Kishanganj district
-
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
కవల శిశువుల జననం గురించి మనం వినేవుంటాం. ఒకే కాన్పులో ఇద్దరో లేదా ముగ్గురో పుట్టడాన్ని కూడా చూసేవుంటాం. అయితే ఒకే కాన్పులో ఏకంగా ఐదుగురు శిశువులు జన్మంచడాన్ని అంతగా చూసి ఉండం. వినివుండం. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో 20 ఏళ్ల మహిళ ఏకకాలంలో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది.ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. శిశువులంతా ఒక కిలో లోపు బరువుతో ఉన్నారు. తల్లి, శిశువులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆ మహిళకు పురుడు పోసిన డాక్టర్ ఫర్జానా మాట్లాడుతూ ఈ కేసు తనకు చాలెంజింగ్‌గా అనిపించిందని, ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని తెలిపారు. కాగా ఆ మహిళకు సాధారణ ప్రసవం ద్వారా శిశువులంతా జన్మించడం విశేషం.కిషన్‌గంజ్ జిల్లాలోని కనక్‌పూర్ పంచాయతీ పరిధిలోని జల్మిలిక్ గ్రామానికి చెందిన తాహిరా బేగం (20) గర్భం దాల్చినప్పటి నుంచి ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చికిత్స అందుకుంటోంది. ఈ నేపధ్యంలో ఆమె కడుపులో ఐదుగురు కవలలు ఉన్నారని స్కానింగ్‌లో వెల్లడయ్యింది. దీంతో ఆమె భయపడిపోయింది. అయితే డాక్టర్ ఫర్జానా ఆమెకు ధైర్యం చెప్పారు. తరువాత ఆమెకు తొమ్మిది నెలల పాటు రెగ్యులర్ చెకప్ కొనసాగింది. శనివారం ఆమె ఐదురుగు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. తాహిరా ఇప్పుడు రెండోసారి తల్లి అయ్యింది. ఆమెకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఆరుగురు పిల్లలకు తల్లిగా మారింది. -
వధువును భుజాలపై ఎత్తుకొని నదిని దాటిన వరుడు.. వైరల్ వీడియో
పట్నా: భారతీయ వివాహంలో సంప్రదాయం ప్రకారం అమ్మాయి మెడలో మూడు ముళ్లు పడగానే ఆమె ఇక తనలో సగభాగం అని భర్త భావిస్తాడు. ఆమెకు ఏం కష్టమొచ్చినా తానే ముందుండి నిలబడాలంటూ భర్తను అగ్నిసాక్షిగా ప్రమాణం చేయిస్తారు. తాజాగా బిహార్‌లో పెళ్లికూతురును తన భుజాలపై ఎత్తుకొని వరుడు నది దాటిన వీడియో వైరల్‌గా మారింది. వివరాలు.. బిహార్‌లోని కిసాన్‌గంజ్ జిల్లాకు చెందిన శివకుమార్ సింగ్‌కు ఉన్న పక్కనే ఉన్న పల్సా గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే వీరువరి గ్రామాలు కంకై నది తీరానికి అటుపక్క.. ఇటుపక్కగా ఉంటాయి. ఇరు గ్రామాల మధ్య రాకపోకలు సాగాలంటే కంకై నదిని దాటి వెళ్లాల్సిందే. కాగా యువతిని పెళ్లి చేసుకున్న శివకుమార్ తన బంధువులతో కలిసి పడవలో తన సొంత గ్రామానికి బయలుదేరాడు. ఇంకా కొంతదూరం వెళితే ఊరికి చేరతామని అనుకుంటున్న తరుణంలో వారి పడవ ఇసుకలో కూరుకుపోయి ఆగిపోయింది. దీంతో శివకుమార్ సహా ఇతర బంధువులు పడవ దిగారు. వారితో పాటే పెళ్లికూతురు కూడా దిగే ప్రయత్నం చేయగా.. వరుడు శివకుమార్ వద్దని వారించి.. ఆమెను తన భుజాలపై ఎత్తుకొని ఆమెను మోసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఈ పరిణామంతో పెళ్లికూతురు సిగ్గుతో ముసిముసినవ్వులు నవ్వగా.. శివ కుమార్ బంధువులు వారిద్దరిని ఉత్సాహపరుస్తూ వచ్చారు. దీనిపై వరుడు శివకుమార్ స్పందిస్తూ.. ' కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదు. అందుకే ఎంత కష్టమైన ఆమెను నా భుజాలపై ఇంటివరకు మోసుకెళ్లాను. చూసేవారికి ఇది ఆనందంగా కనిపించొచ్చు. కానీ మా బాధలు వర్ణణాతీతం. ఇలాంటి ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం. పదేళ్ల క్రితం నితీష్ కుమార్ ప్రభుత్వం కంకై నదీ తీరానికి బ్రిడ్జి కడతామని హామీ ఇచ్చింది. అప్పటినుంచి ఏనాటికైనా బ్రిడ్జి కట్టకపోతారా అనే ఆశతోనే బతుకుతున్నాం.ఈ పదేళ్లలో ఎన్నో పడవ ప్రమాదాలు చోటుచేసుకొని ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంతలా ఉందో మా ఆవేదన చూస్తే మీకు అర్థమవుతుంది'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రిన్సెస్ డయానా కారు వేలం; వామ్మో అంత ధర! -
దారుణం : కళ్లెదుటే కూతురుపై గ్యాంగ్ రేప్
పట్నా : బిహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రి కళ్లెదుటే కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. వివరాలు.. బిహార్‌లోని కిషన్ గంజ్ జిల్లాకు చెందిన ఓ 19 ఏళ్ల యువతిపై ఆరుగురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగడానికి నీళ్లు కావాలంటూ ఇంటికి వచ్చిన దుండగులు యువతిని, ఆమె తండ్రిని కిడ్నాప్ చేసి, పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తాళ్లతో కట్టేశారు. అనంతరం తండ్రి కళ్లెదుటే కూతురిపై ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుతో కోదోవాడి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని కిషన్‌గంజ్ ఎస్పీ ఆశిశ్ తెలిపారు. -
లాలూ కుమారుడి పెళ్లి.. అపశృతి
పట్నా : లాలూ కొడుకు తేజ్ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ఆర్జేడీ నేతలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం ఆర్జేడీ సీనియర్ నేత చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌తో శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కిషన్‌గంజ్ ఆర్జేడీ జిల్లా అధ్యక్షుడు అలమ్, మాజీ మంత్రి ఇస్లాముద్దీన్ బాగీ కుమారుడు ఇక్రాముల్ హక్, దిగల్‌బంక్ ఆర్జేడీ నేత పప్పు పాల్గొన్నారు. వేడుక అనంతరం పట్నా నుంచి కిషన్‌గంజ్‌కు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనం పొతీయా సమీపంలో ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో వీరితో పాటు కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. ఐడీ కార్డుల సహాయంతో వీరిని ఆర్జేడీ నేతలుగా గుర్తించారు. కాగా ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
రూ.యాభై వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోమన్న గ్రామపెద్ద!
పాట్నా: ఇది నిజంగా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. నలుగురు దుండగులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి ఓ యువతి గర్భం దాల్చడానికి కారణమైనా.. డబ్బులు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలంటూ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు బీహార్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. గత ఏడు నెలల క్రితం ఓ యువతి నలుగురు యువకుల చేతిలో అత్యాచారానికి గురైంది. అనంతరం తనకు న్యాయం చేయాలంటూ కృష్ణ గంజ్ జిల్లాలోని పక్లోవా పలష్మానీ గ్రామ పంచాయతీని ఆశ్రయించింది. అయితే అక్కడ ఆ యువతికి ఎటువంటి న్యాయం జరగలేదు. తాజాగా ఆమె ఏడు నెలల గర్భవతి కావడంతో మరోసారి పంచాయతీ గడప తొక్కింది. కాగా, ఆమెపై ఆ పంచాయతీ పెద్దలు వివక్ష చూపించారు. రూ.యాభై వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలంటూ ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చేసేది లేక ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. తనకు న్యాయం చేయడంతో పాటు, ఆ నిందితులకు శిక్ష పడాలని గ్రామ పంచాయతీ వద్ద మొరపెట్టుకున్నా నిరాశే ఎదురయ్యిందని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. ఆ గ్రామ పెద్దలు తనకు న్యాయం చేయకపోగా డబ్బు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలని సూచించినట్లు పోలీస్ అధికారి శ్వేతా గుప్తా స్పష్టం చేశారు. రాజస్థాన్ నుంచి ఇక్కడకు వలస వచ్చిన ఆ బాలిక చాలా పేద కుటుంబానికి చెందిన అమ్మాయని.. ఆ నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ పోలీస్ అధికారి తెలిపారు.ఈ కేసులో డబ్బులో తీసుకోవాలని సూచించిన పంచాయతీ అభ్యర్థిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.