రూ.యాభై వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోమన్న గ్రామపెద్ద! | Take Rs.50,000 and abort, Bihar panchayat tells raped girl | Sakshi
Sakshi News home page

రూ.యాభై వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోమన్న గ్రామపెద్ద!

Published Thu, Dec 4 2014 1:56 PM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

Take Rs.50,000 and abort, Bihar panchayat tells raped girl

పాట్నా: ఇది నిజంగా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. నలుగురు దుండగులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి ఓ యువతి గర్భం దాల్చడానికి కారణమైనా.. డబ్బులు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలంటూ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు బీహార్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది.

గత ఏడు నెలల క్రితం  ఓ యువతి నలుగురు యువకుల చేతిలో అత్యాచారానికి గురైంది. అనంతరం తనకు  న్యాయం చేయాలంటూ కృష్ణ గంజ్ జిల్లాలోని పక్లోవా పలష్మానీ గ్రామ పంచాయతీని ఆశ్రయించింది. అయితే అక్కడ ఆ యువతికి ఎటువంటి న్యాయం జరగలేదు.  తాజాగా ఆమె ఏడు నెలల గర్భవతి కావడంతో మరోసారి పంచాయతీ గడప తొక్కింది.  కాగా, ఆమెపై ఆ పంచాయతీ పెద్దలు వివక్ష చూపించారు. రూ.యాభై వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలంటూ ఆమెకు ఆదేశాలు జారీ చేశారు.  దీంతో చేసేది లేక ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. తనకు న్యాయం చేయడంతో పాటు, ఆ నిందితులకు శిక్ష పడాలని గ్రామ పంచాయతీ వద్ద మొరపెట్టుకున్నా నిరాశే ఎదురయ్యిందని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.

 

ఆ గ్రామ పెద్దలు తనకు న్యాయం చేయకపోగా డబ్బు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలని సూచించినట్లు పోలీస్ అధికారి శ్వేతా గుప్తా స్పష్టం చేశారు. రాజస్థాన్ నుంచి ఇక్కడకు వలస వచ్చిన ఆ బాలిక చాలా పేద కుటుంబానికి చెందిన అమ్మాయని.. ఆ నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ పోలీస్ అధికారి తెలిపారు.ఈ కేసులో డబ్బులో తీసుకోవాలని సూచించిన పంచాయతీ అభ్యర్థిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement