
ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మీరట్‌లోని ఒక ప్రయివేటు హాస్పిటల్‌లో ఐసియూలో చికిత్సపొందుతున్న మహిళ (29) పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరీ ఈ ఘాతుకాలని పాల్పడటం కలకలం రేపింది. నిందితుల్లో ఒక డాక్టరు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. శనివారం రాత్రి ఈ ఉదంతం చోటు చేసుకుంది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం శ్వాస సంబంధమైన ఇబ్బందులతో బాధిత మహిళ ఆసుపత్రిలో చేరారు. అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమెకు మరింత జాగ్రత్తగా చికిత్స అందించాల్సిన సిబ్బంది ఆమెపై దురాగతానికి పాల్పడ్డారు. స్పృహలోనికి వచ్చిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ముందస్తు పథకం ప్రకారం మత్తు ఇంజక్షన్ ఇచ్చి..అక్కడి సిసీటీవీని ఆఫ్ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టామని సీనియర్ అధికారి హరిమోహన్ సింగ్ తెలిపారు. ఇప్పటికే ఒక మహిళ సహా, అయిదుగురి నిందితులను అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందం త్వరితగతిన విచారణ చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment