ప్రియురాలి గ్యాంగ్‌రేప్‌.. ప్రియుడి ఆత్మహత్య | 21 Year Old Ends Life After Girlfriend is Gangraped in Front of Him | Sakshi
Sakshi News home page

ప్రియురాలి గ్యాంగ్‌రేప్‌.. ప్రియుడి ఆత్మహత్య

Published Fri, Sep 14 2018 8:48 AM | Last Updated on Fri, Sep 14 2018 8:48 AM

21 Year Old Ends Life After Girlfriend is Gangraped in Front of Him - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బహుశా  దీనిని అవమానంగా భావించి సవాన్‌ సాయి..

కోర్బా: కళ్లెదుటే ప్రియురాలు గ్యాంప్‌రేప్‌నకు గురవడంతో మనస్తాపం చెందిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చత్తీడ్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు..కటోఘోరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సవాన్‌ సాయి(21), మైనర్‌ బాలిక(17) కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం సాయి అకస్మాత్తుగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు విచారణలో భాగంగా మైనర్‌ బాలికను ప్రశ్నించగా..ఆమె అసలు విషయం చెప్పడంతో గ్యాంగ్‌ రేప్‌ సంఘటన వెలుగులోకి వచ్చింది.

సెప్టెంబర్‌ 1న సాయంత్రం తానూ, సవాన్‌ సాయి ఓ పాఠశాల వద్ద కూర్చున్నామని, ఆ సమయంలో ఈశ్వర్‌ దాస్‌(22), ఖేమ్‌ కన్వర్‌(21) అనే ఇద్దరు వచ్చి సవాన్‌ సాయితో గొడవ పడ్డారని తెలిపింది. ఆ తర్వాత సవాన్‌ సాయి కళ్లెదుటే తనను రేప్‌ చేశారని బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాతి రోజు గ్రామంలో రేప్‌ చేసిన యువకులు, మరికొందరికి ఆ సంఘటన గురించి చెప్పారని, బహుశా  దీనిని అవమానంగా భావించి సవాన్‌ సాయి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడ్డ నిందితులు ఈశ్వర్‌ దాస్‌, కన్వర్‌లను పోలీసులు అరెస్ట్‌  చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement