: ‘జువనైల్ జస్టిస్ చట్టం ప్రకారం, అతడిని జువనైల్ జస్టిస్బోర్టు నిర్బంధం నుంచి తప్పించవచ్చు. కానీ పూర్తిగా విడుదల చేయకూడదు. మొదట, ఆ వ్యక్తి మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉన్నాడా? అతడిలో మార్పు వచ్చిం దా? అనే విషయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్ కమిటీ నిర్ధారించాలి. అంతదాకాఅతడిని విడుదల చేయరాదు.’ - బాలనేరస్తుడిని విడుదల చేయొద్దంటూ పిటిషన్ వేసిన బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి రాజకీయాంశం కాదు: ‘ఇలాంటి వ్యక్తులు ఇంతత్వరగా విడుదల కావడానికి కారణమైన చట్టాల్లోని లోపాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది’ - నళిన్ కోహ్లి, బీజేపీ అధికార ప్రతినిధి ఢిల్లీ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: ‘ఢిల్లీ ప్రభుత్వం, డీసీడబ్ల్యూ రాజకీయాలు చేస్తున్నాయి. విడుదలకు ముందు రాత్రి వరకు డీసీడబ్ల్యూ ఎందుకు స్పందించలేదు?’ కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ కేసు నేపథ్యం.. 2012, డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీలో కదులుతు న్న బస్సులో మరో ఐదుగురితో కలిసి ఈ బాల నేరస్తుడు 23 ఏళ్ల యువతి జ్యోతిసింగ్‌పై పాశవిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ గ్యాంగ్ రేప్లో తీవ్రమైన గాయాల పాలైన ఆ యువతి కొన్ని రోజుల తరువాత చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిరసనలు ప్రజ్వరిల్లాయి. దీని ఫలితంగానే నిర్భయ చట్టం రూపుదిద్దుకుంది. విచారణ అనంతరం.. బాల నేరస్తుల చట్టం ప్రకారం ఆ బాల నేరస్తుడు ఉత్తర ఢిల్లీలోని ‘ప్లేస్ ఆఫ్ సేఫ్టీ’అనే సంరక్షణ కేంద్రంలో మూడేళ్లు శిక్ష అనుభవించాలని జువనైల్ జస్టిస్ బోర్డ్ తీర్పునిచ్చింది. అత్యాచారానికి పాల్పడినవారిలో అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది ఇతడేనని, చేసిన నేరం దారుణమైనది కనుక, జువనైల్ చట్టం ప్రకారం మూడేళ్ల శిక్ష మాత్రమే విధిం చడం సరికాదన్న భావన అప్పట్లో వ్యక్తమైంది. మూడేళ్లు పూర్తికావడంతో అతడిని అధికారులు ఆదివారం విడుదల చేశారు. నిబంధనల ప్రకారం వివరాలను వెల్లడి చేయకూడదు కనుక అతడి పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. భద్రతాకారణాల దృష్ట్యా ఆ బాల నేరస్తుడిని ఒక రోజు ముందే సంరక్షణ కేంద్రం నుంచి రహస్య ప్రాంతానికి తరలించారు. పోలీసుల అదుపులో ‘నిర్భయ’ తల్లిదండ్రులు న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషి విడుదలపై నిరసన తెలుపుతున్న ‘నిర్భయ’ జ్యోతి సింగ్ తల్లిదండ్రులు సహా పలువురు సామాజిక కార్యకర్తలను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో జ్యోతిసింగ్ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీసింగ్ పాండే సహా పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఇండియాగేట్ వద్దకు చేరుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన తెలపడం ప్రారంభించారు. ‘బాల నేరస్తుల చట్టంలో ప్రభుత్వం సవరణలు తెచ్చేందుకు ఇంకా ఎన్ని అత్యాచారాలు, హత్యలు జరగాలి?’ అని ఆశాదేవి ప్రశ్నించారు. ‘జైళ్లో ఉండాల్సినవారిని విడుదల చేస్తున్నారు. మమ్మల్ని మాత్రం పోలీసులు వెంటాడుతున్నారు’ అన్నారు. ప్రధాని మోదీ మాకు రెండు నిమిషాల సమయమివ్వాలని డిమాండ్ చేశారు. కాసేపటి తరువాత అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
నా కూతురు పేరు జ్యోతిసింగ్
ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ‘నిర్భయ’ తల్లి వెల్లడి న్యూఢిల్లీ: దేశప్రజల మదిలో ‘నిర్భయ’గా నిలిచిపోయిన తన కూతురు పేరు జ్యోతిసింగ్ అని మూడేళ్లక్రితం ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌కు గురై ప్రాణాలుకోల్పోయిన యువతి తల్లి వెల్లడించింది. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగి మూడేళ్లు గడిచిన సందర్భంగా బుధవారం ఢిల్లీలో మహిళా, పౌరసంఘాలు జంతర్‌మంత్ వద్ద నిర్వహించిన ‘నిర్భయ చేతన దివస్’ నివాళి కార్యక్రమంలో యువతి తల్లి ఆశాదేవి మాట్లాడారు. ‘నా కూతురు పేరు జ్యోతిసింగ్. నా కూతురు పేరు చెప్పడానికి నేనేం సిగ్గుపడట్లేదు. రేప్‌లాంటి అమానుషమైన నేరాలకు పాల్పడే వారిని బహిరంగంగా ఉరితీయాలి.’ అన్నారు. మహిళాసమస్యలపై పార్టీలకతీతంగా ఎంపీలు ఏకం: మహిళాసమస్యలపై యువతలో అవగాహన కల్పించేందుకు పార్టీలకతీతంగా 20 మంది ఎంపీలు ఏకమయ్యారు. లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన ఎంపీలు సుప్రియా సూలె(ఎన్సీపీ), గౌరవ్ గొగోయ్(కాంగ్రెస్), ప్రీతమ్ ముండే, శతాబ్ది రాయ్(టీఎంసీ)సహా 20 మంది ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి లింగ సమానత, మహిళావిద్య, మహిళాసాధికారత వంటి అంశాలపై తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కాగా, డబ్బు లేని కారణంగా నిర్బంధంలో ఉన్న వారికి బెయిల్ మంజూరులో జాప్యం జరగడంపై పార్లమెంటరీ కమిటీ సభ్యుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని కేసు వాదనకు మంచి లాయర్లను వినియోగించాలని సూచించింది. -
అప్పుడే 'నిర్భయ' ఆత్మకు శాంతి!
యావత్ దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనకు నేటితో మూడేళ్లు. దేశ రాజధాని హస్తినలో కదులుతున్న బస్సులో ఆరుగురు కిరాతకుల చేతిలో అతి అమానుషమైన హింసను ఎదుర్కొని.. చివరివరకు ప్రాణాల కోసం పోరాడి.. తుదిశ్వాస విడిచిన పారా మెడికల్ విద్యార్థిని ఉదంతం.. ఇప్పటికీ స్మృతిపథంలో మెదులుతూనే ఉంది. యావత్ జాతిని దిగ్భ్రాంతి పరిచిన ఈ ఘటనతో మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు జరిగాయి. లైంగిక దాడులు, మహిళలపై దాడులకు వ్యతిరేకంగా నిర్భయ చట్టం వంటి కఠిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా దేశంలో మహిళలపై నేరాలు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక చోట్ల స్త్రీలపై అకృత్యాలు, అరాచకాలు వెలుగుచూస్తేనే ఉన్నాయి. నిర్భయగా పేరొందిన ఆ వైద్య విద్యార్థిని ఉదంతాన్ని గుర్తుచేస్తూనే ఉన్నాయి. మరోవైపు నిర్భయపై అతికిరాతకంగా లైంగిక దాడి జరిపి, ఆమెను అమానుషంగా హింసించిన నేరగాళ్లలో ఒకడైన బాలనేరస్తుడు ఈ నెల 20న విడుదల కానున్నాడు. ఘటన జరిగినప్పుడు అతడు 18 ఏళ్ల వయస్సుకు కొద్ది నెలల మాత్రమే తక్కువ ఉండటంతో అతణ్ని బాలనేరస్తుడిగా పరిగణించి మూడేళ్లపాటు సంస్కరణ గృహానికి పంపారు. మూడేళ్ల కాలం ముగియడంతో అతనికి రూ. 10 వేలు, ఓ కుట్టు మిషన్ ఇచ్చి సమాజంలోకి స్వేచ్ఛగా విడిచిపెట్టనున్నారన్న వార్తలు నిర్భయ తల్లిదండ్రులను కలిచివేస్తున్నాయి. ఇది నేరం చేసేందుకు అతనికి లైసెన్స్ ఇచ్చి సమాజంలోకి పంపడమేనని వారు అంటున్నారు. మిగతా నేరగాళ్ల మాదిరిగానే అతన్ని మేజర్‌గా పరిగణించి కఠిన శిక్ష వేయాలని వారు డిమాండ్ చేశారు. నిర్భయ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న బాలనేరస్తుడి విడుదలపై బాలీవుడ్ అలనాటి నటి, ఎంపీ హేమామాలిని స్పందించారు. ఆ బాలనేరస్తుడిది రాక్షస మానస్తత్వమని, అతన్ని కూడా పెద్దవాడిగా పరిగణించి కఠిన శిక్ష విధించాలని ఆమె కోరారు. అప్పుడే నిర్భయ ఆత్మకు శాంతి లభిస్తుందని, ఆమె తల్లిదండ్రులు అనుభవించిన ఆత్మక్షోభకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు బారనేస్తుడి విడుదలపై స్పందించిన కేంద్ర మానవహక్కుల సంఘం ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు నోటీసులుస జారీచేసింది. ఈ వ్యవహారంపై డిసెంబర్ 21లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. -
నిర్భయ దోషికి ప్రభుత్వ సాయం
న్యూఢిల్లీ: మహిళలపై జరిగిన అకృత్యాల్లో అత్యంత హేయమైనదిగా భావించే నిర్భయ ఉదంతంలో దోషిగా నిరూపితుడై, మూడేళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న బాలనేరస్తుడు(ఇప్పుడతని వయసు 20 ఏళ్లు) డిసెంబర్ 20న విడుదల కానున్నాడు. జువైనల్ హోమ్ నుంచి విడుదలయిన తర్వాత, తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అతడికి సహకరిస్తామని, టైలర్ షాప్ ఏర్పాటుచేసుకునేందుకుగానూ 10వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు శిక్షా కాలంలో బాల నేరస్తుడు పరివర్తన చెందలేదని, పైగా మరింత హింసాయుతగా మారినందున విడుదల నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. అటు ఢిల్లీ సర్కార్, ఇటు కేంద్ర ప్రభుత్వాల భిన్నవిభిన్నవాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు బాలనేరస్తుడి విడుదలపై తన తీర్పును రిజర్వులో ఉంచింది. బాలనేరస్తుడు విడుదలయ్యే రోజు.. జువైనల్ హోం వద్దకు అతడి కుటుంబ సభ్యులను రప్పించి, తిరిగి అందరినీ సురక్షితంగా స్వగ్రామం చేర్చేందుకు ఏర్పాట్లు చేశామని, తరలింపునకు అయ్యే రవాణా ఖర్చును కూడా తామే భరిస్తామని ఢిల్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు సోమవారం మీడియాకు వెల్లడించారు. స్వగ్రామంలోనై లేక మరోచోట అతడు టైలర్ షాప్ ఏర్పాటు చేసుకునేందుకు సహరిస్తామని, కుట్టు మిషన్, షాపు అద్దె, దారాలు తదితరాలు కొనుక్కునేందుకు రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తామని అధికారులు చెప్పారు. కొత్త జీవితంలో అతడు నిలదొక్కుకునేలా అవసరమైతే మరో ఆరు నెలలు అతడికి అండగా ఉంటామనీ స్పష్టం చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఢిల్లీ సర్కార్ నిర్ణయాలను తప్పుపడుతోంది. దీంతో ఈ వ్యవహారం మరో 'ఆప్ వర్సెస్ సెంటర్'గా మారే అవకాశం ఉంది. తీవ్రమైన నేరాల్లో బాలనేరస్తులకు కూడా పెద్దలకు విధించే కఠిన శిక్షలనే అమలుచేయాలన్న బిల్లు లోక్ సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్ లో ఉంది. రాజ్యసభ ఏదోఒక నిర్ణయం వెలువరించేతవరకు బాలనేరస్తుడి విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ద్వారా సేకరించిన రహస్య సమాచారం మేరకు.. శిక్షా కాలంలో బాలనేరస్తుడు మరింత కర్కషంగా తయారయ్యాడని అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) సంజయ్ జైన్ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. విడుదల అనంతరం బాలనేరస్తుడికి సహకరించాలనుకుంటున్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాలను కూడా నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని కేంద్రం హైకోర్టును కోరింది. కేంద్రం ప్రతిపదనలపై స్పందించిన ఢిల్లీ అధికారులు.. జువైనల్ పరివర్తన చెందిందీ లేనిదీ ఏకపక్షంగా నిర్ణయించడం సరికాదంటున్నారు. జువైనల్ విడుదలను నిలిపివేయాల్సిందేనని హైకోర్టులో పిల్ దాఖలు చేసిన బీజేపీ నేత సుబ్రహ్మణియన్ స్వామి మరో కొత్త విషయం చెప్పుకొచ్చారు. ఢిల్లీ బాలనేరస్తుల కారంగారంలోనే శిక్ష అనుభవిస్తున్న మరో జువైనల్ (ఢిల్లీ హైకోర్టు పేలుడులో దోషి)తో నిర్భయ దోషి పరిచయం పెంచుకున్నాడని, ఆ పరిచయం నిర్భయ దోషిని మరింత హింసాయుత ఆలోచనలవైపు నడిపించిందని, ఇప్పుడతను గతంలో కంటే మరింత ప్రమాదకరంగా మారాడని అందుకే విడుదలను నిలిపివేసి పెద్దలకు విధించిన శిక్షే అమలు చేయాలని కోరుతున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి వెల్లడించారు. -
ఆ బాల నేరస్తుడిని ఇప్పుడే వదలరట!
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్(నిర్భయ) ఘటనకు సంబంధించిన బాల నేరస్తుడిని ఇప్పుడే విడుదల చేయడం లేదని సమాచారం. అతడిని ఒక ఏడాదిపాటు ఓ స్వచ్ఛంద సంస్థ కస్టడీలో ఉంచనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.అతడి విడుదలపట్ల ఇప్పటికే నిర్భయ తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిని వెలిచుచ్చడంతోపాటు భిన్న వర్గాల నుంచి కూడా ప్రతికూల స్పందన వస్తుంది. ఓ రకంగా చాలామంది ఈ విషయానికి సంబంధించి ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపధ్యంలో అతడిన జాతీయ భద్రతా చట్టం కింద మరో ఏడాది తమ పర్యవేక్షణలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది. తమ కూతురుపై అత్యంత పాశవికంగా లైంగిక దాడి జరిపింది ఆ నేరస్తుడేనని కోర్టు కూడా పేర్కొందని, అలాంటివాడిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తూ ఇప్పటికే నిర్భయ తల్లిదండ్రులు కేంద్ర హోంశాఖకు, కోర్టులకు, మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. 'ఇది సామాన్యంగా ఆలోచించాల్సిన విషయం కాదు.. పోలీసులు సరిగా పనిచేయాల్సిన సమయం' అంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నేరస్తులకు హక్కులు ఉండవని వారు పేర్కొన్నారు. అతడి వల్ల సమాజానికి మా కుటుంబంలాగే అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఈ నేపథ్యంలో అతడిని మరో ఏడాదిపాటు అక్కడే పోలీసుల సమక్షంలో ఉంచనున్నట్లు తెలిసింది. 2012 డిసెంబర్ నెలలో పారామెడికల్ విద్యార్థిని అయిన నిర్భయపై ఆరుగురు వ్యక్తులు పాశవిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె చనిపోయింది. ఆ సమయంలో ఈ బాలనేరస్తుడికి 18 ఏళ్ల లోపు ఉన్నాయి. ప్రస్తుతం అతడి వయసు 21. -
'నిర్భయ' కేసులో బాలనేరస్తుడి విడుదల ఆపేందుకు..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో బాలనేరస్తుడి (జువెనైల్)గా ఉన్న నిందితుడు మరో మూడు వారాల్లో జైలు నుంచి విడుదల కానున్నాడు. 2012లో అత్యంత కిరాతకంగా విద్యార్థినిపై అత్యాచారం జరిపిన ఆరుగురు నిందితుల్లో ఒకడైన అతణ్ని మరికొంతకాలం జైలులోనే ఉంచేందుకు అతనిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టమైన జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే సీనియర్ పోలీసులు అధికారులు న్యాయనిపుణులను కలిసి చర్చించారు. ప్రస్తుతం అతని వయస్సు 21 సంవత్సరాలు. ఢిల్లీ హైకోర్టు బాంబు పేలుళ్ల నిందితుడు అతన్ని ప్రేరేపించాడని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడైన నేపథ్యంలో అతనిపై ఎన్ఎస్ఏ ప్రయోగించే అవకాశముందా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని 12 నెలలపాటు జైలులో ఉంచవచ్చు. మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు అతని విడుదలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అతని విడుదలను ఆపేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖతోపాటు, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరగా జాతీయ మానవహక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించారు. 'ఇప్పుడు పోలీసులు ఆలోచించడం కాదు చర్యలకు ఉపక్రమించాలి' అని నిర్భయ తండ్రి బద్రినాథ్ మీడియాకు తెలిపారు. నేరగాళ్లకు ఎలాంటి హక్కులు ఉండరాదని పేర్కొన్నాడు. నిర్భయగా పేరొందిన వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన సమయంలో జువెనైల్ వయస్సు 18 సంవత్సరాలకు కొన్ని నెలలు మాత్రమే తక్కవ. దీంతో అతన్ని బాలనేరస్తుడిగా పరిగణించి మూడేళ్ల పాటు సంస్కరణ గృహానికి తరలిస్తూ శిక్ష విధించారు. అయితే నిర్భయపై జరిగిన అమానుష హింసలో జువెనైల్ పాత్ర కూడా ఉందని, అతన్ని కూడా మిగతా నిందితుల మాదిరిగానే పరిగణిస్తూ.. కఠిన శిక్ష విధించాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నిర్భయ కేసులో మైనర్‌పై తీర్పు వాయిదా
దేశ రాజధానిలో గత సంవత్సరం డిసెంబర్ 16న జరిగిన సామూహిక అత్యాచారం కేసు (నిర్భయ కేసు)లో మైనర్ నిందితుడిపై తీర్పును జువెనైల్ జస్టిస్ బోర్డు ఈనెలాఖరుకు వాయిదా వేసింది.'బాల నేరస్థుడు' అనే పదాన్ని ఎలా అన్వయించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు కావడం, అక్కడ తీర్పు త్వరలో వెలువడనుండటంతో ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ గీతాంజలి గోయల్ నేతృత్వంలోని బోర్డు తన తీర్పును ఆగస్టు 31వ తేదీకి వాయిదా వేసింది. జూలై 11వ తేదీ నుంచి ఇప్పటికి వరుసగా నాలుగోసారి ఈ కేసులో తీర్పు వాయిదా పడింది. 'బాల నేరస్థులు' అనే పదానికి అన్వయం ఎలా తీసుకోవాలంటూ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 14న తన తీర్పును వాయిదా వేసింది. బాల నేరస్థుల చట్టం ఏమాత్రం సరిగా లేదని, ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సు తీర్మానాలను అది ఉల్లంఘిస్తోందని స్వామి వాదించారు. బాల నేరస్థుల నేరాన్ని నిర్ధారించేటప్పుడు కేవలం వారి వయస్సు 18 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన మాత్రమే కాక, వారి మానసిక స్థితి, తెలివితేటలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. నిర్భయ కేసులో బాల నేరస్థుడు కూడా మిగిలినవారితో పాటు అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కేసులో మిగిలిన నిందితులు ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. కీలక నిందితుడు రామ్ సింగ్ మార్చి 11న తీహార్ జైల్లో మరణించడంతో అతడిపై విచారణ నిలిపివేశారు. బాల నేరస్థుడిపై మాత్రం జూలై 11, జూలై 25, ఆగస్టు 5, ఆగస్టు 19 తేదీల్లో.. అంటే నాలుగుసార్లు తీర్పు వాయిదా పడింది. నిందితులందరిలోకీ బాల నేరస్థుడే అందరికంటే క్రూరంగా ప్రవర్తించినట్లు పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. అయితే.. జువైనల్ బోర్డు వద్ద విచిరణలో మాత్రం తాను నిర్దోషినని బాలనేరస్థుడు పేర్కొన్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇతడు 11 ఏళ్ల వయసులో ఢిల్లీ వెళ్లాడు. ఇంతకుముందు ఓ కార్పెంటర్‌ను దోచుకున్న కేసులో ఇతడిపై నేరం రుజువైంది.