అనంతపురం జిల్లా గుత్తిలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఐదుగురు యువకులు పలుమార్లు అత్యాచారం చేసి, ఆమెను గర్భవతిని చేశారు. గుత్తి పట్టణంలోని ఓ కాలనీలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఏడాది క్రితం ఆ ఇంట్లో పెద్ద కుమార్తె వివాహం జరిగింది. ఆ సమయంలో ఫొటోలు తీసేందుకు వచ్చిన మరో కాలనీకి చెందిన మోసెస్ అనే యువకుడితో చిన్న కుమార్తె (15)కు పరిచయం ఏర్పడింది. అలా ఆ యువకుడు అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ క్రమంలో మాయమాటలతో, భయపెట్టి ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో మోసెస్ స్నేహితులు నలుగురు కూడా ఆ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేస్తూ వచ్చారు. ఇటీవల ఆ అమ్మాయి పొట్ట ఎత్తుగా పెరగడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే, ఏడు నెలల గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో బాధితురాలు తండ్రితో కలిసి సోమవారం పోలీసులను ఆశ్రయించింది. ఐదుగురు యువకులు తనను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారని చెప్పిన బాధితురాలు.. ఫిర్యాదులో మోసెస్ పేరును మాత్రమే పేర్కొంది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బాలికపై ఐదుగురి అత్యాచారం
Published Tue, Jun 10 2014 10:13 AM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM
Advertisement
Advertisement