
పట్నా : బిహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రి కళ్లెదుటే కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. వివరాలు.. బిహార్‌లోని కిషన్ గంజ్ జిల్లాకు చెందిన ఓ 19 ఏళ్ల యువతిపై ఆరుగురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగడానికి నీళ్లు కావాలంటూ ఇంటికి వచ్చిన దుండగులు యువతిని, ఆమె తండ్రిని కిడ్నాప్ చేసి, పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తాళ్లతో కట్టేశారు.
అనంతరం తండ్రి కళ్లెదుటే కూతురిపై ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుతో కోదోవాడి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని కిషన్‌గంజ్ ఎస్‌పీ ఆశిశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment