వివాహితపై అత్యాచారం | - | Sakshi
Sakshi News home page

వివాహితపై అత్యాచారం

Published Wed, Oct 4 2023 12:28 AM | Last Updated on Wed, Oct 4 2023 9:01 AM

- - Sakshi

కర్ణాటక: వివాహితపై సాముహిక అత్యాచారం చేసి, దానిని మొబైల్లో రికార్డు చేసి బ్లాక్‌మొయిల్‌ చేస్తున్న దారుణ ఘటనకు సంబంధించి బెళగావి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. గోకాక్‌ పట్టణంలో సెప్టెంబర్‌ 5న ఈ దుర్ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోకాక్‌ చుట్టు పక్కల ఒంటరి మహిళను గుర్తించిన ముఠా సభ్యులు ఆమైపె అత్యాచారం చేశారు.

వీరు దోపిడీలకు కూడా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇదే ప్రాంతంలో ఓ ఇంటిలో రూ. 10 లక్షల విలువైన నగలు దోచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని అరెస్ట్‌ చేసిన పోలీసులకు అత్యాచారం ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి కేజీ బంగారు నగలు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement